భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ప" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

పంచదార పలుకులు - విషపు చూపులు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

పంచదార పలుకులు - విషపు చూపులు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

పంచాంగం పటపట - విస్తరాకు లొటలొటసవరించు

పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?సవరించు

పంచాగ్ని మధ్య ఉన్నట్లుసవరించు

పంటకు పెంట - వంట మంటసవరించు

పెంట అనగా ఎరువు అని..... మంట అనగా నిప్పు అని అర్థము. పంటకు ఎరువు అవసరం అలాగే వంట చేయడానికి మంట అవసరము అని దీని అర్థము

పండగ నాడు కూడా పాత మొగుడేనా?సవరించు

వివరణ: గతంలో రవికల పండుగ అని ఒక ఉత్సవం జరిగేది. భార్య భర్తలు ఒక నది ఒడ్డు చేరుకొని నది ఎగువన భార్యలు తమ రవికలు తీసి నదిలో వేసేవారు. కొంత దూరంలో వున్న భర్తలు నదిలో కొట్టుకొని వస్తున్న రవికలను ఒక్కొక్కదాన్ని ఒకడు చేత చిక్కించు కోవాలి. అలా ఎవరి రైక ఎవరికి దొరుకుతుందో ఆ రవిక స్వంత స్త్రీ రవిక దొరికించు కొన్న పురుషునితో ఆ రాత్రి సంబోగంలో పాల్గొనాలి. అదీ ఆ పండగ తీరు. అలా ఒక పురుషునికి ఒక రైకి దొరికింది. ఆ రవికకి సంబంధించిన స్త్రీ ఆ పురుషుని వద్దకు వచ్చింది. తీరా చూస్తే ఆ పురుషుడు తన సొంత మొగుడే.. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. (దీనికి మూల: పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు... రచన... తాపీ ధర్మారావు)

పండుగ - పైన దండుగసవరించు

పండని ఏడు పాటు ఎక్కువసవరించు

పండాకును చూచి పసరాకు నవ్వినట్లుసవరించు

పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుందిసవరించు

పండిత పుత్ర పరమ శుంఠసవరించు

పండితుని కొడుకు పరమ మూర్కుడవుతాడని ఈ సామెతకు అర్థం. ఇది ప్రాస కొరకు మాత్రమే పుట్టిన సామెత.

పండితపుత్రుడు... కానీ పండితుడే...సవరించు

ఈ సామెతకు వ్వతిరేఖార్థంలో ఒక సామెత ఉంది. అది పండిత పుత్ర శుంఠః దానికి వ్వతిరేకార్థంలో కల్పించిన సామెత ఇది.

పండిన రోజే పండుగసవరించు

పండినా ఎండినా పని తప్పదుసవరించు

పండు వలిచి చేతిలో పెట్టినట్లుసవరించు

పండే పంట పైరులోనే తెలుస్తుందిసవరించు

పంది ఎంత బలిసినా నంది కాదుసవరించు

పందికేంతెలుసు పన్నీరు వాసనసవరించు

ఎప్పుడూ బురదలో దొర్లుతూ మురికి వాసనలో జీవించే పందికి పన్నీరు సువాసన తెలియదు. అలానే విలువ తెలీని మూర్ఖులకు విలువైన బోధలు చేసినా లేదా విలువైన వస్తువులను ఇచ్చినా వారికి వాటి విలువ తెలియక దుర్వినియోగం చేస్తారు.

పందిని పొడిచే వాడే బంటుసవరించు

పందిని వేటాడ్డం అంత సులభం కాదు. దాని శరీరానికి ఎంత దెబ్బ తగిలినా సులభంగా చావదు. క్రింద పడిపోడు. అలాగే పారిపోగలదు లేదా మీదికి దాడి చేయగలదు. అందుచేతనే పందిని పొడిచే వాడే బంటు అని సామెత పుట్టింది.

పంది పన్నీరు మెచ్చునా?సవరించు

పంది బురద మెచ్చుసవరించు

పందుం తిన్నా పరకడుపేసవరించు

పంపకాలు మాకు - లొట్టలు మీకుసవరించు

పకపకా నవ్వేవారూ, గబగబా అరిచేవారూ కపటమెరుగరుసవరించు

పక్కమీద పూలు నలిగినట్లు నీవూ నలిగితే ఎట్లా అన్నాడటసవరించు

పక్కలో బల్లెంలాగాసవరించు

పక్కింటి పోరు పండగంత వేడుకసవరించు

పొరుగు వారు పోట్లాడుకుంటుంటే ఇరుగు పొరుగు వారికి అదొక వేడుక. ఇది మానవ సహజం. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత/

పగ గలిగి బ్రతకటం - పామున్న యింట్లో బ్రతకటం ఒక్కటేసవరించు

పగటి నిద్ర పనికి చేటుసవరించు

పగటి ముచ్చట పని చేటుసవరించు

అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేయటమని అర్థం. ఇలాంటి కాలక్షేపాల మాటలు పగటిపూట పెట్టుకుంటే తాను చేసే పనితోపాటు ఇతరుల పనిని కూడా చెడగొట్టినట్టవుతుంది.

పగ బట్టిన త్రాచులాగసవరించు

త్రాసు పాము పగ బట్టితే ఎప్పటికి మరచిపోక తన పగ తీర్చు కోవడానికి వేచి చూస్తుంటుందని ప్రజల మూడ విశ్వాసము. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. పాములు పగపట్టడం ఒక మూడ నమ్మిక మాత్రమే

పగలు చెయ్యి లాగితే రానిది, రాత్రి కన్నుగీటితే వస్తుందా?సవరించు

పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తుంది అన్నట్లుసవరించు

చాల వికారంగా/ అనాకారిగా వున్నదని ఈ సామెతకు అర్థం.

పగలూ, వగలూ నిప్పులాంటివిసవరించు

పగలెల్లా బారెడు నేశాను - దీపం తేరా దిగనేస్తాను అన్నాడటసవరించు

పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడటసవరించు

పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందిసవరించు

మంచి వానికి అందరు మంచి వారుగానె... చెడు వానికి అందరు చెడ్డగానే కనబడతారని దీని అర్థం.

పచ్చగా వుంటే పదిమంది చుట్టాలుసవరించు

పచ్చి వెలగకాయ గొంతుకడ్డం పడ్డట్లుసవరించు

పట్టణే పాదమాచారంసవరించు

పట్టిందల్లా బంగారమెసవరించు

ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు.

పట్టినదంతా బంగారం - ముట్టినవల్లా ముత్యాలు అన్నట్లుసవరించు

ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు.

పట్టుకొన్నవాడు మట్టగుడిశ అంటే పైనున్నవాడు జెల్ల అన్నాడటసవరించు

పట్టుకొమ్మను నరుక్కున్నట్లుసవరించు

పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుందిసవరించు

మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట. మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

పట్టు పట్టరాదు, పట్టి విడువరాదుసవరించు

పట్టెడు పెడితే పుట్టెడు పుడుతుందిసవరించు

పట్టెడు బొట్టుంటే పది లక్షలు స్త్రీకిసవరించు

పడతి పరువాలు పంచదార గుళికలుసవరించు

పడమట కొర్రువేస్తే పందిళ్ళమీద రాజనాలు పండుతాయిసవరించు

పడమట కొర్రువేస్తే పాడి ఆవు రంకె వేస్తుందిసవరించు

పడ్డ గోడలు పడ్డట్టుండవు - చెడిన కాపురం చెడినట్లుండదుసవరించు

పడ్డవారు చెడ్డవారు కారుసవరించు

పడిసం పదిరోగాల పెట్టుసవరించు

పడిశం అనగా జలుబు .. పడిశం పట్టితే పది రోగాలు పట్టుకున్నంత బాధ అని ఈ సామెతకు అర్థం.

పడుగూ పేకలాగాసవరించు

పడుచుపిల్ల కౌగిలి సుఖాల లోగిలిసవరించు

పడుచుపిల్ల పరువాలు రసరాజ్య సోపానాలుసవరించు

పడుచుపిల్ల కనుగీటు యువహృదయపు తడబాటుసవరించు

పడుచుల కాపురం - చితుకుల మంటసవరించు

పడుచులతో సయ్యాట - పాములతో చెలగాటం ఒకటేసవరించు

పడుపడు అన్న నాసవితే గాని పడ్డ నాసవితి లేదుసవరించు

అందరూ సలహాలిచ్చి వారేగాని ఆచరించేవారులేరు - అని సామెత అర్థము

పడమట పిసరంత మబ్బు నడిస్తే పాతాళందాకా వానసవరించు

పడమట మెరిసిన పది ఘడియలకు వానసవరించు

పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళలో దిగదుసవరించు

పణత పడే జాగాకే కాళ్ళు ఈడ్చుకుపోతాయిసవరించు

పత్రి దేవుని మీద - భక్తి చెప్పులమీదసవరించు

పదవులు మావి - బాధలు మీవిసవరించు

పద్మాసనం వేసుకుని కూర్చుంటే పరమాన్నం వడ్డిస్తారా?సవరించు

పదిమంది కళ్ళ పడ్డ పాము చావక బ్రతుకుతుందా?సవరించు

పదిమంది చేరితే పనిపాడుసవరించు

పదిమంది నడిచిందే బాటసవరించు

పది మందిలో పడ్డ పాము తప్పించు కుంటుందిసవరించు

పది మందిలో పడ్డ పాము తలో మాట చెపుతూ అలజడి సృష్టిస్తారు. ఇంతలో ఆ పాము తప్పించు కుంటుంది. ఒక నాయకత్వంపై ఏదైనా పని చేయాలని ఈ సామెత అర్థం.

పది రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగులుతుందిసవరించు

పది వూళ్ళ పాపరాజులాగాసవరించు

పదుగురు నడిచిన దారిన పులు మొలవదుసవరించు

పులు అనగా గడ్డి అని అర్థం. పలువురు నడిచే దారిలో గడ్డి మొలవదు అనిఅర్థం. అనగా పదిమందిలో చెడుగా ముద్ర పడివ వాదు అభివృద్ధిలోకి రాడని అర్థం.

పదుగురాడు మాట పాటిపై ధర చెల్లుసవరించు

పది మంది చెప్పిన మాటే చల్లు తుంది. ఇది ఒక పద్య పాటము: పదుగురాడు మాట పాటియై ధరచెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు. ఒక్కడే ఎంత మొత్తుకున్నా వాని మాట చెల్లదని అర్థం.

పనికి పంగనామం పెట్టి గంపజాతర నెత్తికెత్తుకున్నట్లుసవరించు

పనికి పరాకు - తిండికి హుషారుసవరించు

పని చేయడానికి మొండికేసి......... తిండికి మాత్రం ముందుండే వారి గురించి ఈ సామెత ఉపయోగిస్తారు

పనికి పాతిక నష్టం - పరక లాభంసవరించు

పనికి పీనుగ - తిండికి ఏనుగుసవరించు

పనికి వచ్చి సరదా తీర్చమన్నట్లుసవరించు

పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందటసవరించు

పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయిందిసవరించు

పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది. (ఇది సామెతకు అసలు అర్థం) ఒక పనిలో ఎంతో ఆరి తేరిన వాడనని చెప్పుకునే వానిని నమ్మి పనిచెపితే... ఆ పని తర్వాత ఆపనిలోని డొల్లతనం తెలిసి పోతుంది. ఆ సందర్భంలో ఈ సామెత వాడతారు.

పనిచేయనివాడు ఇంటికి చేటుసవరించు

పని తక్కువ - ప్రాకులాట ఎక్కువసవరించు

పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లుసవరించు

సాధారణంగా బజారులో అన్ని దుకాణందారులు తమ అంగడికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఒక్క మంగలి తప్ప. జుత్తు పెరిగితే మనమే మంగలి దగ్గరికి వెళ్ళలి


పనిలేని మంగలి పిల్లి తల గొరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ఉపయోగపడని పనిచేస్తుంటే వారిని ఉద్దేశించి ఆ సామెత ప్రయోగిస్తాం. నిర్వ్యాపారాంబష్టన్యాయము

పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయిందిసవరించు

పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది. (ఇది సామెతకు అసలు అర్థం) ఒక పనిలో ఎంతో ఆరి తేరిన వాడనని చెప్పుకునే వానిని నమ్మి పనిచెపితే... ఆ పని తర్వాత ఆపనిలోని డొల్లతనం తెలిసి పోతుంది. ఆ సందర్భంలో ఈ సామెత వాడతారు.

పనీ పాటూలేదు పదం పాడతానన్నట్లుసవరించు

పనిముందా? తిండి ముందా?సవరించు

పని ముద్దా? పాటు ముద్దా?సవరించు

పని లేని పాపరాజులాగాసవరించు

పన్నెండామడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నాడటసవరించు

పప్పుకూటికి ముందు - చాకిరీకి వెనుక వుండాలిసవరించు

పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమిసవరించు

పప్పులేని పెళ్ళి - ఉప్పులేని కూరసవరించు

పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పెయ్యవే కోడలా అంటే, పప్పులో చెప్పువేసి, అత్త కంచంలో అంచున పెట్టిందటసవరించు

పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలుసవరించు

అపసోపలు పడి అధికంగా సంపాదించ డానికన్నా కొంచెమైనా నిదానంగా సంపాదించడం మేలని దీని అర్థం.

పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుందిసవరించు

16 ఏళ్ల వయసులో గాడిద కూడా గంధర్వ కన్య లాగ ఉంటుంది

పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?సవరించు

(ఇది పొడుపు కథ దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు)

పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?సవరించు

నోట్లో ఉన్న పళ్ళు ఊడగొట్టుకోదలచినప్పుడు ప్రత్యేకమైన రాయి అవసరంలేదు. అందుకు ఏ రాయైనా సరిపోతుంది. అదే విధంగా తనకు తాను స్వయంగా నష్టం కలిగించుకుంటున్నప్పుడు అది ఏ పధ్ధతిలో జరిగినా ఒకటేనని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

పయోముఖ విషకుంభముసవరించు

పైకి చూడ్డానికి చాల అమాయకంగా కనిపిస్తూ లోన దుర్భుద్దులున్న వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు

పరకాంత పొందు తాచుపాము పడగసవరించు

పరకాంత లెందరయినా కులకాంతకు సాటిరారుసవరించు

పరనింద గృహక్షయం - యతినింద కులక్షయంసవరించు

పరమానందయ్యగారి శిష్యులలాగాసవరించు

అత్యంత అమాయకుల గురించి ఈ సామెత ఉపయోగిస్తారు. పరమానందయ్య శిష్యులు చాల అమాయకులు

పరికిణీ, పావడాలు పరువాల ఆవడలుసవరించు

పరుగెత్తి పాలు త్రాగేకన్నా, నిలబడి నీళ్ళు త్రాగటం మేలుసవరించు

పరులసొమ్ము పాపిష్టిదిసవరించు

పరుల సొమ్ము పామువంటిదిసవరించు

పరుల సొమ్ము పేలపిండిసవరించు

పరువాల జాతరలో పెదవి ఎంగిలా?సవరించు

పరువాల పల్లవింత - పాన్పు త్రుళ్ళింతసవరించు

పరువాల పొందుకు పరదాలు అడ్డెందుకు?సవరించు

పరువాల పోరు మధువుల పుంత అన్నట్లుసవరించు

పరువిచ్చి పరువు తెచ్చుకోసవరించు

పరువుకీ, కరువుకీ డబ్బుసవరించు

పరువు లేని బ్రతుకు పరమ రోతసవరించు

పళ్ళూడకొట్టుకోవటానికి ఏ రాయైనా ఒక్కటేసవరించు

పసిపిల్లలు దేవుడితో సమానంసవరించు

పసిపిల్లలు, తాగుబోతులు నిజం చెబుతారుసవరించు

పసుపు, కుంకుమల కోసం పది క్రోసులయినా వెళ్ళాలిసవరించు

పరోపకారం ఇదం శరీరంసవరించు

ప్రదక్షిణాలు చేస్తూ కడుపు చూచుకున్నదటసవరించు

దేవునికి ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పితే ....... ఒక ఇల్లాలు దేవునికి ప్రదక్షిణాలు చేస్తూ..... చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట కడుపు వచ్చిందస లేదాయని. అనగా అమాయకురాలని అర్థము.

ప్రమిదలో వత్తేసి కళ్ళలో దీపాలు వెలిగించు అందిటసవరించు

ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధంసవరించు

ప్రసూతి వైరాగ్యం పురిటి పచ్చి ఆరేదాకానేసవరించు

పశువుల పాలు మేపును బట్టిసవరించు

పశువులు తమకు వేసిన మేతను బట్టి పాలిస్తాయని అర్థము

పశువుల విరివి - పంటకు తేటసవరించు

పాచిన కూరలు బాపనికన్నట్లుసవరించు

పాచిపండ్లవాడు కూడబెడితే, బంగారు పండ్లవాడు అనుభవించాడటసవరించు

పాటకు పది ఫణుతులుసవరించు

పాటిమీద గంగానమ్మకు కూటిమీదే ధ్యాససవరించు

పాటు చేతకానివాడు మాటల మోసగాడుసవరించు

పాటుకలిగితే కూటికి కొదువా?సవరించు

పాటు పడితేనే భాగ్యంసవరించు

పాటులెల్ల పొట్టకూటికేసవరించు

ఏపని చేసినా పొట్ట కూటికే అనే అర్థం ఈ సామెకు వున్నది

పావలా కోడికి ముప్పావలా దిష్టిసవరించు

అసలు కన్నా కొసరు ఎక్కువని దీనర్థం.

పావల కోడికి ముప్పావలా మసాలసవరించు

అసలు కన్నా కొసరు ఎక్కువ అని ఈ సామెతకు అర్థం.

పాడికి పంట తమ్ముడుసవరించు

పాడికుండలు పగులకొట్టినట్లుసవరించు

పాడి గుట్టు - పంట రట్టుసవరించు

పాడిని దాచాలి - పంటను పొగడాలిసవరించు

పాడి పసరము, పసిబిడ్డ ఒకటేసవరించు

రైతు ఇంట్లో వున్న పిల్లలను\పశువులను సమానంగా చూస్తాడని/ఆదరిస్తాడని అర్థము

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ!సవరించు

చెప్పిన విషయాన్నే పదే పదే అదే పనిగా చెబుతూ ఉంటే వినే వారికి విసుగొస్తుంది. ఈ సందర్భాన్ని ఈ సామెతతో చెబుతాం.

పాడువూరికి నక్క తలారిసవరించు

పాడే నోటికి పాట పండుగసవరించు

పాత చింతకాయ పచ్చడిసవరించు

పాత చుట్టం - పాత చింతకాయపచ్చడిసవరించు

పాతది పనికి రాదు - కొత్తది కొరగాదుసవరించు

పాత రోత - కొత్త రుచిసవరించు

పాత్ర యెరిగి దానం యివ్వాలి - వంశ మెరిగి బిడ్డను తెచ్చుకోవాలిసవరించు

పానకంలో పుడకలాగాసవరించు

పానుపు అలవాలిగానీ తనువులు గాదన్నట్లుసవరించు

పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందటసవరించు

దానమిచ్చిన వస్తువుయొక్క మంచి చెడులు బేరీజు వేయడం.

పాపమని పాలు పోస్తే, ఒద్దని ఒలకపోశాడటసవరించు

పాపమని భోజనం పెడితే పక్కలోకి రమ్మన్నాడటసవరించు

పాపాల భైరవుడుసవరించు

పాపి చిరాయువుసవరించు

పాపిట వంకరయితే బ్రతుకంత వంకరేసవరించు

పాపి సముద్రానికి పోతే అరికాలు తేమ కాలేదుటసవరించు

పాపిసొమ్ము పరులపాలు - ద్రోహిసొమ్ము దొంగలపాలుసవరించు

పాముకాళ్ళు పాముకే ఎరుకసవరించు

పాముకు పళ్ళలో విషం - జ్ఞాతికి కండ్లలో విషంసవరించు

పాముకు పాలు పోసి పెంచి నట్టుసవరించు

దుర్మార్గులను చేరదీస్తే ఏనాటికైనా ప్రమాదమనిసూసించే సామెత ఇది.

పాము చావరాదు - బడిత విరగరాదుసవరించు

పాము చుట్టము - పడగ పగసవరించు

పాము పడగ నీడను కప్ప చందానసవరించు

అత్యంత ప్రమాద పరిస్థితిలో వున్నాడని ఈ సామెతకు అర్థము.

ప్రాణముంటే శివం - ప్రాణం పోతే శవంసవరించు

ప్రాణం పోయినా మానం పోరాదుసవరించు

ప్రాణం కన్నా పరువు గొప్పదని ఈ సామెతకు అర్థము

ప్రాణం వున్నప్పుడే పంతాలు నెరవేరుతాయిసవరించు

ప్రాస కోసమేడ్చానే కూసుముండా అన్నట్లుసవరించు

పారే ఏటికి నీరు పండుగసవరించు

పాలకొండ లోయల్లో బంతులాట అన్నట్లుసవరించు

పాలకోసం పొదుగు కోసినట్లుసవరించు

పాల పొంగు - పడుచు పొంగుసవరించు

పాలు, నీళ్ళలా కలిసిపోయారుసవరించు

చాల కలగోలుపుగా వున్నారని అర్థం.

పాలు తాగి రొమ్ము గుద్దినట్టుసవరించు

తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు.... అనే సామెత లాంటిదే ఇది కూడ

పాలు పొంగటం పొయ్యిపాలుకేసవరించు

పాండవుల సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరిసవరించు

పిట్ట కొంచెం కూత గనంసవరించు

చిన్నవయసులో పెద్ద ఘనత సాధించిన వారిగురించి ఈ సామెత వాడతారు

పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్లుసవరించు

పిండి కొద్దీ రొట్టెసవరించు

ఎన్ని రొట్టెలు కావాలో వాటికి సరిపడా పిండిని కలుపు కోవాలి. తక్కువ పిండి కలిపి ఎక్కువ రొట్టెలు కావాలంటే అది అసాద్యం. అలాగే కొంచెం పిండి కలిపి పెద్ద రొట్టె చేయాలంటే కూడా కుదరదు.

పిండికొద్దీ రొట్టె - తిండికొద్దీ పసరంసవరించు

పిండి ఎంత ఎక్కువ వుంటే అన్ని రొట్టెలు చేసుకో వచ్చు...... అలాగే ఆవుకు ఎంత తిండి పెడితే అన్ని పాలిస్తుందని ఈ సామెతకు అర్థము.

పిండి బొమ్మ చేసి ఆడబిడ్డంటే, ఆడబిడ్డ తనాన అదిరదిరి పడిందిటసవరించు

పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుందిసవరించు

పిండార బోసినట్లు వెన్నెలసవరించు

పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టుసవరించు

సొమ్మంతా ఒకరి చేతికిచ్చి ఖర్చులకు వారిని అడగాల్సిన దుస్థితి, తెలివితక్కువ వ్యవహారం.బుద్ధిలేనితనం.

పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంసవరించు

చిన్న విషయానికి, పెద్ద విషయానికి ఒకే పనితనము పనికిరాదని చెప్పేదే ఈ సామెత.

పిడుగుకు గొడుగడ్డమా?సవరించు

పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లుసవరించు

పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదుసవరించు

ఎటు వంటి పరిష్కారం దొరకని సమస్య వచ్చినప్పుడు ఈ సామెత వాడతారు.

పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడటసవరించు

అనగా వానికి ఇంకా పిచ్చి తగ్గ లేదని అర్థం.

పిచ్చి వాని చేతిలో రాయిసవరించు

పిచ్చి వాడు తన చేతిలోని రాయిని ఎవరి మీదకు విసురుతాడో తెలియదు.

పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలుసవరించు

పిచ్చుక మీద బ్రంహాస్త్రం వేసి నట్టుసవరించు

గోటితో పొయ్యేదానికి గొడ్డలి ఎందుకు? అనే సామెత లాంటిదే ఇదీను./ కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు

పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలిసవరించు

పిచ్చోడి చేతిలో రాయిసవరించు

పిచ్చోడు రాయితో ఎవరిని గురి పెట్టి కొట్టడు. ఎవరిని కొట్టాలో అతనికే తెలియదు. అతడు విసిరిన రాయి ఎవరికైనా తగలవచ్చు. అందరు జాగ్రత్తగా వుందాలని దీని అర్థం..

పిచ్చోడికి పింగే లోకంసవరించు

ప్రియం మహాలక్ష్మి - చౌక శనేశ్వరంసవరించు

పిలవని పేరంటానికి వెళ్ళినట్లుసవరించు

పిల్ల ఓపిక శోభనంలో తెలుస్తుందన్నట్లుసవరించు

పిల్ల గలవాడు పిల్లకేడిస్తే - కాటివాడు కాసుకేడ్చినట్లుసవరించు

పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదుసవరించు

పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదుసవరించు

పిల్ల పిడికెడు - గూనె గంపెడుసవరించు

పిలిచి పిల్లనిస్తానంటే వంక పెట్టినట్లుసవరించు

పిలిచేవారుంటే బిగిసేవారికి కొదువలేదుసవరించు

పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బసవరించు

పిల్లనిచ్చినవాడు ఈగ - పుచ్చుకున్నవాడు పులిసవరించు

పిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా వెతికి నట్టుసవరించు

అతిగా మతిమరుపు గలవారిగురించి ఈ సామెత చెప్పతారు

పిల్లా అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందటసవరించు

పిల్లి ఎదురైతె తల్లి గూడా శత్రువవుతుందిసవరించు

ప్రయాణమై వెళుతుంటే పిల్లి ఎదురు రాకూడదని ప్రజల్లో ఉన్న మూడ నమ్మకానికి ఈ సామెత పుట్టింది

పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట. Sసవరించు

పిల్లికి ఎలుక సాక్షిసవరించు

పిల్లికి కూడా భిక్షం పెట్టనట్లుసవరించు

మహా పిసినారి గురించి ఈ సామెత పుట్టింది

పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటంసవరించు

పిల్లికి రొయ్యల మొలత్రాడు కట్టినట్లుసవరించు

పిల్లి గుడ్డిదయితే ఎలుక వెక్కిరించిందటసవరించు

ఒకప్పుడు బాగా బతికిన కాలంలో ఎవరికైనా కీడు చేసి వుంటే... అతడు బలహీనుడవగానే అతని శత్రువులు అతని పనిపడతారు. అది ఈ సామెత అర్థము

పిల్లి గ్రుడ్డిదయితే ఎలుక ముడ్డి చూపిస్తుందిసవరించు

పిల్లి పిల్లలను త్రిప్పినట్లుసవరించు

పిల్లి తాను పెట్టిన పిల్లలను కుదురుగా ఒక చోట వుండనియ్యదు. పిల్లల బద్రత కొరకు తన పిల్లలను మూడు రోజులకొకసారి స్థానాన్ని మారుస్తుంది. ఆవిధంగా తమ స్థానాన్ని మార్చు వారినుద్దేశించి ఈ సామెతను ఉటంకిస్తారు

పిల్లిమెడలో గంట కట్టేదెవరు?సవరించు

వివరణ: ఎలుకలని చంపుతున్న పిల్లి బాధ పడలేక ఎలుకలన్నీ ఒక సమావేశము ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికొచ్చాయి. అదేమంటే.... ఎవరైనా పిల్లి మెడలో గంట కడితే అది మనమీద దాడి చేసేందుకువచ్చేటప్పుడు గంట శబ్దం విని మనం దాక్కో వచ్చు అని వాటి అభిప్రాయము. కాని అలా పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఇది అసాద్యం. అసాద్యమైన పని గురించి చెప్పే సామెత ఇది.

పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్లుసవరించు

పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదుసవరించు

పిల్లిని చంపకూడదని ప్రజల్లో వున్న నమ్మకాన్ని బట్టి ఈ సామెత పుట్టింది

పిల్లిని సంకలో పెట్టుకొని రామేశ్వరం పోయినట్లుందిసవరించు

పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?సవరించు

వివరణ: ఉట్టి మీదున్న పాల కుండను చూసి పిల్లి ఈ ఉట్టి తెగిపోవు గాక" అని శాపంపెట్టి అది తెగి పాల కుండ పగిలి పోతే పాలు తాగ వచ్చునని దాని ఆశ. అలా స్వార్థానికి పెట్టే శాపాలు,. తిట్లు పని చేయవని ఈ మాటకు అర్థం

పిలిచి పిల్లనిస్తానంటే కులమేమి గోత్రమేమని అడిగాడటసవరించు

పెళ్ళి చేసుకోవడానికి పిల్ల దొరకడమే గగనంగా వున్న రోజుల్లో ... ఒకడు పిలిచి పిల్లనిస్తానంటే..... వారి కులగోత్రాలు ప్రశ్నించాడట ఒకడు.

ప్రీతితో పెట్టింది పట్టెడయినా చాలుసవరించు

భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు అనే నానుడి లాంటిదే ఈ సామెత కూడాను

పుండుకు పుల్ల మొగుడుసవరించు

పుండున్నచోటే పుల్ల తగుల్తుందిసవరించు

పుండు మానినా మచ్చమానదుసవరించు

పుండు మీద కారం చల్లి నట్లుసవరించు

కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతుంటే ఈ సామెతను వాడతారు

పుక్కిట పురాణంసవరించు

పుట్టని బిడ్డకు పూసల దండ అల్లినట్టుసవరించు

ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయినట్టు తెగ హడావుడి .బిడ్డ పుట్టడని తెలిసినా బిడ్డ కోసం పూసలదండ అల్లుతూ కూర్చోవటమంటే లేనిపోని హడావుడి చేయటమే

పుట్టంగ పురుడు - పెరగంగ పెళ్ళిసవరించు

పుట్టనివాడు, గిట్టినవాడు పుణ్యాత్ములుసవరించు

ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే అని ఈ సామెతకు అర్థము

పుట్టమన్ను వేస్తే పుట్లకొద్దీ పంటసవరించు

పుట్టమీద తేలుకుడితే నాగుపాము కరచినట్లేసవరించు

పుట్టి చచ్చినా కొడుకే మేలుసవరించు

పుట్టినవాడు గిట్టక మానడుసవరించు

పుట్టి మునిగినట్లుసవరించు

పుట్టెడు నువ్వుల్లోపడి దొర్లినా అంటేగింజే అంటుతుందిగానీ అంటనిది అంటదుసవరించు

పుచ్చుకున్నప్పుడు కొడుకుపుట్టినంత సంతోషం, యిచ్చేటప్పుడు మనిషిపోయినంత బాధసవరించు

పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదుసవరించు

ఎవరికైనా చిన్ననాటి నుండి వచ్చిన అలవాట్లు అంత సులభంగా పోవని ఈసామెత అర్థం.

పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులుసవరించు

తండ్రి కొడుకులు ఆస్తి పంపకాలు కోడళ్ళు ప్రేమ వివాహాలు మొదలైన విషయాల్లో మనస్ఫర్ధలకు లోనవుతారు. ఆ మనస్ఫర్ధలే ఇద్దరినీ శత్రువులుగా మార్చేస్తాయి. చిన్నప్పుడు ముద్దు మురిపాలు పంచుకున్న ఆ ఇద్దరే ఒకరి ఊసంటే ఒకిరికి పడక బద్ధ శత్రువుల్లాగా మారిపోతుంటారనే వైరాగ్య భావనతో ఈ సామెత

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలుసవరించు

పుణ్య కార్యాలు చేసె వారికి జీవితం సుఖమయమౌతుందని చెప్పే సామెత ఇది.

పుణ్యంకొద్దీ పురుషుడు - విత్తంకొద్దీ వైభవంసవరించు

పుణ్యం పుట్టెడు - పురుగులు తట్టెడుసవరించు

పుణ్యానికి పిలిచి కొలిస్తే పిచ్చికుంచమని పారపోశాడటసవరించు

పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్లుసవరించు

పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మినట్లుసవరించు

పువ్వులా విచ్చుకుంటా తుమ్మెదలా దోచుకో అందటసవరించు

పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా చెట్టు క్రింద గడ్డనానదుసవరించు

పుబ్బ కార్తెలో వర్షాలు కురవవు అనడానికి ఈ సామెత వాడుతారు.

పుబ్బ రేగినా బూతురేగినా నిలువవుసవరించు

పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒక్కటేసవరించు

ఇది వ్యవసాయ సంబంధిత సామెత. పుబ్బ కార్తెలో విత్తనాలు చల్లితే పంట రాదని దీనర్థము

పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలుసవరించు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లుసవరించు

పురిటిలోనే సంధి కొట్టినట్టుసవరించు

పురుషుల భాగ్యం - పడతుల సౌఖ్యంసవరించు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా!సవరించు

ఇది ఒక వేమన పద్య భాగము.

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచిసవరించు

మనుషులు అందరు ఒక్కటి కాదు. ఎవరి బుద్దులు వారివి అనే అర్థం లో ఈసామెత వాడుతారు.

పుర్రెకొక తెగులుసవరించు

పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లుసవరించు

పుంగనూరు జవాను లాగా అనే సామెత లాంటిదే ఇదీను. వివరణ: ఒక రైతు తన పాలేరుని రేపు ఏదో పనిమీద వేమారం గ్రామానికి పంపదామని తన బార్య తో అంటుండగా ఆ మాట పుల్లయ్య విన్నాడు. అతి నమ్మకస్తుడైన పుల్లయ్య ఎలాగు వేమారం వెళ్ళమంటాడని పెందలకడనే బయలు దేరి వేమారం వెళ్ళి వచ్చాడు పుల్లయ్య. తెల్లవారి పుల్లయ్యను వేమారం పంపుదామని చూస్తుంటే పుల్లయ్య కనిపించలేదు. కొంత సేపటికి రానే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే..... తమరు నన్ను వేమారం పంపుదామని అనుకుంటే విన్నాను.... అందుకని వేమారం వెళ్ళి వచ్చేశాను అన్నాడు. అమాయకుడని అర్థము

పులి కడుపున పిల్లులు పుడతాయా?సవరించు

పులిమీద పుట్రలాగాసవరించు

పులిమీద స్వారిసవరించు

వివరణ. పులిమీద స్వారి చాల ప్రమాదకరము.పులి మీద ఎక్కినవాడు అలా స్వారి చేస్తూనే వుండాలి. దిగాడంటే పులి వాడిని తినేస్తుంది.మిక్కిలి ప్రమాదకరమైన పని చేస్తున్న వారినుద్దేశించి చెప్పేసామెత ఇది.

పులి మీసాలతో ఉయ్యాల ఊగినట్లుసవరించు

ప్రమాదకరమైన పనిచేస్తున్నాడని అర్థము

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుసవరించు

పులిచారలను పోలిన విధంగా వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాజాలదు. గొప్పవారిని అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవారు కాలేరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లుసవరించు

'పుల్లాయావారం చేసావ్.' ఇది మాట వాడుక. సరిగా జరగని లేదా ప్రయోజనము లేక జరిగిన పనిని గురించి వాడబడు పదం. ఆచంట షావుకారు తన పనివాడు పుల్లయ్యకు చెప్పాడు ఇలా "ఒరే పుల్లయ్యా రేప్పొద్దున్నే ఓసారి వేమారం వెళ్ళిరావాల్రా పెందలకడనే లేచి". అప్పుడు పుల్లయ్య "సరేనండయ్యా" అని పుల్లయ్య ఇంటికెళ్ళి పడుకొని మరునాటి ఉదయమే లేచి వేమవరం వెళ్ళి వచ్చేసాడు.తాపీగా మధ్యాహ్నానానికి వచ్చిన పుల్లయ్యను చూసి "ఏరా పుల్లయ్యా ఎక్కడికి పోయావ్ పొద్దున్నే వేమవరం వెళ్ళాలన్నానుగా " అన్నాడు షావుకారు. అప్పుడు పుల్లయ్య "అయ్య నేను పొద్దున్నే లేచి ఎల్లొచ్చేసేనయ్యా ఏమారం" అన్నాడు మన పిచ్చి పుల్లయ్య . "నేను పనేంటో చెప్పకుండా ఎలా వెళ్ళావు. ఎందుకెళ్ళావు ?ఎందుకొచ్చావు? నీకు చెప్పడం నా తప్పు " అని వాపోయాడు షావుకారు.

పై కథనం మీదుగా ఈ సామెత పుట్టిందని ఒక వాదన.

పుష్యమాసంలో పూసలు గ్రుచ్చ పొద్దుండదుసవరించు

పుష్యమాసానికి పూసంత వేసంగిసవరించు

పుష్యమి కురిస్తే పిట్టకూడా తడవదుసవరించు

పూచిన పువ్వంతా కాయలైతే చెట్టు మనునా?సవరించు

పూచింది పుడమంత - కాచింది గంపంతసవరించు

పూజకన్నా బుద్ధి - మాటకన్నా మనసు ప్రధానంసవరించు

పూటకూళ్ళమ్మకు పుణ్యంతో పని లేదుసవరించు

పూటకూళ్ళింటి తిండిలాగాసవరించు

పూట గడుస్తుందిగానీ మాట నిలచిపోతుందిసవరించు

పూనినకర్మ పొరుగూరు పోయినా తప్పదుసవరించు

పూరిగుడిసెకు పందిరి మంచమా అన్నట్టుసవరించు

స్థాయిమరచి వ్యవహరించటం, స్తోమతకు మించి ఆలోచించటం కూడదని ఈ సామెతకు అర్థం.

పూర్ణం లేని బూరె - వీరణంలేని పెళ్ళిసవరించు

పూవు పుట్టగానే పరిమళిస్తుందిసవరించు

పూవు పుట్టగానే తెలుస్తుంది కళసవరించు

పూబోడీ అంటే, ఎవర్రా బోడి? నీ అమ్మబోడి, నీ అక్కబోడి అందటసవరించు

పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటంసవరించు

మనసులో కల్మషం పెట్టుకొని పైకి బాగా మాట్లాడే వారిని గురించి ఈ సామెత చెప్తారు.

పెద్దలమాట చద్దిమూటసవరించు

పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠముసవరించు

పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదుసవరించు

భోజనాల బంతిలో మొదట కూర్చోవాలనేది ఒక సూక్తి. ఎందుకంటే..... చివర్లో కూర్చుంటే వడ్డించే ఆహార పదార్థాలు తనదాక వస్తాయే లేక మధ్యలోనే అయిపోతాయేమోనని సందేహం. కాని వడ్డించే వాడు మనవాడైతె.. పదార్థాలు సరిపడక పోయినా.... మిగిల్చుకొని తనదాక వస్తాడస్ని ఈ సామెత అర్థం.

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుసవరించు

పొయ్యిమీద ఉన్న పెనం కన్నా పొయ్యిలోని మంట ఇంకా చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా వస్తువు పెనం మీదినుండి పొయ్యిలో పడితే ఇంకా ఎక్కువ కాలుతుంది. ఈ విధంగా ఎవరైనా ఉన్న బాధల కంటే ఎక్కువ బాధలలోకి దిగజారితే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

పెరుగుట విరుగుట కొరకేసవరించు

ఏదైనా మితంగా వుండాలి. అతిగా పోతే నష్టపడక తప్పదని చెప్పెదే ఈ సామెత.

పెళ్ళి అయిన యింటిలో ఆరునెలలు కరువుసవరించు

పెళ్ళి చేసి చూడు..... ఇల్లు కట్టి చూడు అనే నానుడి లాంటిదే ఈ సామెత. పెళ్ళికి, ఇంటికి చాల ధనము ఖర్చు అవుతుంది... ఆ దెబ్బ నుండి కోలుకోవాలంటే చాల కాలం పడుతుందని ఈ సామెతకు అర్థం.

పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లుసవరించు

పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళికూతుర్లేనా?సవరించు

పెళ్ళికి వచ్చినవారే చేస్తారు పెళ్ళి పనులు, పెళ్ళామా! నీ ఒళ్ళు అలిపించుకోకు అన్నాడటసవరించు

పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టుసవరించు

బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శుభశకునం కాదన్నది ఒక మూఢనమ్మకం. పిల్లి ఎదురైనప్పుడు బయలుదేరవలసిన వాళ్లు ఆగిపోవటం జరుగుతుంటుంది. అలాంటిది పిల్లిని చంకనపెట్టుకుని పెళ్ళికి వెళితే పిల్లితోపాటు ఆ పిల్లిని ఎత్తుకుని వస్తున్న వ్యక్తిని కూడా తిడతారు.అసలు సంగతి పిల్లిలాగా అపశకునకారిలాగా ఉండే వ్యక్తిని పక్కనపెట్టుకుని బయలుదేరితే ఆ వ్యక్తితోపాటు తీసుకెళ్ళిన మంచి వ్యక్తి కూడా మాటపడవలసి వస్తుంది. కనుక ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, కలిసి తిరిగేటప్పుడు సమాజం వాళ్లు చేసే పనులను హర్షిస్తుందా? నిరసిస్తుందా? అనే విషయాలను గమనించుకుని స్నేహం చేయాలి. ఒకవేళ సమాజం వ్యతిరేకించే వ్యక్తులు గనుక అయితే వారిని వెంటపెట్టుకుని నడవటం మంచిదికాదన్నది ఈ సామెత చెప్పే సత్యం. ==పెళ్ళికొడుకు కుడికాలు చూచి అత్త ఏడుస్తుంటే, ఏడ్పులో ఏడ్పు ఎడమకాలూ చూడమన్నాడట తోడపెండ్లికొడుకు ==

పెళ్ళికొడుకు మావాడేగానీ, చెవి పోగులు మాత్రం మావిగావు అన్నట్లుసవరించు

పెళ్ళినాటి పప్పుకూడు రోజూ దొరుకుతుందా?సవరించు

పెళ్ళినాడే పరగడుపన్నట్లుసవరించు

పెళ్ళిని చూస్తూ ఒకడుంటే, పెళ్ళాన్ని చూస్తూ ఒకడున్నాడటసవరించు

పెళ్ళిలో పుస్తె కట్టడం మరచిపోయినట్లుసవరించు

పెళ్ళీ - పెటాకులుసవరించు

పెళ్ళాం పోతే పురుషుడు మళ్ళీ పెండ్లికొడుకుసవరించు

పెదవి దాటితె పృధివి దాటు తుందిసవరించు

ఏదైన రహస్యాన్ని మనసులోనే దాచుకోవాలి. దాన్ని ఎవరికైన చెప్పామొ తప్పక అది బహిర్గతం అవుతుందని అర్థం.

పెళ్ళికి బొట్టుపెట్టి పిలిస్తే వెళ్ళక, పెంకుపట్టుకుని వెనుకదారిన పులుసు కోసం వెళ్ళిందటసవరించు

పెళ్లికి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టుసవరించు

ప్రతి పని చాల ఆలస్యంగా చేసే వారిని గురించి ఈ సామెతను వాడతారు.

పెంటకొద్దీ పంటసవరించు

పెట్టకపోయినా పెట్టే యిల్లు చూపమన్నారుసవరించు

పెట్టనమ్మ పెట్టనే పెట్టదు పెట్టే ముండ కేమొచ్చింది రోగం అన్నాడటసవరించు

పెట్టగతులు లేకున్న పుట్టగతులు వుండవుసవరించు

పెట్టి దెప్పితివో - పెద్దల తిడితివోసవరించు

పెట్టినదే తనది - కూడ బెట్టినది యితరులదిసవరించు

పెట్టినమ్మ పుణ్యాన - పెట్టనమ్మ పాపానసవరించు

పెట్టినమ్మకు పెట్టినంతసవరించు

నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ

పెట్టినమ్మకు పెట్టినంతసవరించు

ఈయనిది రాదు. "పెట్టి పుట్టలేదు", నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ

పెట్టి పొయ్యనమ్మ కొట్టవచ్చిందిటసవరించు

పెట్టు చుట్టం - తిట్టు పగసవరించు

పెట్టుబడిలేని సేద్యం - చద్దిలేని పయనంసవరించు

పెడతానంటే ఆశ - కొడతానంటే భయంసవరించు

పెడితే తింటారుగానీ తిడితే పడతారా?సవరించు

పెడితే పెళ్ళి పెట్టకపోతే పెటాకులుసవరించు

పెత్తనానికి పోతే దుత్త చేతికొస్తుందిసవరించు

పెదవి దాటితే పృథ్వి దాటుతుందిసవరించు

పెదవీ పెదవి కలిస్తే మధువులు - ఒంపూ సొంపూ దక్కితే శోభనంసవరించు

పెదవుల పరిచయం ఎదలకు పరిణయం అన్నట్లుసవరించు

పెదవుల మధువులు, కౌగిలి విందులు మల్లెల జాతరలో అందటసవరించు

పెదవుల రుచి పెదవులకే తెలుసన్నట్లుసవరించు

పెద్ద యింటి గోత్రాలు దేవుడి కెరుకసవరించు

పెద్ద యింటి రంకు, పెద్ద చెరువు కంపు తెలియవుసవరించు

పెద్ద యింటి భాగోతంసవరించు

పెద్దలమాట చద్దిమూటసవరించు

పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠముసవరించు

పెదాలమ్మ వేటలో అలుపుండదన్నట్లుసవరించు

పెనము మీదనుంచీ పొయ్యిలో పడ్డట్లుసవరించు

పెరటిచెట్టు మందుకు పనికిరాదుసవరించు

పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతి అయినట్లుసవరించు

పెరుగుట విరుగుట కొరకేసవరించు

ఇదొక సుమతీ శతక పద్య భావము.,,,,,పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తద్యము సుమతీ .

పెళ్ళంటే నూరేళ్ళ పంటసవరించు

పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడేసవరించు

డబ్బుతో ముడిపడిన ఏ వ్యవహారం లోనైనా నిక్కచ్చిగా వుండాలని అర్థం. బందుత్వాలను కూడా చూడొద్దని ఈ మాటకు అర్థం.

పేడ తక్కెడ ఇసుక తక్కెడ వాటంసవరించు

అంతా మోసమేనని దీనర్థం. వివరణ: ఒకడు పేడను మూట కట్టుకొని వెళ్లుతూ ఒక మర్రి చెట్టుక్రిండ విశ్రమిస్తాడు. అక్కడికే మరొకడు ఒక ఇసుక మూటను తెచ్చి పక్కన పెట్టుకొని విశ్రమిస్తాడు. ఎవరికి వారు ... ఎదుటి వాని మూటలో ఏదో గొప్ప వస్తువులున్నాయని.... దాన్ని ఎలాగైనా దొంగిలించాలని పన్నాగం పన్ని నిద్ర నటిస్తున్నారు. ఒక మెల్లగా లేచి ఎదుటి వాని మూటను తీసుకొని పారి పోతాడు. ఇది గమనిస్తున్న రెండో వాడు నిద్ర నటిస్తూ వుంటాడు. వాడటు వెళ్లగానే, అక్కడ మిగిలిన మూటను పట్టుకొని వేగంగా పారిపోతాడు. చాల దూరం వెళ్లి మూటలు విప్పి చూసి ఎవరికి వారు తెల్లమొఖం వేస్తారు. ఇది ఈ సామెత వివారణ.

పేదకు పెన్నిధి దొరికినట్లుసవరించు

పేదవాడి పెళ్ళాం వాడకెల్లా వదినసవరించు

పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయిసవరించు

పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందటసవరించు

పేద వాని కోపం పెదవికి చేటుసవరించు

పేదవానికొచ్చిన కోపం వలన అతనికే నష్టం. కోపంతో తన పెదవి కొరుక్కొని గాయం చేసుకుంటాడు తప్ప ఫలితముండదని అర్థం.

పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయిసవరించు

పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటసవరించు

అర్హత లేని వారికి అధికారము ఇవ్వరాదని దీని అర్థం. అలాఇస్తే వ్వహరామంతా.... నష్టమొస్తుందని అర్థం.

పేరు ఒకరిది - నోరు ఒకరిదిసవరించు

పేరు ఒకరిది - పెత్తనమొకరిదిసవరించు

పేరు ఒకరిది - సౌఖ్యమొకరిదిసవరించు

పేరుకే పెద్దరికం - బానిస బ్రతుకుసవరించు

పేరు గొప్ప - ఊరు దిబ్బసవరించు

పేరు పల్లకీ మీద - కాలు నేల మీదసవరించు

పేరు పెండ్లివారిది - తిండి యింటివారిదిసవరించు

పేరులేని వ్యాధికి పెన్నేరు మందన్నట్లుసవరించు

పేరు పల్లకీ మీద - కాలు నేల మీదసవరించు

పేరు పెండ్లివారిది - తిండి యింటివారిదిసవరించు

ప్రేమలేని మాట పెదవి పైనేసవరించు

ప్రేమలో పడ్డవారు ఎంతకైనా తెగిస్తారుసవరించు

పైన పటారం, లోన లొటారంసవరించు

తాము ఏమీ చేయలేమని తెలిసి కూడా కొంతమంది అధికులమని గొప్పలు ఛెప్పుకుంటారు. తీరా అవసరం వచ్చేసరికి మెల్లగా జారుకుంటారు. అలాంటి వారిని ఉద్ధేసించి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. మెరిసే దంతా బంగారం కాదు అనే సామెత లాంటిదే ఈ సామెత

పైనబడ్డా నేనే గెలిచానన్నట్లుసవరించు

పైన (అదనంగా) మనిషుంటే పగలే తల నెప్పి వస్తుందిసవరించు

వ్వవ సాయం పనులలో అందరికి పని వుంటుంది. పైగా ఒకడు వుంటే అబ్బ నాకు తలనెప్పిగా వున్నదీ అని వెళ్లి చెట్టుకింద పడుకుంటాడు. పైగా మనిషున్నాడు గదా... పని ఎలాగు జరుగుతుందని అతని భావన. పైగా మనిషి లేకుంటే అతను తల నెప్పి సాకు చెప్పి తప్పించు కోడు. ఆ సందర్భంగా పుట్టింది ఈ సామెత.

పైపనీ, క్రింద పనీ నేను చూచుకుంటా సహకరించు అన్నాడటసవరించు

పైపై పనేనా అసలు పనేమైనా వుందా అని అందిటసవరించు

పైరుగాలి తగిలితే పంటకు ఏపుసవరించు

పైరుకు ముదురు - పసరానికి లేతసవరించు

పైసాకూ, ప్రాణానికి లంకెసవరించు

పైసాలో పరమాత్ముడుసవరించు

పొగచుట్టకు, పడతి యోనికి ఎంగిలి లేదుసవరించు

పొగాకు కొనుక్కోవాలి అందలం బయటపెట్టరా అన్నాడటసవరించు

పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా భూమాతే యివ్వాలిసవరించు

పొట్టకోస్తే అక్షరం ముక్క లేదన్నట్లుసవరించు

నిరక్షరాస్యులను గురించి ఈ సామెతను వాడుతారి/

పొట్లచెట్టుకు పొరుగు గిట్టదుసవరించు

పొట్టోడికి పుట్టెడు బుద్దులుసవరించు

పొట్టిగా వున్న వారిని సమాజం చిన్న చూపు చూస్తుంది. వారికి ఓదార్పుగా ఈ సామెత వాడతారు.

పొట్టోడు గుట్టెక్కలేదుసవరించు

ఇది ప్రాస కొరకు వాడిన మాటేగాని అర్థంలేదు

పొత్తుల మగడు పుచ్చిచస్తాడుసవరించు

పొదుగు కోసి పాలు త్రాగినట్లుసవరించు

పొదుగులేని ఆవు పాలిస్తే నాలుకలేని పిల్లి నాకి పోయిందటసవరించు

పొద్దు గడిచిపోతుంది మాట నిలిచిపోతుందిసవరించు

పొద్దున్నే వచ్చిన వాన - ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం పోరుసవరించు

పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టుసవరించు

పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలి. వారి గురించి ఈ సామెత పుట్టింది.

పొద్దు తిరుగుడు - డొంక తిరుగుడుసవరించు

పొయ్యి ఊదిందంటే బంధువుల రాకసవరించు

పొయ్యిలో పిల్లి లేవలేదుసవరించు

వంట చేయలేదని ఈ సామెతకు అర్థం. అనగా కడు బీద వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది

పొమ్మనలేక పొగపెట్టినట్లుసవరించు

ఇష్టం లేకుండా పనిచేస్తుంటే వారిని గురించి ఈ మాట పుట్టింది. ఇష్టం లేని చుట్టాలు ఇంటికొస్తే వారిని పొమ్మలేరు. అందుచేత పొగబెడితే.... అనగా వంట చేస్తున్నట్టు నటిస్తూ పొగ ఎక్కువ పెట్టితే ఆ పొగకు వారు భరించలేక వారే వెళ్ళి పోతారని అర్థం.

పొయ్యి దగ్గర పోలీసుసవరించు

అగ్గిపుల్ల అగ్గిపెట్టెకు రాచగానే ఒక్కసారి భగ్గుమంటుంది.పోలీసుల్లో చాలామంది భేషజంతో అలా పలకరించి, పలకరించకముందే మండిపడుతూ ఉండేవారు.అగ్గిపుల్ల అగ్రభాగాన నల్లటి గుండులాగా ఉండే మందు పోలీసు నెత్తిన పెట్టుకునే టోపీ.అగ్గిపుల్లను అలా గీసే గీయకముందే భగ్గున మండటం వల్ల పొయ్యి వెలిగించటానికి సిద్ధంగా పెట్టుకొనే అగ్గిపుల్లను పొయ్యి దగ్గర పోలీసు అన్నారు.

పొయ్యి ప్రక్కన వెన్న ముద్ద పెట్టినట్లుసవరించు

పొయ్యి ప్రక్కన వెన్నముద్ద పెడితే అది కరిగి పోతుంది. అలాంటి తెలివి తక్కువ దద్దమ్మల గురించి చెప్పినదే ఈ సామెత.

పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదు అన్నాడటసవరించు

పొరుగమ్మ సరిపెట్టుకుంటే - ఇరుగమ్మ ఉరిపెట్టుకుందిసవరించు

పొరుగింట చూడరా నా పెద్ద చెయ్యిసవరించు

పొరుగింటి పుల్లకూర రుచిసవరించు

చాలామందికి ఇంట్లో వండే వంటలకంటే పొరుగింటి వంటలు రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే ఎవరికైనా తమ స్వంతవారు చేసిన వస్తువులూ, విషయాలకంటే పొరుగువారివి మిన్నగా తోచినపుడు వారిని నిందిస్తూ ఈ సామెతను వాడుతారు.

పొరుగింటి కలహం వినవేడుకసవరించు

పొరుగింటి జగడం చూడవేడుకసవరించు

పొరుగింటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లుసవరించు

పరమ అసూయ పరుల గురించి ఈ సామెత వాడుతారు.

పొరుగూరి వ్యవసాయం - ఇద్దరు భార్యల సంసారం ఒక్కటేసవరించు

పొంకణాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు - మూడు ఎడ్లుసవరించు

పొంగినదంతా పొయ్యిపాలేసవరించు

పొంగే పాలను వూదరాదు - వెలిగే దీపాన్ని ఆర్పరాదుసవరించు

పొంగే యౌవ్వనం కౌగిళ్ళపాలు అన్నట్లుసవరించు

పోకముడి విప్పుతూ కోక వెల అడిగినట్లుసవరించు

పోతే రాయి వస్తే పండుసవరించు

పోతే వెంట్రుక వస్తే కొండ సామెత లాంటిదే ఇదీను.వివరణ.ఒకడు కొండకు వెంటుక వేసి లాగుతున్నాడట. అదేంటని మరొకడడగగా.... దానికి సమాదానంగా.... పోతే వెంట్రుక వస్తే కొండ వస్తుంది అన్నాడట.

పోనీలెనని పాత చీర ఇస్తే ఇంటెనకాలకెళ్లి మూరేసిందటసవరించు

దానమిచ్చిన వస్తువుకు కూడా వంకలు బెట్టే వారికి చెప్పే సామెత ఇది.

పోనున్నది పోకమానదుసవరించు

పోయిన నీటికి కట్ట కట్టినట్లుసవరించు

గత జల సేతు బందనము అన్న సంస్కృత సామెతకు అనువాదము ఇది.

పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదటసవరించు

పోయే కాలానికి కాని బుద్ధిసవరించు

పోరాని చోట్లకు పోతే రారాని నిందలు వచ్చినట్లుసవరించు

పోరిన పొరుగు - దాచిన కుండలు మనవుసవరించు

పోరుకు సిద్ధమయితే పోటుకు సిద్ధం అన్నాడటసవరించు

పోరు నష్టం -పొందులాభంసవరించు

విరోధము నష్టాన్ని, స్నేహం లాబాన్ని కలిగిస్తుందని దీనర్థం.

పోలీ! పోలీ! నీ భోగమెన్నాళ్ళే అంటే మాఅత్త మాలవాడనుండి వచ్చేదాకా అన్నదటసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_ప&oldid=2989016" నుండి వెలికితీశారు