శ్రీ విరించి
శ్రీ విరించి కలం పేరుతో ప్రసిద్ధులైన డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి సుప్రసిద్ధ కథకుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు.
జీవిత విశేషాలుసవరించు
ఆయన 1935లో విజయవాడలో జన్మించారు. మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజంలో నివసిస్తున్నారు. ఆయన మొదటి రచన 1951లో ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలోని "స్వతంత్ర" అనే తెలుగు వార పత్రికలో ప్రచురించబడినది. ఆ తరువాత ఆయన ఆంగ్లంలో రచనలు చేయడంప్రారంభించారు. 1979 లో సాహిత్య అకాడమీ జర్నల్ అయిన భారతీయ సాహిత్యం లో ప్రచురితమైనది.[1]
అవార్డులుసవరించు
- శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు (1990)
- డాక్టర్ దాశరథి రంగాచార్య అవార్డు
- శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు.
రచనలుసవరించు
తెలుగుసవరించు
- విజ్ఞానఖని అరిస్టాటిల్ జీవితం తాత్త్వికత
- పి. బ్లావట్‌స్కీ జీవిత-తత్త్వం
- గ్రీక్ తత్త్వవేత్త సోక్రటీస్ జీవితం తాత్త్వికత
- చిరంజీవి [2]
- గ్రీకు తత్త్వవేత్తలు[3]
- అర్థం (కథాసంపుటం)
- కారని కన్నీరు (కథాసంపుటం)
- మెట్లు లేని నిచ్చెన (కథాసంపుటం)
- కనకపు గట్టు (కథాసంపుటం)
- గంథపు చుక్క (కథాసంపుటం)
- నిధి చాల సుఖమా? (కథాసంపుటం)
- పడిలేచే కడలితరంగాలు (కథాసంపుటం)
- కొలను (కథాసంపుటం)
- కాలం కొలవని మనిషి (కథాసంపుటం)
- పద్మపత్రం (కథాసంపుటం)
- నగరమథనం (అనువాదం)
- ఉద్యోగం కోసం (అపురూపకాలు -శ్రవ్యనాటికలు)
- కథారామం (విమర్శ)
- ఉత్తర కర్ణాటక జానపద కథలు (అనువాదం)
- నిరంతర సత్యాన్వేషి
ఇంగ్లీషుసవరించు
- Awakening to Truth
- In the World of Magic an Introduction to the Study of ISIS Unveiled
- Secrets of Our Existence
- Some Significant Factors in Theosophy
- The True Path of Theosophy
- Understanding Krishnamurthi
- Words of Wisdom
- A Lonely Disciple (Monograph on T. Subba Row, 1856-1890)
- Waves and Waves and Other Stories
- Accept Me as I Am and Other Stories
థియోసాఫికల్ సొసైటీలో సేవలు..సవరించు
- రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. చెన్నై సమీపం అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు.తెలుగు, ఇంగ్లిష్‌లో
- అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లిష్‌లో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు.
- కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు.[4]
మరణంసవరించు
87 సంవత్సరాల వయ్ససులో గుండెపోటు కారణంగా జనవరి 26, 2022 న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మూలాలుసవరించు
- ↑ Srivirinchi బయాగ్రఫీ
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో చిరంజీవి పుస్తక ప్రతి
- ↑ "పుస్తక పరిచయం-గ్రీకు తత్వవేత్తలు". Archived from the original on 2018-02-09. Retrieved 2015-08-30.
- ↑ "Telugu Poet: శ్రీ విరించి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత?". Sakshi Education. Retrieved 2022-01-28.