సబర్ కాంతా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సబర్ కాంతా ఒకటి.

హిమత్‌నగర్ పబ్లిక్ లైబ్రరీ
ఉత్తర గుజరాత్ జిల్లాలు

జిల్లాకేంద్రంగా హిమత్‌నగర్ పట్టణం ఉంది.

భౌగోళికంసవరించు

జిల్లాకేంద్రం హిమ్మత్‌నగర్ అహమ్మదాబాదుకు 80 కి.మీ దూరంలో ఉంది. సబర్ కాంతా జిల్లా ఈశాన్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో మహేసనా జిల్లా, బనస్ కాంతా జిల్లా, దక్షిణ సరిహద్దులో గాంధీనగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఆరవల్లి జిల్లా ఉన్నాయి.

ఆర్ధికంసవరించు

 • జిల్లాలోని ప్రంత్జి, తలోద్ ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయి.
 • జిల్లాలో వ్యవసాయం, సెరామిక్స్, కెమికల్స్, పాలు ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయి.
 • జిల్లాలో వేరుశనగ, పత్తి, క్లే, నూనె గింజలు, పొగాకు పంటలు విస్తారంగా పండించబడుతున్నాయి.

పర్యాటక ఆకర్షణలుసవరించు

 • జిల్లాలో ఇడార్, పోలో అరణ్యాలు, విజయనగర్.

విభాగాలుసవరించు

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి.

గణాంకాలుసవరించు

జిల్లా వైశాల్యం 7390 చ.కి.మీ. స్త్రీ పురుష నిష్పత్తి 947:1000. అక్షరాస్యత 67.31%. ఇది సెసిమిక్ జోన్ - 3 (భూకంప ప్రమాదం ఉన్న భూభాగం 3) లో ఉంది.

చరిత్రసవరించు

బ్రిటిష్ పాలనా కాలంలో బనస్ కాంతా జిల్లాలోని విజయనగర్ విజయనగర్ లేక పోల్ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది మహీకాంతా రాజాస్థానాలలో ఒకటి. [1]

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బసస్ కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాతీ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలుసవరించు

సబర్‌కాంతా జిల్లా 7 తాలూకాలు క్రింది ఉంది:

 • హిమత్నగర్ - జిల్లా కేంద్రం
 • ఇదార్
 • ప్రంతిజ్
 • తలోద్
 • ఖెద్బ్రహ్మ
 • వదలి
 • విజయనగర్

ఆరావళి అనే కొత్త జిల్లా కలిగి 6 తాలూకాలు క్రింది సబర్కంట చెక్కారు ఉంది

 • ంఒదస
 • ఢన్సుర
 • భయద్
 • ంఎఘరజ్
 • భిలోద
 • మాల్పుర్

[3]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,427,346, [4]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 183వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 328 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.56%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.6%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
గూజరాత్ రాష్ట్రంలో ఉత్తమ గ్రామం జిల్లాలోని పుంసిరి [7]

కోటలుసవరించు

ఇడార్ గర్ ఇల్వదుర్గాసవరించు

ఇడార్ (ఇల్వదుర్గ) ఒక పురాతనమైన కోట. దీనిని గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో ఇది మహీకాంతా ఏజంసీ లోని రాథోర్ రాజపుత్రులకు యాత్రాస్థలంగా ఉంది. సహజరక్షణ కలిగిన కొండల మీద సంప్రదాయసిద్ధంగా నిర్మించిన కోటలకు ఒక ఉదాహరణగా ఉంది. ఇది ఆరవల్లి పర్వతావళి దక్షిణ సరిహద్దులో ఉంది. పర్వతపాదాల వద్ద ఒక పురాతన రాజభవన శిథిలాలు ఉన్నాయి. అందమైన నిర్మాణవైభవానికి ఇది గత చిహ్నంలా నిలిచి ఉంది. ఇందులో రాతితో సున్నితంగా చెక్కబడిన వరండాలు ఉన్నాయి. ఇడార్ పట్టణంలో ప్రవేశించడానికి మూడంతస్థుల గడియార గోపురం, ప్రవేశద్వారం ఉంటుంది. మార్గానికి ఇరువైపులా రంగురంగుల దుకాణాలతో నిండిన బజార్లు ఉంటాయి. .[8]

