భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకుఏ అన్నమైతేనేం వరి అన్నమే పెట్టమన్నట్టుసవరించు

జొన్న అన్నం తినేవాళ్ళ దగ్గర మీరు ఏది తింటే అదే పెట్టండి కానీ వరి అన్నం పెడితే బాగుంటుందేమో అని లౌక్యంగా చెప్పి తనకు కావలసింది పెట్టించుకొని తినటం.

ఏ ఆకు రాలినా ఈతాకు రాలదుసవరించు

ఏ ఎండకా గొడుగు పట్టినట్లుసవరించు

ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుందిసవరించు

ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లుసవరించు

ఏకాంతంలో కాంతా కలాపాలే ముద్దన్నట్లుసవరించు

ఏ కాలు జారినా పిర్రకే మోసంసవరించు

ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టుసవరించు

ఏకుతో తాకితే మేకుతో మొట్టినట్టుసవరించు

చిన్న తప్పుకు పెద్ద శిక్ష వెయ్యటం

ఏకుతో తాకితే మోకుతో కొడతారుసవరించు

ఏకులాగ వచ్చి మేకులాగా అయినట్లుసవరించు

ఏకులు పెడితే బుట్ట చిరుగుతుండా?సవరించు

ఏ గాలికా చాప యెత్తినట్లుసవరించు

ఏ గుంటనీరు ఆ గుంటకేనన్నట్లుసవరించు

ఏ గూటి పక్షి ఆ గూటికేసవరించు

ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందిసవరించు

ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పట్టరాదుసవరించు

ఏ చెట్టూ లేనిచోట ఆముదపుచెట్టు మహావృక్షంసవరించు

ఏటవతల యిచ్చేకన్నా యేట్లో పారేయటం ఉత్తమంసవరించు

ఏటి ఈతకు లంక మేత సరిసవరించు

ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా?సవరించు

ఏటి వొడ్డు చేనుకు మాటిమాటికీ భయంసవరించు

ఏటికి ఎదురీదినట్లుసవరించు

ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లుసవరించు

ఏటిగట్టు దాని మాట యెన్నడూ నమ్మరాదుసవరించు

ఏటిముందర - కూటిముందర తడవ సెయ్యకుసవరించు

ఏటివంక లెవరు తీరుస్తారు?సవరించు

ఏటివరద - నోటిదురద రెండూ ఒక్కటేసవరించు

ఏటుకు ఏటు - మాటకు మాటసవరించు

ఏమీలేనమ్మకు ఏతులు లావుసవరించు

వివరణ: ఏతులు అనగా గొప్పలు అని అర్థం. ఏమీ లేనమ్మ అన్నీ గొప్పలే చెపుతుంది. అని అర్థం. అన్ని వున్న విస్తరి అణిగిమణిగి వుంటుంది... ఖాళీ విస్తరే ఎగెరెగిరి పడుతుందీ ఈ సామెత కూడా ఒకే అర్తంలో వాడతారు.

ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లుసవరించు

పూర్వకాలంలో చెల్లెలికి పెళ్ళికావటం కష్టమయిన పరిస్థితిలో, అక్క మొగుడికే ఇచ్చి పెళ్ళి చేసేవారు.ప్రయత్నించిన పని బయటివారి వల్ల కాక చివరగా సొంతవారి సహాయము కోరవచ్చినవాడిని ఉద్దేశించి

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లుసవరించు

ఎక్కడికక్కడ పరిస్థితిని అర్థంచేసుకుని, దానికి తగినట్లుగా ఆయా ప్రదేశాల్లో ప్రవర్తించాలని ఈ సామెతకు ఒక అర్థం. మరొక అర్థం ఏమంటే.... అవసరాన్ని బట్తి రంగులు మార్చే మొసగాడ్ని కూర్చి కూడా ఈ సామెతను వాడుతారు.

