సాంచి ఇండియాలోని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయ్‌సేన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం, ఇది భోపాల్‌కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రాంతంలోని బెస్‌నగర్ మరియు విదిషాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది BCE మూడవ శతాబ్దం నుంచి CE 12వ శతాబ్దికి చెందిన పలు బౌద్ధ స్థూపాలకు నిలయం, బౌద్ధ యాత్రికుల ముఖ్య స్థలాల్లో ఇది ఒకటి. ఇది ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందన రాయ్‌సేన్ జిల్లా నగర పంచాయితీకి చెందినది. ఇక్కడి స్తూపం చుట్టూ ఉన్న తోరణాలు ప్రేమ, శాంతి, విశ్వాసం, సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Buddhist Monuments at Sanchi
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
The Great Stupa at Sanchi
రకంCultural
ఎంపిక ప్రమాణం(i)(ii)(iii)(iv)(vi)
మూలం524
యునెస్కో ప్రాంతంAsia-Pacific
శిలాశాసన చరిత్ర
శాసనాలు1989 (13th సమావేశం)

సాంచిలోని మహా స్తూపం BCE మూడో శతాబ్దికి చెందిన చక్రవర్తి అశోకా ది గ్రేట్ స్థాపించారు. దీని కేంద్ర భాగంలో అర్థగోళాకారంలోని ఇటుకలతో కట్టిన కట్టడంలో బుద్ధుడి ఆస్తికలను ఉంచారు. దీని పైభాగాన ఛత్రం ఉంది, గొడుగు వంటి ఈ నిర్మాణం అత్యున్నత శ్రేణికి నమూనాగా ఉంటుంది, అస్థికలకు నీడనిచ్చి గౌరవించే ఉద్దేశంతో దీనిని నిర్మించారు.

సాంచి వ్యుత్పత్తిసవరించు

సాంచి బహుశా సంస్కృతం మరియు పాళీ పదమైన సాంచ్ నుండి పుట్టి ఉంటుంది, దీనికి అర్థం కొలవడం . అయితే హిందీలో సాంచి లేదా సాంచా అంటే అర్థం రాతి మూసలు.

చరిత్రసవరించు

సంగ కాలంసవరించు

సాంచి
Sanchi
Coordinates: 23°28′50″N 77°44′11″E / 23.480656°N 77.736300°E / 23.480656; 77.736300
Population (2001)
 • Total6,785
 
ది కాంపౌండ్ బుద్దిస్ట్ సింబల్స్: శ్రీవాత్సవ వితిన్ ఎ తీర్తంత, ఓపర్ ఎ చక్రా వీల్, ఆన్ ది తోరణ గేట్ అట్ సాంచి).

ఈ స్థూపాన్ని BCE రెండో శతాబ్దిలో కొంతమేర ధ్వంసం చేశారు, సంగ చక్రవర్తి పుష్యమిత్ర సుంగుడి హయాంలో ఇది జరిగి ఉండవచ్చు. పుష్యమిత్రుడు మూల స్థూపాన్ని ధ్వసం చేయగా అతడి కుమారుడు అగ్నిమిత్రుడు దాన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు.[1] సుంగ వంశీయుల తదుపరి పాలనా కాలంలో, ఈ స్థూపాన్ని రాతి కట్టడాలతో రెట్టింపు పరిమాణంలో విస్తరింపజేశారు. గుమ్మటాన్ని స్తూపంపై భాగానికి సమీపంలో విస్తరించారు మరియు చదరపు పరిమాణంలో మూడు పెద్ద ఛత్రాలను ఉంచారు. అనేక దొంతరలతో కూడిన ఈ గుమ్మడం ధర్మానికి నమునా -ధర్మచక్రం-గా ఉంది. ఈ గుమ్మటం ఒక పెద్ద వృత్తాకారపు వేదికపై ప్రదక్షిణ కోసం ఏర్పర్చబడింది, దీన్ని రెండు వరుసల మెట్ల దారి గుండా దర్శించవచ్చు. నేలకు సమాంతరంగా రెండవ రాతి బాట వద్ద పలు రాతిస్తంభాల వరుసను కట్టారు దీనికి నలువైపులా నాలుగు పెద్ద ద్వారాలు (తోరణాలు) ఎదురెదురుగా ఉన్న రీతిలో కట్టారు. సుంగ వంశ పాలనా కాలంలో నిర్మించినట్లు భావిస్తున్న భవంతులే రెండు, మూడు స్థూపాలుగా ఉంటున్నాయి. (అయితే ఇవి బాగా అలంకరించిన తోరణాలు కావు, శాసనాలను బట్టి ఇవి శాతవాహన కాలానికి చెందినవి తెలుస్తున్నాయి)