పర్యాటక ఆకర్షణలుసవరించు

విజయ్ విలాస్ విజయనగర్సవరించు

ఆరవల్లీ పర్వాతావళి పాదాల వద్ద " విజయ్ విలాస్ విజయనగర్ " దట్టమైన అరణ్యాల మద్య ఉంది. ఇది సబర్ కాంతా జిల్లాలో గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో ఉంది. ప్రకృతి ఆరాధకులకు ఇది స్వర్గం వంటిది. సాటిలేని సౌందర్యంతో అలారారుతున్న ఈ ప్రదేశం ఆటవీ వృక్షజాలం, జంతుజాలానికి నెలవై ఉంది. అందంగా పుష్పించిన వృక్షాలు, నదీనదాలు, కలుషిత రహిత సరోవరాల మద్య ఉన్న ఈ ప్రాంతంలో పక్షుల శరణాలయం ఉంది.[9]

దర్బర్గ్ సవరించు

సబర్ కాంతా జిల్లాలో అంబాజీ నుండి 18కి.మీ దూరంలో ఉన్న పోషినా గ్రామం నిరాడంబరమైన సంప్రదాయ గ్రామీణ వాతావరణానికి అద్దంలా ఉంటుంది. గ్రామంలో గరాసియాలు, భిల్లులు, మతవిశ్వాసాలు మెండుగా ఉన్న రాబరీలు వంటి గిరిజనులు మిశ్రితమై ఉన్నారు. పోషినాలో గిరిజన ఆలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన వేలాది టెర్రకోటా గుర్రాలు బారులు తీరి ఉంటాయి. సమీప గ్రామాలలో కూడా ప్రజల భక్తికి నిదర్శనంగా ఇలాంటి గుర్రాలు కనిపిస్తుంటాయి. ఈ గుర్రాలను తయారు చేస్తున్న వారి గృహలను సందర్శించడం ద్వారా గిరిజన జీవన సరళిని తెలుసుకోవచ్చు.

ఫొషినా గ్రాంలో ఉన్న దర్బర్గఢ్ పోషినా ఒకప్పుడు రాజభవనంగా ఉండి ప్రస్తుతం సంప్రదాయక హోటల్‌గా మారింది. ఇందులో బ్రహ్మాడమైన ద్వారాలు, భారీ గోపురాలు, అనేక స్తంభాలు, తోరణాలు, ప్రశాంతమైన ముంగిలి, పూదోటలు, పసరిక మైదానాలు (లాన్), విశాలైన డాబాలు ఉన్నాయి. ఈ రాజభవనం చాళుక్య వంశానికి చెందిన రాజులకు చెందింది. 12వ శతాబ్దంలో చాళుక్యసామ్రాజ్యం మద్యభారతం నుండి గుజరాత్ వరకు విస్తరించింది. పర్షవ్నాథ్, నెమినాథ్ జైన ఆలయాలు, పురాతనమైన శివాలయం ఉన్నాయి.

 • పోషినా సమీప ంలో ఉన్న గుంభకారి గ్రామంలో హోళి పండుగ తరువాత కొన్ని వారాలపాటు " చిత్ర - విచిత్ర " సంత జరుగుతుంటుంది..[10]

