సామెతలు - ఉ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"అ" నుండి "క్ష" వరకు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "ఉ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదుసవరించు
ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రిసవరించు
ఉంటే ఊరు - పోతే పాడుసవరించు
ఉంటే లిక్కి - పోతే కొడవలిసవరించు
వివరణ: లిక్కి అనగా ఒక కొడవలి (గడ్డి కోయడానికుపయోగ పడే పరికరం) కొంత పెద్దగా వుంటుంది. కాలానుగుణంగా దానికి పదను (కక్కు) తగ్గగా తిరిగి పదను పెట్టిస్తారు. అలా పలుమార్లు పదును పెట్టగా ఆ కొడవలి చిన్నదైపోతుందు. అప్పుడు దాన్ని లిక్కి అని అంటారు. ఒక రైతు మరొక రైతుకు తన లిక్కిని అరువు ఇచ్చాడు. పొరబాటున అది ఎక్కడో పోయింది. ఆ విషయాన్ని మొదటి రైతు చెప్పగా ..... ఆ రైతు 'అలాగా .... ఎంత మంచి కొడవలి.... పోయిందా..... మరో కొత్త కొడవలి నైనా కొనివ్వు...' అని అంటాడు. ఒక వేళ ఆ లిక్కి దొరికివుంటే అదే తనది అనేవాడు. అది లేదు గనుక పోయిన లిక్కిని కొడవలిగా చపుతాడు. అలా పుట్టింది ఈ సామెత.
ఉండనీయదు ఊరి శని ,తిననీయదు నోటి శనిసవరించు
ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారుసవరించు
ఉంటే అమీరు - లేకుంటే పకీరుసవరించు
ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదుసవరించు
అతి దైన్యమైన పరిస్థితి అని అర్థము
ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందటసవరించు
ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లుసవరించు
చుట్టాలోస్తే వారు పోయేంతేవరకు వారికి మర్యాదలు చేయాలి. కాని పొమ్మనలేరు. అలాంటప్పుడు వంట చేసేటప్పుడు..... (కట్టెల పొయ్యి) పొగ ఎక్కువ వచ్చేటట్టు చేస్తే ఆ పొగను భరించలేక వారే వెళ్ళి పోతారని ఈ సామెతకు అర్థము.
ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లుసవరించు
ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లుసవరించు
ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?సవరించు
ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా?సవరించు
ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదన్నట్లుసవరించు
పుట్టినప్పటి బుద్దులు పుడకలతో గాని పోవట అనగా.... పుట్టినప్పుడున్న బుద్ధులు చనిపోయే దాక పోవని అర్తము. పై సామెత అర్థం కూడా ఇటువంటిదె.
ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లుసవరించు
ఉట్టికి నాలుగు చేరులు తెగినట్లుసవరించు
ఉట్టిమీద కూడు - వూరిమీద నిద్రసవరించు
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే!సవరించు
ఉడకవే ఉడకవే ఉగాదిదాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందటసవరించు
ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లుసవరించు
ఉడుతా భక్తిగాసవరించు
తన శక్తి మేరకు సాయం/దానం చేయాలని ఈ సామెతకు అర్థం. రామాయణంలో వున్నట్టు చెప్పబడే ఒక కథ ఈ సామెతకు ఆధారం. కథ: శ్రీరామ చంద్రుడు లంకను చేరడానికి సముద్రం మీద వారధి కడుతున్నాడు. ఆ కార్యక్రమంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత తాను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తలచి...... సముద్రంలో మునిగి నీటితో తడిసిన తన శరీరంతో పొడి ఇసుకలో పొర్లి.... తన శరీరానికి అంటిన ఇసుకను కడుతున్న వారధి పైన విధిలించేదట....... ఆ విధంగా అల్ప జీవి అయిన ఉడుత కూడా ఆ పవిత్ర కార్యంలో తన వంతు సాయం చేసిందట.
ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లుసవరించు
ఉట్టి గొడ్డు (వట్టి గొడ్డు) అంటే పిల్లలు పుట్టని ఆవు అని అర్థము. సంతానవృద్ధికి ఏ మాత్రం ఉపయోగం లేకపోయినా అరుస్తుంది అని ఇక్కడ భావము. చేయవలసిన పని చేయకుండా ఉత్తిగా వేషాలు వేసేవాడిని ఉద్దేశించి కూడా ఈ సామెత వాడతారు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుసవరించు
"ఉట్టి" - అంటే త్రాళ్ళతో అల్లిన ఒక సాధనం. కప్పునుండి వ్రేలాడుతుంది. పల్లెలలో (ఇదివరకు) పాలు, పెరుగు వంటివాటిని పైకప్పునుండి ఉట్టిలో వ్రేలాడదీసే వారు, పిల్లులవంటివాటినుండి రక్షణగా. (ఇప్పుడు చిన్నికృష్ణుని కేలెండర్లలో ఎక్కువగా చూస్తుంటాము.) ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతీ మనిషికి ఎంతో కొంత సామర్థ్యం వుండాలి. ప్రతిపనీ చేసేస్తానని గొప్పలు పోతే అందరిలోను నవ్వులపాలు కాక తప్పదు. అలాంటి సందర్భంలో వచ్చే సామెతే ఇది.ఇంట్లో చూరికి వున్న ఉట్టి ఎగిరి అందుకోలేని ఆవిడ ఆకాశం లోని స్వర్గాన్ని అందుకోలేదుకదా. అలాగే చిన్న పని చెయ్యలేని వారు వారి సామర్ధ్యానికి మించిన పని చేస్తానంటే వారిని వేళాకోళం చేస్తూ అనే మాట ఇది. చిన్న పని కూడా చేయలేని వారు పెద్ద పనిని ఎలా చేయ గలరు అని అర్థము ఈ సామెతకున్నది.
ఉడుత కేల ఊర్లో పెత్తనంసవరించు
ఉడుత చాల అల్పజీవి. ఊర్లో విషయాలు దానికెందుకు. అదే విధంగా పెద్ద వాళ్ళ వ్వహారాలలో అల్పులు తల దూర్చరాదని ఈ సామెతకు అర్థం.
ఉడుత ఊపులకు కాయలు రాలుతాయాసవరించు
ఉడుత చిన్న జీవి. అది చెట్టు కొమ్మను ఊపినంత మాత్రాన దానిలోని కాయలు రాలవు. అదే విదంగా బలహీనులు పెద్ద పెద్ద కోరికలు కోరితె వృధా అని అర్థం.
ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లుసవరించు
ఉత్త కుండకు వూపు లెక్కువ ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువసవరించు
ఉత్త కుండకు ఊపులెక్కువసవరించు
నిండు కుండ తొణకదు అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. కుండ నిండా నీళ్ళు వుంటే... ఆ కుండ తొణకదు..... దాన్ని ఎత్తుక రావడం కొంత తేలికైన పని. అదే కుండలో సగం వరకే నీళ్ళు వుంటే...... కొంత బరువు తక్కువైన అందులోని నీళ్ళు తొణికిసలాడుతున్నందున .... కుండను మోసేవానికి కొంత ఇబ్బంది కరమైన విషయము.
ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువసవరించు
ఉత్తచేతులతో మూర వేసినట్లుసవరించు
ఉత్తపుణ్యానికి మొత్తుకు చచ్చినట్లుసవరించు
ఉత్తర ఉరిమి కురిసినా, త్రాచు తరిమి కరిచినా తిరుగులేదుసవరించు
ఉత్తర జూచి ఎత్తర గంపసవరించు
ఇది వ్యవసాయ ధారులకు సంబంధించిన ఆమెత. ఉత్తర అనగా ఉత్తర కార్తే. ఉత్తర కార్తెలో / ఎత్తర గంప అనగా .... విత్తనాలు చల్లడానికి గంప నెత్తమనడమని అర్థం.
ఉత్తర పదును - ఉలవకు అదునుసవరించు
ఇది వ్వసాయ ధారుల సామెత. ఉత్తర కార్తెలో ఉలవలకు అదును అని దీని అర్థము.
