భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ఊ, ఋ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి. ==ఊకదంపుడు మాటలు == పనికిరాని,ఉపయోగం లేని మాటలు

ఊకని దంపితే బియ్యం వస్తాయా?సవరించు

ఊక అనగా బియ్యంలేని పొట్టు. బియ్యంకొరకు దానిని దంచడము వృథా. ఉపయోగములేని పని చేయడాన్ని / వృథాప్రయాసను ఈ సామెత తెలియజేస్తుంది

ఊగే పంటి కింద రాయి పడ్డట్టుసవరించు

అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి. అటువంటి సందర్భాలలో ఈ సామెతను వాడుతారు.

ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చుసవరించు

ప్రాణానికి తెగించి దేన్నో సాధించ ప్రయత్నించి, ఆ ప్రయత్నములో ప్రాణములే ప్రమాదములో పడినప్పుడు, ఈ సామెతను చెప్పుదురు. అసలు ప్రాణం అంటూ ఉంటే ఉప్పుకల్లు అమ్ముకోవటంతో సహా ఏదో ఒక పని చేసుకు బ్రతకవచ్చు అని ఈ సామెత యొక్క అర్థం.

ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లుసవరించు

ఎవడో ఒక ప్రబుద్ధుడు ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నవాడి ముక్కు మూసాట్ట. అవివేకముతో చేసే వారి పనులు ఏ విధముగా ఉండునో ఈ సామెత తెలియచెప్పుచున్నది.

ఊపిరి వుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చుసవరించు

ఊపిరి అనగా ప్రాణం అని అర్థము. దానికున్న విలువను తెలియ జేస్తున్నది ఈ సామెత. అసలు ప్రాణమంటూ వుంటే ఏ పని చేసైనా బ్రతక వచ్చు అని ఈ సామెత అర్థం.

ఊపిరి పట్టితే బొజ్జ నిండుతుందా?సవరించు

ఊపిరి (గాలి) బిగబట్టితే కడుపు గాలితో నిండుతుంది. అంతమాత్రం చేత ఆకలి తీరదు అని ఈసామెత అర్థం.

ఊరక రారు మహానుభావులుసవరించు

ఊరకరారు మహాత్ములుసవరించు

ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిటసవరించు

ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదుసవరించు

ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుటసవరించు

ఊరంతా నాన్నకు లోకువ - నాన్న అమ్మకు లోకువసవరించు

ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీసవరించు

ప్రతి పనికి టింగురంగ అంటు బయలుదేరే వారిని ఈ విధంగా అంటారు.

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంటసవరించు

ఎవరేది మంచి చెప్పినా వినకుండా మూర్ఖంగా తన దారిన తను పోయేవాడిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.

ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుందిసవరించు

ఈ రెండు మాటలకు ఒకటే అర్థం. వృద్దులు అవసాన దశలో నిరాశ నిస్పృహలో ఈ మాట అంటుంటారు

ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదుసవరించు

ఏపనైనా చేస్తే అందులో ఏమైనా తప్పులు దొర్ల వచ్చు. అసలు పనేచేయకుంటే తప్పులు దొర్లే అవకాశమే లేదు. అందుకే అన్నారు ఊరకున్న వాడు ఉత్తమోత్తముడు అని.

ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాసు కూడ పడదుసవరించు

ఊర్లో పెళ్ళికి ఇంట్లో సందడిసవరించు

ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడిసవరించు

పల్లటూళ్ళలో పెళ్ళి జరిగినప్పుడు భోజనాలు ఆరుబయటగాని, పందిరివేసి గాని విస్తళ్ళలో వడ్డిస్తారు. విందుభోజనాల ఘుమఘుమలకు ఊళ్ళోని కుక్కలన్నీ భోజనాల పందిరి దగ్గర చేరి విసిరేసిన విస్తళ్ళ దగ్గర కాట్లాడుకుంటూ తెగ హడావిడి చేస్తాయి. పెళ్ళివారికీ ఊళ్ళొని కుక్కలకీ ఏ సంబంథం ఉండదు. అలాగే తమకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చి కొందరు హడావిడి చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు.

ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లుసవరించు

ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదటసవరించు

ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుటసవరించు

ఊరంతా నాన్నకు లోకువ - నాన్న అమ్మకు లోకువసవరించు

ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదటసవరించు

ఊరపిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుసవరించు

ఊర పిచ్చుక ఒక అల్ప జీవి. దాని అతి పెద్దదైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము మూర్ఖత్వమని అర్థము.

ఊరించి వూరించి బెల్లం పెట్టినట్లుసవరించు

ఊరికళ వూరి గోడలే చెపుతాయిసవరించు

ఊరికి వచ్చినమ్మ నీళ్ళకు రాదా?సవరించు

ఊరికి చేసిన ఉపకారం... శవానికి చేసిన సింగారం ... వృధా..సవరించు

శవానికి ఎన్ని అలంకారాలు చేసినా కొన్ని గంటల్లో అవన్ని శ్మశానంలో కాలి పోవాల్సిందే. అలాగే స్వంత వూరికి చేసిన ఉపకారం కూడా వృధా అని అర్థం.

ఊరికి ఉపకారి ఆలికి అపకారిసవరించు

ఇంటి పనుల కన్నా బయట వాళ్ళ పనులు ఎక్కువ చెసే మనిషిని ఉద్ధేసించి ఈ మాటలు అంటారు

ఊరికే వస్తే మావాడు మరొకడున్నాడటసవరించు

ఉచితంగా ఏదైనా ఇస్తున్నారంటే దానికొరకు ఆ వస్తువు అవసరమున్నా లేకున్నా అందరూ దానికొరకు ప్రయత్నిస్తారని ఈ సామెత అర్థము

ఊరంతా చుట్టాలే... ఉట్టి కట్ట తావే లేదుసవరించు

ఊరికే పెట్టే అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లుసవరించు

ఊరికే కూర్చునేవాడికి వురిమినా వుత్తేజం రాదుసవరించు

ఊరి గబ్బు చాకలికి తెలుసుసవరించు

ఊరి దగ్గరి చేనుకు అందరూ దొంగలేసవరించు

ఊరినిండా అప్పులు - తలనిండా బొప్పెలుసవరించు

ఊరి మీద వూరు పడ్డా కరణం మీద కాసు పడదుసవరించు

ఊరి ముందర చేను - ఊళ్ళో వియ్యము అందిరావుసవరించు

ఊరి ముందరి చేను వూరపిచ్చుకల పాలన్నట్లుసవరించు

ఊరిలో కుంటి - అడవిలో లేడిసవరించు

ఊరి వారి పసుపు - ఊరి వారికుంకుమ అన్నట్లుసవరించు

ఊరి వారి వత్తి, వూరి వారి చమురు, వూగు దేముడా వూగు అన్నట్లుసవరించు

ఊరుంటే మాదిగవాడ, మాలవాడ వుండవా?సవరించు

ఊరు ఉసిరికాయంత - తగవు తాటికాయంతసవరించు

ఊరుకు చేసిన వుపకారం - పీనుగుకు చేసిన శృంగారం ఒకటేసవరించు

ఊరు మారినా పేరు మారదన్నట్లుసవరించు

ఊళ్ళేలని ఏలని వాడు రాజ్య మేలుతాడా?సవరించు

ఊళ్ళో లేని మొగుడుకన్న - ఉపాదానమెత్తే మొగుడు మేలుసవరించు

ఊళ్ళో యిల్లు లేదు - పొలంలో చేను లేదుసవరించు

ఊళ్ళో పెళ్ళయితే కుక్కలకు హడావిడన్నట్లుసవరించు

ఊళ్ళో ముద్ద - గుళ్ళో నిద్రసవరించు

ఊళ్ళో వియ్యం - ఇంట్లో కయ్యంసవరించు

ఊళ్ళో వియ్యం కలతల నిలయంసవరించు

ఊసరవెల్లిలాగా రంగులు మార్చినట్లుసవరించు

ఊహ వూళ్ళేలుతుంటే - రాత రాళ్ళు మోస్తున్నదిటసవరించు

ఋణ శేషము శత్రు శేషము వుండ కూడ దంటారు.సవరించు

ఋణము - వ్రణము ఒక్కటేసవరించు

ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదుసవరించు

ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదుసవరించు

మూలాలుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం