సామెతలు - ఇ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"అ" నుండి "క్ష" వరకు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "ఇ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
ఇగురం ఇంటెనుకుంటె మనిషి వాకిట్లున్నట్టు
ఇకారంగ బుట్టినోడు ఇకృతంగ ఏడ్షినట్టు
ఇచిత్రాల పెళ్ళికొడుక్కి అక్షింతలు పెడితే నొసలు దురద అని నోట్లో వేసుకున్నాట్టసవరించు
ఇచ్చకాలకు ఉచ్చతాగితే గచ్చు కంపు కొట్టిందటసవరించు
ఇచ్చకాలవారూ బుచ్చకాలవారూ పొట్టకోసం పొక్కులు గోకుతారుసవరించు
ఇచ్చితినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లుసవరించు
ఇచ్చి తిరిగేది కోమటి తీసుకుని తిప్పేది కంసాలిసవరించు
ఇచ్చి తీసుకుంటుంటే ఈలిగ నేస్తంసవరించు
ఇచ్చేవాణ్ని చూస్తే చచ్చిన వాడు కూడ లేచి వస్తాడుసవరించు
ఇచ్చింది యిచ్చి పుచ్చిన దాన్ని కొన్నట్లుసవరించు
ఇచ్చింది ఇస్తే కరణమే కాదన్నట్లుసవరించు
ఇచ్చిన నిష్ఠూరం కన్నా యివ్వని నిష్ఠూరమే మంచిదిసవరించు
ఇచ్చినమ్మ ఈగ - పుచ్చుకున్నమ్మ పులిసవరించు
ఇచ్చినవాడు దాత - ఇవ్వనివాడు రోతసవరించు
ఇచ్చినవాడే నచ్చినవాడు - చచ్చినవాడే అబ్బినవాడుసవరించు
ఇచ్చే గొడ్డునే పితికేదిసవరించు
ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లుసవరించు
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లుసవరించు
ముందు ఇంట్లో అన్ని కార్యాలు చక్కబెట్టుకొని ఆతర్వాతనె ఊరి వారి విషయం చూడాలని అర్థం
ఇంట ఆచారం - బయట అనాచారంసవరించు
ఇంటాయనకు మగతనమేవుంటే పొరుగింటాయన పొందెందుకు? అందటసవరించు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడుసవరించు
సాధారణముగా మనము దొంగను ఒక అపరిచితుని రూపంలో ఊహిస్తాము. కానీ, సొంత ఇంటిలో వ్యక్తే ఇతర కుటుంబ సభ్యులను మోసము చేయుచున్నయెడల, అట్టి వానిని ఉద్దేశించి ఈ సామెతను ప్రస్తావించెదరు.
ఇంటింటా ఒక పొయ్యి - మా యింట మరో పొయ్యిసవరించు
ఇంటి ఎద్దుకు బాడుగ ఏమిటి?సవరించు
ఇంటి కళ ఇల్లాలే చెబుతుందిసవరించు
ఇంటికి అవ్వ - కొలతకు తవ్వ కావాలిసవరించు
ఇంటికి ఈల కత్తి - పొరుగుకు బంగారు కత్తిసవరించు
ఇంటికి ఏబ్రాసి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మిసవరించు
ఇంటికి ఒక పువ్వు - ఈశ్వరుడికి ఒక మాలసవరించు
ఇంటికి గుట్టు - మడికి గట్టుసవరించు
ఇంటి కుక్కకు యింటి కుక్క పనికి రాదుసవరించు
ఇంటి కూటికీ, బంతి కూటికీ రెంటికీ చెడినట్లుసవరించు
ఇంటి పేరు పుణ్యాల వారు - చేసేవేమో పాపపు పనులుసవరించు
ఇంటి మొగుడు చెమటకంపు - పొరుగింటి మొగుడు పూలవాసనసవరించు
ఇంటి లక్ష్మిని వాకిలే చెబుతుందిసవరించు
ఇంటివాడు ఒసే అంటే, బయటివారూ ఒసే అంటారుసవరించు
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారుసవరించు
ఇంటివాడివలె చేసేవాడూ లేడు - బయటివాడివలె తినేవాడూ లేడుసవరించు
ఇంటివాడు ఈకతో కొడితే పొరుగువాడు పోకతో కొడతాడుసవరించు
ఇంటికి జ్యేష్ఠాదేవి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మిసవరించు
ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అల్లుడే లెక్కపడేదిసవరించు
ఇంటికి పెద్దకొడుకై పుట్టటం కంటే చాకలివాడి గాడిదగా పుట్టటం మేలుసవరించు
ఇంటికి ముసలి - మడుగుకు మొసలి కీడుసవరించు
ఇంటివారు గొడ్డు గేదంటే పొరుగువారు పాడి గేదె అన్నట్టుసవరించు
తన ఇంట్లో దేనికీ పనికిరాడన్న చీత్కారాలను పొందుతూ బయట పదిమంది ముందూ ప్రశంసంలందుకున్నట్లు
ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టుసవరించు
నమ్మించి మోసం చేయటం
ఇంటికన్నా గుడి పదిలంసవరించు
గృహమే కదా స్వర్గసీమ అని ఆర్యోక్తి. అటువంటి ఇల్లు సమస్యలకు నిలయమై నరకప్రాయమైనపుడు ఇంటిలోని వారు తమ పరిస్థితిని ఈ సామెత ద్వారా వ్యక్తము చేయుట సర్వసాధారణము. గొడవలతో అశాంతికి నిలయమైన ఇంటి కన్నా ప్రశాంతమయిన గుడి ఎంతో మేలు అని అర్థము.
ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడిసవరించు
ఇంట్లో గౌరవం పొందక బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునే వారు.
ఇంటికి గుట్టు రోగానికి రట్టు ఉండాలన్నారుసవరించు
ఇంటి విషయాలు బయటకు చెప్పకూడదు... దాని వల్ల పోయేది ఇంటి వారి పరువే. కాని రోగమొస్తే అందరికి చెప్పాలి. ఎవరో ఒకరు రోగాన్మీ మందివ్వక పోరు. దాని వల్ల రోగము కుదుట పడగలదు.
ఇంటిపేరు కస్తూరి.... ఇంట్లో గబ్బిలాల కంపుసవరించు
పైన పటారం... లోన లొటారం.. లాంటిదే ఈ సామెత.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నారుసవరించు
ఇంటి లోని వస్తువుల అమరికను బట్టి ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్థనను గ్రహించ వచ్చు అని ఈ సామెత అర్థం.
ఇంటి చక్కదనం ఇల్లాలిని చూస్తే తెలుస్తుందిసవరించు
ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదుసవరించు
ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోతసవరించు
ఇంట్లో పరిస్థితి బాగా లేకున్నా బయట మాత్రం అందరి ముందు గొప్పగా వున్నట్టు నటించడం
ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింటి పుల్లకూర రుచిసవరించు
ఇంట్లో ఇల్లాలి పోరు - బయట బాకీల హోరుసవరించు
ఇంట్లో పిల్లి, వీధిలో పులిసవరించు
వీధిలో గాంభీర్యంగా తిరిగె చాలా మంది ఇంట్లో పెళ్ళాం దగ్గర పిల్లి లా తిరుగుతుంతటారు
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యసవరించు
ఇంటిలో శ్రీరాముని వలె ఏకపత్నీవ్రతుడిగా నటిస్తూ, బయట ఇతర స్త్రీలతో తిరుగు వాడిని (కృష్ణుడు గోపికలతో తిరుగుటను పోల్చుచూ) ఉద్దేశించి ఈ సామెతను వాడెదరు.
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుసవరించు
ఏ ప్రదేశంలో అయితే బాగా బ్రతికావో (స్థితి పరంగా), అక్కడే పరిస్థితుల ప్రభావము వలన హీనంగా బ్రతకాల్సిన పరిస్థితిని ఈ సామెత ద్వారా వ్యంగ్యంగా చెప్పుచున్నారు.
ఇంత లావున్నావు.... తేలు మంత్రం కూడ రాదాసవరించు
లావుగా భలంగా వున్నావారు అన్ని విద్యల్లో ఆరి తేరి వుంటారని అమాయక పల్లె ప్రజలు ఆ రోజుల్లో నమ్మేవారు. అలా.... ఒక పల్లే వాసి ఒకణ్ని పట్టుకొని తేలు మంత్రం వేయమని కోరాడట. అతను తేలు మంత్రం తనకు రాదనగానె...... ఇంత లావు వున్నావు తేలు మంత్రం కూడా రాదా అని వెళ్లి పోయాడు. ఇది హాస్వోక్తిగా చలామణిలో ఉంది.
