భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "న" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

నక్క ఎక్కడ నాగలోక మెక్కడ?సవరించు

నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదటసవరించు

నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱసవరించు

నక్క జిత్తులవాడుసవరించు

జిత్తుల మారి మోసగాడిని ఈ సామెతతో పోలుస్తారు

నక్కను చూచిన వేటగాడిలాగాసవరించు

నక్కను త్రొక్కి వచ్చినట్లుసవరించు

అదృష్టము కలసి వచ్చినది అర్థము

నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు - నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదటసవరించు

నక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లుసవరించు

నక్కలు బొక్కలు వెదుకునుసవరించు

నక్క వినయం - కొంగ జపంసవరించు

నట్టేట చేయి విడిచినట్లుసవరించు

నట్టేట చేయి విడిచినట్లయితె మునిగి పోతాడు. అలా చేస్తే నమ్మించి మోసము చేయడమని అర్థము.

నట్టేట పుట్టి ముంచినట్లుసవరించు

నట్టేట పడ్డ సొమ్ము నట్టింటికి నడిచి వచ్చినట్లుసవరించు

అదృష్టము కలిసి వచ్చినదని అర్థము

నగుబాట్ల పెళ్ళికి పెళ్ళినాడే నాగవల్లి అన్నట్లుసవరించు

నడచినవాడే పడేదిసవరించు

నడమంత్రపు సిరిసవరించు

నడమంత్రపు సిరికి నెత్తిమీద కళ్ళుసవరించు

మధ్యలో సంపదలు కలిగిన వారికి గర్వ మెక్కువ అని అర్థము

నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిదిసవరించు

నడిచే దారిలో గడ్డి మొలుస్తుందా?సవరించు

అల్పుడికి ఐశ్వర్యం వేస్తే.. అర్దరాత్రి గొడుగు పట్టమన్నాడట. మధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి...... అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా..... గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట

నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడటసవరించు

మధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి...... అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా..... గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట

నడమంత్రపు సిరి వస్తే నడుము లిరుగ పడ్డట్లుసవరించు

నడువగా నడువగా పైగుడ్డే బరువుసవరించు

అలసట ఎక్కువైతే...... తనపైనున్న గుడ్డ కూడా బరువని పిస్తుందని అర్థము.

నడుము మునిగేదాకానే చలి - నలుగురూ వినేదాకానే సిగ్గుసవరించు

నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!సవరించు

నడిరాత్రి దుప్పట్లో యౌవ్వన మద్దెల మోతలన్నట్లుసవరించు

నడి సముద్రంలో నావ లాగసవరించు

కష్టాల్లో మునిగి ఎటు దిక్కు తోచని స్థితిలోవున్న వారి గురించి ఈ సామెత వాడతారు.

నత్తగుల్లలన్నీ ఒకచోట - ముత్యపు చిప్పలన్నీ ఒకచోటసవరించు

ఏగూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అనే సామెత లాంటిదే ఈ సామెత.

నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లుసవరించు

తనగురించి తెలిసిన వారు లేక పోతే ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చని అర్థము

నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్లుసవరించు

నపుంసకునికి రంభ దొరికినట్లుసవరించు

నిరుపయోగమైన పనిని గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు

నమ్మకానికి రాయబారమెందుకు?సవరించు

నమిలేవాడికన్నా మింగినవాడే ఘనుడుసవరించు

నమ్మించి గొంతు కోసినట్లుసవరించు

నయము నష్టకారి - భయము భాగ్యకారిసవరించు

నయాన కాని పని భయాన అవుతుందిసవరించు

నయమున పాలుం ద్రావరు, భయంబున విషంబు నైన బక్షింతురుగా.... అనే పద్యమే ఈ సామెత మూలము.

నరకానికి నవ ద్వారాలు - స్వర్గానికి ఒక్కటేసవరించు

నరములేని నాలుక ఎటైనా తిరుగుతుందిసవరించు

నరునికి నాలుగు దశలుసవరించు

నల భీమ పాకములుసవరించు

నల్ల బంగారం యిస్తా సాన పెట్తావా అందిటసవరించు

నల్లబాపడు నాభికంటే విషంసవరించు

నల్లటి కుక్కకు నాలుగు చెవులుసవరించు

నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోమటిని నమ్మకూడదటసవరించు

సామాన్యంగా బ్రాహ్మణులు ఎర్రగానూ, కోమటివారు నల్లగానూ ఉంటారని ఒక నానుడి. అలా కాకుండా, బ్రాహ్మణుడు నల్లగానూ, కోమటి ఎర్రగానూ ఉంటే, సామాన్యంగా జరిగే దానికి వ్యతిరేకముగా ఉండటంవల్ల, అలా ఉన్నవాళ్ళని నమ్మకూడదని సామెతే తప్ప మరింకేమీ కాదు, ఇందులో ఉదహరించబడిన కులాల మీద ఎటువంటి వ్యాఖ్య అంతకన్నాకాదు.

నలిగి వున్నప్పుడు తొలగి వుండమన్నారుసవరించు

నలుగురితో చావు పెళ్ళిలాంటిదిసవరించు

నలుగురి తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం -సవరించు

నలుగురితో పాటు నారాయణా!సవరించు

అందరూ వెళ్ళే దారిలోనె వెళ్ళమని దీనర్థము

నలుగురూ వినేదాకానే సిగ్గుసవరించు

నలుగురూ నడిచే దారే నడవాలిసవరించు

నలుగురూ నడిచిందే బాట - పలికిందే మాటసవరించు

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు అనే వేమన పద్యం ఈ సామెతకు ఆధారము

నలుపు నారాయణ స్వరూపంసవరించు

నలుపో తెలుపో నలుగురు పిల్లలు - ముతకో సన్నమో నాలుగు చీరలుసవరించు

నల్లేరు మీద బండిలాగాసవరించు

అతిసులభముగా పని జరిగితే ఈ సామెతను వాడుతారు. బండి వెళ్ళే దారిలో నల్లేరు అడ్డు వుంటే బండి కేమి నష్టముండదు.

నవరత్నాలున్నా నారీరత్నం వుండాలిసవరించు

నవాబు పొట్టకూ, తమలపాకు కట్టకూ ఎప్పుడూ తడుపు కావాలిసవరించు

నవ్వలేని వారిని నమ్మరాదుసవరించు

నవ్విన నాపచేనే పండుతుందిసవరించు

నవ్వు నాలుగిందాల చేటుసవరించు

నవ్వే వాళ్ళ ముందు జారి పడ్డట్టుసవరించు

ఏదో కారణంగా వారు ముందుగానే నవ్వుతున్నారు. అంతలో ఆదారిన వెళ్ళే వాడు వారి ముందు కాలి జారి పడ్డాడు. దాంతో వారి నవ్వు పరాకాష్ఠకు అందుకుంది.

నవ్వే ఆడదాన్నీ - ఏడ్చే మగవాణ్ణీ నమ్మరాదుసవరించు

నరకానికి నాలుగు ద్వారాలు... స్వర్గానికి ఒకటే దారిసవరించు

నరము లేని నాలుక నాలుగు విధాలుసవరించు

నోట్లో నాలుక లేక పోవటం అంటే సరిగా మాట్లాడలేకపోవటం.నరము లేని నాలుక నాలుగు విధాలు అంటే మాట నిలకడలేని తనం.మాట నిలబెట్టుకోలేని తనం, నిమిషానికి ఒక రకంగా మాట మారుస్తూ ఉండటం.ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాకుండా ఉండటం.

నవ్విన నాపచేనే పండుతుందిసవరించు

కాలం అంతా ఒక్కలాగ వుండదు. ఈ రోజు పనికి రాదనుకున్న వస్తువు రేపు విలువైనదిగా వుండవచ్చు. ఆలాంటి దాన్ని గురించి ఈ సామెత.

నంగనాచి తుంగబుఱ్ఱసవరించు

నంగిమాటల వాడినీ - దొంగ చూపుల వాడినీ నమ్మరాదుసవరించు

నందనవనంలో నాగుపామున్నట్లుసవరించు

నంది అంటే పంది అన్నట్లుసవరించు

నందిని చేయబోయి పందిని చేసినట్లుసవరించు

నందిని పంది - పందిని నంది చేయగలిగినవాడుసవరించు

నంబి కవిత్వం - తంబళ్ళ జోస్యంసవరించు

నంబివాడు ఎదురైనా నాగుపాము ఎదురైనా కలిసిరావుసవరించు

నంబీ నంబీ నా పెళ్ళికేమి సహాయం చేస్తావంటే నీ పెళ్ళికి ఎదురు రాను పో! అన్నాడటసవరించు

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గుసవరించు

అన్ని వదిలేసిన వారిని గూర్చి ఈ సామెత వాడతారు. ఎవరు ఏమనుకున్నా నాకేమి అని మొడితనముతో వుండేవారిని ఉద్దేశించినది ఈ సామెత.

నష్టపడ్డా భ్రష్టు కారాదుసవరించు

నాకు లేక ఆకులు నాకుతుంటే నీకెక్కడ పెట్టేది?సవరించు

నా కోడీ, కుంపటీ లేకుంటే ఎలా తెల్లారుతుందో, నిప్పెట్లా దొరుకుతుందో చూస్తానందటసవరించు

ఈ సామెతకు ఆధారంగా ఒక కథ వున్నది: ఒక ఊరిలో ఒక ముసలామె వుండేది. ఆమె వద్ద వంట చేసుకోడానికి ఒక కుంపటి వుండేది. అదే విధంగా ఒక కోడి పుంజు వుండేది. ప్రతి రోజు ఊరివారు ముసలమ్మ కోడి కూయంగానే..... నిద్రలేచి మగవాళ్ళందరూ వారి వారి పనులకు వెళ్ళే వారు. ఆడవారు మాత్రం.... ఈ ముసలమ్మ కుంపటిలోని నిప్పు తీసుకెళ్ళి తమ ఇంట పొయ్యి వెలిగించుకునేవారు. ఇది గమనించిన ఆ ముసలమ్మ..... నా కోడి పుంజు కూత తోటే ఈ వూర్లో తెల్లవారుతుంది...... నా కుంపటిలోని నిప్పుల వల్లనే ఈ వూరి వారందరి పొయ్యి వెలుగు తున్నదని.... భావించి ..... నేనే గనుక లేకుంటే.... ఈ ఊర్లో ఎలా తెల్లవారుతుందో..... వూర్లో వారు వంట ఎలా చేసుకుంటారో..... చూస్తానని ఎక్కడికో వెళ్ళి పోతుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ వూరి వారి బ్రతుకులెలా వున్నాయో చూద్దామని తిరిగొచ్చింది ఆ ముసలామె. ఆ వూరిలో ప్రజలు యధావిధిగానె వుండటం చూచి..... నివ్వెర పోతుంది.

నాగరికంలేని మాట నాలుక తీటసవరించు

నక్కకూ నాగలోకానికీ పోలికా?సవరించు

నాగస్వరానికి లొంగని తాచుసవరించు

ఎవరి మాట వినని... మొండి వాని గురించి ఈ సామెత వాడతారు.

నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నాడటసవరించు

నా చేను నీకు రాసిస్తా దున్నుకుని పంట పండిస్తావా? అని అడిగిందటసవరించు

నాజూకు నయగారాలు - వలపు వయ్యరాలుసవరించు

నాటిన పైరుకు నష్టం లేదుసవరించు

నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లుసవరించు

అమాయకత్వం, తెలివి లేని తనం గల వారి గురించిన సామెత ఇది.

నాతి బలం నాలుకేసవరించు

నాతోనే అంతా వున్నది అన్నట్లుసవరించు

నాది కాదు - నా అత్త సొమ్ము అన్నట్లుసవరించు

నా దెబ్బకు గోలకొండ కూడా అబ్బా అంటుందిసవరించు

నానాటికీ తీసికట్టు నాగంభొట్లుసవరించు

నా నోట్లో నీ వేలు పెట్టు - నీ కంట్లో నా వేలు పెడతా అన్నట్లుసవరించు

నా పాతివ్రత్యం గూర్చి నా మొదటి మొగుణ్ని అడగరా రెండో మగడా అందిటసవరించు

నా పెనిమిటికి లేనిది నీకుంది అందుకే నీ పక్కలోకొచ్చా అందిటసవరించు

నామాలవారే గానీ, నియమాలవారే లేరుసవరించు

నా మొగుడికే పసవుంటే నీ దగ్గరెందుకు పడుకుంటానని అందిటసవరించు

నాయనకు పెళ్ళి సంబరం - అమ్మకు సవతి సంకటంసవరించు

న్యాయదేవత వింటుందేగానీ చూడలేదుసవరించు

న్యాయదేవత కళ్ళు విప్పనంతవరకే అన్యాయం ఆగడాలుసవరించు

న్యాయానికి కూడు లేదుసవరించు

న్యాయానికి రోజులు లేవుసవరించు

న్యాయాన్ని రక్షిస్తే, అది నిన్ను రక్షిస్తుందిసవరించు

నారా అనరా అంటే పీచు అనే వాడుసవరించు

నారి తెగినా కష్టమే - నారి తిరిగినా కష్టమేసవరించు

నారి అనగా వింటి నారి అని అర్థం. మరొక అర్థము స్త్రీ అని. వింటి నారి తెగితే.... విల్లు నిరుపయోగము..... అలాగే స్త్రీ బయట తిరిగితే పరువుండదని అర్థము

నారు పోసిన వాడు నీరు పోయక పోతాడా?సవరించు

నాలిముచ్చు వెధవనీ, నీళ్ళు నమిలేవాణ్నీ నమ్మరాదుసవరించు

నాలుక కటువు - ఎద మెత్తనసవరించు

నోటి మాత్రమే కఠినంగా వుండి మనస్సు మెత్తనయితే ఈ సామెతను వాడుతారు

నాలుక దాటితే నరకముసవరించు

నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తేకేసవరించు

నాలుక మీద తేనె - మనసులో విషంసవరించు

నాలుక వుంటే అన్ని దిక్కులూ తిరుగగలడుసవరించు

నా వ్రేలితో నా కన్నే పొడిచినట్లుసవరించు

నాశనమూ - నల్ల బొగ్గులూసవరించు

నా సింగారం చూడరా నా బంగారు మగడా! అన్నట్లుసవరించు

నిండా మునిగిన వానికి చలేంటిసవరించు

చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది.

నిండిన కడుపుకు అన్నం - బట్టతలకు నూనె అన్నట్లుసవరించు

నిండిన కడుపుకు నిక్కెక్కువసవరించు

నిండు కుండ తొణకదుసవరించు

అన్ని వున్న విస్తరి అణిగి మెణిగి వుంటుంది ఎంగిలాకు గాలికి ఎగిరి పడుతుంది. అనే సామెతె లాంటిదే ఇది కూడ. గొప్పవారు చిన్న చిన్న విషయాల గురించి పట్టించు కోరు అని చెప్పే సామెత ఇది.

నిండుటేరు నిలిచి పారుతుందిసవరించు

గంగ పారు చుండు కదలని గతి తోడ.... మురుగు పారు మ్రోత తోడ .... అనే పద్య పాదమే ఈ సామెతకు మూలం.

నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయిసవరించు

నిజం కురచ - బొంకు పొడవుసవరించు

నిజం నిలకడమీద తెలుస్తుందిసవరించు

అప్పటికప్పుడు అసలు విషయం తెలియకున్నా... తర్వాతన్నా నిజం తెలుస్తుందని ఈ సామెత అర్థం.

నిజం మాట్లాడితే నిస్టూరంసవరించు

కొన్ని సార్లు నిజం చెపితే కూడా తగువులు వస్తాయి అని చెప్పే సామెత ఇది.

నిజమైన బంగారం నిప్పుకు వెరవదుసవరించు

నిజంచెపితే నమ్మరుసవరించు

నిజంనిప్పులాంటిదిసవరించు

నిజం మాట్లాడితే ఉన్న ఊరు అచ్చిరాదుసవరించు

నిత్య కళ్యాణం, పచ్చ తోరణంసవరించు

అన్ని సక్రంగ జరుగుతూ సంసారం సక్రమంగా జరుగుతుంటే ఈసామెత వాడుతారు

నిత్య దరిద్రుడు.... నిచ్చింత పురుషుడుసవరించు

నిద్ర పోయేవాణ్ని లేపొచ్చు గాని నిద్ర నటించే వాణ్ణి లేప లేముసవరించు

నిజముగా నిద్ర పోయే వాడు కాస్త అలికిడికి లేస్తాడు. అలా కాకుండా నిద్ర పోతున్నట్టు నటిస్తున్న వాడిని బలవంతంగా లేపాలని ప్రయత్నించినా వాడు లేవడు. ఎందుకంటే అది కపట నిద్ర.

నిదానమే ప్రధానంసవరించు

నింద లేనిదే బొంది పోదుసవరించు

నింద వస్తుంది గానీ అవమానం రాదుసవరించు

నిన్న ఉన్నవాడు నేడు లేడుసవరించు

నివురు కప్పిన నిప్పువలెసవరించు

నిప్పంటించగానే తాడెత్తు లేస్తుందిసవరించు

నిప్పుకు చెదలంటుతుందా?సవరించు

నిప్పుకూ నీటికీ ఉన్నంత స్నేహంసవరించు

నిప్పు త్రొక్కిన కోతిలాగాసవరించు

నిప్పు ముట్టనిదే చేయి కాలదుసవరించు

నిప్పులేనిదే పొగరాదుసవరించు

దేనికయినా ఒక కారణముంటుందని చెప్పేదే ఈ సామెత.

నిప్పులో ఉప్పు వేసినట్లుసవరించు

నివురు గప్పిన నిప్పులాసవరించు

బయటకు కనబడని ప్రమాదమని అర్థం. నిపురు కప్పిన నిప్పు..... నిప్పుగా పైకి కనిపించదు. అలాగని దాన్ని ముట్టుకుంటే కాలక మానదు.

నిమ్మకు నీరెత్తినట్లుసవరించు

నిమ్మ చెట్టు నీడా కాదు... నిండు మనిషి తోడు కాదుసవరించు

ఉపయోగము లేని పని అని అర్థం.

నియమం కోసం నామం పెడితే, నామం నా కొంపముంచింది అన్నట్లుసవరించు

నియోగి నిక్కులుసవరించు

నియోగపు ముష్టికి బనారసు సంచిసవరించు

నిర్భాగ్యపు దామోదరుడికి అభాగ్యపుటల్లుడుసవరించు

నిలకడ లేని మాట నీళ్ళ మూటసవరించు

నిలుచోటానికి చోటిస్తే పడగ్గది ఎక్కడన్నాడటసవరించు

నిష్ఠ నీళ్ళపాలు - మంత్రం మాలలపాలుసవరించు

నిష్ఠ మాలలపాలు - మానం సాయిబుపాలుసవరించు

నీ ఎడమ చెయ్యి తియ్యి - నా పురచెయ్యి పెడతాను అన్నట్లుసవరించు

నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడటసవరించు

ఆమె కాపురము కూలిపోయిన తర్వాతనే రంకు మొగుడయ్యాడు. ఇక ప్రత్యేకంగా ఆమె కాపురం కూల్చాల్చిన పని లేదు. ఆ సందర్భానికి ఈ సామెత వాడతారు.

నీకు ఎక్కడ సంశయమో, నాకూ అక్కడే సందేహంసవరించు

నీకు బెబ్బెబ్బే - నీ యబ్బకు బెబ్బెబ్బేసవరించు

నీ కూడు తింటూ, నీ బట్ట కడుతూ, నాతో కాపురం చెయ్యి అన్నట్లుసవరించు

నీకో దణ్ణం - నీ పెద్దకొక దణ్ణంసవరించు

నీకోసం పుట్టా, నీకోసం పూచా, దొరలా దోచుకో అందటసవరించు

నీతల్లో తేజమ్మ రావాలిసవరించు

నీటికి కలువ - మాటకు చలువసవరించు

నీటికి నాచు తెగులు - మాటకు మాట తెగులుసవరించు

నీటికి నాచు తెగులు - నాతికి రంకు తెగులుసవరించు

నీటి మూటలు - గాలి మాటలుసవరించు

నీటిలో జాడలు వెతికినట్లుసవరించు

నీటిలో రాతలు రాసినట్లుసవరించు

అబద్దాలు అని అర్థం.

నీడలకు నోళ్ళుంటాయిసవరించు

నీతి లేని మాట రాతి వేటుసవరించు

నీతిలేని పొరుగు నిప్పుతో సమానంసవరించు

నీతి లేని వారు పొరుగున వుంటే ఏనాటికైనా ముప్పే. జాగ్రత్తగా వుండమని హెచ్చరిక

నీతి లేనివాడు కోతికంటే పాడుసవరించు

నీతో కాపురం ఒంటికి కంపరం అన్నట్లుసవరించు

నీతోడిదే లోకం అన్నట్లుసవరించు

నీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లుసవరించు

ఎదుటివారి సొమ్మును ఏదో ఒక విధంగా కాజేద్దామని ఎదుటివారికి మేలు చేసి పెడతామంటూ వారికి మాయమాటలు చెప్పి వారి చేత ఖర్చు పెట్టించి తమ పని చేసుకుపోవటం.ఎదుటివారి చేత ఖర్చు చేయించి చివరకు డబ్బంతా తామే సమకూర్చినట్లుగా ప్రచారం చేసుకోటం.

నీ పెండ్లాం ముండమొయ్యా!సవరించు

పెండ్లాం ముండ మొయ్యడమంటే.... భర్త చావడమని అర్థము. కాని మొగుడే ఆ మాటంటే...... అతడొక అమాయకుడని అర్థము

నీ పెండ్లి ఎట్లాగో పాడయింది, నా పెండ్లికి రా అన్నాడటసవరించు

నీరు వుంటేనే పల్లె - నారి వుంటేనే యిల్లుసవరించు

నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగుసవరించు

నీవు నేర్పిన విద్యయే నీర జాక్షసవరించు

నీవు పాడిందానికీ, నేను విన్నదానికి సరి. తలవూపిన దానికి తంబూర పెట్టిపో! అన్నట్లుసవరించు

నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లోసవరించు

ఉపకారికి అపకారం చేసిన సందర్భాన్ని ఈ సామెతతో పోలుస్తాం. నీ వేలితో నాకు తినిపిస్తే నా వేలితో నీ కంట్లో పొడుస్తా అన్నట్లు!!

నీవు ఒక అందుకుపోస్తే, నేను ఒకందుకు తాగుతున్నాసవరించు

నీళ్ళ మూట - వంచకుడి మాట ఒక్కటేసవరించు

నీళ్లు నమిలేవాడికి నిలకడ లేదుసవరించు

ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పకపోవటం, సంబంధం లేని మాటలు ఏవేవో చెబుతూ అసలు విషయం చెప్పకపోటం.ఒకవేళ ఏదైనా చెప్పినా ఆ మాటలో కచ్చితమైన విషయాలుండవు. అలాంటివారి మాటలను నమ్మవద్దని ఆ మాటల ఆధారంగా గట్టి నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దని

నీళ్ళు లేని పైరు - నూనె లేని జుట్టుసవరించు

నీ సరి వేల్పులు - నా సరి దాసులు లేరుసవరించు

నీ సొమ్ము ఆదివారం - నా సొమ్ము సోమవారంసవరించు

నుదుట వ్రాయనిదే నోటరాదుసవరించు

నువ్వు దంచు నేను బుజాలెగరేస్తానుసవరించు

వడ్లు నువ్వు దంచు, నేను దంచుతున్నట్లు అభినయిస్తూ భుజాలు ఎగరేస్తాను .పని నువ్వు చెయ్యి, నేను ఎగ్గొడతాను అనటం.

నువ్వు దంచుతూ వుండు - నేను పక్కలెగరేస్తాను అన్నట్లుసవరించు

నుయ్యి తియ్యబోతే భూతం బయటపడ్డట్లుసవరించు

నూటికీ కోటికీ ఒకడుసవరించు

నూటికి పెట్టి కోటికి గొరిగినట్లుసవరించు

నూతి కప్పకు సముద్రపు సంగతేం తెలుస్తుంది?సవరించు

నూరు అబద్ధాలాడి అయినా ఒక యిల్లు నిలుపమన్నారుసవరించు

ఒక మంచి పని చెయ్యడానికి అబద్దం ఆడినా తప్పు లేదని అర్థము ఈ సామెతకున్నది

నూరు కీళ్ళు ఓరిస్తేగానీ ఒక మేలు దక్కదుసవరించు

నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావుసవరించు

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లుసవరించు

ఎంతటి భలవంతుడైనా కాలం కలిసి రాకపోతే ఒక్కోసారి కుక్కచావు చస్తాడని అర్థం.

నూరు చిలుకల ఒకటే ముక్కుసవరించు

పల్లె ప్రాంత ప్రజల ఉహా ధోరణి విచిత్రంగా ఉంటుంది. వారికి తెలిసిన వస్తువులను వారికి తెలిసిన వాటితో పోల్చి చెపుతుంటారు. ఈ పొడుపు కథ కూడా అలా ఒక వస్తువుతో పోల్చి చెప్పుకొనగా ఉద్భవించినదే. నూరు చిలకలు ఉంటే వాటికి ఒకటే ముక్కు ఉండటం సృష్టిలో చాలా విచిత్రమైన విషయమే. ద్రాక్షపండ్ల గుత్తిలోని ద్రాక్ష పళ్ళన్నీ పచ్చగా గుత్తిగా ఒద్దికగా ఒకే చోట ఉండటం పొడుపు కథ. ద్రాక్ష పళ్ళన్నీ చిలకలుగా వాటిని కలుపుతూ ఉన్న ఒకే తొడిమ ముక్కుగా సృష్తికర్త భావం. అందుకే దీనిని విడుపు ద్రాక్ష గుత్తి అంటుంటారు.

నూరు నోములు ఒక్క రంకుతో సరిసవరించు

నూరు మాటలు ఒక వ్రాతకు సరికావుసవరించు

నూరేళ్ళు వచ్చినా నుదుటి వ్రాతే గతిసవరించు

నూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లుసవరించు

లక్షసద్గుణములను ఒక దోషము తుడిచివేయును. "నూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లు" అని తెనుఁగు సామెత. కడవెఁడు పాలు ఒకవిషబిందువుతో పాడయినట్లు. ఏకోఽపి హన్తి గుణలక్ష మపీహ దోషః సంస్కృత న్యాయములు

నెత్తిన రూక పెట్టినా కాసుకు కొరగాడుసవరించు

నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుందిసవరించు

తన క్రింది వారితొ కొంత కఠినంగా వ్వవరిస్తేనె సంస్థ అభివృద్ధి చెందు తుందని అర్థం.

నెత్తీబోడి తిత్తీబోడి, తిరుపతికెందుకు?సవరించు

నెమలికంటిలో నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లుసవరించు

నెమలిని చూచి కుక్క నాట్యమాడినట్లుసవరించు

నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంటసవరించు

నెయ్యానికైనా - వియ్యానికైనా - కయ్యానికైనా సమానంగావుండాలిసవరించు

నెల తక్కువైనా రాజింట పుట్టాలిసవరించు

నెల తక్కువైనా మగవాడిగా పుట్టాలిసవరించు

నెల బాలుడికి నూలు పోగన్నట్లుసవరించు

నేడు చస్తే రేపటికి రెండుసవరించు

నేతి కుండను నేలబెట్టి, ఉత్త కుండను ఉట్టి మీద పెట్టినట్లుసవరించు

నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టుసవరించు

పేరుకేగాని అసలు సరకు లేదనే అర్థంలో ఈ సామెత చెప్తారు. నేతి బీరకాయలో నెయ్యి లేదు, మైసూరు పాకులో మైసూరు లేదు.

నేతిబీరలో నేతి చందంలాసవరించు

నేతిబీర అనేది ఒక బీరకాయ రకము. పేరుకే ఇందులో నేతి అని ఉంది కానీ బీరకాయలో నెయ్యి (నేతి) ఉండదు. కేవలం పేరుకే ఏదైనా ఉంటే దాన్ని నేతి బీరకాయలో నేతి చందానా అంటారు.

  • గొప్ప కోసం కబుర్లు చెప్పేవార గురించి నీతి బీరకాయ కబుర్లు చెపుతాడు అంటారు.

నేను పుట్టకపోతే నువ్వెవరిని పెళ్ళి చేసుకునేవాడివని అడిగితే, నీతల్లిని పెళ్ళాడేవాడిని అన్నాడటసవరించు

నేను వెళితే లేదుగానీ నా పేర చీటీ పంపితే పని జరుగుతుందా?సవరించు

నేల విడిచి సాము చేసినట్లుసవరించు

అసాద్యమని అర్థము

నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లుసవరించు

ఇక్కడ "నోటికి అదుపు" అన్న మాటకు రండు అర్ధాలు తీసుకొనవచ్చును. ఒకటి నోటితో మనము ఏది మాట్లాడినా ఎంత పడితే అంత మాట మాట్లాడ రాదు ఐతే సందర్భానికి తగినట్లుగా ఆలోచించి మాట్లాడాలి.రెండవది నోటితో మనము తినేది తగినంత కన్నా ఎక్కువ తిన రాదు. అలా చేయకున్న అది మనిషికి చేటు తెచ్చును. అలాగే ఇంటిలోని వారికి కూడా పొదుపు వుండాలి. అది లేకపొయిన మొత్తం కుటంబానికే కాక వారి తరువాతి తరాల వారికి కూడా మంచిది కాదు.

నేలచూపు పోతే వాలుచూపు సై అంటుందిసవరించు

నేలది తీసి నెత్తికి రాసుకున్నట్లుసవరించు

నేలరాయి నెత్తికెత్తుకున్నట్లుసవరించు

నేల విడిచి సాము - నీరు విడిచి ఈతసవరించు

నేర్చి చెప్పిన మాట నెరవాది మాటసవరించు

నేర్చినమ్మ ఏడ్చినా బాగానే వుంటుందిసవరించు

నేర్చిన బుద్ధి ఏడ్చినా పోదుసవరించు

నేసేవాణ్ని నమ్ముకుని పొలిమేర జగడం ఒప్పుకోరాదుసవరించు

నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడుసవరించు

ఇది సుమతీ శతక పద్య భాగము.

నొసట నామాలు - నోట్లో బూతులుసవరించు

నొసట వ్రాసిన వ్రాతని చెరిపే దెవరు?సవరించు

నోటి తీట పొట్టకు చేటుసవరించు

నోటితో లేదనేది చేతితో లేదంటే సరిసవరించు

నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లుసవరించు

నోట్లో నువ్వుగింజ దాగదుసవరించు

నోట్లో ముద్ద గూట్లో దీపంసవరించు

నోట్లో వేలు పెట్టినా కరవలేని నంగనాచిసవరించు

నోరు అప్పాల పిండి - చెయ్యి బలుసు ముల్లుసవరించు

నోరున్న తలగాచునుసవరించు

నోరున్నవాడిదే రాజ్యంసవరించు

నోరుంటే ఊరుంటుందిసవరించు

నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదుసవరించు

నోరు నవ్వటం - నొసలు వెక్కిరించటంసవరించు

మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు

నోరు మూస్తే మూగ - నోరు తెరిస్తే గయ్యాళిసవరించు

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందిసవరించు

తాను మంచిగా వుంటే ఎదుటివారుకూడ మంచిగానె వుంటారని అర్థం. అందరూ స్నేహ భావంతో వుండాలని అర్థం ఈ సామెతలో ఉంది.

నొసట పళ్ళు - నోట్లో కళ్ళు లేవుసవరించు

నోరు మాట్లాడుతుంది... నొసలు వెక్కిరిస్తుందిసవరించు

మనసులో ఒకటి పెట్టుకొని, పైకి మరొకటి మాట్లాడె వారినిగురించి ఈ మాట పుట్టినది.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_న&oldid=2989015" నుండి వెలికితీశారు