తంగేడు పూచినట్లుసవరించు

తంగేడు చెట్టు విపరీతంగా పూస్తుంది. ఎవరికైన అధిక సంపద చేకూరితే ఈ సామెతను ఉపయోగిస్తారు.

తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపంసవరించు

తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుందిసవరించు

తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది - తల్లి చస్తే కాపురం తెలుస్తుందిసవరించు

తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునాసవరించు

తండ్రి వంకవారు దాయాదివారుసవరించు

తంతే బూరెల బుట్టలో పడ్డట్టుసవరించు

అనుకోని అదృస్జ్టము కలిగిన వారి నుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

తంబళ అనుమానముసవరించు

అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చిన వారునుద్దేసించి ఈ సామెత చెప్తారు.

తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడుసవరించు

తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునాసవరించు

తక్కువ వానికి నిక్కులు లావుసవరించు

తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మసవరించు

తగిలించుకొనటం తేలిక - వదిలించుకోవటం కష్టంసవరించు

తగిలిన కాలే తగులుతుందిసవరించు

తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూసవరించు

తగులమారి తంపి - పుల్లింగాల పిల్లిసవరించు

తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుటసవరించు

తన ప్రశ్నలోనే జవాబున్నది. నర్మగర్బంగా చెప్పిన సమాదనమిది.

తగులుకున్న మొగుడినీ, తాడిచెట్టు నీడనూ నమ్ముకోరాదుసవరించు

తట్టలో కాపురం బుట్టలోకి వచ్చినట్లుసవరించు

తడిక కుక్కకు అడ్డంగానీ, మనిషికి అడ్డమా?సవరించు

తడిక తోసిన వాడిది తప్పు అన్నట్లుసవరించు

తడిక లేని ఇంట్లో కుక్క దూరినట్లుసవరించు

తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడుసవరించు

తడి గుడ్డతో గొంతు కోయడం అసాద్యం: అలాంటి దుర్మార్గపు పనులను గుట్టు చప్పుడు కాకుండా చేసేసి ఏమి ఎరనట్టు వుండె వారిని గురించి ఈ సామెత పుట్టింది. వీడు తడి గుడ్డతో గొంతు కోసె రకం అని అంటారు.

తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడుసవరించు

దెబ్బ తగిలితే గాని జాగ్రత్త పడని వారి గురించి ఈ సామెత పుట్టింది.

తడిశిన కుక్కి బిగిశినట్టుసవరించు

ఏదైనా దారం కట్లు తడిసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా బిగుసుకుంటాయి.

తడిశి ముప్పందుం మోశినట్టుసవరించు

  • ఒక గాడిద ఉప్పు బస్తా మోస్తూ ఒక చిన్న నదిని దాటేటప్పు పొరబాటున నీళ్ళలో పడి పోయింది. తిరిగి లేచే టప్పటికి అందులోని ఉప్పు సగం కరిగి పోయి బరువు తగ్గి పోయించి. ఇదేదో బాగుందని అనుకున్న గాడిద ప్రతి సారి అలాగే కావాలని నీళ్ళలో పడేది. ఒక సారి దానిమీద మాసిన బట్టలు వేశాడు చాకలి. యదా ప్రకారము అది కాలువను దాటుతూ కావాలని కాలవ నీళ్ళలో పడింది. చాకలి వాడు దానిని లేపి నిలబెట్టి ఆ తడిసిన బట్టలను కూడా గాడిదమీద వేశాడు. ఆ తడిసిన బట్టలు బరువు రెండింతలు అయ్యింది.

తడిసిన వానికి చలేమిటి?సవరించు

ఇలాంటి సామెతే మరొకటి. నిండా మినిగిన వాడికి చలేమిటి?

తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లుసవరించు

అమాయకుల గురించి ఈ సామెతె పుట్టింది

తద్దినము కొని తెచ్చుకొన్నట్టుసవరించు

కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

తద్దినం పెట్టేవానికి తమ్ముడేగా!సవరించు

తద్దినపు భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడటసవరించు

తద్దినానికి తక్కువ - మాసికానికి ఎక్కువసవరించు

తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపుసవరించు

తన కంట్లో దూలాలు పెట్టుకుని, పరుల కంట్లో నలుసులు ఎంచినట్లుసవరించు

తన కంపు తన కింపుసవరించు

తన కడుపు పండితే పక్కింటాయన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందిటసవరించు

తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోకదారిద్ర్యం అనుకున్నట్లుసవరించు

తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టుసవరించు

ఏరి కోరి కష్టాలను తెచ్చుకొని నెత్తిన వేసుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

తన కాళ్ళకు తానే మొక్కుకున్నట్లుసవరించు

తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చునుసవరించు

తనకు కానిది గూడులంజసవరించు

అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్న సామెత లంటిదే ఇదీను.

