భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "జ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల?సవరించు

బ్రాంహలు తమ గుర్తింపు కొరకు జందెం వేసు కుంటారు. అయితే పలాన వ్యక్తి బ్రాంహడు అని జగమంతా తెలుసు, అతని గుర్తింపు కొరకు ప్రత్యేకంగా జందెం ధరించ నవసరం లేదు. ఈ సందర్భంగా పుట్టినదే ఈ సామెత.

జగడమెట్లొస్తుందిరా జంగమయ్యా అంటే................... బిచ్చం పెట్ట వే బొచ్చు ముండా అన్నాడటసవరించు

==జగడమెట్టొస్తుంది జంగమయా అంటే ................ బిచ్చం పెట్టవె బొచ్చు ముండా అన్నాడట==. వివరణ: జగడం ( ఎవరి మధ్యనయినా పోట్లాట ఎలా వస్తుందో తెలియని ఓ అమాయకురాలు భిక్షం అడగడానికి వచ్చిన జంగమయ్యను అడిగింది. దానికి వాడు బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడట. జంగమయ్య మాటలతో ఆ అమాయకురాలికి కోపం వచ్చింది. అనవసరంగా తనను నిందించినందుకు జగడానికి దిగింది. నీ ప్రశ్నకు సమాదానమిదే అని జంగమయ్య సమాధానం చెప్పాడు. ఆలా పుట్టిందట ఈ సామెత.

జగడాల మారిసవరించు

పోట్లాటకు ఎప్పుడు సిద్దంగావున్న స్త్రీ/పురుషుడు: ఉదా: వాడొట్టి జగడాల మారి.

జగమెరిగిన సత్యంసవరించు

అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.

జగమెండిసవరించు

పెద్ద మొండి వాడు. ఉదా: వారు మహా జగమొండి.

జగత్ కిలాడీలుసవరించు

మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు. మోస గాళ్ల గురించి ఈ సామెత

జడ్డిగం లోనే మిడత పోటుసవరించు

జనగణమన పాడేశారుసవరించు

ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,. పని పూర్తయినప్పుడు ఈ మాట వాడతారు.

జన్మకో శివరాత్రి అన్నట్లుసవరించు

బహు అరుదుగా జరిగే సంఘటనల గురించి ఈ సామెతను వాడతారు.

జబర్దస్తీ చేస్తున్నాడుసవరించు

బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు.

జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లుసవరించు

జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుందిసవరించు

ధనవంతులు ఎంతపనైనా చేయగలరని ఈ సామెత అర్థం.

జరిగితే జల్లెడతో మోయవచ్చుసవరించు

జరిగితే జ్వరమంత సుఖం లేదుసవరించు

జరుగుబాటు తక్కువ - అదిరిపాటెక్కువసవరించు

జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లుసవరించు

జలగలా పీడిస్తున్నాడుసవరించు

ఎక్కువగా బాధిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నన్ను జలగలా పీడిస్తున్నాడు.

జలగ పట్టినట్లుసవరించు

జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లుసవరించు

జలుబుకు మందు లేదు..... అనే అర్థంతొ ఈ సామెత పుట్టింది. జలుబుకు మందు వేసినా వేయకపోయినా అది ఏడు రోజులుంటుందని అందరికి తెలుసు

జవ్వాది పూసుకొని చంకలెత్తినట్లుసవరించు

జ్వర జిహ్వకు పంచదార చేదుసవరించు

జంగాలో! దాసర్లో! ముందూరును బట్టిసవరించు

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసిసవరించు

జనవాక్యం గీటురాయిసవరించు

జనవాక్యం కర్తవ్యంసవరించు

జన్మకొక శివరాత్రి అన్నట్లుసవరించు

జబ్బొకటి - మందొకటిసవరించు

జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లుసవరించు

జాతి కొద్దీ బుద్ధి - కులం కొద్దీ ఆచారంసవరించు

జ్ఞాతి గుఱ్ఱు - అరటి కఱ్ఱు వదలవుసవరించు

జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లుసవరించు

జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లుసవరించు

తలకు మించిన భారము అన్న అర్థంలో ఈ సామెతనుపయోగిస్తారు.

జాబు రాసిపెట్టమంటే కాళ్లునొప్పులంటే వాటితో పనేమిటంటే నేను రాసింది నేనే చదవాలి అన్నాడటసవరించు

జానెడు పిట్టకు మూరెడు తోకసవరించు

పిట్ట కొంచెం........... కూత ఘనం ...... వంటి సామెత ఇది కూడాను.

