సంఘం చెక్కిన శిల్పాలు
సంఘం చెక్కిన శిల్పాలు (1980 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
తారాగణం | చంద్రమోహన్, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయనిర్మల |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | విజయకృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- చంద్రమోహన్
- గుమ్మడి
- అంజలీదేవి
- మమత
- సునీత
- రాజ్‌కుమార్
- విజయనిర్మల
- అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గంసవరించు
- దర్శకత్వం: విజయనిర్మల
- కథ: తోటకూర ఆశాలత
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: గోపీకృష్ణ
- మాటలు: అప్పలాచార్య
కథసవరించు
రొఖ్కయ్య చౌదరి తన పెద్ద కూతురుకు మూడవ యేటనే వివాహం జరిపిస్తాడు. అబ్బాయి వైమానికదళంలో శిక్షణ పొందుతూ వుంటాడు. చిన్నమ్మాయి ఉదయార్కను కాలేజీ చదువు మానిపించి ఒక తాగుబోతుకు ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. అది అతని భార్యకు ఇష్టం వుండదు. భర్తను ఎదిరించలేక, కన్నకూతురు జీవితం నాశనమవుతుంటే చూడలేక ఆమె మనోవేదనకు గురి అవుతుంది. ఉదయకు పెండ్లి అవుతుంది. శోభనం రాత్రి ఉదయ భర్త తప్పతాగి పాముకాటుకు గురై చనిపోతాడు. ఉదయ వితంతువవుతుంది. ఇంటికి వచ్చిన ఆమె అన్న ఇది చూసి సహించలేకపోతాడు. తన స్నేహితునికి ఉదయనిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన మిత్రుని సోదరితో అతనికి పరిచయమై ప్రణయంగా మారుతుంది[1].
పాటలుసవరించు
ఈ సినిమాలోని 7 పాటలను ఆరుద్ర రచించారు.[2]
- ఓ రక్క మొగుడ మామయ్య ఓ రత్త మొగుడా మామయ్య - గానం: ఎస్.జానకి
- దేవుడు చేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- నీ కనులలో వుంది నీలాకాశం - నా కవితలో వుంది భావావేశం - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- పలికెను ఏదో రాగం అలివేణి కళ్యాణిగా - గానం: ఎస్.జానకి
- పోయిరావే అమ్మ పోయి రావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ - గానం: పి.సుశీల బృందం
- మా పాప మాణిక్యమే - రూపమే వైఢూర్యమే - గానం: పి.సుశీల
- మురళీ కృష్ణా మోహన కృష్ణా కాసంత నను చూడవోయీ గిరిధరా - గానం: పి.సుశీల
- అందం చందం లేని మొగుడు నాకు ఉన్నాడు - ఎస్.పి. శైలజ - రచన: అప్పలాచార్య
మూలాలుసవరించు
- ↑ వి.ఆర్. (12 April 1980). "చిత్రసమీక్ష సంఘం చెక్కిన శిల్పాలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 12. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 24 January 2018.
- ↑ ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.