సామవేదం షణ్ముఖశర్మ

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త
(సామవేదం షణ్ముఖ శర్మ నుండి దారిమార్పు చెందింది)

సామవేదం షణ్ముఖశర్మ ఒక ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత. ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు. స్వాతి వార పత్రికలో కొన్ని సంవత్సరాలపాటు పని చేశారు.

సామవేదం షణ్ముఖశర్మ
సామవేదం షణ్ముఖశర్మ
జననంసామవేదం షణ్ముఖశర్మ
1967
ఒడిషా రాష్ట్రం లో అస్కా గ్రామం
ఇతర పేర్లుసమన్వయ సరస్వతి, వాగ్దేవీ పుత్ర, సంగీత శివపధ(ద) నిర్దేశక
వృత్తిఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.
ప్రసిద్ధిప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయ రచయిత
తండ్రిసామవేదం రామమూర్తి శర్మ
వెబ్‌సైటు
http://saamavedam.org/

సామవేదం షణ్ముఖశర్మగారు రాసినసినిమాలలో శుభాకాంక్షలు, సూర్యవంశం, సుస్వాగతం చిత్రాలలోప్రజాదరణ పొందిన పాటలురాశారు.

జీవిత విశేషాలు

మార్చు

షణ్ముఖశర్మ 1967లో ఒడిషా - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో జన్మించారు.[1] బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరారు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశారు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నారు.[2] స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించారు.

శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించారు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యం సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశారు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.[3] కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చారు.

ముఖా ముఖి

మార్చు

పురస్కారాలు

మార్చు

కొన్ని ప్రవచనాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-04-27. Retrieved 2009-05-06.
  3. http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.

యితర లింకులు

మార్చు