సర్పయాగం పరుచూరి సోదరులు దర్శకత్వంలో 1991లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఒక వైద్యుడు తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకున్నాడన్నది ఈ చిత్ర కథ.[2] ఈ సినిమాతో నటి రోజా తెలుగు తెరకు పరిచయం అయింది.[3]

సర్పయాగం
Sarpayagam.jpg
దర్శకత్వంపరుచూరి సోదరులు
నిర్మాతడి.రామానాయుడు
నటులుశోభన్ బాబు,
రేఖ
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ
విడుదల
నవంబరు  1, 1991 (1991-11-01)
భాషతెలుగు

కథసవరించు

సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్. ఆయన ముద్దుల కూతురు అనసూయ. చిన్నతనంలోనే ఒక అగ్నిప్రమాదంలో తల్లిని కోల్పోవడం వల్ల అనసూయను చాలా గారాబంగా పెంచి పెద్దచేస్తాడు వేణుగోపాల్. ఉన్నత విద్యకోసం మంచి కళాశాలలో చేరుస్తాడు. ఆ కళాశాలలో సీనియర్ విద్యార్థి ఫణి ఆమె మీద మోజు పడతాడు. ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకుని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేస్తాడు. జరిగిన విషయం చెప్పుకోలేక అనసూయ తండ్రికి తన బాధనంతా ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. వేణుగోపాల్ చట్టంతో తనకు న్యాయం జరగదని తానే అపరాధులను చంపడానికి హంతకుడిగా మారతాడు.[4]

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "శోభన్‌బాబు ఉచితంగా సినిమా చేస్తానన్నారు!". సితార. Retrieved 2020-06-08.
  2. Editor, Prabhu- (2019-11-01). "Sobhan Babu Sarpayagam Movie Completes 28 Years | Telugu Filmnagar". Thetelugufilmnagar (in ఇంగ్లీష్). Retrieved 2020-06-08.CS1 maint: extra text: authors list (link)
  3. ప్రకాష్, పి.వి.డి.ఎస్. "రోజా...ఉభయ 'తార'కం". సితార. Retrieved 2020-06-08.
  4. "మృగాలను ప్రశ్నించిన అస్త్రం - సర్పయాగం". iDreamPost.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-08.