సవితా శాస్త్రి

Indian dancer and choreographer

సవితా శాస్త్రి, ప్రముఖ భారతీయ భరతనాట్య నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్. ఆమె సంప్రదాయ భరతనాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కళాకారిణిగా ప్రసిద్ధి చెందింది. భారతీయ పురాణాలకు సంబంధించిన నేపథ్యంతో కాకుండా, ప్రముఖ నవలా కథల నేపథ్యంతో భరతనాట్య నృత్యప్రదర్శనలు ఇవ్వడం ఆమె ప్రత్యేకత.[1][2][3][4]  ఆమె ఆవిష్కరణల ద్వారా సంప్రదాయ నాట్యాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో సవితా విమర్శకుల ప్రశంసలు కూడా గెలుచుకొంది.[5] రుక్మిణీదేవి అరండేల్ ఆమె నాట్యం చేసే సమయంలో ఎలా అయితే నాట్య పునరుజ్జీవనానికి కష్టపడింది అని పేరు తెచ్చుకుందో, [6][7]  అలాగే సవితను కూడా నాట్య పునరుజ్జీవన శిల్పిగా పేర్కొంటారు.

సవితా శాస్త్రి
2013లో చెన్నైలోని సంగీత అకాడమీలో ఆమె స్వయంగా కొరియోగ్రాఫ్ చేసిన యుద్ధ్ అనే భరతనాట్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నసవితా శాస్త్రి (2013)
జననం
సవితా సుబ్రమణ్యం

(1969-12-11) 1969 డిసెంబరు 11 (వయసు 54)
విద్యాసంస్థస్టెల్లా మారిస్ కాలేజ్, చెన్నై
వృత్తిభరతనాట్యం కొరియోగ్రాఫర్, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1981 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎకె శ్రీకాంత్

తొలినాళ్ళ జీవితం, చదువు మార్చు

హైదరాబాద్ లో జన్మించిన సవితా, కొన్నాళ్ళు ముంబైలో పెరిగారు. ఆ తరువాత ఆమె కుటుంబం వారి స్వంత ప్రదేశమైన చెన్నైలో స్థిరపడ్డారు. సవితా విద్యాభ్యాసం చెన్నైలోనే చేశారు. ముంబైలోని శ్రీరాజరాజేశ్వరి భరతనాట్య కళా మందిర్ లో గురు మహాలింగం పిళ్ళై వద్ద భరతనాట్యం లో శిక్షణ మొదలుపెట్టిన ఆమె, ఆ తరువాత చెన్నైలో అడయార్ కె.లక్ష్మణ్వి.పి.ధనంజయన్, శాంతా ధనంజయన్ దంపతుల వద్ద నాట్యం నేర్చుకొంది సవితా. చెన్నైలోని పి.ఎస్.సీనియర్ మాధ్యమిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె, స్టెల్లా మేరిస్ కళాశాలలో డిగ్రీ చదివింది. 1986లో ఆమె గురువు అడయార్ కె లక్ష్మణ్ నిర్మించిన తమిళ చిత్రం ఆనంద తాండవం చిత్రంలో ప్రధాన డ్యాన్సర్ గా నటించింది సవితా.[8]  అమెరికాలో నాడీ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది ఆమె.

మూలాలు మార్చు

  1. "Praveen, Priyanka. (6 August 2012)". Archived from the original on 3 మార్చి 2016. Retrieved 12 ఏప్రిల్ 2017.
  2. Singh, Nonika. (15 July 2012).
  3. Yasin, Fozia. (27 January 2013).
  4. Vincent, Anusha. (5 March 2013).
  5. Walia, Yamini. (12 February, 2015).
  6. Vishwanath, Narayana. (9 March 2015).
  7. Dhamija, Ashok. (20 January, 2015).
  8. "Viswanathan, Lakshmi. (1 December 2003)". Archived from the original on 6 డిసెంబరు 2003. Retrieved 12 ఏప్రిల్ 2017.