భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ద" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

దంచలేనమ్మ ఊదూది చూచిందటసవరించు

దాహం వేసినపుడే, బావి తవ్వుకున్నట్లు.సవరించు

దంచినమ్మకు బొక్కిందే కూలిటసవరించు

దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడుసవరించు

దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడుసవరించు

దండుగలో దండుగసవరించు

దంపినమ్మకు బొక్కిందే దక్కుడుసవరించు

దంపుళ్ళ పాటకు దరిద్రం లేదుసవరించు

దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లుసవరించు

దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లుసవరించు

దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువసవరించు

దగ్గూ, గజ్జీ దాచినా దాగవుసవరించు

దగ్గుతూ పోతే సొంటి కూడ ప్రియమేసవరించు

దడియం గురువుకు మణుగు శిష్యుడుసవరించు

దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?సవరించు

దప్పిక కొన్నప్పుడు బావి త్రవ్వినట్లుసవరించు

దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదుసవరించు

దమ్మిడీ పెళ్ళికి ఏగానీ బోగం మేళంసవరించు

దమ్మిడీ ముండకు ఏగానీ క్షవరంసవరించు

దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడటసవరించు

దయలేని అత్తకు దణ్ణం పెట్టినా తప్పే - లేకున్నా తప్పేసవరించు

దయ్యాలతో చెలిమి చేసినట్లుసవరించు

దరిద్రానికి మించిన బాధ లేదుసవరించు

దరిద్రానికి మాటలు హెచ్చు - తద్దినానికి కూరలు హెచ్చుసవరించు

దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వానసవరించు

దరిద్రుడైన వ్యక్తి పెళ్ళికి పూనుకోవడమే కష్టం. దానికి తోడు వడగళ్ళ వాన పడితే ఆ పెళ్ళి ప్రయత్నాలు కాస్తా చెడుతాయి. అదే విధంగా ఎవరైనా తమ తలకు మించిన పనికి పూనుకున్నప్పుడు వారికి మరిన్ని అవరోధాలు ఎదురైతే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

దరిద్రుడికి అంటనప్పుడు ఆముదం రాచినా అంటదుసవరించు

దరిద్రుడికి ఏరేవు కెళ్ళినా ముళ్ళపరిగేసవరించు

దరిద్రుడికి పిల్లలెక్కువసవరించు

దరిద్రుడి చేనుకు వడగండ్ల వానసవరించు

దరిద్రుడు తలగడుగబోతే వడగండ్ల వాన కురిసిందటసవరించు

దరిద్రునికి దైవమే తోడుసవరించు

దరిలేని బావి - వితరణలేని ఈవిసవరించు

దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపంసవరించు

దశకొద్దీ దొరికాడు దిసిమొల మొగుడుసవరించు

దశకొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలుసవరించు

దశ దానాలకూ తోటకూర కట్టేసవరించు

దశ వస్తే దిశ కుదురుతుందిసవరించు

దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...సవరించు

దాగబోయి తలారి యింట్లో దూరినట్లుసవరించు

దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లుసవరించు

దానం చేయని చెయ్యీ - కాయలు కాయని చెట్టూ ఒక్కటేసవరించు

దానాలలోకెల్లా విద్యాదానం శ్రేష్ఠంసవరించు

దాన్ని నమ్ముకొని దడి కింద దాక్కొని వుంటే ఈదుర గాలికి ఇచ్చుకొని చచ్చాడటసవరించు

ఎవరో ఏదో ఇస్తారని ఆశపడి పడిగాపులు పడే వారి గురించి చెప్పే సామెత ఇది.

దాయాది వుంటే నిప్పెందుకు?సవరించు

దారం లేని సూదిని దయ్య మెత్తుకుపోతుందిసవరించు

దాసుని తప్పు దండంతో సరిసవరించు

దారిన పోయె కంపను ముడ్డికి తగిలించు కొన్నట్లు....సవరించు

అనవసరమైన విషయాలలో తల దూర్చి కష్టాలను కొని తెచ్చుకొనే వారిని ఇలా అంటారు.

దారిన దొరికింది ధర్మానికి పోయిందిసవరించు

దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లుసవరించు

దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేసినట్లుసవరించు

దాలి గుంటలో కుక్క మాదిరిసవరించు

దాసరిపాట్లు దైవాని కెరుకసవరించు

దాసుని తప్పు దండంతో సరిసవరించు

దింపుడు కళ్ళాశసవరించు

దిక్కులేనివారికి దేవుడే దిక్కుసవరించు

మనకు సహాయం అవసరమయినప్పుడు ఎవరి సహాయం అందకపొతే ఆ దేవుడి మీదే భారం వేయమని దీని అర్థం.

దిక్కు లేని యిల్లు దయ్యాల నిలయంసవరించు

దిగంబర సన్న్యాసికి చాకలెందుకు?సవరించు

దిగితేనేగాని లోతు తెలియదుసవరించు

సాధారణంగా ఏదైనా చెరువునిగాని మడుగునిగాని బయటినుండి చూసి లోతు అంచనా వేయలేము. అలాగే ఏ విషయమైనా మనం స్వయంగా పాల్గొంటేగాని అందులోని సాధక బాధకాలు తెలీవని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షుసవరించు

ప్రతి రోజు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వున్నప్పుడు ఏ రోజుకారోజు ..... ప్రాణాపాయం తప్పిందని బయట పడ్డామని సంతోష పడేవారి నుద్దేసించి ఈ సామెత వాడతారు.

దినబత్తెం దివిటీ వెలగుసవరించు

దినమూ చచ్చేవాడికి ఏడ్చే దెవరు?సవరించు

దిబ్బ మీద కూర్చొని మేడమీదున్నట్లు కలలు కనడంసవరించు

ఎవరి స్థాయికి తగ్గ కోరికలు వారు కోరాలని హితవు చెప్పే సామెత ఇది.

దీని సిగ తరగసవరించు

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలిసవరించు

దీపం కాంతులను వెదజల్లుతున్నప్పుడు ఆ వెలుగులో మన పనులను చక్కపెట్టుకుంటాం, కాంతి తోలగిపోతె ఎ పని చేయలేము. అంటే ఏ సమయానికి ఏం చేయాలో ఆలోచించుకొని ఆలస్యం చేయకుండ మనిషి జీవితాన్ని సాగించాలని ఈ సామెత పరమార్దం.

దివిటీ ముందు దీపం పెట్టినట్లుసవరించు

దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒక్కటేసవరించు

దీపం పేరు చెబితే చీకటి పోతుందా?సవరించు

దీపం ముడ్డి క్రిందనే చీకటిసవరించు

దీపావళికి దీపమంత చలిసవరించు

దీపావళికి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతాయిసవరించు

దుంగ దించి బండ నెత్తుకొన్నట్లుసవరించు

దుంపతెంచి గంపకెత్తినట్లుసవరించు

దుక్కి కొద్ది పంట .... బుద్ది కొద్ది సుఖముసవరించు

దుక్కి వుంటే దిక్కు వుంటుందిసవరించు

దుక్కికాని చేను తాలింపులేని కూరసవరించు

దుక్కికొద్దీ పంట - బుద్ధి కొద్దీ సుఖంసవరించు

దుక్కి చాలని చేనుకు ఎరువు ఎంత పెట్టినా వట్టిదేసవరించు

దుక్కిటెద్దు చావు పక్కలో పెళ్ళాం చావు వంటిదిసవరించు

దుక్కి దున్నితేనే భూమికి శాంతంసవరించు

దుగ్గాణి ముండకు దుడ్డు క్షౌరంసవరించు

దుత్తకు పాల రుచి తెలుసా?సవరించు

దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండినట్లుసవరించు

దున్నగలిగేవాడికే ధరణి దీవెనసవరించు

దున్న గలిగితేనే మన్ను ముట్టుకోవాలిసవరించు

దున్నటం ఎవడైనా దున్నుతాడు - పంట పండించేవాడే కావాలి నాకు అందిటసవరించు

దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడటసవరించు

దున్నపోతు ఈనదు. ఎవరైనా అది ఈనిందంటే దూడను కట్టెయ్యమనడం అసందర్భ ప్రలాపన. అంటే ఎవరైనా ఒక అసందర్భమైన విషయాన్ని చెప్పినపుడు మరొకరు దానితో ఏకీభవించడం లేదా సమ్మతించడం జరిగితే ఈ సామెతను ఉపయోగిస్తాం.

దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టుసవరించు

దున్న పోతు మీద వాన పడితే దానికి చాల హాయిగా వుంటుంది. అంతవరకు కాస్తనన్నా తొందరగా నడిచేది వర్షంలో అసలు నడవదు. అనా నిదానంగా పనిచేసే వారి గురించి ఈ సామెత వాడతారు.

దున్నపోతు మీద వాన కురిసినట్లుసవరించు

దున్నపోతు మీద వానకురిసినట్లుసవరించు

దున్నపోతు మీద ఎంత వాన కురిసినా వాటికి ఏమీ పట్టదు. అలాగే ఎంత చెప్పినా వినక పోయే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

దున్నబోతె దూడల్లో... మేయ బోతె ఎద్దుల్లోసవరించు

వివరణ: ఇంకా పని నేర్వని పెద్ద కోడెదూడ పని తప్పించుకోవడానికి.... దున్నబోతె తాను దూడనంటూ దూడల్లో కలిసి పోతుంది..... మేతకు వెళ్లేటప్పుడు పనిచేసె ఎద్దులకు మంచి మేత పెడతారు గనుక ఆమేత కొరకు ఎద్దులతో వెళ్లుతుంది.... ఎవరన్నా పని చేయకుండా తిని కూర్చుంటే ఈ సామెతను వాడతారు.

దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ వుంటే నీళ్ళుసవరించు

దున్నే ఎద్దులకు నక్కలను చూపి నట్లుసవరించు

పని చేసుకునే వారి పనిని చెడగొట్టే వారి గురించి సామెత పుట్టింది. దున్నె ఎద్దులకు నక్కలను చూపితె అవి బెదిరి పనికి ఆటంకం కలుగుతుంది. పని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు.

దున్నే ఎద్దునే పొడిచేదిసవరించు

దున్నేవాడు లెక్కలేసుకుంటే నాగలికూడా మిగలదుసవరించు

వ్యవసాయం అంత లాభదాయకం కాదు అనే ఆర్థంలో ఈ సామెతను వాడుతారు.

దున్నేవానికి దడవనా తొక్కేవానికి వెరవనా అన్నదటసవరించు

దురాశ దుఃఖానికి చేటుసవరించు

అత్యాశ ఎప్పటికైనా కష్టం కలిగిస్తుందని తెలియ జెప్పడం.

దుర్మార్గానికి తండ్రి బద్ధకంసవరించు

దుష్టులకు దూరంగా ఉండాలిసవరించు

దూకుతా దూకుతానన్న సవితే కానీ దూకిన్నా సవితి లేదుసవరించు

ఊరికూరికే బెదిరిస్తూ అది నిజంగా చేసి చూపని వాళ్ళని సూచిస్తూ వచ్చిన సామెత ఇది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాపూరమణల చిత్రం "అందాల రాముడు"లో దీనిని వాడుకున్నారు.

దూకు దూకుమనే వాళ్ళేగానీ, దూకే వాడు ఒక్కడూ లేడుసవరించు

దూరపుకొ౦డలు నునుపుసవరించు

దూరాంగా కనిపించే కొండలు నునుపుగానే కనిపిస్తాయి. కొండలమీదున్న ఎగుడుదిగుడు ప్రదేశలు, పెద్ద రాళ్ళు, వృక్షాలు అన్ని కలిపి చదునుగానె కనిపిస్తాయి. దగ్గరికి పోతే గాని అసలు సంగతి తెలియదు. ఏదైనా అంతే.. దగ్గరికిపోతేగాని అసలు సంగతి కనబడడు. ఆ ఉద్దేశంతో చెప్పినదే ఈ సామెత.

దూబర తిండికి తూమెడుసవరించు

దూస్తే దోసెడు - ఊదితే హుళక్కిసవరించు

దీపంపేరు చెబితే చీకటి పారిపోతుందా?సవరించు

దెబ్బకు దెయ్యమైనా వదులుతుందిసవరించు

మాటలకు లొంగని వారు దెబ్బలకు లొంగుతారని చెప్పే సామెత ఇది.

దెబ్బకు దేవుడైనా దిగి వస్తాడుసవరించు

మంచి మాటలతోకాకపోతే దెబ్బలతో పని జరిపించ వచ్చని ఈ సామెత అర్థం.

దెబ్బకొడితే దేవేంద్రలోకం కనబడాలిసవరించు

దేవతలకు దుమ్ము - రాక్షసులకు మన్నుసవరించు

దేవునికైనా దెబ్బే గురువుసవరించు

మంచి మాటలతో చెపితే వినని వారు కూడా దెబ్బలకు లొంగు తారని అర్థం.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుసవరించు

వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాల వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే దుర్మార్గులు, మూర్ఖులు ఇతరులకు సన్మార్గబోధ చేస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాల వల్లించినట్లు అంటారు.

దేవర చిత్తం - దాసుడి భాగ్యంసవరించు

దేవర తలిస్తే దెబ్బలకు కొదువా?సవరించు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెత లాంటిదే ఇదీను.

దేవుడని మ్రొక్కితే దయ్యమై పట్టినట్లుసవరించు

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడుసవరించు

దేవుడు తలిస్తే సంపదలకు కొదవా?సవరించు

దేవునికి చూపులు - మనకి మేపులుసవరించు

దేవునికి ముడుపు - దయ్యానికి దెబ్బసవరించు

దేవుని పెండ్లికి అందరూ పెద్దలేసవరించు

గుళ్లో దేవునికి పెళ్ళికి వూరి వారందరు పెద్దలే

దేహి అంటే నాస్తి అనరాదుసవరించు

దొడ్డివాకిట దయ్యాన్ని తరిమితే, తలవాకిట వచ్చి నిల్చిందటసవరించు

దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకుపోతే గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మిసవరించు

దొరకని పూలు దేవునికర్పణంసవరించు

చెల్లని కాసులు దేవునికి అనే సామెత లాంటిదే దీను.

దొరల చిత్తం - చెట్టు నీడ నిలకడ లేనివిసవరించు

దొరబిడ్డ అయినా ఒకనికి పెండ్లామేసవరించు

దొరికితే దొంగలు... లేకుంటే దొరలేసవరించు

ఎక్కడైనా దొంగ తనము చేసిన వాడిని అడిగితే తాను దొంగతనము చేసినట్లు ఒప్పుకొనడు. దొంగతనము చేసినప్పుడు దొరికితేనే అతను దొంగ అని నమ్మకంగా చెప్పగలము. దొరకనంత వరకు అతను దొరే. ఆ సందర్భంలో చెప్పేదె ఈ సామెత.

దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లుసవరించు

అతి నిదానంగా పనిచేసె వారిగురించి ఈ సామెత వాడతారు.

దొంగలు పడ్తారని కొబ్బరి చెట్టుకు మడి బట్ట కట్టిందటసవరించు

పరమ అమాయకుల గురించి చెప్పే సామెత ఇది.

దొంగకు తేలు కుట్టి నట్లుసవరించు

దొంగ తనానినికి వెళ్లిన వానికి తేలుకుట్టితే....... నెప్పికి వాడు అరిస్తే.... పట్టు బడి పోతాడు.. నెప్పికి అరవలేకుండా వుండ లేడు...

దొంగకు తోడు దొంగసవరించు

దొంగకు తోడు - దొరకు సాక్షిసవరించు

దొంగకు దొంగ సహవాసంసవరించు

దొంగకు దొంగబుద్ధి - దొరకు దొరబుద్ధిసవరించు

దొంగకు దొరికిందే చాలుసవరించు

దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదుసవరించు

దొంగకు భయము - లంజకు సిగ్గు లేవుసవరించు

దొంగ చేతికి తాళ మిచ్చినట్లుసవరించు

దొంగతనానికి పోతూ డోలు చంకన పెట్టుకుని పోయినట్లుసవరించు

దొంగపోటు కంటే లింగ పోటెక్కువయిందిటసవరించు

దొంగ పోయి తలారింట దూరినట్లుసవరించు

దొంగల సొమ్ము దొరలపాలుసవరించు

దొంగల సొమ్ము పరులపాలుసవరించు

దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుసవరించు

దొంగలూ దొంగలూ కలిసి వూళ్ళు పంచుకున్నట్లుసవరించు

దొంగిలించపోతే మంగలం దొరికిందటసవరించు

దొంగలందరూ దుష్టులు కారు - దుష్టులందరూ దొంగలేసవరించు

దొంగవాడి దృష్టి మూటమీదనేసవరించు

దొంగవాని తల్లికి ఏడువ భయంసవరించు

దొంగండీ అంటే ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నాడటసవరించు

దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లుసవరించు

దొంగాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపేసవరించు

దొందూ దొందేరా తొందప్పాసవరించు

ఎవరో ఇద్దరు మాటలు సరిగ్గా రాని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారిని వెక్కిరిస్తూ మూడవ వ్యక్తి అయిన వాడు వాడి స్నేహితునితో అన్న మాట ఇది "దొందూ దొందేరా తొందప్పా" అని. అసలు వాడు "రెండూ రెండేరా కొండప్పా" అనాలి. కానీ వాడికి కూడా సరిగ్గా అనడానికి నోరు తిరగలేదు. తన చేతకాని తనాన్ని చూసుకోలేని వాడు ఎదుటి వాళ్ళ లోపాలను వెక్కిరించితే వాడే నవ్వుల పాలు అవుతాడు అని నీతిని బోధించే సామెత ఇది.

దోచుకుపోయినవాడు దొర - దొరికినవాడు దొంగసవరించు

దోవలో పెట్టి తొక్కొద్దు అన్నట్టుందిసవరించు

దోసకాయ తిన్న కడుపూ, దొంగలు దోచిన యిల్లూ ఒక్కటేసవరించు

దోసెడు కాంతులు - వెన్నెల వూసులుసవరించు

దైవబలం మహాబలంసవరించు

దైవాన్ని నమ్మి చెడినవాడు లేడుసవరించు

దౌర్భాగ్యపు దామోదరుడుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_ద&oldid=2739900" నుండి వెలికితీశారు