శ్రీ కృష్ణ కర్ణామృతం
శ్రీకృష్ణ కర్ణామృతం (ఆంగ్లం: Sri Krishna Karnamrutam) సంగీత సాహిత్య రంగాల్లో ప్రఖ్యాతి పొందిన సంస్కృత కావ్యం. దీన్ని వాగ్గేయకారుడు లీలాశుకుడు (విల్వమంగళం స్వామియార్) రచించారు[1]. కర్ణామృతం అనగా చెవులకు అమృతం వంటిదని అర్థం. లీలాశుకుడు దీనిని శ్రీకృష్ణుణ్ణి కీర్తించే పుష్పగుచ్ఛంతో పోల్చాడు.
శ్రీ కృష్ణ కర్ణామృతం ” గ్రంథకర్త లీలాశుకుడు. ఈయనకే “బిల్వమంగళుడు” అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ “శ్రీ కృష్ణకర్ణామృతం” లోనిశ్లోకాలు 14 వ శతాబ్దం నుంచీ ఇతర గ్రంథాలలోనూ, శాసనాలలోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాశుకుడు 11 వ శతాబ్ది నుంచీ 14 వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాశుకుడు జయదేవుడికంటే గూడా ప్రాచీనుడనే చెప్పాలి.
కృష్ణభక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశయాత్రలో కృష్ణానదీతీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణకర్ణామృతగానం విని ఆనందభరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంథం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్యచరితామృతంలో చెప్పబడిఉంది.
ఈ గ్రంథంలోని శ్లోకాలన్నీ “ముక్తక”రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలూ స్వతంత్రంగా సమగ్రమైన అర్థాన్ని అందిస్తాయన్నమాట. కథకోసం, భావంకోసం ముందు వెనకాల శ్లోకాలు చూడక్కర్లేదు. ఈ గ్రంథం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందోవిషయాల సమాహారమని చెప్పవచ్చు. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జెలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు, కుండల వంటి జడపదార్థాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించటం మరో విశేషం.
ప్రాచుర్యం
మార్చులీలాశుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలు అటు ఉత్తర భారతదేశంలోనూ, ఇటు దక్షిణ భారతదేశంలోనూ సంగీత సభలలో, భజన కార్యక్రమాల్లో విరివిగా ఆలపిస్తూంటారు. సభలలో రాగమాలికలుగా విద్వాంసులు గానం చేసే శ్లోకాలు మాత్రమే కాకుండా తాళలయాన్వితాలై మృదంగాది వాద్యాలతో సహా పాడతగినవీ, నృత్యాభినయం చేయదగినవీ, నిబద్ధ గేయాలు అనదగిన వృత్తచ్ఛందస్సులు ఈ కృష్ణకర్ణామృతంలో సగానికి మించి ఉన్నాయి. దీనివల్ల సంగీత సభల్లోనే కాక నృత్య ప్రదర్శనల్లో కూడా శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలు సుప్రసిద్ధి పొందాయి.
కావ్య సరళి
మార్చుశ్రీకృష్ణ కర్ణామృతం 3 ఆశ్వాశాలుగా విభజింపబడింది. sri
మూలాలు
మార్చు- ↑ Sri. Varadachari Sadagopan's article at Sadagopan.org Archived 2009-02-11 at the Wayback Machine