శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట 2017లో విడుదలైన తెలుగు సినిమా. గాయత్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.ఎస్.రావు నిర్మించిన ఈ సినిమాకు నరేష్ పెంట దర్శకత్వం వహించాడు. శేఖర్ వర్మ, దీప్తి శెట్టి, మధుసూదన్, రామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 మే 2017న విడుదలైంది. ఈ సినిమా ఆగష్టు 9న అమేజాన్‌ ప్రైమ్‌లో ఓటీటీలో విడుదలైంది.[1]

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట
దర్శకత్వంనరేష్ పెంట
నిర్మాతకె.ఎస్.రావు
తారాగణం
  • శేఖర్ వర్మ
  • దీప్తి శెట్టి
ఛాయాగ్రహణంకూనపరెడ్డి జయకృష్ణ
కూర్పుఎస్.ఎస్.సుంకర
సంగీతంనరేష్ పెంట
నిర్మాణ
సంస్థ
గాయత్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2017 మే 26 (2017-05-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

హైదేరాబద్ లో ఎలాగైనా నందు (దీప్తి శెట్టి) ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ కు వచ్చి గౌతమ్ (శేఖర్ వర్మ) అనే కన్సల్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి కనిపించకుండా పోతాడు. నందు అతన్ని వెతికి లాభం లేక సొంత ఊరికి బయలుదేరుతుంది. బస్సు లో వెళ్తున్న ఆమెకు పక్క సీట్లోనే గౌతమ్ ప్రత్యక్షమవుతాడు. అతన్ని బందించి తన ఊరికి తీసుకువెళ్ళి తండ్రి రావుగారు (మధుసూదన్‌రావు)కి అప్పగిస్తుంది. నందు కుటుంబం నుండి గౌతమ్ కు ఎదురైన అనుభవాలేంటి ? అసలు గౌతమ్ నందును ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • శేఖర్ వర్మ
  • దీప్తి శెట్టి
  • మధుసూదన్
  • రామరాజు
  • గీతాంజలి
  • గౌతంరాజు
  • మధుమణి నాయుడు
  • మాధవి
  • రమణి
  • నాగేంద్రప్రసాద్
  • సత్తిబాబు యండమూరి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: గాయత్రీ ప్రొడక్షన్స్
  • నిర్మాత: కె.ఎస్.రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్ పెంట
  • సంగీతం: నరేష్ పెంట
  • సినిమాటోగ్రఫీ: కూనపరెడ్డి జయకృష్ణ
  • ఎడిటింగ్: ఎస్.ఎస్.సుంకర
  • పాటలు: సాహిత్య సాగర్, గిరి పట్ల
  • ఫైట్స్: అశోక్ రాజా

మూలాలు మార్చు

  1. Andhrajyothy (28 July 2019). "ట్రావెల్‌ లవ్‌ స్టోరీ..." Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. Andhrabhoomi (30 May 2017). "శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట (పేరుకు తగని ప్రయత్నం)". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.