ఇత్తడి పుత్తడీ కాదు - తొత్తు దొరసానీ కాదుసవరించు
ఇద్దరు ముద్దు, ఆపై వద్దుసవరించు
కుటుంబనియంత్రణ శాఖవారి నినాదం.ఇప్పుడు ఒక్కరు చాలు లేదా అసలేవద్దు (one or none) గా మారింది.
ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడుసవరించు
సాధారణంగా మనుషులు భూమిపై జీవించివున్న వారిలో తమకు నచ్చినవారిని మాత్రమే గొప్పవారిగా అభివర్ణిస్తారు. అలా కానపుడు ఇంకా పుట్టనివారిని మాత్రమే వారు సత్పురుషులుగా భావించే అవకాశం ఉందని (అనగా వేరెవరినీ సత్పురుషులుగా భావించరని) వివరిస్తూ, సామాన్య మానవ నైజం ఎటువంటిదో చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.
ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేముసవరించు
ఇనుప గుగ్గిళ్ళుకానీ మినప గుగ్గిళ్ళు కావు అన్నట్లుసవరించు
ఇనుము కరిగే చోట ఈగలకేమి పని?సవరించు
ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేముసవరించు
ఇరుగు ఇంగలం - పొరుగు మంగలంసవరించు
ఇరుగును చూచి పొరుగు వాత పెట్టుకొన్నట్లుసవరించు
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనే సామెత లాంటిదే ఇదీను.
ఇరుకులో యిబ్బందులు అన్నట్లుసవరించు
ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడెసవరించు
ఇంటిలో తలెత్తిన తగాదాలను, ఒంటికి వచ్చిన నొప్పులను వెంటనే నయం చేసుకోవాలి
ఇల్లలకంగానే పండగకాదుసవరించు
కొందరు ఏదన్నా పని మొదలు పెట్టి అంతా సాధించినట్టు ఆనుకొంటారు. అలాంటివారినుద్దేశించి హెచ్హరికగా ఇది ఆరంభం మాత్రమే చెయ్యవలసినది ఎంతే ఉంది అనే ఉద్దేశముతో ఈ విధముగా అంటారు.
- ఆరంభశూరత్వం. స్థాయికి మించిన వ్యవహారాలను సాధించేందుకు తాపత్రయపడటం.పండుగకు సంబంధించిన పనులేవీ చేయకుండా కేవలం ఇల్లు ఒక్కటే అలికి పండుగ అయిపోయిందని సంబరపడటం
ఏదైనా ఒక ప్రారంబించ గానే అది పూర్తవుతుందని అనుకుంటుంటారు కొంత మంది. ఆ పనిలో రాబోవు సవాళ్ళు ఎన్నో ఉండ వచ్చు. అది గ్రహించలేని వారి గురించి ఈ సామెత వాడుతారు.
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లుసవరించు
మతి మరుపు ఎక్కువయిన వారి గురించి ఈ సామెత వాడతారు.
ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదుసవరించు
ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎదుటివారికి ఎంత అనుకూలంగా ఉన్నా మాటపడాల్సి రావటం.ఆధిక్యభావాన్ని ఎంతగా అణచుకొని కలుపుగోలుతనంగా ప్రవర్తిస్తున్నా చుట్టుపక్కల వాళ్ళెవరూ ఆ మంచితనాన్ని గుర్తించక ఏదో ఒక వంకపెట్టి బాధించటం.ఓ వ్యక్తి తాను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి యజమాని తనను పెట్టిన బాధలు గుర్తించుకొని తానొక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు తన ఇంట్లోకి అద్దెకు వచ్చినవారిని కష్టపెట్టకుండా జాగ్రత్తపడ్డాడట. అయినా ఆ అద్దెకొచ్చిన ఆసామి ఆ యజమానిని ఏదో ఒకటి అననే అన్నాడట. పాడి బాగా ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో పాడిలేని వాళ్ళకు 'పోనీలే' అని ఉచితంగా మజ్జిగ పోస్తే తాము పొందిన సాయానికి కృతజ్ఞతగా ఉండకపోగా నీళ్ళమజ్జిగ అని, చాలలేదని వంకలు పెట్టారట.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంటసవరించు
కొంతమంది ఎదుటి వాళ్ళు ఎంత బాధలో ఉన్నా పట్టించుకోరు సరికదా తమ అవసరాలకు లోపంవచ్చిందని సాధిస్తుంటారు.అలాంటి సందర్భంలో ఈసామెతను చెబుతారు.దీనికో చిన్న కద ఉంది.ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని వెళ్ళి అర్ధరాత్రి ఆ ఇంటిని సమీపించేసరికి ఆ ఇల్లు కాలిపోతూ ఉంది.ఆ ఇంటిలో వాళ్ళు అందరూ ఇల్లు అగ్నికిఆహుతి అయినందుకు గోడుగోడున విలపిస్తుంటే దొంగ కూడా తాను అనుకున్నట్లు దొంగతనం చేయడానికి వల్లకాలేదని పెద్దగా ఏడ్చాడు.
