శ్రీలేఖ మిత్ర

బెంగాలీ సినిమా నటి.

శ్రీలేఖ మిత్ర, బెంగాలీ సినిమా నటి.[3] హోతాత్ బ్రిష్టి (1998), కాంతతార్ (2006), అస్కోర్జో ప్రొదీప్ (2013), స్వదే అహ్లాడే (2015), చౌకత్ (2015), రెయిన్‌బో జెల్లీ (2018) వంటి సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[4] బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డును, ఆనందలోక్ అవార్డును అందుకుంది.

శ్రీలేఖ మిత్ర
జననం (1971-08-30) 1971 ఆగస్టు 30 (వయసు 52)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసిలాదిత్య సన్యాల్ (2003-2013)[2]
పురస్కారాలుబెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డు, ఆనందలోక్ అవార్డు
వెబ్‌సైటుsreelekhamitra.com

జననం మార్చు

శ్రీలేఖ, పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. శ్రీలేఖ తండ్రి సంతోష్ మిత్రా, థెస్పియన్ నటుడు.[5] శ్రీలేఖ ఆక్సిలియం కాన్వెంట్ స్కూల్ నుండి ప్రాథమక విద్యలో ఉత్తీర్ణత సాధించింది.[6] జయపురియా కళాశాలలో తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరి, కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో ఉద్యోగం రావడంతో చదువును వదిలేసింది.[7]

వ్యక్తిగత జీవితం మార్చు

శ్రీలేఖకు 2003లో సిలాదిత్య సన్యాల్ తో వివాహం జరిగింది. 2013లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.

సినిమారంగం మార్చు

దులాల్ లాహిరి దర్శకత్వం వహించిన బాలికర్ ప్రేమ్ అనే బెంగాలీ టివి సిరీస్ లో తొలిసారిగా నటించింది.[5] అనింద్య సర్కార్ దర్శకత్వంలో 1996లో వచ్చిన తృష్ణ అనే బెంగాలీ టివి సిరీస్ నబానిత పాత్రతో గుర్తింపు పొందింది.[8] బాసు ఛటర్జీ తీసిన హోతత్ బ్రిష్టి (1998) సినిమాలో నటించింది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది.[9][10] బప్పాదిత్య బందోపాధ్యాయ తీసిన కంటటర్ (2006) లో సినిమాలో నటించి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు, ఆనందలోక్ అవార్డును పొందింది. సుమన్ ముఖోపాధ్యాయ్ తీసిన మహానగర్@కోల్‌కతా (2010) సినిమాలో నటించి, 2011లో సహాయ పాత్ర విభాగంలో ఉత్తమ నటిగా బిగ్ బంగ్లా మూవీ అవార్డును అందుకుంది.[11] 2012లో, ఉరో చితి (2011) లో నటనకు ఉత్తమ సహాయ నటి విభాగంలో జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్‌ని అందుకుంది. అష్చోర్జ్యో ప్రోదీప్ (2013) లో పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్‌కు ఎంపికైంది.[12] రాజా దాస్‌గుప్తా తీసిన చౌకాత్ (2016) లో నటించి ప్రశంసలు అందుకుంది. రీమా ముఖర్జీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం అర్ధాంగిని ఏక్ అర్ధసత్య (2016) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అవార్డులు మార్చు

అవార్డు సంవత్సరం విభాగం సినిమా టివి సిరీస్ ఫలితం
బి.జె.ఎఫ్.ఏ. అవార్డు 2007 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి కంటటర్ గెలుపు
ఫిలింఫేర్ అవార్డ్స్ తూర్పు 2014 సహాయ పాత్రలో ఉత్తమ నటి అశ్చోర్జ్యో ప్రోదీప్ Nominated
ఆనందలోక్ అవార్డు 2006 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి కంటటర్ గెలుపు [13]
2008 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి టోలీ లైట్లు Nominated
జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్ 2012 సహాయ పాత్రలో ఉత్తమ నటి ఉరో చితి గెలుపు [12]
2014 సహాయ పాత్రలో ఉత్తమ నటి అశ్చోర్జ్యో ప్రోదీప్ Nominated [12]
బిగ్ బంగ్లా మూవీ అవార్డు 2010 సహాయ పాత్రలో ఉత్తమ నటి మహానగర్ @ కోల్‌కతా గెలుపు [14]
కళాకర్ అవార్డు 2003 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ప్రతిబింబ గెలుపు [15]
2009 ప్రధాన పాత్రలో ఉత్తమ నటి టోలీ లైట్లు గెలుపు [15]

మూలాలు మార్చు

  1. "মাকে বড্ড মিস করছি, জন্মদিনে কেঁদে ফেললেন শ্রীলেখা". anandabazar.com. Retrieved 2022-04-08.
  2. "আমার প্রাক্তন হ্যান্ডসম বলেই আর কাউকে সে ভাবে মনে ধরল না: শ্রীলেখা". anandabazar.com. 20 November 2020. Retrieved 2022-04-08.
  3. "Sreelekha Mitra movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-04-07. Retrieved 2022-04-08.
  4. "Sreelekha Mitra's explosive video, actor alleges superstars control casting in Bengali industry". The Times of India (in ఇంగ్లీష్). 20 June 2020. Retrieved 2022-04-08.
  5. 5.0 5.1 "'I'll never sell my soul to be No. 1'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.
  6. "প্রথম চুমু... মুখ খুললেন শ্রীলেখা". anandabazar.com. 28 August 2018. Retrieved 2022-04-08.
  7. "কোনও নায়ক, প্রডিউসার আমার প্রেমিক ছিলেন না, বিছানাতেও যায়নি, তাই আমি মিসফিট: বিস্ফোরক শ্রীলেখা". The Wall. 19 June 2020. Retrieved 2022-04-08.[permanent dead link]
  8. "শ্রীলেখা কারোর কাজ নিয়ে নেয় নি তো? স্বজনপোষণ বিতর্ক উস্কে দিলেন প্রিয়া কার্ফা". Zee24Ghanta.com. 21 June 2020. Retrieved 2022-04-08.
  9. "Hothat Brishti made me the Ferdous I am". Archived from the original on 17 June 2014.
  10. Singh, Shalu (20 June 2020). "Actor Sreelekha Mitra claims superstars govern casting in Bengali film industry". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.
  11. "92.7 BIG FM and Mustraj presents BIG Bangla Movie Awards 2010". EVENTFAQS Media. Retrieved 2022-04-08.
  12. 12.0 12.1 12.2 "I felt insulted and humiliated". www.telegraphindia.com. Retrieved 2022-04-08.
  13. "লাস্যময়ী শ্রীলেখার কিছু আবেদনময়ী ছবি". Khas Khobor. 8 August 2020. Retrieved 2022-04-08.[permanent dead link]
  14. "92.7 BIG FM and Mustraj presents BIG Bangla Movie Awards 2010". EVENTFAQS Media. Retrieved 2022-04-08.
  15. 15.0 15.1 "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-04-08.