శాతవాహన కాలంసవరించు

 
కార్వ్‌డ్ డెకరేషన్ ఆఫ్ ది నార్తరన్ గేట్ వే టుది గ్రేట్ స్తూపా ఆఫ్ సాంచి

తోరణాలు, రాతిస్తంభాలను BCE 70లో నిర్మించారు, వీటిని శాతవాహనుడు కట్టించాడని భావిస్తున్నారు. దక్షిణ భాగంలోని తోరణం వద్ద పైభాగంలో ఉండే పెద్ద దూలాన్ని శాతవాహన శాతకర్ణి వద్ద పనిచేసే శిల్పులు బహుమతిగా ఇచ్చారని శాసనం నమోదు చేసింది:

"రాజన్ శ్రీ శాతకర్ణి ప్రధాన శిల్పి వాసితి పుత్రుడు అనందుడు సమర్పించిన బహుకృతి"[2].

రాతితో కట్టినప్పటికీ, వాటిని కొయ్యతో చెక్కినంత రమణీయంగా వంపులు చెక్కి కట్టారు. ప్రవేశ ద్వారాలవద్ద వర్ణ శిల్పాలను పెట్టారు. అవి బుద్ధుడి జీవితంలో రోజువారీ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించేవి. దారినపోయేవారికి ఇవి చాలా సులభంగా బోధపడుతూ వారి జీవితాలకు బౌద్ధ సంప్రదాయం ఎలా ఉపయోగపడుతుందో సుబోథకం చేసేవి. సాంచి వద్ద చాలావరకు ఇతర స్థూపాల నిర్మాణానికి స్థానిక ప్రజానీకం విరాళాలు సమర్పించింది. స్థూపానికి ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందాలనే కోరిక దీని వెనకు ఉంది. దీనికి ప్రత్యక్షంగా రాజ సహాయం ఉండేది కాదు. భక్తులు, స్త్రీ పురుషులు ఇరువురూ ఒక శిల్పానికి కావలిసినంత డబ్బు విరాళంగా ఇచ్చి బుద్ధుడి జీవితానికి సంబంధించి తమకు నచ్చిన దృశ్యాన్ని ఎంచుకునేవారు. తర్వాత వారి పేర్లు ఆ శిల్పంపై చెక్కబడేవి. దీంతో స్తూపం మీద ఒక ప్రత్యేక ఉదంతానికి చెందిన కథ పలు చోట్ల పునరావృతమై కనిపించేది (దహేజియా1992). ఈ రాతి శిల్పాలలో బుద్ధుడిని మానవుడిగా మాత్రం చిత్రించేవారు కాదు. దీనికి బదులుగా కళాకారులు అతడికి కొన్ని లక్షణాలను ఆపాదించేవారు. అతడు తండ్రి ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చిన గుర్రం, అతడి పాదముద్రలు, లేదా జ్ఞానోదయమైన సమయంలో బోధి వృక్షం కింద ఉన్న మండపం ఇలాంటి గుర్తులను చెక్కేవారు. మానవ దేహం బుద్ధుడికి సరిపోక పోవచ్చని వారు ఆలోచించి ఉండవచ్చు.

 
డిటెల్ ఆన్ ది సాంచి స్తూపా

సాంచి స్తూపం అంచులలోని కొన్ని వర్ణ చిత్రాలు గ్రీకు అలంకరణలలో ఉన్నవారు (గ్రీకు దుస్తులు, లక్షణాలు, సంగీత వాయిద్యాలు) స్తూపానికి మొక్కుతున్నట్లు చూపిస్తున్నాయి[3].

తదుపరి కాలాలుసవరించు

తదుపరి స్తూపాలు, ఇతర బౌద్ధ మత, తొలి హిందూ కట్టడాలను క్రీస్తు శకం 12వ శతాబ్ది వరకు శతాబ్దాల పాటు నిర్మిస్తూ వచ్చారు. 17వ ఆలయం బహుశా మొట్టమొదటి బౌద్ధ ఆలయాలులో ఒకటి కావచ్చు ఎందుకంటే దానిమీది తేదీలు తొలి గుప్తుల కాలాన్ని చూపిస్తున్నాయి. దీంట్లోనే సమతలాకారంలోని పై కప్పుతో ఉన్న చదరపు గర్బగుడి ఉంది. దానికి మంటపం నాలుగు స్తంభాలు కూడా ఉన్నాయి. గర్భగుడి లోపలి ప్రాతం మరియు వెలుపలి ప్రాంతంలోని మూడు పక్షాలు సాదాగా, నిరలంకారంగా ఉంటున్నాయి కాని, ముందుభాగం మరియు స్తంభాలను మాత్రం అద్భుతరీతిలో చెక్కారు. దీంతో ఆలయానికి దాదాపు ప్రామాణిక రూపం సిద్ధించింది (మిత్రా 1971) భారతదేశంలో బౌద్ధమతం పతనంతో సాంచి స్తూపాలు ఉపయోగంలో లేకుండా పోయాయి. ఒక రకంగా అవి కనుమరుగయిపోయాయి.

