శ్రీవిల్లి పుత్తూరు
?శ్రీవిల్లి పుత్తూరు తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 9°30′58″N 77°37′48″E / 9.5161°N 77.63°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 146 మీ (479 అడుగులు) |
జిల్లా (లు) | విరుధ్ నగర్ జిల్లా |
జనాభా | 73,131 (2001 నాటికి) |
శ్రీవిల్లి పుత్తూరు (తమిళం: ஸ்ரீவில்லிபுத்தூர் / திருவில்லிபுத்தூர்) తమిళనాడు రాష్ట్రంలో విరుదునగర్ జిల్లాలోని పట్టణం, పురపాలక సంఘం. ఇది దక్షిణ రైల్వేలో మధురై పట్టణానికి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవిల్లి పుత్తూరు విల్లి, కందన్ పేరుమీద నామకరణం చేయబడింది.
]
శ్రీవిల్లి పుత్తూరు పట్టణ చిహ్నం 12-అంతస్తుల శ్రీవిల్లి పుత్తూరు గోపురం. ఈ ఆలయం వటపత్రసాయికి సమర్పించబడింది. ఈ గోపురం 192 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం. ఇది దేవుని మామగారైన పెరియాళ్వార్ చేత నిర్మించబడిందని ప్రసిద్ధి. ఇది 108 దివ్యదేశాలు లోని ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితర సాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై స్తోత్రాన్ని రచించింది. ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనది ఆండాళ్ జన్మనక్షత్రాన జరిగే రథోత్సవం. శ్రీ ఆండాళ్ కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది.[1].
మూలాలు
మార్చు- ↑ "Divine home of the Saint poetess". October 17, 2003. Archived from the original on 2010-01-02. Retrieved 2009-05-12.