పోలో స్మారకచిహ్నం, విజయనగరం అరణ్యాలుసవరించు

పోలో ఒక పురాతన నగరం. ఇది రాజస్థాన్ ద్వారంగా భావించబడుతుంది. పాలకులకు ఈ ప్రాంతం శత్రువులు, పౌరులు, కోపగించిన భార్యలు, వేసవి సూర్యుడుల నుండి దగడానికి అనువైన ప్రదేశం. ఇది తూర్పు, పడమరులా విస్తరించిన పవిత్ర పర్వతాల మద్య ఉంది. ఇది విసర్జిత ప్రదేశంగా మారి క్షీణదశకు చేరడానికి కారణం మర్మంగానే ఉంది. దట్టమైన అరణ్యాల దైనందిన నిత్యపూజలు నిర్వహించబడుతున్న పురానమైన ఆలయాలు ఉన్నాయి. బృహత్తరమైన ఈ దేవాలయాలలో వృక్షాలు కూడా దేవతలలగా కనిపిస్తూ ఉంటాయి. సునదమైన అరణ్యాల నేపథ్యంలో అడవితో సంబంధబాంధవ్యాలున్న ఆదివాసీ నివాసాలు చెదురుమదురుగా కనిపిస్తుంటాయి.

పోలోనగరంసవరించు

పురాతనమైన పోలో నగరం హర్నవ్ నది చుట్టూ నిర్మించబడింది. హర్నవ్ నది పురాణాలలో ప్రస్తావించబడిన పురాతన జలప్రవాహం. ఇడార్‌కు చెందిన పరిహార్ రాజులు 10వ శతాబ్దంలో పోలో నగరాన్ని స్థాపించారు. దీనిని 15వ శతాబ్దంలో మేవార్‌కు చెందిన రాథోడ్ రాజపుత్రులు జయించారు. పోల్ అంటే మేవారి భాషలో ద్వారం అని అర్ధం. ఇది గుజరాత్, రాజస్థాన్ ల మధ్య ద్వారంగా ఉంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఇది కలలియోకు తూర్పుగా ఈ ప్రాతంలోని ఎత్తైన కొండ మీద నిర్మించబడింది. దీనికి పశ్చిమంలో మంరెచి ఉంది. ఇది ప్రాంతీయ ఆదివాసులకు పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. దినంలో చాలా భాగం ఇక్కడ సూర్యరశ్మి ఉండదు. ఈ నగరాన్ని విసర్జించడానికి కారణం మర్మంగానే ఉంది.

వృక్షజాలం, జంతుజాలంసవరించు

400 చ.కి.మీ విస్తరించి ఉన్న పొడి, డిసిడ్యుయస్ (ఆకురాలు) అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇది సెప్టెంబరు, డిసెంబరు మద్య అందంగా ఉంటుంది. వర్షాల తరువాత నదులు నిండుగా ప్రవహిస్తుంటాయి. ఇది సంవత్సరమంతా ఆకర్షణీయంగా అరణ్యజీవన అనుభూతిని ఇస్తుంటుంది. ఇక్కడ 450 జాతుల ఔషధ మొక్కలు, 275 పక్షులు, 30 జాతుల క్షీరదాలు, 32 సరీసృపాలు ఉన్నాయి. ఎలుగుబంట్లు, పాంథర్లు, చిరుతపులులు, హైనాలు, నీటి పక్షులు, గద్దలు, రాబందులు, గుడ్లగూబలు, పాడే పక్షులు ఉన్నాయి. వర్షాకాలంలో ఇక్కడ నీటి పక్షులు అధికంగా వస్తుంటాయి.

పర్యాటకులుసవరించు

సమీప కాలం వరకు ఇక్కడకు పర్యాటకులు అరుదుగానే వచ్చేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక అధికరిస్తుంది. ఇందుకు ఇక్కడ ఉన్న ప్రజలు చూపుతున్న శ్రద్ధ కారణం.[11]

 • ఉమాషంకర్ జోషి (1911-1988) రచయిత, పండితుడు. బమ్నాలో జన్మించాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Rajput Provinces of India - Vijaynagar State (Princely State)
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 3. http://www.narendramodi.in/grand-felicitation-for-shri-modi-in-newly-created-aravalli-district/
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
 7. Bharat Yagnik (20 May 2012). "Gujarat village that puts metros to shame". The Times of India. Archived from the original on 2012-05-23. Retrieved 2014-11-13.
 8. http://gujaratindia.com/about-gujarat/forts-1.htm#Idar
 9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-09. Retrieved 2014-11-13.
 10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-22. Retrieved 2014-11-13.
 11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-12. Retrieved 2014-11-13.

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

మూలాలజానితాసవరించు