పాశ్చాత్యుల పునరావిష్కరణసవరించు

1818లో జనరల్ టేలర్ అనే బ్రిటిష్ అధికారి సాంచి (Sāñcī) ఉనికిని గురించి నమోదు చేసిన (ఇంగ్లీషులో) మొట్టమొదటి పాశ్చాత్య చరిత్రకారుడిగా పేరుకెక్కాడు. ఔత్సాహిక పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు గుప్తనిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని 1881 వరకు తవ్విపడేశారు, ఆ తర్వాతే స్తూపం పునరుద్ధరణ పని మొదలైంది. 1912 మరియు 1919 మధ్య కాలంలో కట్టడాలను ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలోకి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు.[4]

ఈరోజు, దాదాపు 50 స్మారక స్తూపాలు సాంచి కొండమీదే ఉంటున్నాయి, వీటిలో మూడు స్తూపాలు, పలు ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ స్మారక స్తూపాలను 1989 నుండి UNESCO ప్రపంచ వారసత్వ స్థలాలులో చేర్చారు.

జనాభా వివరాలుసవరించు

As of 2001 ఇండియా జనాభా లెక్కలు[5] ప్రకారం, సాంచి జనాభా 6,౭౮౫. జనాభాలో 53% పురుషులు కాగా, మిగిలిన 47% స్త్రీలు ఉన్నారు. సాంచిలో సగటు అక్షరాస్యతా రేటు 67%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, మహిళల అక్షరాస్యత 57%గా ఉంది. మనాలిలో 9% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు.

గ్యాలరీసవరించు

మూస:BuddhasHolySites

సూచనలుసవరించు

  1. "ఒరిజనల్ ఇటుకల స్తూపాన్ని అశోకా ఉద్దేశ్యపూర్వకంగా ద్వంసం చేసిందెవరు మరియు ఆ విశిష్టమైన గొప్ప పునరుద్ధరణ పనిని ఎప్పుడు ప్రారంభించారో కూడా తెలీదు, కాని మొదటి గ్రంథ రచయిత పుష్యమిత్ర సుంగ వంశ రాజుల్లోతొలి రాజు (184-148 BCE), అని తెలుస్తోంది, బుద్ధిజం పట్ల బద్దవ్యతిరేకుడిగా ఇతడు పేరుమోశాడు, అందుకనే పునరుద్ధరణను అతడి తక్షణ వారసుడు అయిన అగ్నిమిత్రుడు చేపట్టవలసి వచ్చింది," జాన్ మార్షల్, ఎ గైడ్ టు సాంచి" p. 38. కలకత్తా: సూపర్నెంట్, గవర్నమెంట్ ప్రింటింగ్ (1918).
  2. ఒరిజనల్ టెక్స్ట్ "L1:రానో సిరి శతకర్నిష L2: అవెసనిసా వసిటిపుటస L3: అనమదస దనమ్", జాన్ మార్షల్, "ఎ గైడ్ టు సాంచి" p. 52
  3. "ఎ గైడ్ టు సాంచి" జాన్ మార్షల్, ఈ గ్రీకులను పోలిన విదేశీయులను కూడా సుసాన్ హటింగ్టన్ వర్ణించారు, "ది ఆర్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా", p. 100
  4. జాన్ మార్షల్, "యాన్ హిస్టారికల్ అండ్ ఆర్టిస్టిక్ డిస్క్ర్రిప్షన్ ఆఫ్ సాంచి," ఫ్రమ్ఎ గైడ్ టు సాంచి, కలకత్తా: సూపర్నెంట్, గవర్నమెంట్ ప్రింటింగ్ (1918). Archived 2009-02-10 at the Wayback Machine.Pp. 7-29 ఆన్‌లైన్, ప్రాజెక్ట్ సౌత్ ఇండియా. Archived 2009-02-10 at the Wayback Machine.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)

సాహిత్యంసవరించు

  • దేహెజియా, వైద్య (1992). కలెక్టివ్ అండ్ పాపులర్ బేసెస్ ఆప్ ఎర్లీ బుద్దిస్ట్ పాట్రనేజ్: పవిత్ర స్తూపాలు, 100 BC-AD 250. B. స్టొలర్ మిల్లర్‌లో (ed.) ది పవర్ ఆఫ్ ఆర్ట్ . ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్: ఆక్స్‌పర్డ్. ISBN 0-609-60855-X.
  • దేహెజియా, విద్యా (1997). ఇండియన్ ఆర్ట్ . ఫైడన్: లండన్. ఐ ఎస్ బి ఎన్ 0-43-956827-7 .
  • మిత్రా, దెబలా. (1971). బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ . సాహిత్య సంసద్: కలకత్తా. ISBN 0525949801

బాహ్య లింకులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సాంచి&oldid=2814000" నుండి వెలికితీశారు