ప్రధాన మెనూను తెరువు
భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ఒ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవుసవరించు

ఒకడి పాటు పది మంది సాపాటు అన్నట్టుసవరించు

ఒకరిపై ఎక్కువ మంది ఆధారపడి బతకటం.

ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారుసవరించు

కష్టాలలో ఉన్నవానికి ఇవన్నీ మామూలే అంటూ ఉచిత సలహాలివ్వటం

ఒక దెబ్బకు రెండు పిట్టలుసవరించు

ఒకే పనితో రెండు కార్యములు చేయ ప్రయత్నించి, అవి నెరవేరిన సందర్భములో ఈ సామెతను ఉటంకించెదరు. అంటే ఒకే పనికి రెండు ప్రయోజనాలు కలగడం అని ఈ సామెత చెబుతోంది.

ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పేసవరించు

ఒల్లని మగడా వండి పెట్టరా అంటే చేతకాని పెళ్లామా చేర్చి పెట్టవే అన్నాడటసవరించు

ఒల్లని లంజకు విడువని మిండడుసవరించు

ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టుసవరించు

మతిమరుపు వారిని గురించి ఈ సామెత పయోగిస్తారు.

ఒళ్ళు బలిసిన పూజారి అమ్మవారిని పట్టుకున్నాడటసవరించు

ఒంటికి ఓర్చలేనమ్మ రెంటికి ఓర్చునాసవరించు

ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరుసవరించు

ఆపని అసాధ్యము అని చెప్పడనికి ఈ సామెతను ఉపయోగిస్తారు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_ఒ&oldid=2008228" నుండి వెలికితీశారు