జారితేనూ, సాగితేనూ పడమన్నారుసవరించు

జయాపజయాలు ఒకరి సొమ్ముగావుసవరించు

జిడ్డు గాడుసవరించు

పట్టు కుంటే వదలడు: ఉదా: వాడు మహా జిడ్డుగాడు, పట్టు కుంటే వదలడు. వారిని గురించి ఈ సామెత వాడతారు.

జిల్లేడు పెళ్లిసవరించు

ఉత్తుత్తి పెళ్ళి: వివరణ: కొందరికి శాస్త్రప్రకారం మొదటి పెళ్ళి కలిసి రాదని వస్తుంది. అటు వంటప్పుడు మొదటిగా వారికి జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేసి రెండో పెళ్ళిగా అసలు పెళ్ళి చేస్తారు. ఆ విధంగా మొదటి పెళ్ళి వలన జరగవలసిన అనర్థము జిల్లేడు చెట్టుకు జరుగుతుంది.

జిల్లేడు పువ్వుకు తుమ్మెద లాశించినట్లుసవరించు

జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయాసవరించు

వాళ్ల నాన్న దుర్మార్గుడు. అందుకే ఆ లక్షణాలన్నీ ఇతడికొచ్చాయి. మంచి లక్షణాలు ఎందుకొస్తాయి?' అన్నట్లు

జివ తక్కువ - జీత మెక్కువసవరించు

జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధిసవరించు

ఒక్కొక్క వ్యక్తికి నచ్చే ఆహారపదార్థాలు, వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చే పదార్థాలు మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి వచ్చే ఆలోచనలు మరొకరికి రుచించకపోవచ్చు. అంతమాత్రాన ఒకరి రుచులూ, అభిరుచులూ, ఆలోచనలు, అభిప్రాయాలూ వేరొకరి వాటికంటే గొప్పవని ఎవరూ భావించరాదు అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

జింకకు కొమ్ములు బరువా?సవరించు

జీతం బత్తెం లేకుండా తోడేలు గొర్రెలను కాస్తానందటసవరించు

జీతం లేని నౌకరు, కోపం లేని దొర లేరుసవరించు

జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదుసవరించు

జీలకర్ర - శింగినాదంసవరించు

జుట్టు అంటూ ఉంటే............... ఏ జడైనా వేసుకొవచ్చుసవరించు

ధనం వుంటే ఏ పనైనా చేయవచ్చు అనే అర్థంతో ఈ సామెత వాడతారు.

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమేసవరించు

అన్ని ఆదాయ వనరులు సక్రమంగా వుంటే ఏ పనైనా చేయ వచ్చు. అసలు జుట్టంటూ వుంటే ఏ కొప్పు అయినా వేయ వచ్చు. జుట్టు లేకుంటే ఏ కొప్పు కూడా వేసే అవకాశమే లేదు. ఆ విధంగా పుట్టినదె ఈ సామెత.

జుట్టున్నమ్మ ఏకొప్పు అయినా పెడుతుందిసవరించు

ధనం వుంటే ఏ పనైనా చేయవచ్చు అనే అర్థంతో ఈ సామెత వాడతారు.

జుట్టు పీక్కొంటున్నారుసవరించు

తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం: ఉదా: వారు ఆ విషమై జుట్టు పీక్కొంటున్నారు.

జుట్టుంటే ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చుసవరించు

జుట్టు పట్టుకుని తంతే జూటూరులో పడి పోవాలిసవరించు

జులాయిగా తిరుగుతున్నాడుసవరించు

పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం: ఉదా: వాడు జులాయిగా తిరుగు తున్నాడు. [[ఇది జాతీయము. దీనిని ఆ జాబితాలో చేర్చ వచ్చు.

జెముడు కంచెకు శ్రేష్ఠం - రేగడి చేనుకు శ్రేష్ఠంసవరించు

జ్యేష్ఠ చెడకురియును - మూల మురుగ కురియునుసవరించు

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుసవరించు

ఎవరైనా ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు. పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసే ఉంటుంది.

జేబులు కొట్టే రకంసవరించు

దొంగ బుద్ధి గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.

జోడు లేని బ్రతుకు తాడు లేని బొంగరంసవరించు

జోరు మీదున్నాడుసవరించు

మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?

జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడుసవరించు

ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్త.

జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరంసవరించు

జోరీగల గొడ్డుకు గోరోజనం మెండుసవరించు

జోలికి రాకుసవరించు

నాతో పెట్టుకోకు. ఉదా: నా జోలికి రాకు. (ఇది జాతీయము. దీనిని ఆ జాబితాలో చేర్చ వచ్చు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_జ&oldid=3153577" నుండి వెలికితీశారు