భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ఆ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

ఈ ఇంట ఆచారమా మా గ్రహచారమా?సవరించు

ఈ ఊరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరంసవరించు

అంతా సమానమే నని అర్థం.

ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడటసవరించు

ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళుసవరించు

ఈగ వ్రణం కోరు - నక్క పీనుగ కోరుసవరించు

ఈగను కప్ప మ్రింగితే - కప్పను పాము మ్రింగుతుందిసవరించు

ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడటసవరించు

ఈ చేత చేస్తారు - ఆ చేత అనుభవిస్తారుసవరించు

ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదుసవరించు

ఈడుగానిది యింటికిరాదుసవరించు

ఈడు చూసి పిల్లని యివ్వాలి - పిడి చూసి కొడవలి కొనాలిసవరించు

ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడుసవరించు

ఈతకు మించిన లోతు లేదుసవరించు

ఈతచెట్టు ఇల్లు కాదు - తాడిచెట్టు తల్లి కాదుసవరించు

ఈతచెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారుసవరించు

ఈత నేర్చిన వాడికే నీటి చావుసవరించు

ఈత వచ్చినపుడు లోతనిపిస్తుందా?సవరించు

ఈదబోతే త్రాగ నీళ్ళు లేవుసవరించు

ఈనగాచి నక్కల పాలు చేసినట్లుసవరించు

ఈ దెబ్బెలా వుందని అడిగితే నిన్నటి దెబ్బే బాగుందన్నదటసవరించు

ఈనాడు ఇంటిలో - రేపు వీధిలోసవరించు

ఈ నొక్కుళ్ళకన్నా ఆ దెబ్బలే బాగున్నాయందటసవరించు

ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం?సవరించు

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టుసవరించు

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే, ఎంతో ఎక్కువ ఆశించినా కొద్దిగా మాత్రమే దక్కితే. అటువంటి సందర్భాలలో ఈ సామెత వాడతారు.

ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడుసవరించు

కొంత ఇచ్చి ఎక్కువ మొత్తం లాగే వాడని అర్థం.

ఈనగాచి నక్కల పాలు చేసినట్లుసవరించు

ఈనగాయటం అంటే పశువును దూడను కనేంత వరకు పోషించి రక్షించటం అని అర్థం. ఆవు దూడను కనేంత వరకు రక్షించి తన పని అయిపోయిందనుకొని వెళ్ళి పోతే నక్కలు వచ్చి ఆదూడను తినేస్తాయి.. అలాకాక ఎల్లప్పుడు రక్షణా వుండాలని ఈ సామెత అర్థము.

పండించిన పంటను పరులపాలు సేయుట. == "ఈనగాచి పొలమును నక్కలకుఁ బెట్టినట్లు బాహుబలాధిక్యంబు పేరిమిని గష్టపడి రణంబునం గెలుచుకొన్న రాజ్యంబును ఫలకాలంబున నొరుల పాలు సేయనేల." (నీతిచంద్రిక - సంధి.) - ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవుసవరించు

మూలాలుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

వనరులుసవరించు

  • లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_ఈ&oldid=2008222" నుండి వెలికితీశారు