ఏగూటి చిలక ఆగూటి పలుకులే పలుకుతుందిసవరించు

ఏగూటి పక్షులు ఆ గూటికే చేరుతాయిసవరించు

ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షముసవరించు

పెద్దగా విషయ పరిజ్ఞానం లేనివారిదగ్గర మిడిమిడి జ్ఞానంతో డంబాలు పలికేవాడు అమాయకుల మధ్యనున్నంతవరకూ అతడే మేధావి

ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్లుసవరించు

ఎన్ని పాట్లు పడినా ఆవన్నీ తిండి కొరకే అనే అర్థం ఈ సామెత చెపుతున్నది.

ఏపుట్లో ఏ పాముందో ఎవరికెరుకసవరించు

ఎవరి మనసులో ఏ ఆలోచనలున్నాయో ఎవరు తెలుసుకోలేరు

ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేంసవరించు

ఏటి ఇసుకని కొలవటము, తాటిమానుని తన్నటము, ఈతమానునని విరిచే ప్రయత్నము చేయటం, ఈ మూడు అసాధ్యమయిన, మూర్ఖమయిన పనులు. ఓ మూర్ఖుని బుద్ధిని మార్చేప్రయత్నము

ఏటికవతల ముత్యాలు తాటికాయంత వున్నాయి అన్నడటసవరించు

ఏట్లో వేసే టప్పుడు కూడ ఎంచి వేయాలి.సవరించు

ఏరు, నదిని దాటె టప్పుడు అందులో చిల్లర నాణేలను వేయడం సాంప్రదాయం. అలా వేసెటప్పుడు కూడా ఇంత వేస్తున్నాను అని ఎంచి వేయాలని..... ప్రతి ఖర్చుకు లెక్క వుండాలని డబ్బు విషయంలో బాధ్యతాయుతంగా వుండాలని చెప్పెదే ఈ సామెత.

ఏట్లో వేసినా యెంచి వేయాలిసవరించు

ఏట్లో పారే నీరు యెవరు త్రాగితేనేం?సవరించు

ఏడవగలిగితే ఏడ్చేకొద్దీ వ్యవసాయంసవరించు

ఏడవనేరిస్తేనే వ్యవసాయంసవరించు

ఏడ్చి ముఖం కడుక్కున్నట్లుసవరించు

ఏడు కురచలు చూచి యెద్దు కొనాలిసవరించు

ఏడుపులో ఏడుపుసవరించు

ఏడుపులో ఎడమ చేయి అన్నట్లుసవరించు

ఏడు మాటలు మాట్లాడినా ఏడడుగులు నడిచినా గుణం తెలుస్తుందిసవరించు

ఏడు మెతుకులు కతికితే ఏనుగంత బలంసవరించు

ఏడుస్తూ ఏరువాక సాగిస్తే కాడీ, మోకూ దొంగలు యెత్తుకుపోయారటసవరించు

ఏడ్చేదాని ఎడమచేతి క్రిందా, కుట్టేదాని కుడిచేతి క్రిందా కూర్చోరాదన్నట్లుసవరించు

ఏడ్చేదాని మొడొస్తే నామొగుడు వస్తాడన్నదట ఒక ఇల్లాలు:సవరించు

ఇద్దరు మగ వాళ్లు కలిసి వేటకు వెళ్లారట: వారు ఎంత కాలానికి తిరిగి రాక పోయే సరికి అందులో ఒకని భార్య తన మొగుడి గురించి ఏడవ సాగింది. రెండొ అతని భార్య ఏడ్వకుండా నిబ్బరంగా వుందట.ఇరుగు పొరుగు ఎందుకు అలా నిబ్బరంగా వున్నావని అడగ్గా... ఆమె మామొగుళ్లు ఇద్దరు కలిసే వెళ్లారు. ఆ ఏడ్చే దాని మొగుడు వస్తే నామొగుడు కూడా వస్తాడు గదా.... అని సమాధానం చెప్పిందట\ ఆడపిల్లలు పెళ్ళి వయసుకి ఎదిగినా కొంతమంది తల్లితండ్రులకు వారికి పెళ్ళిచెయ్యాలి అన్న ఊహ రాదు. తెలుగు వారింట సాంప్రదాయంగా పెద్దపిల్లలకు పెళ్ళిచేసి గాని చిన్న పిల్లలకు చేయరు. అందుకని అక్కకు పెళ్ళి అయితే తనకు కూడా అవుతుంది అనే ధైర్యంతో కొంతమంది చెళ్ళెళ్ళు ఆ విషయాన్ని పట్టింఛుకోరు. అలాగే కొంతమందికి ఒకే రకమయిన సమస్యలు వున్నా కానీ అందరూ వాటిని పరిష్కరించటానికి నడుము కట్టరు. తోటివారు పరిష్కరిస్తే మనకి కూడా పరిష్కారమవుతుందని ఎదురు చూస్తూ వుంటారు. అటువంటి వారిని పోల్చి చెప్పటానికి ఈ సామెత .

ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదుసవరించు

సంశయించవలసిన విషయమే

ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చొన రాదుసవరించు

ఏడ్చేవాడు ముక్కు చీది ఎడంపక్కకు వేస్తాడు.అంచేత ఏడ్ఛే వానికి ఎడం పక్కన కూర్చో రాదు.సూదితో కుట్టే వాడు ప్రతి కుట్టుకు సూదివున్న చేతిని దారాన్ని బిగదీసేందుకు పొడుగ్గా చాపుతాడు. అంచేత కుట్టేవానికి కుడి పక్కన కూర్చో రాదు అని అని అర్థం.

ఏడ్చేవాడిని చూచి నవ్వినట్లుసవరించు

ఏపాటు తప్పినా సాపాటు తప్పదుసవరించు

ఎవరు ఏపని చేసినా తిండి కొరకే. అందరికి తిండి తప్పదు.'కోటి విద్యలు కూటి కొరకే'

ఏతాము పాటకు ఎదురుపాట లేదుసవరించు

ఏదారి లేకుంటే గోదారె దిక్కుసవరించు

ఏ దారి అంటే గోదారి అన్నట్లుసవరించు

ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపేసవరించు

ఐదు తూములు తిన్నా, పది తూములు తిన్న ఏమీ తిననట్లే। మరీ తిండిబోతుని, పొద్దాకా ఏమన్నా పెట్టు, ఏమన్నా పెట్టు అని ఏడిపించే పిల్లలని ఇలా అంటూ ఉంటారు

ఏదుంతిన్నా ఏకాదశే పందుంతిన్నా పరగడుపేసవరించు

ఏ దేముడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరుసవరించు

ఏనుగుకు వెలక్కాయలు లొటలొటసవరించు

ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టుసవరించు

సమఉజ్జీగా లేని వ్యవహారం. స్థాయిని మించి చేసే వ్యర్థ ప్రయత్నం.

ఏనుగు తొండమూ తిరుగుబోతు ముండ వూరుకోవుసవరించు

ఏనుగంత తండ్రి ఉండే కంటే ఎలుకంత తల్లి మేలుసవరించు

ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లుసవరించు

మంచి షడ్రుచులతో తినడము అలవాటయినవాడు పచ్చడి మెతుకులు తిని ఉండలేడుకదా. ఎక్కువ మోతాదులో తినడం అలవాటయినవాడికి కొద్ది మోతాదులో తిండి పెట్టటాన్ని

ఏనుగు దాహానికి చూరునీళ్ళా?సవరించు

ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడుసవరించు

ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు వంటిదే ఈ సామెత.

ఏనుగులా ఉండేవాడు పీనుగులా తయారయ్యాడుసవరించు

ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యేసవరించు

ఏనుగు బ్రతికున్నప్పుడు దానితో బరువైన పనులెన్నో చేయించవచ్చు. అది చనిపోయాక దాని శరీరభాగాలను అమ్మి ధనము సంపాయించవచ్చు. ఈ విధంగా ఎవరైనా బ్రతికున్నప్పుడూ, మరణించిన తరువాతా ఉపయోగపడినప్పుడు ఈ సామెత

