షెర్లాక్ హోమ్స్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
షెర్లాక్ హోమ్స్ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక కల్పిత పాత్ర. డోయల్ రచనల్లో ఈ పాత్ర తనను ఒక కన్సల్టింగ్ డిటెక్టివ్ గా పరిచయం చేసుకుంటుంది. ఈయనకు అద్భుతమైన పరిశీలనా శక్తి, నిగమనం, న్యాయ పరిజ్ఞానం, తార్కిక జ్ఞానం ఉంటాయి. ఈ నైపుణ్యాలతో ఈయన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతో సహా వేర్వేరు క్లయింట్లకు వివిధ రకాలైన కేసులలో సహాయం చేస్తుంటాడు.
షెర్లాక్ హోమ్స్ | |
---|---|
షర్లాక్ హోమ్స్ పాత్ర | |
మొదటి దర్శనం | ఒ స్టుడీ ఇన్ స్కార్లెట్ |
సృష్టికర్త | ఆర్థర్ కోనన్ డాయిల్ |
సమాచారం | |
లింగం | పురుషుడు |
వృత్తి | జాసూసు |
కుటుంబం | మైక్రోఫ్ట్ హోమ్స్ (సోదరుడు) |
జాతీయత | బ్రిటన్ |
ఈ పాత్ర మొదటిసారిగా 1887 లో ప్రచురితమైన ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ రచనలో సృష్టించబడింది. సాహితీ ప్రపంచంలో ఈ పాత్ర మొదటి కల్పిత డిటెక్టివ్ పాత్ర కానప్పటికీ, బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర.[1] 1990ల నాటికి, ఈ పాత్ర 25,000 నాటకాల్లోనూ, చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచురణల్లో చోటు చేసుకుని చలనచిత్ర, టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా చిత్రీకరించబడిన పాత్రగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.[2]
స్ఫూర్తి
మార్చుఎడ్గార్ అలన్ పో సృష్టించిన సి. అగస్టే డుపిన్ కాల్పనిక సాహిత్యంలో సృష్టించిన మొదటి డిటెక్టివ్ పాత్ర. హోమ్స్‌తో సహా అనేక తరువాతి పాత్రలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది.[3] 1877లో కోనన్ డోయల్ కు పరిచయమైన సర్జన్ జోసెఫ్ బెల్ యొక్క నిజ జీవిత వ్యక్తి నుండి హోమ్స్ పాత్రకు స్ఫూర్తి అని చాలాసార్లు చెప్పాడు. హోమ్స్ లాగానే, బెల్ నిశితమైన పరిశీలనల నుండి విస్తృతమైన పరిష్కారాలను కనుగొనడంలో సిద్ధహస్తుడు.[4]
మూలాలు
మార్చు- ↑ Sutherland, John. "Sherlock Holmes, the world's most famous literary detective". British Library. Archived from the original on 28 జూన్ 2017. Retrieved 3 July 2018.
- ↑ "Sherlock Holmes awarded title for most portrayed literary human character in film & TV" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Guinness World Records. 14 May 2012. Retrieved 5 January 2020.
- ↑ Sova, Dawn B. (2001). Edgar Allan Poe: A to Z (Paperback ed.). New York: Checkmark Books. pp. 162–163. ISBN 0-8160-4161-X.
- ↑ Lycett, Andrew (2007). The Man Who Created Sherlock Holmes: The Life and Times of Sir Arthur Conan Doyle. Free Press. pp. 53–54, 190. ISBN 978-0-7432-7523-1.