ఉత్తరలో పూడ్చేకంటే గట్లమీద కూర్చుని ఏడ్వటం మేలుసవరించు
ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదుసవరించు
ఉత్తర దిక్కున వాన మబ్బు పట్టితే తప్పకుండ వర్షం వస్తుందని ఈ సామెతకు అర్థం. ఇది వ్యవసాయ ధారులకు సంబంధించిన సామెత.
ఉత్తరపు వాకిలి యిల్లు వూరికే యిచ్చినా తీసుకోరాదుసవరించు
ఉత్తరలో చల్లిన పైరు కత్తెరలో నరికిన కొయ్యసవరించు
ఉత్తరాయణం వచ్చింది ఉరి పెట్టుకో మన్నాడుటసవరించు
ఉదయం ముద్దుల ఫలహారం - మధ్యాహ్నం కౌగిలి భోజనం - రాత్రికి అందాల విందులు అందటసవరించు
ఉదర పోషణార్ధం బహుకృత వేషంసవరించు
కోటివిద్యలు కూటి కొరకే అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. ఎన్ని వేషాలేసినా కడుపు తిండి కొరకే అని దీని అర్థం.
ఉద్దర అయితే వూళ్ళు కొంటారు, నగదు అయితే నశ్యం కూడా కొనరుసవరించు
ఉద్దర అయితే నా కిద్దరన్నట్లుసవరించు
ఉద్యోగం పురుష లక్షణం గదా! గొడ్డలి తేరా నిట్రాడు నరుకుదాం అన్నాడటసవరించు
గుడిసెకు మధ్య నాటిన ఆధార స్తంభం నిట్రాయి -
ఉద్యోగికి ఒక వూరనీ లేదు - ముష్టివానికి ఒక యిల్లనీ లేదుసవరించు
ఉద్యోగానికి దూరభూమి లేదుసవరించు
ఉద్యోగికి ఒక వూరని లేదు.. ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి పని చేయాలి...... అది దూరామా..... దగ్గరా..... అని ఆలోసించే అవకాశమే లేదు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత.
ఉద్యోగం పురుష లక్షణంసవరించు
పురుషుడన్నవాడు ఏదో ఒక పని చేయాలని దీనర్థం. పనీ పాట లేకుండా వుండకూడదని గూఢార్తం.
ఉన్న దుండగా పైన ఉపాకర్మ యింకొకటిసవరించు
య మపరో గండస్యోపరి స్ఫోటః అనగా కాలుటచే గలిగిన పుండుపై ఈబొబ్బ యింకొకటికూడ. సంస్కృత న్యాయములు కరువులో అధికమాసమన్నట్లు అన్న సామెతె లాగానే ఇదీను.... ఉన్న కష్టాలకు తోడు మరి కొన్ని కష్టాలోస్తే ఈ సామెతను వాడుతారు.
ఉన్న మాటంటే ఉలుకెక్కువసవరించు
ఎదుటి వ్యక్తితో అతని గురించిన చేదయిన నిజం మాట్లాడినపుడు, నిజం ఒప్పుకునే ధైర్యం లేక ఉలికిపాటుతో మాటలతో ఎదురుదాడి చేస్తాడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు. నిజం చెప్పితే నిష్ఠూరం అన్న సామెత అర్థమే దీనికి వర్తిస్తుంది.
ఉన్న వూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారము వృధాసవరించు
ఉన్న వూరికి ఏదేని ఉపకారము చేస్తే వూరి వారు దాని ఉపకారముగా భావించరు. అదేదో అతని బాధ్యతగా భావిస్తారు. అదే విధంగా శవానికి ఎన్ని అలంకారాలు చేసినా కొద్ది సేపె... ఆ తర్వాత వృధా.....
ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదుసవరించు
ఉన్న వూరివాడికి కాటి భయం - పొరుగూరు వాడికి నీళ్ళ భయంసవరించు
ఉన్న ఊరి వాడు రాత్రులందు వెళ్ళాలంటే దయ్యాలుంటాయని కాటి వైపు వెళ్ళడు. కాడు ఎక్కడుందో అతనికి తెలుసు..... పొరుగూరునుండి వచ్చిన వాడికి ఈ వూర్లో కాడు ఎక్కడుందో తెలియదు.... వెళ్ళవలసి వస్తే కాడు ప్రక్కనుండే వెళ్ళతాడు. కానీ నీళ్ళున్న చోట వెళ్ళాలంటే..... అవి ఎంత లోతులో వున్నాయో ఆ వూరి వారికి తెలిసినంతగా పొరుగూరి వారికి తెలియదు. కనుక ఆ నీళ్ళలో వెళ్ళాలంటే పొరుగూరు వానికి భయం.. ఇది ఈ సామెతకు వివరణ.\
ఉన్న వూరూ - కన్న తల్లీ ఒక్కటేసవరించు
ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయెసవరించు
అత్యాశకు పోకూడదని ఈ సామెతకు అర్థం.
ఉన్న వూరూ - మన్న ప్రజాసవరించు
ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడిందిసవరించు
ఉన్నది ఒక కూతురు - వూరంతా అల్లుళ్ళుసవరించు
ఉన్నది పోదు -లేనిది రాదుసవరించు
ఉన్నదే మనిషికి పుష్టి - తిన్నదే గొడ్డుకి పుష్టిసవరించు
ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టుసవరించు
ఉన్న మాటంటే వున్నవూరు అచ్చిరాదుటసవరించు
ఉన్నమాటంటే వులుకెక్కు వన్నట్లుసవరించు
ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టేసవరించు
ఉన్నవాడు వూరికి పెద్ద - చచ్చినవాడు కాటికి పెద్దసవరించు
చేసి పెడతానన్న పని చెప్పిన సమయానికి చేయక, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకోటం.
ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదుసవరించు
ఉన్న వూరివాడికి కాటి భయం - పొరుగూరు వాడికి నీళ్ళ భయంసవరించు
ఉన్న ఊరి వాడు రాత్రులందు వెళ్ళాలంటే దయ్యాలుంటాయని కాటి వైపు వెళ్ళడు. కాడు ఎక్కడుందో అతనికి తెలుసు..... పొరుగూరునుండి వచ్చిన వాడికి ఈ వూర్లో కాడు ఎక్కడుందో తెలియదు.... వెళ్ళవలసి వస్తే కాడు ప్రక్కనుండే వెళ్ళతాడు. కానీ నీళ్ళున్న చోట వెళ్ళాలంటే..... అవి ఎంత లోతులో వున్నాయో ఆ వూరి వారికి తెలిసినంతగా పొరుగూరి వారికి తెలియదు. కనుక ఆ నీళ్ళలో వెళ్ళాలంటే పొరుగూరు వానికి భయం.. ఇది ఈ సామెతకు వివరణ.\
ఉన్న వూరూ - కన్న తల్లీ ఒక్కటేసవరించు
ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడిందిసవరించు
ఉన్నది ఒక కూతురు - వూరంతా అల్లుళ్ళుసవరించు
ఉన్ననాడు ఉట్ల పండుగ - లేనినాడు లొట్లపండుగసవరించు
ఉన్న మాటంటే వున్నవూరు అచ్చిరాదుటసవరించు
ఉన్నమాట అంటే వూరికే చేటుసవరించు
ఉపకారం చేయబోతె అపకారాం ఎదురైనట్లుసవరించు
ఉపకారం అంటే వూళ్ళోంచి లేచిపోయినట్లుసవరించు
ఉపకారానికి పోతే అపకారం జరిగినట్లుసవరించు
ఉపదేశం లావు - ఆచరణ తక్కువసవరించు
ఉపాయాలున్నవాడు ఊరిమీద బ్రతుకుతాడుసవరించు
ఉపాయం లేనివాడు ఉపవాసంతో చచ్చాడన్నట్లుసవరించు
తెలివి లేని వాడు ఉదర పోషణార్థం ఏపనీ చేయలేడు..... కనుక తిండి లేక చస్తాడని ఈ సామెతకు అర్థం.
ఉపాయం లేని వాణ్ణి ఊర్లో నుండి వెళ్లగొట్టమన్నారుసవరించు
తెలివి తేటలు లేని వాడు ఊర్లో బ్రతకడం కష్టం అని దీని అర్థం
ఉపాయవంతుడు ఊరికి నేస్తంసవరించు
మంచి సలహాలు / ఉపాయాలు చెప్పేవాడు పనీపాట చేయకుండా.... తన మాటకారి తనంతో ఊరిమీద బ్రతికేస్తాడని అర్థం.
ఉప్పు తిన్నవాడు ఉపకారం చేస్తాడుసవరించు
ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది అన్నట్లుసవరించు
ఉప్పు లేని కూర - పప్పు లేని పెండ్లిసవరించు
ఉప్పు ఊరగాయ కాదుసవరించు
ఉప్పు రుచులకు రాజు..... రోగాలకు రా రాజుసవరించు
ఉప్పు రుచులకు రాజు. అది లేని వంట లేదు. కాని అది ఎక్కువయితే అన్ని రోగాలకు అదే కారణమవుతుందని తెలియ జెప్పుతున్నది ఈ సామెత.
ఉప్పు మూటలు నీట ముంచినట్లుసవరించు
ఉప్పుమూటలు నీట ముంచితే ఉప్పు కరిగి పోతుంది. నష్టం ఎక్కువ. దీనికొక కథ చెప్పతారు. ఒక వూర్లో ఒక వ్యాపారి వుండే వాడు. వాడు ఉప్పు బస్తాను ఒక గాడిద మీద వేసుకొని ఊరూ వూరూ తిరిగి అమ్మేవాడు. ఒక నాడు ఒక కాలువ దాటుచుండగా పొరబాటున గాడిద కాలువలో పడి పోయింది. గాడిదను.... ఉప్పు బస్తాను లేపి తిరిగి ప్రయాణం మెదలెట్టాడు వ్యాపారి. నీళ్లలో పడిన ఉప్పు బస్తా..... కొంతవరకు ఉప్పు నీళ్ళలో కరిగి పోగా..... బరువు తక్కువగా వున్నట్టు అనిపించింది గాడిదకు. ఆ తర్వాత ఆ గాడిద దారిలో ఎక్కడ కాలువ దాటవలసి వచ్చినా కావాలని ఆ కాలువ నీళ్ళలో పడి పోయేది బరువు తగ్గించుకోడాని. ..... అలా వుండగా..... ఇది గ్రహించిన వర్తకుడు గాడిదకు బుద్ధి చెప్పాలని..... ఒక రోజు ఆ వ్యాపారి..... ప్రత్తితో నింపిన బస్తా గాడిద మీద వేసికొని వెళుతుంటాడు. అలవాటు ప్రకారం ఆ గాడిద కాలవలో కావాలనేపడుతుంది. వర్తకుడు ప్రత్తి బస్తాను, గాడిదను పైకి లేపి తిరిగి ప్రయాణమౌతాడు. నీటిలో తడిసిన ప్రత్తి బస్తా.... బరువు రెట్టింపవుతుంది. తాను చేసిన పొరబాటును గుర్తించింది గాడిద.
ఉప్పు వేసి పొత్తు కలిపినట్లుసవరించు
ఉప్పులేని పప్పు చప్పనసవరించు
ఉభయ భ్రష్టత్వం - ఉప్పరి సన్యాసం అన్నట్లుసవరించు
ఉమ్మడి పనికి బడుగు - సొంత పనికి పిడుగుసవరించు
ఉమ్మడి బర్రె పుచ్చి చచ్చిందన్నట్లుసవరించు
ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం యిద్దరికీ చేటుసవరించు
వ్యాపరమైనా.... వ్యవసాయమైనా.... ఉమ్మడిగా చేయ కూడదని ఈ సామెతకు అర్థం. ఉమ్మడిగా చేస్తే చేయ వలసిన పని వాడు చేస్తాడని వీడు..... వీడి చేస్తాడని వాడు... ఇలా ఎవరికి వారు అనుకుంటుంటే ఆ పని కాస్తా అసంపూర్ణంగా మిగిలి పోతుంది. నష్టం వస్తుంది.