ఏనుగు నిచ్చి అంకుశం దాచుకున్నట్లుసవరించు

ఏనుగు వెళు తుంటే కుక్కలు మొరిగి నట్టుసవరించు

ఏనుగులు మందగమనంతో నడుస్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. కాని ఏనుగులు వాటిని కించెత్తైనా గమనించవు. నిజాయితీ పరులైన నాయకులు ఎవరెన్ని అన్నా తమ పనులు తాము చేసుకొని పోవాలి. ఎవరో ఏదో అన్నారని దాని గురించి విచారించరు అని ఈ సామెత అర్థము

ఏనుగునెక్కి కుక్క అరుపులకు దడిచినట్టుసవరించు

మంచి పనిని చేస్తున్నప్పుడు నీచులు, దుర్మార్గులు అనే మాటలను విని దడుచుకోకూడదు. ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉండాలి

ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లుసవరించు

ఏనుగు నెక్కి దిడ్డి లోకి వెళ్ళినట్లుసవరించు

వివరణ: దిడ్డి అనగా సందు. ఏనుగు ఎక్కిన వాడు రాజ మార్గంలో వెళ్ళాలి. అలా వెళ్ళితే హోదాకు హోదా..... ఏనుగు నడక సక్రంమంగా వుంటుంది. సందులో వెళ్ళితె ఏనుకు పైనున్న వాడికి ప్రమాదము, ఏనుగు సందులో నడవడం కూడా కష్టమే. తెలివి తక్కువ వారి పనులకు ఈ సామెతను వాడుతారు.

ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లుసవరించు

భస్మాసురుడు తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకుని బూడిద అయినట్టు తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకొవటం

ఏనుగు మీద దోమ వాలి నట్లుసవరించు

ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యేసవరించు

ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడా!సవరించు

ఏనుగులే గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా సంగతేమిటి అన్నదటసవరించు

ఏ పని చేసినా పొయ్యిలో ఏకులు దాచుకున్నట్లేసవరించు

ఏ పుట్టలో ఏ పాముందో?సవరించు

ఏ పూజ తప్పినా పొట్టపూజ తప్పదుసవరించు

ఏబ్రాసికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువసవరించు

ఏ మందలో పట్టినా, మన మందలో ఈనితే సరిసవరించు

ఏమి చేసుకుని బ్రతకనమ్మా అంటే నోరు చేసుకుని బ్రతకమన్నట్లుసవరించు

ఏమి చేస్తున్నావురా అంటే పారబోసి యెత్తుతున్నా అన్నాట్టసవరించు

ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందటసవరించు

ఏమీ ఎరుగని వాడు చీరముడి, పోకముడి విప్పి ఆశ్చర్యంగా చూసాడటసవరించు

ఏమీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి పోయిందటసవరించు

ఏమీ లేకపోతే మూట విప్పి మళ్ళీ కట్టమన్నట్లుసవరించు

ఏమీ లేనమ్మకు యేడ్పులే శరణ్యంసవరించు

ఏమీ లేనివానికి ఏతులు లావు - స్వాములవారికి జడలు లావుసవరించు

ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్లు తినవచ్చుసవరించు

ఏమండీ కరణం గారూ పాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడటసవరించు

కొంతమంది అన్ని పరిస్థితులలోనూ అన్ని వేళలలోనూ తమదే పైచెయ్యిగా ఉండాలని అనుకుంటుంటారు. ఎప్పుడన్నా ఒకసారి ఎవరైనా ఎన్నో గొప్పలు చెప్పారు కదా అపజయం పాలయ్యారేమిటి అని ప్రశ్నిస్తే అది తమ అపజయం కాదని, ఇంకా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నానని బుకాయిస్తుంటారు.కరణాలు, మునసబులు ఊరిపెద్దలుగా పెత్తనం చేస్తుండేవారు.ఒక కరణం గోతిలో పడ్డాడట.ఒకాయన మా అందరికీ చెప్పేవాడివి కదా, ఇప్పుడు నీవిలా గోతిలో పడ్డావేమిటని ప్రశ్నిస్తే తాను పడలేదని సర్వేచేస్తూ అలా దూకానని బుకాయించాడట. తనకే అన్నీ తెలిసినట్లు అందరికీ సూచనలిచ్చేవాడు మోసపోయినప్పుడు ఎవరైనా ఇదేంటి ఇంత తెలివితక్కువగా మోసపోయావు అని అడిగితే, తన పరువు దక్కించుకోవటానికి తాను మోసపోలేదని తానే కావలసి అలా ప్రవర్తించానని చెపుతున్నప్పుడు విన్నవారు ఈ సామెతచెబుతారు.

ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడుందిసవరించు

ఖాళీగా ఏమీ వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అదే అన్ని పదార్థాలు వడ్డించిన విస్తరాకు ఎగరకుండా స్థిరంగా ఉంటుంది. మిడిమిడి జ్ఞానం గలవాడూ, స్థితప్రజ్ఞుడినీ పోల్చుతూ ఈ సామెత .

ఏరా బడాయిబావా అంటే ఏమే గుడ్డి కంటి మరదలా అన్నాడటసవరించు

ఏరా?.... పడ్డావా?.... అంటే ..... లేదు అదొక లగువు అన్నాడటసవరించు

చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనే వారి గురించి చెప్పినది ఈ సామెత.

ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి!సవరించు

ఏ రేవుకు వెళ్ళినా ముళ్ళపరిగే దొరికిందన్నట్లుసవరించు

ఏరు యెన్ని వంకలు పోయినా కలిసేది సముద్రంలోనేసవరించు

ఏరు ఏడామడలుండగానే చీర విప్పి చంకన బెట్టుకొందటసవరించు

ఏరు ఏడు ఆమడలు దూరంలో ఉండగా అప్పుడే చీర తడిసి పోతుందేమో అన్న భయంతో చీర విప్పి చంకన పెట్టుకున్నట్టు, అతి జాగ్రత్త

ఏరు యెంతపారినా కుక్కకు గతుకునీళ్ళేసవరించు

ఏరు ఏడామడలదూరం వుండగానే చీరవిప్పి చంకలో పెట్టుకున్నదటసవరించు

ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుసవరించు

అవసరం తీరిన తర్వాత సహాయం చేసిన వాళ్ళకు హాని తలపెట్టడం .ఏరు దాటడానికి తెప్పను వాడుకుని, అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత ఇంక ఆ తెప్పతో మనకు అవసరం లేదని దాన్ని తగలబెట్టినట్లు

ఏరు దాటి తెప్ప తగలేసినట్లుసవరించు

ఏరు పోయిందే పోక - యేలిక చెప్పిందే తీర్పుసవరించు

ఏరు మూరెడు తీస్తే - కొలను బారెడు తీస్తుందిసవరించు

ఏరు ముందా? ఏకాదశి ముందా?సవరించు

ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్యసవరించు

పొందిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నతతో వ్యవహరించటం. అవసరం తీరేవరకూ ముఖస్తుతి చేసి ఆపై హేళన చేసే నీచబుద్ధి

ఏళ్ళు యెగసన - బుద్ధి దిగసనసవరించు

ఏలటానికి వూళ్ళు లేకపోవచ్చుకానీ బిచ్చమెత్తుకు తినటానికి వూళ్ళే లేవా?సవరించు

ఏలేవాడి యెద్దు పోతేనేం - కాచేవాడి కన్ను పోతేనేం?సవరించు

ఏవాడ చిలుక ఆవాడ పలుకు పలుకుతుందిసవరించు

ఏ వేషం వచ్చినా దివిటీ వానికే చేటుసవరించు

ఏ వేషం వేసినా గ్రాసం మాత్రం రావాలన్నట్టుసవరించు

ఏ పని వృథాగా, ఉచితంగా చెయ్యకూడదని. ఏ పనిచేసినా తగిన ప్రతిఫలం పొంది తీరాల.ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం

ఏ వేషం వేస్తేనేం? గ్రాస మొస్తుంది గదా!సవరించు

ఐదు నిముషాల సుఖానికి మరుజన్మ నెత్తాలి అందిటసవరించు

ఐశ్వర్య దేవత హలంలోనే వుందిసవరించు

ఐశ్వర్యానికి అంతం లేదు - దారిద్ర్యానికి మొదలూలేదుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_ఏ&oldid=3008318" నుండి వెలికితీశారు