తనకు కానిది ఎట్లా పోతేనేం?సవరించు

తనకు కాని రాజ్యం పండితేనేం? పండక పోతేనేం?సవరించు

తనకు మాలినధర్మము - మొదలు చెడ్డ బేరము లేవుసవరించు

తనకు రొట్టె - యితరులకు ముక్కసవరించు

తనకు లేదనేడిస్తే ఒకకన్ను పోయింది - ఎదుటివానికున్నదని ఏడిస్తే యింకోకన్ను పోయిందిసవరించు

తన కొంగున కట్టిన రూక..... తనకు పుట్టిన బిడ్డసవరించు

తన కోపమే తన శత్రువుసవరించు

ఇది సుమతి శతక పద్య భాగము. తన కోపమె తన శతృవు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము........... తద్యము సుమతీ..

తన గుణం మంచిదయితే, సానివాడలో కూడా కాపురం చేయవచ్చుసవరించు

తన చావు జగత్ప్రళయం అనుకున్నట్లుసవరించు

తన తప్పు తప్పు కాదు - తన బిడ్డ దుడుకూ కాదుసవరించు

తనదాకా వస్తేగానీ తెలియదుసవరించు

తనది తాటాకు - యితరులది ఈతాకుసవరించు

తనది కానిది గూడు లంజసవరించు

తనదీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలాయటసవరించు

తన బలముకన్నా స్థాన భలము మిన్నసవరించు

ఇది వేమన శతక పద్య సారాంశము. నీటి లోన ముసలి నిగిడి ఏనుగును బట్టు, బయట కుక్క చేత బంగపడును, స్థాన భలము గాని తన బలము కాదయ విశ్వదాభిరామ వినుర వేమ.

తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరముసవరించు

తన నీడని తానే త్రొక్కుకున్నట్లుసవరించు

తన నోటికి తవుడు లేదు - లంజ నోటికి పంచదారటసవరించు

తన ముడ్డి కాకుంటే కాశీదాకా దేకమన్నట్లుసవరించు

తన ముడ్డి కాకపోతే తాటి మట్టకి ఎదురు దేకమన్నట్లుసవరించు

తన యింటితలుపు ఎదురింటికిపెట్టి, తెల్లవార్లూ తనింట్లో కుక్కలు తోలుతూ కూర్చున్నట్లుసవరించు

తనయుల పుట్టుక తల్లి కెరుకసవరించు

తనవారి కెంత వున్నా తన భాగ్యమే తనదిసవరించు

ఇది సుమతి శతక పద్య సారాంశము: ధనపతి సఖుడై వుండిన, యనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్,, తనవారికెంత గలిగిన తన భాగ్యము తనకు గాక తద్యము సుమతీ....

తన సొమ్ము అల్లం - పరుల సొమ్ము బెల్లంసవరించు

తనువుకు తనువే అర్పణం అన్నట్లుసవరించు

తనువుల తహతహ తీరేది కాదన్నట్లుసవరించు

తనువుల దాహాలు పెదవులకే తెలుసునన్నట్లుసవరించు

తనువుల పాలపుంత సొగసుల తాంబూలం అన్నట్లుసవరించు

తనువుల యుద్ధం తనివి తీరదుసవరించు

తనువులు దగ్గరైతే పరువాల పోరు తగ్గుతుందన్నట్లుసవరించు

తనువు వెళ్ళినా దినము వెళ్ళదుసవరించు

తన్నే కాలికి రోలు అడ్డమా?సవరించు

తప్పు చేసినవానికీ - అప్పుచేసిన వానికీ ముఖం చెల్లవుసవరించు

తప్పులు చేయనివారు అవనిలో లేరుసవరించు

తప్పు లెన్ను వారు తండోపతండాలుసవరించు

ఇది వేమన శతక పద్యము: తప్పులెన్ను వారు తండోప తండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు విశ్వదాభి రామ వినుర వేమ.

తప్పు, ఒప్పు దైవ మెరుగునుసవరించు

తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగునుసవరించు

ఇది సుమతి శతక పద్య భాగము: కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్, తమ తేమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులగుదురు తద్యము సమతీ.

తమలపాకులో సున్నమంతటివాడు - తక్కువయినా ఒకటే ఎక్కువయినా ఒకటేసవరించు

తమలపాకుతో తానిట్లంటే, తలుపుచెక్కతో నేనిట్లంటిసవరించు

తమాం లేదంటే రవికైనా తప్పించమన్నాడటసవరించు

==తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి అర్ధం :-మనిషి మనవాడు అయిన ధర్మం తపితే సహించ కూడదు ==

తరతరాల ఆస్తే నిలిచివున్న ప్రశస్తి అన్నట్లుసవరించు

తలకడిగి బాసచేసినా వెలయాలిని నమ్మరాదుసవరించు

ఇది సుమతి శతక పద్య భాగము.

తల క్రింద కొరివిలాగాసవరించు

తల కోసి మొలేసినట్లుసవరించు

తలగడ క్రింద త్రాచుపామువలెసవరించు

దీనికి సమానర్థంలో మరో సామెత ఉంది.; అది. పక్కలో బల్లెం లాగా.

తల గొరిగించు కొన్నాక తిథి, వార, నక్షత్రాలు చూచినట్లుసవరించు

తలచినప్పుడే తాత పెళ్ళిసవరించు

తల చుట్టం, తోక పగసవరించు

తలచుకొన్నప్పుడే తలంబ్రాలంటే ఎలా?సవరించు

తలలు బోడులైన తలపులు బోడులాసవరించు

చింత చచ్చినా పులుపు చావది లాంటిదే ఈ సామెత కూడాను.

తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?సవరించు

తల ప్రాణం తోకకి వచ్చినట్లుసవరించు

ఎవరైనా ఏదైనా పనిని అతి కష్టం మీద సాధించినప్పుడు తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

తల పాగ చుట్టడం రాక తల వంకర అన్నాడటసవరించు

పని చేతగాక ఎదుటి వారిపై నిందలు వేసె వారిని బట్టి ఈ సామెత వాడతారు.

తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదుసవరించు

తలంబ్రాలకూ, తద్దినాలకూ ఒకే మంత్రమా?సవరించు

తలమాసిన వాడెవడంటే ఆలి చచ్చినవాడే అన్నట్లుసవరించు

ఆలి చచ్చిన వాడు అందరికీ అలుసే....... అన్నట్టు

తలలు బోడులయినా తలపులు బోడులా?సవరించు

చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత లాంటిదే ఇదీను.

తలవ్రాత తప్పించుకోలేనిదిసవరించు

తలలో నాలుకలాగాసవరించు

పంచాయతీ కార్యదర్శులు తలలో నాలుక లాగా ప్రగతి లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

తలారి పగ తలతో తీరుతుందిసవరించు

తల్లి కడుపు చూస్తే పెళ్ళాం జేబు చూస్తుందిసవరించు

తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడటసవరించు

తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడటసవరించు

తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తాసవరించు

==తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా==మొగుడు పెళ్ళాల మధ్య సరసం, గిల్లికజ్జాలు సర్వసాధారణం. మాటకు మాట అనుకుంటారు. కానీ, గడుసుదైన పెళ్ళాం మాత్రం ఒకటికి రెండు అంటుంది. సమతుల్యం కాని షరతులున్నప్పుడు ఈ సామెతను వాడతారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేసవరించు

జూదం ఆడేటప్పుడు ప్రత్యర్థులు తమ్ములైనా, బంధుమిత్రులైనా వారు ఓడితే పందెంగా ఒడ్డిన సొమ్ములను వదులుకోవాల్సిందే అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందిసవరించు

కన్న తల్లి తన బిడ్డ చిన్న వాడైనా పెద్ద వాడైనా ఇంటి కొచ్చిన వెంటనే తిన్నావా? అని అడుగుతుంది. కాని అతని భార్య మాత్రం భర్త జేబు చూస్తుంది. ఎందుకంటే?..... డబ్బులేమైనా సంపాదించి తెచ్చాడా? అని ఆ సందంర్బంగా పుట్టిన సామెత ఇది.

తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్పేవాడా?సవరించు

తల్లికి తగిన బిడ్డసవరించు

తల్లిగలప్పుడే పుట్టిల్లు - పాలుగలప్పుడే పాయసంసవరించు

తల్లి గుణం కూతురే బయట పెడుతుందిసవరించు

తల్లి గూని అయితె పిల్లలు గూని అవుతారాసవరించు

తల్లి చచ్చినా మేనమాముంటే చాలుసవరించు

తల్లికి తిండి పెట్టలేనివా పినతల్లికి చీర పెడతానన్నాడటసవరించు

తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానంసవరించు

తల్లి చస్తే నాలుక చచ్చినట్లు - తండ్రి చస్తే కళ్ళు పోయినట్లుసవరించు

తల్లి చాటు పిల్లసవరించు

తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?సవరించు

తల్లి తండ్రి అల్లము.... పెళ్లామంటే బెల్లముసవరించు

పెళ్లాం పై ప్రేమతో తల్లి దండ్రులను నిరాదరించే వారికి ఈ సామెత వాడతారు.

తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే - పిల్లలు కొట్టుకుంటూ లేస్తారుసవరించు

తల్లిదే వలపక్షం - ధరణిదే వలపక్షంసవరించు

తల్లి దైవము - తండ్రి ధనంసవరించు

తల్లినన్నా చూపెట్టు - తద్దినమన్నా పెట్టుసవరించు

తల్లిని చూచి పిల్లను - తరిని చూచి బర్రెను ఎంచుకోవాలిసవరించు

తల్లిని నమ్మినవాడూ, ధరణిని నమ్మిన వాడూ చెడడుసవరించు

తల్లి పిత్తి పిల్ల మీద పెట్టినట్లుసవరించు

తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే !సవరించు

తన తల్లి ఆమె పుట్టింటిలో వివాహం వరకే ఉంటుంది. మేనమామలు జీవితాంతం ఉంటారు. అటువంటి మేనమామలకు తన తల్లి పుట్టింటిను గురించి చెప్పవలెనా. తెలిసిన వారికి ఏదో కొత్తగా చెప్పబోయే ప్రయత్నం అని భావం.

తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్లుసవరించు

తల్లి పెంచాలి - ధరణి పెంచాలి - అంతేగానీ బయటివారు పెంచుతారా?సవరించు

తల్లి మాటలు - పినతల్లి పెట్టుసవరించు

తల్లి ముఖం చూడని బిడ్డ - వాన ముఖం చూడని పైరుసవరించు

తల్లి ముక్కు కోసిన వానికి మేనత్త ముక్కు బెండపువ్వుసవరించు

తల్లి రోసిన బిడ్డను దాది రోయదా?సవరించు

తల్లి లేని పిల్ల - ఉల్లిలేని కూరసవరించు

తల్లి లేని పిల్ల దయ్యాల పాలుసవరించు

తల్లి వంకవారు తగినవారుసవరించు

తల్లి విషం - పెళ్ళాం బెల్లంసవరించు

తల్లిసాలు బొల్లి పిల్లసవరించు

పిల్ల కూడా తల్లిలాగె వుంటుంది..... విత్తు ఒకటి వేస్తే చెట్టు మరొకటి మొలుస్తుందా ఈ సామెత లాంటిదె అది కూడ

తల్లిని బట్టి బిడ్డ..... నూలును బట్టి గుడ్డసవరించు

తల్లిని బట్టి బిడ్డ..... విత్తును బట్టి పంటసవరించు

తా వలచింది రంభ - తా మునిగింది గంగసవరించు

తవ్వగా తవ్వగా నిజం తేలుతుందిసవరించు

తవ్వినా దొరకనిది మొత్తుకుంటే దొరుకుతుందా?సవరించు

తవ్వి మీద పోసుకున్నట్లుసవరించు

తవుడు తింటూ వయ్యారమా?సవరించు

చేసేది వెదవ పనైనా బడాయి పోయే వారి గురించి ఈ సామెత చెప్తారు.

తాకబోతే తగులు కున్నట్లుసవరించు

తాగను గంజి లేదు - తలకు సంపంగి నూనెటసవరించు

తాగనేరని పిల్లి ఒలక పోసుకున్నదటసవరించు

తాగపోతే నీరు లేదుగానీ ఈద పోయినట్లుసవరించు

తాగినవాడి తప్పుకు తగవు లేదుసవరించు

తాగిన వాడిదే పాట - సాగిన వాడిదే ఆటసవరించు

తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుందిసవరించు

మధ్యం అలవాటు, పరస్త్రీ గమనం చాల కష్టాలు తెప్పిస్తాయని హిత బోధ చేస్తున్నది ఈ సామెత.

తాగిన రొమ్మే గుద్దినట్లుసవరించు

తాగేవాడే తాళ్ళ పన్ను కడతాడుసవరించు

తాచుపోతు తామసం - జర్రిగొడ్డు పిరికితనంసవరించు

తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిటసవరించు

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?సవరించు

తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారుసవరించు

తాటి చెట్టుకి తేనె పట్టుపడితే ఈతచెట్టుకు ఈగలు ముసిరాయటసవరించు

తాటిచెట్టు నీడ గాదు తగులుకున్నది పెండ్లామూ గాదుసవరించు

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కొరకు అన్నాడటసవరించు

అబద్ధం చెపితే అతికి నట్టుండాలి. అలా చాత కాని వారికి ఈ సామెత వాడతారు

తాటి చెట్టు కింద పాలు తాగినా ఎవరు నమ్మరుసవరించు

ఏపని చేసినా సమయము, సందర్భము చూసుకోవాలని ఈ సామెత అర్థం.

తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటాడుసవరించు

తాడు తెగిన గాలిపటంలాసవరించు

తాడూ లేదు - బొంగరం లేదుసవరించు

తాతకు దగ్గులు నేర్పినట్ట్లుసవరించు

తాత తిన్న బొచ్చె తరతరాలుసవరించు

తాతా చార్యులకు పీర్ల పండక్కి పొంతనేమిటిసవరించు

ఒక దానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడె వారిని గురించి ఈ సామెత వాడతారు.

తాతాచార్యుల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదుసవరించు

తాత తవ్విన చెరువని దూకుతామాసవరించు

తాతలనాడు నేతులు తాగాం, మా మూతులు వాసన చూడండిసవరించు

తానా అంటే తందానా అన్నట్లుసవరించు

బుర్రకత చెప్పేటప్పుడు ప్రధాన గాయకుడు ఒక వచనం చెప్పితె వంత పాట గాళ్లు వెంటనే తందాన తానా.... అంటారు. అనగా వాడు చెప్పిందే నిజమని వంత పాడడ మన్న మాట. ఇలాంటిదే ఇంకో సామెత అదిగో పులి అంటే ఇదిగో తోక

తాను త్రవ్విన గోతిలో తానే పడతాడుసవరించు

తాను తిన తవుడు లేదు - వుంచుకున్న దానికి వడియాలుసవరించు

తాను తుమ్మి తానే శతాయుశ్షు అనుకున్నట్లుసవరించు

తాను దూర సందులేదు - మెడకో డోలుసవరించు

తాను మింగేదాన్నీ - తనను మింగేదాన్నీ చూచుకోవాలిసవరించు

తాను వలచినది రంభ, తాను మునిగింది గంగసవరించు

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సామెత లాంటిదే ఇదీను. మొండి వాడు, ఎవరి మాట వినని వాని గురించి వాడే సామెత ఇది.

తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లుసవరించు

తన మాటే చెల్లాలనే మొండి వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

తాను మెచ్చ తినాలి - పరుల మెచ్చ నడవాలిసవరించు

తాను పట్టిన కుందేలుకు మూడె కాళ్లు అనే రకంసవరించు

తన మాటనే నెగ్గించుకోవాలని చేసె వారి గురించి ఈ సామెత వాడతారు

తాను వలచింది రంబ తాను మునిగింది గంగసవరించు

మొండి వాళ్ల గురించి వాడె సామెత.

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడుసవరించు

అన్ని పనులు తాననుకున్నట్టు జరగవని చెప్పేదే ఈ సామెత

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడటసవరించు

తాను తలిచినట్లే అన్ని జరగవని హిత బోధ చేయడమే ఈ సామెత లక్ష్యం.

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుసవరించు

తాళ్ళపాక వారి కవిత్వం కొంత - నా పైత్యం కొంతసవరించు

తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండిసవరించు

తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం. అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు. తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం. చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు. కేవలం ఒక పాత్ర సంభాషణలలో భాగంగా రాసిన సంభాషణ సామెతగా భాషలో ఇంకిపోయింది.

తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారుసవరించు

తాను తాగుతున్నది మజ్జిగే అయినా.... ఆస్థలం తాటి చెట్టు క్రింద అయినందున అతడు తాగుతున్నది కల్లే అనుకుంటారు. ఏ పనిచేసినా సమయా సందర్భాన్ని అనుసరించి చేయాలి అనే భావం ఈ సామెతలో దాగున్నది.

తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడుసవరించు

ఒకరికి మించిన వారు ఇంకొకరు వుంటారు. తానె గొప్పవాడినని విర్ర వీగే వారికి గుణ పాటంగా ఈ సామెత చెప్తారు.

తాడు చాలదని బావిని పూడ్చమన్నాడటసవరించు

ఒక పద్ధతిలో పని కాక పోతె వేరొక మార్గంలో ఆలోసించాలి గాని..... అసలు పని మానుకోకూడదని హితవు చెప్పేదే ఈ సామెత.

తాడు బొంగరం లేనివాడుసవరించు

ఎవరి అదుపులో లేకుండా గాలికి తిరిగేవాడని అర్థం.

తాతకు దగ్గులు నేర్పినట్టుసవరించు

సాధారణంగా తాతలు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. వారికి ఎలా దగ్గాలో ఛెప్పటం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే అపార అనుభవం కలిగిన విషయ పరిజ్ఞానికి అదే విషయంపై బోధలు చేయటం తాతకు దగ్గులు నేర్పటం లాంటిదే అని దీని అర్ధం.

తాత చస్తే బొంత నాది అనే రకంసవరించు

తాదూర సందు లేదు, మెడకో డోలుసవరించు

తన పరిస్థితె అంతంత మాత్రము. దానికి తోడు ఇంకొడిని ఇంటికి భోజనానికి ఇంటికి పిలిస్తే ఎలా? ఇలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత: "తాదూర సందు లేదు, మెడకు ఒక డోలు"

తామరాకు మీద నీటిబొట్టులాసవరించు

తామ రాకు మీద నీటి బొట్టు స్థిరంగా వుండదు. ఆకుకు అంటు కోదు. పాదరసం లా కదులు తుంటుంది. ఏదైనా వ్యవహారంలో అంటి ముట్ట నట్లు వ్వవహరించి కష్టాల పాలు గాకుండా వుండాలని దీని అర్థం.

తాయెత్తులకే పిల్లలు పుడితే మొగుడెందుకన్నట్లుసవరించు

తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయిసవరించు

సంపాదన లేకుండా తండ్రులు సంపాదించారని తింటూ కూర్చుంటే అది ఎంతోకాలం వుడదని చెప్పేదే ఈ సామెత.

తింటే అయాసం - తినకుంటే నీరసంసవరించు

తింటే కదలలేను - తినకపోతే మెదలలేనుసవరించు

తింటేగానీ రుచి తెలీదు - దిగితేగానీ లోతు తెలీదుసవరించు

తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలిసవరించు

గారెల రుచి గొప్ప తనాన్ని.... మహాభారతం విశిష్టతను చెప్పేదె ఈ సామెత. == తిండికి తిమ్మరాజు, పనికి రాధక్రిష్న

తిండికి ఏనుగు - పనికి పీనుగుసవరించు

తిండికి చేటు - మందికి బరువుసవరించు

తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజుసవరించు

తిండికి తిమ్మరాజు - పనికి పోతరాజుసవరించు

తిండికి మెండు - పనికి దొంగసవరించు

తిండికి వచ్చినట్టా - తీర్ధానికి వచ్చినట్టా?సవరించు

తిండి కొద్దీ పసరంసవరించు

తిండెక్కువైతే తీపరం పెరుగుతుందిసవరించు

తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందటసవరించు

తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం అన్నట్లుసవరించు

తిట్టను పోరా గాడిదా అన్నట్టుసవరించు

తిట్టను పోరా అంటూనె గాడిదా అని తిడు తున్నాడు. ఒక మాటమీద నిలబడని వారి గురించి ఈ సామెత పుట్టింది.

తిట్టబోతే అక్కబిడ్డ - కొట్టబోతే బాలింత అన్నట్లుసవరించు

తిట్టితే చచ్చేవాడూ - దీవించితే బ్రతికేవాడూ లేడుసవరించు

తిట్టితే గాలికి పోతాయిసవరించు

తిట్టిన వాడికి తిట్టున్నర అన్నట్లుసవరించు

తిట్టుకు సింగారం లేదుసవరించు

తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవుసవరించు

తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందటసవరించు

మామూలుగా కోడిపుంజు దిబ్బలో మేస్తుంది, ఇంటి కప్పు ఎక్కి కూస్తుంది. అనుకూలంగా ఉందికదా అని దిబ్బెక్కి కూయదు. ఆ విధంగా ఎవరైనా పనిని చేయవలసిన విధంగా కాకుండా తమ సుఖానికి అనుకూలమైన విధంగా చేసినప్పుడు ఈ సామెతను వాడుతారు.

తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుందిసవరించు

తినగా తినగా గారెలు చేదుసవరించు

తినగ తినగ వేము తియ్యగనుండుసవరించు

ఈ సామెత వేమన శతకంలోని ఒక పద్యం నుంచి ఉద్భవించింది. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినుర వేమ సాధన చేస్తూ ఉంటే పనులు సులభతరమౌతాయని దీని అర్థం.

తిననేర్చినమ్మ పెట్ట నేరుస్తుందిసవరించు

తినబోతూ రుచులు అడిగినట్లుసవరించు

చాలామంది భోజనానికి కూర్చున్నప్పుడు, ఎలాగూ తాము తినబోతున్నా, వంటకాల రుచి ఎలా ఉందని ఇతరులను అడుగుతుంటారు. ఈ విధంగా తాము స్వయంగా కాసేపట్లో తెలుసుకోబోయే విషయాలను ఇతరుల ద్వారా తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను వాడుతారు.

తిన్న యింటి వాసాలు లెక్కపెట్టినట్లుసవరించు

తిన్నదాని కంటే అరిగిందే బలంసవరించు

తినమరిగిన కుక్క అలమరిగిందటసవరించు

తినమరిగిన కోడి యిల్లెక్కి కూసిందిసవరించు

తినమరిగిన ప్రాణం అల్లాడిపోతుందిసవరించు

తిని వుండలేక, తాగి బొందలో పడినట్లుసవరించు

తిని కక్కరాదు - కని పోగొట్టుకోరాదుసవరించు

తిన్నింటి వాసాలు లెక్కేయటంసవరించు

అన్నం పెట్టిన వారికే ద్రోహం చేయాలనే బుద్ధి గలవారి గురించి ఈ సామెత పుట్టింది.

తినే తినే కూడులో మన్ను పోసుకున్నట్లుసవరించు

తినేది గొడ్డు మాంసం పైగా విభూతి రేఖలుసవరించు

తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పేరు నీకెలా తెలిసిందని అడిగితే నీ ముఖం చూడగానే తెలిసిందని అన్నాడటసవరించు

తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లుసవరించు

తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?సవరించు

సముద్రంలోని తిమింగలాలకు టన్నులకొద్దీ చేపలు ఆహారంగా అవసరం అవుతాయి. అంత పెద్ద మొత్తంలో చేపల్ని తినే తిమింగలాలకు ఏ చేప అయినా ఒకటే. ఈనాటి కొంతమంది రాజకీయ నాయకులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం విడుదల చేసే ఏ రకం నిధులైనా వారి అవినీతికి అతీతం కాదు.

తియ్యని ముద్దులకు మురవాలో, అదిరే దెబ్బలకు అరవాలో తెలియటం లేదన్నదటసవరించు

తియ్యని రోగాలు - కమ్మని మందులుసవరించు

తిరిగి రైతు - తిరక్క బైరాగి చెడతారుసవరించు

తిరిగే కాలూ, తిట్టే నోరు వూరుకోవుసవరించు

తిరుగానాం మరగానాం తీపి వాయనం అన్నట్లుసవరించు

తిరుపతి క్షవరంలాగాసవరించు

తిలా పాపం తలా పిడికెడుసవరించు

తిండికి ముందు తగువుకు వెనకాల వుండాలంటారుసవరించు

తీగ లాగితే డొంకంతా కదిలినట్లుసవరించు

ఒక్కోసారి ఏదైనా చిన్న తీగను అవసరంకొద్దీ లాగినప్పుడు అనూహ్యంగా ఆ తీగతోపాటు డొంకంతా కదలడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా చిన్న విషయం గురించి ఆరా తీస్తున్నప్పుడు పెద్ద విషయం బయటపడితే ఈ సామెతను వాడుతారు.

తీగ కదిలిస్తే డొంకంతా కదుల్తుందిసవరించు

తీగకు కాయ బరువా?సవరించు

తీట గలవానికి తోట గలవానికి తీరికుండదుసవరించు

తీట బట్టి వాడే గోక్కుంటాడుసవరించు

తీట సిగ్గెరగదుసవరించు

తీతువ పిట్టలాగాసవరించు

తీపి ఏదంటే ప్రాణం అన్నట్లుసవరించు

తీయగా తీయగా రాగం - మూలగ్గా మూలగ్గా రోగంసవరించు

తీర్థము, స్వార్థము కలిసి వచ్చినట్లుసవరించు

తీరు తీరు గుడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే, ఊరికొక గుడ్డ వూడిపోయిందటసవరించు

తీర్చే వారుంటే ఎన్ని బెట్టులైనా పోవచ్చుసవరించు

తీసినవాడూ బాగానే వుంటాడు - చూచినవాడూ బాగానే వుంటాడు ఎదుటివాని మీద పడుతుంది ముట్టుపుల్లసవరించు

తుంగభద్రకు మంగమ్మ పోతే భంగము తప్పుతుందా?సవరించు

తుండూ పిండం చిక్కిన వెనుక ముండకు దిక్కెవరు?సవరించు

తుట్టె పురుగుకు రెక్కలొచ్చినా, ముసలాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గా లుండవుసవరించు

తుప్పరల పసే గానీ మంత్రాల పస లేదుసవరించు

తులసి వనంలో గంజాయి మొక్క వున్నట్టుసవరించు

తుమ్మ తోపుల్లో కొత్త కోలాటంసవరించు

తుమ్మ దుడ్డు వలె - కాపు కదురు వలెసవరించు

తుమ్మల్లో ప్రొద్దుకూకినట్లుసవరించు

తుమ్మితే ఊడె ముక్కుసవరించు

శాశ్వతము కానికి.... తాత్కాలికమైనది అర్థం.

తుమ్మితే వూడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుందిసవరించు

తుమ్ముకు తమ్ముడు లేడు గానీ ఆవలింతకు అన్న వున్నాడుసవరించు

తుమ్ము తమ్ముడై చెపుతుందిసవరించు

తుమ్మెదలాడితే వాన తప్పదుసవరించు

తుంటి మీద కొడితే పళ్ళు రాలాయిసవరించు

అసందర్బ ప్రేలాపన చేసే వారి గురించి ఈ సామెత పుట్టింది.

తురకల సేద్యం పెరికల పాలుసవరించు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు

తురకలలో మంచివాడెవరంటే తల్లిగర్భాన వున్నవాడు, పుడమిగర్భాన ఉన్నవాడుసవరించు

తురక లేని వూళ్ళో దూదేకులవాడే ముల్లాసవరించు

తురకవాడికి గంగిరెద్దు పోతే కోసుకుని తిన్నారటసవరించు

తులము నాలుకకు తొంభై రుచులుసవరించు

తులలో వానకు ధరణి పండునుసవరించు

తులవ నోటికి ఉలవపప్పుసవరించు

తులసి కోటలో దురదగొండి మొలచినట్లుసవరించు

తులసివనంలో గంజాయి మొక్కలాగాసవరించు

తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...సవరించు

చిన్న చిన్న నష్టాలను కలిగించే వాటిని పట్టించుకొని పెద్ద నష్టాలు కలిగించే విషయాల జోలికెళ్లని వారి గురించి ఈ సామెత చెప్తారు.

తూనీగలాడితే తూమెడు వర్షంసవరించు

ఇది రైతుల సామెత: ఒక్కో సారి తూనీగలు గుంపులు గుంపులుగా ఎగురు తుంటాయి. అప్పుడు రైతులు వర్షం వస్తుందని భావిస్తారు.

తూటు పేరె బొక్కసవరించు

రెండు ఒక్కటే అని చెప్పే సామెత ఇది

తూర్పున ఇంద్ర ధనుస్సు - దూరాన వర్షంసవరించు

తూర్పున ఇంద్ర ధనుస్సుకు దుక్కిటెద్దు రంకె వేస్తుందిసవరించు

తూర్పున కొరడు వేస్తే దుక్కెద్దు రంకె వెయ్యునా?సవరించు

తెగిన వేలుమీద ఉచ్చకూడ పోయడుసవరించు

తెగితే లింగడు రాయిసవరించు

తెగించిన వానికి తెడ్డే లింగంసవరించు

తెగిందాకా లాగకుసవరించు

తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడటసవరించు

తెగిన చేను తేమ ఓడుతుందిసవరించు

తెగువ దేవేంద్ర పదవిసవరించు

తెగేదాకా లాగరాదుసవరించు

తెడ్డుకేమి తెలుసు వంట రుచి?సవరించు

తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లుసవరించు

తెలఘాణ్యపు టెక్కు - నియోగపు నిక్కుసవరించు

తెల్లనివన్నీ పాలు -నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లుసవరించు

తెల్లవారితే చూడు ఎల్లాయి బ్రతుకుసవరించు

తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్యసవరించు

ఏదైనా ఒక విషయం తెలియనంత వరకు అదేదో మహా విద్య అనుకుంటారు. అది తెలిశాక ఒహో ఇంతేనా అను కుంటారు. ఈ సామెత అర్థం ఇదే.

తెలివి ఒకరి సొత్తా!సవరించు

తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట వుందిసవరించు

తెలివి తక్కువ - ఆకలెక్కువసవరించు

తెలివైనవాడికి చిటికెల సంకేతం చాలుసవరించు

తెలియని దయ్యంకన్నా తెల్సిన దయ్యం మేలుసవరించు

తెలిసే వరకే బ్రహ్మ విద్య - తెలిసిన తర్వాత కూసు విద్యసవరించు

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరుసవరించు

ఇది సుమతి శతక పద్య భాగము.

తెంపుల నీళ్ళు - చిల్లులు కడవసవరించు

తేనెటీగల పని తీరుబడి లేని పనిసవరించు

తేనె పోసి పెంచినా వేపకు చేదుపోదుసవరించు

దుర్మార్గులకు ఎంతగా నీతులు బోధించినా మనసు మారదు.

తేరగా వచ్చింది తెగ తిన్నట్లుసవరించు

తేరగా వచ్చింది వూరికే పోతుందిసవరించు

తేర గుర్రం - తంగేడు బరికసవరించు

తేలు కుట్టిన దొంగలాసవరించు

దొంగతనానికి ఇంట్లో దూరిన దొంగ తేలు కుట్టినా (పట్టుబడతాడు కాబట్టి)అరవలేడు. అదే విధంగా తాము ఉండకూడని పరిస్థితిలో ఉన్నవారు అట్టి సమయంలో తమకు ఏదైనా నష్టం జరిగినప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఏమీ చెయ్యలేరు

తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ తెగ కుట్టిందటసవరించు

తేలు తేలండీ! అంటూ అరిస్తే మొగాళ్ళను పిలవ్వే అన్నాట్ట,సవరించు

తేలు మాదిరి కుట్టటం - బల్లి మాదిరి అణగటంసవరించు

తేలువలె కుట్టినట్లుసవరించు

తేలేనయ్యకు తిండి మెండు - వండలేనమ్మకు వగలు మెండుసవరించు

తొడ సంబంధం తొంభై ఏళ్ళుంటుందిసవరించు

తొత్తు క్రింద బడి తొత్తులాగాసవరించు

తొత్తులాగా పనిచేసి దొరలాగా అనుభవించాలిసవరించు

తొలకరి జల్లులు - ఆశల మొలకలుసవరించు

తొలకరిలో చెరువు నిండినా - తొలిచూలు కొడుకు పుట్టినా లాభంసవరించు

తొలకరి వాన మొలకలకు తల్లిసవరించు

తొలి ఏకాదశికి తొలి తాటిపండుసవరించు

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుసవరించు

ఆర్తిక పరిస్థితులు బాగు పడితే వారి బుద్ధులు కూడా మారతాయి అని చెప్పేదె ఈ సామెత.

తొందరకు ఆలస్యం తోడుసవరించు

తొందరగా రమ్మంటే, తిరగమూత వేసి వస్తానన్నట్లుసవరించు

తోక తెగిన కోతిలాసవరించు

అసలే అది కోతి. క్షణమైనా తిన్నగా వుండదు. దాని తోక తెగితే ఇక ఎలా గంతు లేస్తుందో కదా. ఈ సామెత అర్థం అదె.

తోక తెగిన నక్కలాగాసవరించు

తోక ముడుచుటసవరించు

తోక ముడుచుట అనగా ఓడి పోవుట లేదా పారి పోవుట అని అర్థం . జంతువులు పోట్లాటకు దిగే టప్పుడు తమ తోకను పైకెత్తుకొని రంగంలోకి దిగుతాయి. అందులో ఏదైనా ఓడి పోతే తన తోకను తన కడుపు క్రిందికి దాచుకొని పారి పోతాయి. కుక్కలు, ఎద్దులు, పులులు, మొదలగు జంతువులలో ఈతతంగం బాగా గమనించ వచ్చు. దాని నుండి పుటినదే ఈ సామెత.

తోకతో నారాయణా అన్నట్లుసవరించు

తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుసవరించు

కొంతమంది ఏమీ తోచక విచిత్రమైన పనులు చేస్తుంటారు. చూసేవాళ్ళకు ఆ చేష్టలు వింతగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంతో హాస్యరసపూరితంగా చెప్పడానికి తోచీ తోచనమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుంది అంటారు. తెలుగు సామెతలలో చమత్కారం మేళవింపుకి ఇది ఒక మచ్చుతునక.

తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే - చూచీ చూడనట్లు చూచారటసవరించు

తోటకూర నాడైనా చెప్పవైతివిరా కొడకా అన్నట్లుసవరించు

తోట మీద వారికి, పీట మీద వారికి మొగమాట ముండదుసవరించు

తోడులేక రాచపీనుగ వెళ్ళదుసవరించు

తోడేలును గొర్రెలకు కాపుంచినట్లుసవరించు

తోరణం కట్టగానే పెళ్ళయినట్టా?సవరించు

ఇల్లు అలకగానే పండగ అన్నట్లు......

తోరణం కట్టినింట్లో తగవు పనికిరాదుసవరించు

తోలు కొరికే వాడు పోతే ఎముక కొరికే వాడు వస్తాడుసవరించు

ఇలాంటిదే మరొ సామెత: తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నె వాడు మారొకదుంటాడు.

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది... తుస్సు మనుట ఖాయంసవరించు

మానవ శరీరాన్ని గురించి వైరాగ్యంతో అనే మాటలు. ఇది బ్రంహయ్య గారి తత్వాలలోని భాగము.

తోలు తీయకుండానే తొనలు మ్రింగినట్లుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_త&oldid=3063290" నుండి వెలికితీశారు