శ్వేత విప్లవం (ఇరాన్)

శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ (Persian: انقلاب سفید‎‎ Enghelāb-e Sefid) అన్నది ఇరాన్ లో 1963లో షా మహమ్మద్ రెజా పహ్లవి ప్రారంభించగా 1978 వరకూ కొనసాగిన సంస్కరణలు. మొహమ్మద్ రెజా షా సంస్కరణ కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిని సమర్థించే వర్గాలను బలహీనపరచేందుకు నిర్మించారు. దీనిలో భూ సంస్కరణలు, ప్రభుత్వ ఫాక్టరీలను ఈ భూసంస్కరణల నిధులు సమకూర్చేందుకు అమ్మడం, మహిళల విమోచనం, అడవులు, పచ్చికబయళ్ళ జాతీయీకరణ, అక్షరాస్యతా నిధులు ఏర్పాటుచేయడం, పరిశ్రమల్లోని కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చే పథకాలు వంటివి భాగం.[1]

భూమి పట్టాలను పంచిపెడుతున్న షా

మూలాలు మార్చు

  1. Amir Arjomand, Said (1988). The Turban for the Crown: The Islamic Revolution in Iran. Oxford University Press. pp. 72-73. ISBN 9780195042580.