ఉయ్యాలలో బిడ్డను పెట్టి వూరంతా వెదకినట్లుసవరించు
ఎదురుగా ఉన్న విషయాన్ని/నిజాన్ని విస్మరించి, పరిష్కారం కొరకు ఎక్కడెక్కడో తిరిగి అలసిన వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఉరికే వాడిని చూస్తే తరమాలనిపిస్తుందిసవరించు
ఉరిమిన మబ్బు కురవక మానదుసవరించు
ఉరిమిన మబ్బు, తరిమిన పాము వూరికే పోవుసవరించు
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుసవరించు
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు - మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.కుండకు ప్రక్కన రంధ్రంతో ఇంకా బలహీనమౌతుంది. మంగలంలో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే.
ఉలవకాని పొలం వూసరక్షేత్రంసవరించు
ఉలవ చేను పెట్టే మగడు వూరకుండక ప్రత్తిచేను పెట్టి ప్రాణం మీదకు తెచ్చాడుసవరించు
ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పమౌతుంది.సవరించు
కష్టాలకోర్చుకున్నచో సుఖాలు లభిస్తాయి అని అర్థం చేప్పేదే ఈ సామెత. సుత్తి దెబ్బలు తగిలితేనే బంగారం మెరుస్తుంది అనే సామెత లాంటిదే ఈ సామెత కూడాను.
ఉలిపి కట్టె కేలరా వూళ్ళో పెత్తనాలు?సవరించు
ఉల్లి వుంటే మల్లి కూడా వంటలక్కేసవరించు
ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదుసవరించు
ఉల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పేదే ఈ సామెత. ఉల్లి అంటే వెల్లుల్లి అని నిఘూడార్థం గమనించవలెను.
ఉల్లి ఉల్లే - మల్లి మల్లేసవరించు
ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనేసవరించు
ఉల్లి ఎంత ఉడికినా కంపు పోదుసవరించు
ఉల్లి గడ్డంత కోడలు వస్తే స్మశానంలో వున్న అత్తగారు వులిక్కిపడిందటసవరించు
ఉల్లి తిన్న కోమటి నోరు మూసుకున్నట్లుసవరించు
ఉల్లినీ తల్లినీ నమ్మి చెడినవారు లేరుసవరించు
ఉల్లి పది తల్లుల పెట్టుసవరించు
ఉల్లి లేక ఉల్లిపాయ యొక్క ఉపయోగాలు నిత్యజీవితంలో వంటల్లో వాడుకపరంగా, మూలికా ఔషధపరంగా ఎన్నో ఉన్నాయి. ఉల్లిని తల్లితో పోల్చటంలోనే ఉల్లి గొప్పతనం తెలుస్తోంది.
ఉల్లి మల్లె కాదు కాకి కోకిల కాదన్నట్టుసవరించు
పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎంత ప్రయత్నం చేసినా మారవని.ఎన్ని నీతులు చెప్పినా మారని వారిని గురించి ఈ సామెత వాడుతారు .
ఉల్లిపాయంత బలిజ వుంటే వూరంతా చెడుతుందిసవరించు
ఉల్లిపాయపెట్టని కోమటి వూరంతా ధారపోసినట్లుసవరించు
ఉల్లి మల్లెవుతుందా? వుంచుకున్నది పెళ్ళామవుతుందా?సవరించు
కాకి కోయిలౌతుందా అలాగే ఉంచుకున్నది పెళ్ళాము కానేకాది. దేని ప్రాముఖ్యత దానిదే..... అని చెప్పేదే ఈ సామెత.
ఉల్లి ముట్టనిదే వాసన రాదన్నట్లుసవరించు
ఉసిరికాయలంత వుంటే వూరంతా ఏలవచ్చుసవరించు
మూలాలుసవరించు
- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం