ప్రధాన మెనూను తెరువు

శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాల

స్కిట్ కళాశాల ముఖ ద్వారం

శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాల ( Sri Kalahasteeswara Institute of Technology or S.K.I.T) శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానమునకు అనుబంధముగా 1997 సంవత్సరములో స్థాపించబడినది. కళాశాల దేవాదాయ శాఖ ఆద్వర్యంలో నడుస్తుంది కనుక పాక్షికంగా ప్రభుత్వాధీనంలో ఉంటుందని చెప్పవచ్చు. దేవాదాయశాఖ కమీషనర్ కళాశాల పాలకమండలికి అధ్యక్షత వహిస్తాడు. దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్, మరియు కళాశాల ప్రిన్సిపల్ సభ్యులుగా ఉంటారు.

పూర్వరంగంసవరించు

 
కళాశాల భవనాలు

1996లో అప్పటి కేంద్ర విద్యాశాఖామాత్యులైన రామె గౌడ శ్రీకాళహస్తీస్వరస్వామి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేశారు. అప్పటి తెలుగుదేశం శాసన సభ్యులు మరియు రాష్ట్ర మంత్రియైన బొజ్జల గోపాలక్రిష్ణా రెడ్డి శ్రీకాళహస్తిలో ఒక పాలిటెక్నిక్ కళాశాల కోసం అడగ్గా ఆయన ఇంజనీరింగ్ కళాశాలనే మంజూరు చేయడం జరిగింది. మొదట్లో శ్రీకాళహస్తి-నాయుడుపేట మార్గంలో ఉన్న కాసా తోట లో ప్రారంభించి తరువాత 2004 లో తిరుపతి-విజయవాడ రాష్ట్ర రహదారి పక్కన ఉన్న స్వంత భవనాలకు మార్చడం జరిగింది. కళాశాల సుమారు 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కళాశాల నుంచి మొదటి బ్యాచ్ 2001 వ సంవత్సరంలో విడుదల అయ్యింది. ఇందులో చదివిన విద్యార్థులు మైక్రోసాఫ్ట్, సన్ మైక్రో సిస్టమ్స్, యాహూ, ఒరాకిల్, యాక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

విభాగాలుసవరించు

మొదట్లో కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలతో ప్రారంభమై తరువాత సివిల్ ఇంజనీరింగ్ లో కూడా కోర్సును అందిస్తోంది. ఒక్కో విభాగంలో 60 సీట్లు ఉన్నాయి.[1]. కళాశాలలో ప్రవేశం ఎంసెట్ పరీక్ష ద్వారానే ఉంటుంది. డిప్లోమా చేసిన వారు కూడా ఈసెట్ ద్వారా డైరెక్టుగా రెండవ సంవత్సరంలో ప్రవేశించే వీలుంది. ప్రభుత్వ నిభంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ/కన్వీనర్ సీట్లు కూడా కొన్ని కేటాయించబడి ఉన్నాయి. పాలక యంత్రాంగం త్వరలో దీనిని స్వయంప్రతిపత్తి గల డీమ్డ్ యూనివర్సిటీ గా రూపుదిద్ది మరిన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

లింకులుసవరించు

మూలాలుసవరించు