శ్రీనాథ కవిసార్వభౌముడు

శ్రీనాథ కవిసార్వభౌముడు 1993 లో వచ్చిన జీవిత చరిత్ర సినిమా. 15 వ శతాబ్దపు కవి శ్రీనాథుడి జీవితం ఆధారంగా నందమూరి రామకృష్ణ, రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ & శ్రీమతి మూవీ కంబైన్స్ పతాకంపై బాపు దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. దిగ్గజ నటుడు ఎన్టీఆర్ చివరి చిత్రం ఇది. ప్రసిద్ధ తెలుగు హాస్యనటులు ఎ.వి.ఎస్, గుండు సుదర్శన్ లకు తొలి చిత్రం కూడా.[1][2][3][4]

శ్రీనాథ కవిసార్వభౌముడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయసుధ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ శ్రీమతి మూవీ కంబైన్స్
భాష తెలుగు

కథసవరించు

శ్రీనాథుడు 1365 లో భీమాంబ, మారయ్యలకు జన్మించాడు. అతను కవిసార్వభౌముడని బిరుదు పొందాడు. కొండవీటి రెడ్డిరాజులు, రాచకొండకు చెందిన వెలమలు, విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు సహా అనేక మంది రాజుల గౌరవాలు పొందాడు. శ్రీనాథుడు స్త్రీ అందాన్ని ప్రశంసిస్తూ పద్యాలు రాసాడు. రాజుల ప్రాపకంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కొండవీడుకు చెందిన పెదకోమటి వేమారెడ్డి కొలువులో మంత్రిగా పనిచేసాడు. అతడి సాహిత్య పరాక్రమానికి ప్రతిఫలంగా దేవరకొండ పాలకుడు లింగమనేడు ప్రతిష్ఠాత్మకమైన నందికంత పోతరాజు కఠారిని బహూకరించాడు.

తారాగణంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "జేజేలు జేజేలు"  ఎస్.పి. శైలజ 4:11
2. "నలదమయంతి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 9:06
3. "హరవిలాసం"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:29
4. "అబ్బా ఓహో యబ్బా"  ఎస్. పి. శైలజ 4:23
5. "పూజారి వారి కోడలు (పద్యం)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 10:14
6. "తొలకరి (పద్యం)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 19:48
7. "కంటికి నిద్ర వచ్చునే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 6:38
8. "ఎన్టీయార్ డైలాగులు"  NTR 3:17
మొత్తం నిడివి:
62:06

శ్రీనాథుని రచనలుగా ప్రజాబాహుళ్యంలో ఉండి, ఈ సినిమాలో వాడిన డైలాగులుసవరించు

  • చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచయించితి మరుత్తరాట్చరిత్ర
  • దివిజ కవివరు గుండియల్ దిగ్గురన అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి

మూలాలుసవరించు

  1. Shrinatha Kavi Sarvabhowma (1993) – Full Cast & Crew – IMDb
  2. Srinadha Kavi Sarvabhowma Movie Online – NTR, Jayasudha
  3. "Tollywood – Watch Latest Telugu Movies Online". Archived from the original on 2014-04-15. Retrieved 2020-08-31.
  4. "N T Rama Rao – 100 Years Of Indian Cinema – Business of Tollywood". Archived from the original on 2014-04-15. Retrieved 2020-08-31.