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడటసవరించు
వెనకటా ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సుల్లి రెగి ఒకదు అన్నట్టు.
ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడుసవరించు
ఇతరుల కష్టాలను తమ స్వార్థానికి వాడుకునేవారి గురించి ఈ సామెత పుట్టిదింది.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంటసవరించు
ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం ఉండాలంటారుసవరించు
ఈ సామెత పాతకాలపు సమాజంలోని అభద్రతా భావాన్ని సూచిస్తుంది. ఇల్లు ఇరుకుగా ఉంటే బంధువులు వచ్చి తిష్ట వేయడానికి వీలుండదని, పెళ్ళాం అందవికారంగా ఉంటే వేరే మగవాడెవడూ తన భార్యపై కన్ను వేయడని దీని అర్ధం. ఇల్లు ఇరుగ్గ వుంటే బందువులు ఎక్కువగా రారు. వచ్చిన రాత్రి బస చేయరు. ఎందు కంటే ఇరుగ్గా వున్న ఇంట్లొ సరైన వసతి వుండదు. అదే విదంగా భార్య అంద విహీనంగా వుంటే పరాయి మగవారు కన్నెత్తి చూడరు. కనుక ఇతరలతో సమస్య లేదు. ఆ సందర్భంలో ఈ సామెత పుట్టింది. "ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం"
ఇల్లెక్కి కొరివి తిప్పినట్లుసవరించు
ఇల్లెక్కి కొరివి తిప్పితే ఇంటికి అతనికి కూడా ప్రమాదమే. అది తెలియక అమాయకపు వాళ్ళ గురించి ఈ సామెత చెబుతారు.
ఇల్లే వైకుంఠం కడుపే కైలాసంసవరించు
ఎ పని చేయకుండా ఇంటిలో తిని పడుకొనే వాళ్ళకు సరిపోతుంది.
ఇలను నమ్మి చెడినవాడు కలికానికి కూడా కన్పించడుసవరించు
ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు - కొమ్ముల బర్రె కొట్టానికి చేటుసవరించు
ఇల్లరికం కన్నా మాలరికం మేలుసవరించు
ఇల్లలికి ముగ్గులు పెడితే ఈగల బాధసవరించు
ఇల్లలుకగానే పండుగా?సవరించు
ఇల్లాలి శుచి యింటిని చూడగానే తెలుస్తుందిసవరించు
ఇల్లాలు లేని యిల్లు భూతాలకు నిలయంసవరించు
ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటుసవరించు
ఇల్లు యిచ్చినవానికీ, మజ్జిగ పోసిన వానికీ మంచి లేదుసవరించు
ఇల్లు ఇరకటం - ఆలి మరకటంసవరించు
ఇల్లు ఇరుగ్గా వుంటే చుట్టాలు రారు. అదే విధంగా భార్య అందంగా లేకుంటే ఇతరుల కన్ను ఆమె మీద పడదు... కనుక అది మంచిదే..... అని అర్థము ఈ సామెతకు.
ఇల్లెక్కి కొరివి త్రిప్పినట్లుసవరించు
అమాయకుల నుద్దేశించిన సామెత ఇది. ఇల్లెక్కి కొరివి తిప్పితే ఇల్లు కాలిపోతుందని తెలియక ఒక అమాయకుడు ఆ పనిచేశాడట
ఇల్లు ఎక్కి కోక విప్పిందటసవరించు
ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడుసవరించు
ఇల్లు కట్టినా, పెళ్ళి చేసినా ఆర్థికంగా దెబ్బ తినడము సహజమని ఈ సామెతకు అర్థం.
ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళుపోసినట్లుసవరించు
ఇల్లు కాలుతుంటే బావి త్రవ్వినట్లుసవరించు
అమాయకుల నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. అర్థం. ఇల్లు కాలిపోతుంటే..... ఇంటిని ఆర్పడానికి నీళ్ళకొరకు బావిని త్రవ్వడము ప్రారంబించాడు ఒక అమాయకుడు.
ఇల్లుచూచి ఇల్లాలిని చూడుసవరించు
ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటుసవరించు
ఇల్లు జానెడు - కర్ర మూరెడుసవరించు
ఆవు పాతిక బందె ముప్పాతిక అన్న సామెత అర్థం దీనికి వర్తిస్తుంది
ఇల్లు తీరు వాకిలి - తల్లి తీరు పిల్లసవరించు
ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువసవరించు
ఇల్లు పీకి పందిరి వేసినట్లుసవరించు
ఇల్లు మ్రింగే అత్తకు యుగం మ్రింగే కోడలుసవరించు
ఒకరికి మించిన వారు ఇద్దరూను..... అని అర్థము
ఇల్లు లేనమ్మ హీనం చూడు - మగడు లేనమ్మ మానం చూడుసవరించు
ఇల్లు విడిచిన తర్వాత ఇల్లాలవుతుందా?సవరించు
ఇల్లు విడిచిన ఆడది - చెట్టు విడిచిన కోతి ఒకటేసవరించు
ఇల్లే తీర్థం - వాకిలే వారణాసి - కడుపే కైలాసం అన్నట్లుసవరించు
ఇల్లుకట్టి చూడు పెళ్ళి చేసి చూడుసవరించు
ఇల్లు కట్టు కోవడము, పెళ్ళి చేయడము ఈ రెండు పనులు చాల ఖర్చుతో కూడుకున్నవి. అందో ఏపని చేసినా చాల కాలంవరకు ఆర్థికంగా కోలు కోలేరు. ఆవిషయాన్ని చెప్పడానికి ఈ సామెతను వాడ తారు.
ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదుసవరించు
ఇడిసేసింది ఈదికి పెద్ద.... ఉంచుకున్నది ఊరికంతా పెద్దసవరించు
ఇడిసేసింది అనగా మొగుణ్ణి వదిలేసిన స్త్రీ అని అర్థము. ఉంచుకున్నది అనగా వేరొకరిని ఉంచుకున్న స్త్రీ అని అర్థము.
ఇవ్వడమన్నది ఈ యింట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తున్నదన్నట్లుసవరించు
ఇవ్వని మొండికి విడువని చండిసవరించు
ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు? రేపు జోలె పట్టడమెందుకు?సవరించు
ఇవ్వాళ చస్తే రేపటికి రెండుసవరించు
ఇవిగో పూలంటే అందుకో అందాలు అందటసవరించు
ఇష్టంలేని పెళ్ళాన్ని ఒసే అన్నా తప్పే - అమ్మా అన్నా తప్పేసవరించు
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానంసవరించు
ఇసంట రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్లుసవరించు
ఇసుక తక్కెడ, పేడ తక్కెడసవరించు
ఈ సామెతను వివరించటానికి ఒక కథ ఉంది. ఒక వ్యక్తి కావిడిలో ఇసుక తక్కెడలు మోస్తూ విశ్రాంతి కోసం బాట పక్కన ఆగుతాడు. అదే సమయంలో ఇంకో వ్యక్తి అలాంటిదే కావిడిలో పేడ తక్కెడలతో వచ్చి అదే చోట ఆగుతాడు. ఇద్దరు వ్యక్తులూ ఎదుటి వ్యక్తి కావిడిలో ఏదైనా విలువైన వస్తువుంటుందని భావించి ఒకరి కావిడిని మరొకరు తీసుకుని ఎవరిదారిని వారు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ఇరువురూ తమ కావిడిలో ఏముందో గమనించి ఎదుటివాడిని మోసిగించబోయి తాముకూడా మోసపోయామని గ్రహిస్తారు. ఈ విధంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పరస్పరం మోసగించుకుంటే వారి పరిస్థితిని వివరించటానికి ఈ సామెతను వాడుతారు.
ఇస్తే చేసేది లేదు - చస్తే వచ్చేది లేదుసవరించు
ఇస్తే పెండ్లి - ఇవ్వకపోతే పెటాకులుసవరించు
ఇహం పరం లేని మొగుడు ఉంటేనేమి? పోతేనేమి?సవరించు
- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం