ప్రధాన మెనూను తెరువు
భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "గ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

విషయ సూచిక

గంగకు - దొంగకు - పంగకు తప్పులేదుసవరించు

గంగలో మునిగినా కాకి హంస కాదుసవరించు

గంగిగోవు పాలు గరిటడైన చాలుసవరించు

ఈ సామెత వేమన శతకంలో ఒక పద్యం నుంచి స్వీకరించబడింది. "గంగిగోవు పాలు గరిటడైన చాలు" "కడవడైననేమి ఖరము పాలు" అంటే నాణ్యత కలది, లేదా ప్రేమతో ఇచ్చింది కొద్దిగానైనా చాలుగానీ నాణ్యత లేనివి లేదా మనసులో కుళ్ళుకుంటూ ఇచ్చినవి ఎంత ఎక్కువైనా వ్యర్థం అని దీని భావం. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

గంజాయి తోటలో తులసి మొక్కసవరించు

గజమూ మిధ్య - పలాయనమూ మిధ్య అన్నట్లుసవరించు

గజ్జి ఉన్నవాడికి లజ్జ వుండదుసవరించు

గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టుసవరించు

గంజి మాత్రమే తాగగలిగే స్తోమత కలిగినవాడు, తాను గంజి తాగేటప్పుడు తన మీసాలు ఎత్తి పట్టుకోవటానికి ఇంకో మనిషిని నియమించుకోలేడు. అలాగే తమ ఆర్థిక స్తోమతే బాగాలేని వారు, వేరొకరిని తమకింద పనికిగాని, పరపతి కోసంగాని నియమించుకున్నప్పుడు వారిని విమర్శిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు.

గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారటసవరించు

గంతకు తగ్గ బొంతసవరించు

ఎవరికి తగిన వారు వారికి దొరకక పోతారా అని

గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడుసవరించు

గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది - తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుందిసవరించు

గట్టుమీద వానికి గప్పాలెక్కువసవరించు

గడ ఎక్కు తిమ్మన్నా - గంతులు వేయి తిమ్మన్నా అన్నట్లుసవరించు

గడించేది ఒకడు - అనుభవించేది మరొకడుసవరించు

గడించే వాడొకడు - గుణించే వాడొకడుసవరించు

గడిచి బ్రతికినామని గంతులు వేయరాదుసవరించు

గడియ పురసత్తు లేదు - గవ్వ ఆదాయం లేదుసవరించు

గడ్డివాము దగ్గర కుక్కలాగాసవరించు

తాను తినదు... తినే ఆవును దగ్గరకు రానీయదు....

గడ్డివామిలో సూది వెదికినట్లుసవరించు

గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లుసవరించు

గడ్డ గడ్డకు గ్రుక్కెడు నీళ్ళు త్రాగినా రెడ్డే వ్యవసాయం చేయాలిసవరించు

గడ్డ పలుగులు గాలికి కొట్టుకుపోతూంటే పుల్లాకు నా గతేంటి అన్నదటసవరించు

గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టుసవరించు

వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలు, సహాయకులున్నచోటే నివాసం ఉండటం మేలు అని చెప్పే సామెత ఇది.

గతం గత:సవరించు

ఏదైన ఒక సంఘటన జరిగితే దాన్ని గురించి సదా ఆలోచించ కూడదని ఈ సామెత అర్తం. జరిగి పోయినది .... దాన్ని గూర్చి ఆలోచిస్తూ సమయం వృధా చేయకూడదు. జరగ వలసి వున్న దానినిగురించి ఆలోచించాలని ఈ సామెత అర్థం.

గతజల సేతు బంధనముసవరించు

నీరు పోయాక ఆనకట్ట కట్టిన అనవసరం అలాగే అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు

గతి లేనమ్మకు గంజే పానకముసవరించు

తిండికి గతి లేని వానికి గంజియే పానకము . రుచిలేనిదయిననూ దొరికిన పదార్థమును మిక్కిలి ఇష్టముగా తినటం.

గతి చెడినా మతి చెడరాదుసవరించు

గతిమాలిన వాడికి కుతిక లావుసవరించు

గద్దించే అత్త - మర్దించే మామసవరించు

గాదె క్రింద పందికొక్కులాగాసవరించు

గానుగవాడి ఎద్దుగానూ - చాకలివాడి గాడిదగానూ పుట్టరాదుసవరించు

గబ్బిలంలాగా అటు పక్షీ కాదు - ఇటు జంతువూ కాదుసవరించు

గబ్బిలాయి ముఖంలాగాసవరించు

గయ్యాళి, గచ్చపొద ఒకటేసవరించు

గరిక మేసిన గాడిద చస్తుందిగానీ, గరిక చావదుసవరించు

గురుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లుసవరించు

గరుత్మంతుణ్ణి చూచిన పాములాగాసవరించు

గర్భాదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లుసవరించు

గర్భాదానానికి రమ్మని జాబువ్రాస్తే నాకు తీరికలేదు నేనున్నట్లుగానే జరిపించండని జాబు వ్రాసాట్టసవరించు

గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుందిసవరించు

గ్రహాలు గతులు తప్పినా, ఆడినమాట తప్పరాదుసవరించు

గండం గడిచి పిండం బయటపడ్డట్లుసవరించు

గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టుసవరించు

ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారని, అటు వంటి వారి గురించి ఈ సామెత పుట్టింది. . ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఈ సామెత కూడా అదే అర్థంలో చెప్పినదే.

గంపలాభం చిల్లు తీసినట్లుసవరించు

గాజుల బేరం భోజనానికి సరిసవరించు

సరిపడ ఆదాయము లేని వ్యాపారాన్ని చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు.

గాజుల చెయ్యి గలగల్లాడితే యిల్లు కళకళలాడుతుందిసవరించు

గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదుసవరించు

ఇలాంటి సామెత మరొకటి: గడ్డి వామి దగ్గర కుక్క పాపలా వున్నట్లు: వివరణ. కుక్క గడ్డి తినదు.... ఆవును తిననీయదు.

గాడి తప్పిన బండివలెసవరించు

గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసనసవరించు

మంచి విషయాల విలువ అర్హత ఉన్నవాళ్ళకే తెలుస్తుంది, అనర్హులకు, కుమతులకు వాటి విలువ తెలీదనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. పందికేం తెలుసు పన్నీరు వాసన అని కూడా అనడం కద్దు.

గాడిదకు గడ్డివేసి, ఆవును పాలిమ్మన్నట్లుసవరించు

గాడిదకు భోగినీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందటసవరించు

గాడిదగుడ్డుసవరించు

వట్టిది, లేనిది, శూన్యము. [నిస్సారతను సూచించుటలోను, తిరస్కారములోను, అహంభావములోను వక్రగతిని పోవువారలపట్ల ఉపయోగించు ఊతపదము.] "వాని దగ్గఱేముంది గాడిదగుడ్డ" "వానికేం తెలుసు గాడిదగుడ్డు" మొ|| (వ్యవ)

గాడిదకేమి తెలుసు గంధపు వాసన?సవరించు

గాడిదతో సేద్యం కాలి తాపులకేసవరించు

గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు జడిస్తే ఎట్లా?సవరించు

గాడిద పుండుకు బూడిద మందుసవరించు

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందటసవరించు

గాడిద మరియు సంగీతము, ఒంటె మరియు అందము పూర్తిగా భిన్న ధ్రువాలు. వేటిలోనూ ప్రావీణ్యత లేని ఆ రెండూ, ఒకరినొకరు ప్రశంశించుకోవటం అర్థంలేని పని. ఈ విషయాన్నే, పాండిత్యము లేని వారు పరస్పరం ఒకరినొకరు పొగుడుకునే సందర్భములో ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు.

గాదె క్రింద ఎలుక గాదె క్రిందే బ్రతకాలిసవరించు

గాదె క్రింద పందికొక్కులాగాసవరించు

గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంటసవరించు

గారెలు చేయవే పెండ్లామా అంటే వేలు మాత్రం చూపిందటసవరించు

గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలిసవరించు

ఇలాంటిదే మరొక సామెత: బిడ్డ ముద్దొచ్చినప్పుడే చంక నెక్కాలి.

గాలి కబుర్లుసవరించు

గాలికి పుట్టి ధూళికి పెరిగినట్లుసవరించు

గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లుసవరించు

గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణంసవరించు

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్టసవరించు

గాలిలో దీపం పెట్టి, ఆర్పకుండా ఉండాలని దేవుని ప్రార్థించాట్ట వెనకటికెవడో. కనీస మానవ ప్రయత్నం చేయకుండా పూర్తిగా దేవునిపై భారం వేసే వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఒక పని చేసే టప్పుడు ఆపని సక్రమముగా పూర్తి కావడానికి తాను చేయ వలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆతర్వాత దేవునిపై భారం వేయాలని బోధించేది ఈ సామెత.

గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టుసవరించు

వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు చేసే వారిని గూర్చి ఈ సామెతను ఉపయోగిస్తారు.

గాలితో తాడు పేనినట్లుసవరించు

సాధ్యంకాని పనిని సులభముగా చేస్తామని కోతలు కోసే వారి నుద్దేశించి ఈ సామెతను చెప్తారు.

గాలిని మూట కట్టగలం గానీ, గయ్యళి నోరు మూయలేంసవరించు

గాలిలో మేడలు కట్టినట్లుసవరించు

గ్రాసంలేని కొలువు - మీసంలేని బ్రతుకు - రసం లేని కావ్యం ఒక్కటేసవరించు

గిరాకీ కొననివ్వదు - మందం అమ్మనివ్వదుసవరించు

గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగుతుందా?సవరించు

గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడటసవరించు

అసత్యం చెపితే అది నమ్మదగినదిగా ఉండాలి. ఇనుప గుళ్ళు నీట తేలుట అసాధ్యము, అటులనే కొయ్యతో చేసిన బెండ్లు మునుగుట అసాధ్యము. ఇది నిజమని నమ్మజూపు వాడు పరమ అసత్యవాది. ఈ సామెత ఈ విషయమునే తెలుపుచున్నది.

గుండెల ఊపుడుకాదు తొడల తొక్కుడుకు తయారుకా అన్నాడటసవరించు

గుంపులో గోవిందాసవరించు

  • ఎక్కువమంది గుమిగూడిన చోట ఎదైనా జరిగితే అది ఎవరు చేసారో కనిపెట్టడం కష్టం. దీనినే గుంపులో గోవిందా అని వ్యవహరిస్తాం.
  • గుంపుగా వెళుతున్న వెంకన్న భక్తులలో ఒక్కడు గోవిందా అని అరిస్తే అందరు గోవిందా అని అరుస్తారు. వారిలో ఏ ఒక్కడు అరవక పోయినా అది తెలియదు.

గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?సవరించు

గుడగుడ ఆలోచన గుడిసెకు చేటుసవరించు

గుడారం గూని బ్రతుకుసవరించు

గుడి దగ్గరయితే గురుత్వం దూరంసవరించు

గుడినే మింగే వానికి గుడిలోని లింగం ఓ లెక్కాసవరించు

పెద్ద పెద్ద దొంగ తనాలు చేసే వానికి చిల్లర దొంగ తనాలు ఒక లెక్కా అనే అర్థంతో ఈ సామెత వాడతారు.

గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలుసవరించు

గుడిని మింగే వాడికి లింగం అడ్డమా?సవరించు

గుడ్డి కన్నా మెల్ల నయము కదాసవరించు

పూర్తిగా అంధకారమయమయిన గుడ్డితనము కన్నా, అంతో ఇంతో కనపడు మెల్లతనము ఎంతో మిన్న. ఈ సత్యమునే ఈ సామెత ద్వారా పలు సందర్భాలలో చెప్పుదురు. ఒక ఉదాహరణ, పది రూపాయలు నష్టపోయే సందర్భంలో మరో చిన్న పని చేయటము ద్వారా ఆ నష్టాన్ని తొమ్మిది రూపాయలకు తగ్గించుకోగలిగే పరిస్థితిలో, ఈ సామెతను వాడవచ్చు.

గుడిసేటి పనులుసవరించు

గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లుసవరించు

గుడ్డి కన్ను తెరిసినా ఒకటే మూసిన ఒకటేసవరించు

ఉపయోగం లేని పనిచేసి నపుడు ఈ మాట అంటారు.

గుడ్డి గుర్రానికి దాణా చేటుసవరించు

గుడ్డి మొగుడికి రేచీకటి పెళ్ళాంసవరించు

గుడ్డివాడి ఉపాయం గుడ్డివాడిది, గూనివాడి ఉపాయం గూనివాడిదిసవరించు

గుడ్డివాడి చేతిలో రాయిసవరించు

గుడ్డివాడు ఎటు రువ్వినా గురేసవరించు

గుడ్డివాళ్ళు ఏనుగులను తడిమి చూచి వర్ణించినట్లుసవరించు

గుడ్డి కంటికి మట్టి అద్దంసవరించు

గుడ్డి కంటికి పగలైతేనే? రాత్రయితేనేం?సవరించు

గుడ్డికన్నా మెల్ల మేలుసవరించు

గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒక్కటేసవరించు

గుడ్డి గుర్రానికి దాణా చేటుసవరించు

గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టుసవరించు

ఆతల్లికి పుట్టిన పిల్లలు తిరిగి ఆ తల్లినే వెక్కిరించడము. అలాంటి వారిని గురిం చి ఈ సామెతను వాడతారు.

గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుందిసవరించు

సమాదానము లేని ప్రశ్నలు వేసి నప్పుడు ఈ సామెతను వాడతారు.

గుడ్డోడికి కుంటోడి సాయంసవరించు

సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్లు... అలాంటిదే పై సామెత కూడ.

గుడ్డెద్దు చేలో పడినట్లుసవరించు

గుడ్డి ఎద్దు చేలో పడితే, అంతా విధ్వంసమే. దారీతెన్నూ తెలియక మొత్తం పైరుని నాశనం చేస్తుంది. కళ్ళు కనబడని కారణంగా అది పైరును మేసి నష్టపరచింది తక్కువైనా.... అది అటు ఇటు తిరిగి తొక్కి పైరుకు చేసిన నష్టం చాల ఎక్కువ. ఈ విషయాన్నే, తీరూతెన్నూ లేక అటూ ఇటూ పనిలేక తిరిగే వాణ్ణి ఉదహరిస్తూ చెబుతారు. ఆ సందర్భంలో చెప్పినదే ఈ సామెత.

గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుసవరించు

వెనకటికెవరో గుమ్మడికాయల దొంగెవరు అంటే తన భుజాలు తడుముకున్నాట్ట. అంటే, తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్ళిన తాలూకు చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో అని చూసుకుంటున్నాడుట. నిజముగా దొంగతనము చేయనివాడయితే కదలక మెదలక ధైర్యంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేసి తట్రుపాటులో ఉంటే ఈ సామెతను వాడ్తారు.

గురి కుదిరితే గుణం కుదురుతుందిసవరించు

గురి తప్పినా పులినే కొట్టాలి - గుంటనక్కను కాదుసవరించు

గురివింద గింజ తన నలుపెరగదంటసవరించు

గురివింద గింజ ముందు భాగమంతా ఎరుపుగా ఉండి, వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉండును. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. అదే విధముగా, తమలోని లోట్లు తెలుసుకోలేక, ఇతరులను తప్పు పట్టువారిని ఈ సామెతతో పరిహసించుట పరిపాటి.

గురివిందగింజ తన ముడ్డిక్రింద నలుపెరగదుసవరించు

గురువుకే పంగ నామాలు పెట్టే రకం వాడుసవరించు

మోసం చేయడానికి తన, పర భేదం పాటించని వాడిని గురించి ఈ సామెత వాడతారు.

గురువు నుంచుని త్రాగితే, శిష్యుడు పరిగెడుతూ త్రాగుతాడుసవరించు

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లుసవరించు

గురువుకు పంగనామాలు పెట్టినట్లుసవరించు

గురువులేని విద్య గుడ్డి విద్యసవరించు

గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడటసవరించు

ఓ అవివేకి యొక్క మనస్తత్వాన్ని ఈ సామెత తెలియచేస్తోంది. గుర్రం కరుస్తుందని భయపడి, అంతకన్నా ప్రమాదకరమయిన స్థానమయిన గాడిద వెనక ఓ అవివేకి కూర్చున్నాడట.

గుఱ్ఱము కడుపున గాడిదపిల్ల పుడుతుందా?సవరించు

గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!సవరించు

గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదుసవరించు

గుడ్డి గుర్రం ఏ పనికీ, ఎందుకూ పనికి రాదు. అయినా దానికి దాణా పెట్టడం తప్పదు. అలాగే కొంతమంది ఇంట్లో ఏ పనీ చేయకుండా జులాయిలా తిరుగుతూ తిండి తినే సమయానికి మాత్రం ఇల్లు చేరతారు. ఇంట్లో మనిషి కాబట్టి తిండి పెట్టడం ఎలాగూ తప్పదు. అలాంటి వారికి ఉద్దేశించిందే ఈ సామెత.

గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?సవరించు

జన్మత: అబ్బే లక్షణాలను నేర్పనవసరము లేదని ఈ సామెత భావము. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినడము అన్నది స్వత:సిద్ధముగా వస్తుంది. అది మరొకరు నేర్పనవసరము లేదని ఈ సామెత చెబుతోంది. చేప పిల్లకుఈత నేర్పవలెనా అన్న సామెత కూడా ఇలాంటిదె.

గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందాసవరించు

గుర్రం తిండి గుర్రానిదే, ఆవు తిండి ఆవుదే. ఒకరికి సహాయపడి మరొకరి నుంచి ప్రతిఫలం ఆశించటం మూర్ఖత్వము. ఈ విషయాన్నే ఈ సామెత తెలియచేస్తోంది.

గుర్రానికి ముడ్డిలో కాలితే వరిగడ్డి తింటుందిసవరించు

గుర్రానికి సకిలింత - సంగీతానికి ఇకిలింత వుండాలిసవరించు

గుర్రాన్ని యేటివరకూ తీసికెళ్ళగలమే గానీ నీళ్ళు త్రాగించగలమా?సవరించు

గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి పులిహోర కోరాడటసవరించు

గుళ్ళో పిత్తక పోతే గుగ్గిలం వేసినంత పుణ్యంసవరించు

గువ్వ గూడెక్కె - రాజు మేడెక్కెసవరించు

గూటిలో కప్ప పీకితే రాదుసవరించు

నోట్లో నాలుక

గూట్లో దీపం - నోట్లో ముద్దసవరించు

గూనివాని ఒడుపు పడుకున్నపుడు చూడాలిసవరించు

గూబ ఎక్కిన గృహము చెడునుసవరించు

గూబ అనగా గుడ్లగూబ అని అర్థం. గుడగూబ ఇంటిలోకి వస్తే ఆ యింటికి అరిష్టమని అందరి నమ్మకము. ఆ నమ్మకానికి ఈ సామెత సమాధానం.

గెలువని రాజుకు గొప్పలు మెండుసవరించు

గేదె, దూడ వుండగా గుంజకు వచ్చెరా గురక వాయువుసవరించు

గొడుగుమీద గొడుగుంటే పిడుగుమీద పిడుగు పడినట్లేసవరించు

గొడ్డుకు ఒక దెబ్బ - మనిషికి ఒక మాటసవరించు

గొడ్డుకి తిన్నది పుష్టి - మనిషికి ఉన్నది పుష్టిసవరించు

గొడ్డు రైతుకు ఒక బిడ్డసవరించు

పశువులు రైతులకు తమ పిల్లలతో సమానమని అర్థము.

గొడ్డు వచ్చిన వేళ - బిడ్డ వచ్చిన వేళసవరించు

ఒక ఇంట్లోకి పెళ్ళై ఒక ఆడ పిల్ల వచ్చిన వేళ అదే విధంగా ఒక పశువు వచ్చిన వేళ మంచిదయితే ఆ యిల్లు బాగుపడుతుందని ఈ సామెతకు అర్థము.

గొడ్డువాడు గొడ్డుపోయి ఏడుస్తుంటే మాదిగవాడు తోలు పోయిందని ఏడ్చాడటసవరించు

గొడ్రాలికి గొంతు పెద్దసవరించు

గొడ్రాలికేమి తెలుసు ప్రసవ నొప్పులుసవరించు

పిల్లలను కాన్నామెకు కనేటప్పుడు వచ్చే ప్రసవ నొప్పులు ఎలావుంటాయో ఆమెకే తెలుస్తాయి. గొడ్రాలికి అనగా పిల్లలు కలగని స్త్రీకి ఆ నెప్పులు ఎలా వుంటాయో తెలియదని అర్థం.

గొడ్రాలి తిట్టూ, గొడ్డలిపెట్టూ ఒక్కటేసవరించు

గొప్పగా తెలిసినవారే గోతిలో పడతారుసవరించు

గొఱ్ఱు గుచ్చిన నేలకు కొరత వుండదుసవరించు

గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడేసవరించు

గొర్రె కసాయివాడినే నమ్ముతుందిసవరించు

గొర్రెవాటు వేలం వెర్రిసవరించు

గొర్రె బలిస్తే గొల్లకే లాభంసవరించు

గొర్రెల మందలో తోడేలు పడ్డట్లుసవరించు

గొర్రెలు గుంపు కూడితే గొప్ప వర్షంసవరించు

గొల్లల గోత్రాలు గొర్రెల కెరుక, గొర్రెల గోత్రాలు తోడేళ్ల కెరుకసవరించు

గొల్లల గోత్రాలు గొర్రెలకు తెలిస్తే - గొర్రెల గోత్రాలు గొల్లల కెరుకసవరించు

గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లుసవరించు

తక్కువ కులం వారు ఆర్థికం బలపడితే తమ కులం చెప్పుకోడానికి ఇష్టపడరు. అంచేత వారు తమ పేర చివరన వేరే కులంవారి మకుటాన్ని పెట్టు కుంటారు. "రావు" అనేది ఒకప్పుడు ఒక ప్రత్యేక కులానికి మాత్రమే సంబంధించింది. కాని ఇప్పుడు అన్ని కులాల వారు దాని వాడు కుంటున్నారు. అలా వచ్చిందే ఈ సామెత.

గొళ్ళెం లేని తలుపు - కళ్ళెం లేని గుర్రంసవరించు

గొంగళిలో తింటూ వెండ్రుకలు ఏరి నట్లుసవరించు

గొంగళి అంటేనే వెంట్రుకలో చేసింది.. దానిలో అన్నం తింటే వెండ్రుకలు రావడము సహజమే... వాటిని ఏరడము వృధా ప్రయాస. అలాంటి పని చేశే వారినుద్దేసించి ఈ సామెతను వాడతారు.

గొంగడున్నంతే చాచుకోవాలిసవరించు

గొంతుకలో వెలక్కాయ పడినట్లుసవరించు

గొంతెమ్మ కోరికలుసవరించు

గోటితో పోయేదానికి గొడ్డలెందుకుసవరించు

గోటితో పోయేదానికి గొడ్డలిని ఉపయోగించాల్సిన పని లేదు. అలాగే చిన్న విషయాల్ని చిన్నగానే సామరస్యంగా పరిష్కరించుకొవాలేగానీ అనవసర రాద్ధాంతం చెసుకోకూడదు అని దీని అర్థం.

గోడకు చెవులుంటాయిసవరించు

రహస్యాన్ని రహస్యంగానే వుంచాలి. బయటకు చెప్పకూడదు అని అర్థం.

గోడకేసిన సున్నం లాగసవరించు

ఈ సామెతకు అనేక వ్యవహార ప్రయోగాలు ఉన్నాయి. గోడకు వేసిన సున్నం తిరిగి మన చేతికి రాదు అన్న సత్యం తెలిసినదే. అలానే, ఎవరికయినా అపాత్ర దానము చేసినట్లయితే, ఆ తరువాత విషయము తెలిసినా, అది గోడకు వేసిన సున్నముతో సమానమే.వెలయాలికి వెచ్చించిన డబ్బు, గోడకు వేసిన సున్నము తిరిగి రాదు అనే అర్థంలో కూడా ఈ సామెతను వాడతారు. (ఎవరికైనా ధనము అప్పుగా ఇస్తే అది తిరిగి రాని సందర్భంలో ఈ సామెతను వాడతారు)

గోడ మీద పిల్లి వాటం వాడుసవరించు

గోడ మీద వున్న పిల్లి ఎటు దూకుతుందో చెప్పడం కష్టం. అలాగే...నీతి నియమం లేకుండా ఎటు అవకాశము వుంటే అటు వైపు వెళ్లే వారిని గురించి ఈ సామెత వాడతారు

గోచీకి ఎక్కువ తుండుకు తక్కువసవరించు

గోచీకి మించిన దరిద్రం లేదుసవరించు

గోచీపాతల రాయుడులాగాసవరించు

గోడకు కొట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావుసవరించు

గోడమీద పిల్లివాటముసవరించు

గోడుకు గోకుడే మందుసవరించు

గోడలకు చెవులుంటాయి - నీడలకు కళ్ళుంటాయిసవరించు

గోతి కాడ నక్కలాసవరించు

ఏ విధముగా నయితే ఓ జిత్తులమారి నక్క ఓ గోతి వద్ద దాగి కూర్చోని, అందులో పడ్డ వారిని సంహరించి తింటుందో, దుష్టులు కూడా చెడు పనులు చేయుటకు సర్వధా తగ్గ అవకాశమునకై వేచిచూచుదురు అని ఈ సామెత తెలుపుచున్నది.

గోతిని తీసినవాడే అందులో పడేదిసవరించు

గోతిలోపడ్డాడుసవరించు

కష్టాలలో చిక్కుకున్నాడని అర్థం. ఉదా:.... వాడు తెలిసి తెలిసి గోతిలో పడ్డాడు (ఇది జాతీయము. దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు)

గోముఖ వ్యాఘ్రంసవరించు

గోవే తల్లి - ఎద్దే తండ్రిసవరించు

గోరంత ఆలస్యం కొండొంత నష్టంసవరించు

కొంచెం ఆలస్యంతో బారి నష్టం జరిగే సందర్భాలు చాలమందికి అనుభవమే. ఆ సందర్భంగా వాడేది ఈ సామెత.

గోరంత దీపం కొండంత వెలుగుసవరించు

దీపం చిన్నదైనా.... అవసరంలో అదే అతి పెద్ద దిక్కు. స్వల్పమని దేనిని చీత్కారము చేయ కూడదు. గోదావరిలో పడ్డ వానికి గడ్డి పోచ చిక్కిన ప్రమాదంనుండి బయట పడే అవకాశమున్నది. కొంచెమే నని దేన్ని హీనంగా చూడకూడ దని ఉపదేశించేదే ఈ సామెత.

గోరంతను కొండంతను చేయడముసవరించు

అతి చిన్న విషయాన్ని చిలువలు పలవలుగా వర్ణించి పెద్ద విషయంలాగా చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు

గోరంత వుంటే కొండంత చేసినట్లుసవరించు

గోరుచుట్టు మీద రోకటిపోటుసవరించు

ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు.

  1. గోరుచుట్టు అంటే చేతివేళ్ళు వాచి నొప్పి పెట్టే ఒక జబ్బు. ఇక ఆ వేలి మీద రోకలి పడిందంటే ఆ బాధ చెప్పనక్కర లేదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆవిధంగా దెబ్బ మీద దెబ్బ తగిలితే ఈ సామెత వాడతారు.

గోడ మీద పిల్లి వాటంసవరించు

గోడ మీదున్న పిల్లి ఏ వైపుకు దూకుతుందో ఎవరూ ఊహించ లేరు..... అలాగే ఏ లక్ష్యం లేని పని చేసే టప్పుడు ఈ మాటను వాడతారు.

గోడకు కొట్టిన బంతి లాగసవరించు

నీవు విసిరిన రాయి నీకే తగులుతుందని చెప్పడానికి ఈ మాటను వాడతారు.

గోళ్లుగిల్లుకుంటున్నాడుసవరించు

ఏపని లేదని అర్థం. ఉదా: వాడు ఏ పనీ లేక గోళ్ళు గిల్లుకుంటున్నాడు. పని పాట చేయని వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_గ&oldid=2738433" నుండి వెలికితీశారు