శ్రీ రమణాశ్రమం
శ్రీ రమణాశ్రమం, రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది. 1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్శనార్ధమ్ వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరువాత కూడా చాలా మంది భక్తులు, ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి, కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు.[1][2]
చరిత్ర
మార్చుఈ ఆశ్రమం క్రమంగా అభివృద్ధి చెందినది. 1922 మే 19 న అతని తల్లి అలగమ్మాల్ మరణించిన తరువాత ఆమె సమాధి వద్ద రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మొదట్లో ఈ ఆశ్రమం చిన్న గృహంగా ప్రారంభమైంది. 1922లో రెండు గృహాలు ప్రారంభమైనవి. ఒకటి సమాధికి అభిముఖంగా మరొకటి ఉత్తరం వైపు నిర్మించబడ్డాయి.
చేరుకునే మార్గం
మార్చుచెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్‌కు 60 మైళ్ళ దూరంలో ఉంది. ఈ రెండుచోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్‌లు చాలా తరచుగా నడుస్తాయి. అలాగే తిరుపతి నుంచి కూడా కాట్పాడి (వేలూర్) మీదుగా బస్‌లు 5 గం.లో చేరుస్తాయి. వైజాగ్, విజయవాడల నుంచి తిరువణ్ణామలై స్టేషన్ మీదుగా పోయే రైళ్ళు రెండున్నాయి (నెం. 22603/5, 22604/5). హైదరాబాద్ (లకడీ-కా-పుల్) నుంచి డైరెక్టు బస్ రోజూ నడుస్తోంది.[3]
ఇవి కూడా చూడండి
మార్చుఇతర పఠనాలు
మార్చు- సూరి నాగమ్మ వ్రాసిన My life at Sri Ramanasramam, Pub. Sri Ramanasramam, 1975.
ఆధారాలు
మార్చు- ↑ Sri Ramana Ashram Archived 2011-07-21 at the Wayback Machine Tiruvannamalai district website.
- ↑ రమణ ఆశ్రమం, తిరువన్నమలై
- ↑ "ఆశ్రమాన్ని చేరుకొనేదెలా?". Archived from the original on 2016-02-15. Retrieved 2015-12-30.
మూలాలు
మార్చు- Abram, David (2003). The Rough Guide to South India. Rough Guides. ISBN 1-84353-103-8.
- Ebert, Gabriele (2006). Ramana Maharshi: His Life. Lulu.com. ISBN 1-4116-7350-6.
- Self-Realization: The Life and Teachings of Bhagavan Sri Ramana Maharshi, by B.V. Narasimha Swami (ISBN 81-88225-74-6)
- Yogananda, Paramahansa (2008). Autobiography of a Yogi. Diamond Pocket Books. ISBN 81-902562-0-3.
- Zaleski, Philip; Carol Zaleski (2006). Prayer: A History. Houghton Mifflin Harcourt. ISBN 0-618-77360-6.
- Osborne, Arthur (2000). "12. Sri Ramanasramam". Ramana Maharshi and the Path of Self Knowledge. Jaico Publishing House. ISBN 81-7224-211-5. online text Archived 2011-08-12 at the Wayback Machine