భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "బ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

భంగు తాగేవారికి హంగుగాళ్ళు పదిమందిసవరించు

బందరు లడ్డూలాగాసవరించు

బందరు బడాయి గుంటూరు లడాయిసవరించు

బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?సవరించు

బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదుసవరించు

బంధువులకు దూరం - బావికి దగ్గరసవరించు

బంధువులంతా ఒక దిక్కు - బావమరిది ఇంకొక దిక్కుసవరించు

బంగారు పళ్లానికైనా గోడ వాలు కావలసిందె.సవరించు

ఎంత గొప్పవారికైనా మరొకరితో అవసరము వుంటుందనిచెప్పే సామెత ఇది.

బక్క ప్రాణం - కుక్క చావుసవరించు

బట్టతలకూ - మోకాళ్ళకూ ముడి వేసినట్లుసవరించు

బట్టతలమ్మకు పాపిట తీయమన్నట్లుసవరించు

బట్టలిప్పి నీళ్ళు పోసుకుంటూ బావగారు వచ్చారని సిగ్గుతో చేతులెత్తి నుంచున్నదటసవరించు

బడాయి బండెడు - బ్రతుకు తట్టెడుసవరించు

బతకలేక బడి పంతులనిసవరించు

ఒకప్పుడు బడి పంతుళ్లకు జీతాలు అంతంత మాత్రమే: అవి కూడా సకాలంలో వచ్చేవి కావు. అయినా బ్రతడానికి చేతనైన పనిచేసి బ్రతకాలి గనుక వారు బడి పంతులు పనిచేసి బ్రతికే వారు. కాని ఇప్పుడు బడి పంతుళ్లకు మంచి జీతాలున్నాయి. కనుక ఈ సామెతెను తిరగ రాయాలి. అవిదంగా వచ్చిందే ఈ నాటి సామెత: అది "" బ్రతక నేర్చిన వాడు బడి పంతులు'

బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందటసవరించు

బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంటసవరించు

బతికి చెడినవారితో వుండొచ్చుకానీ చెడి బతికిన వారితో వుండరాదుసవరించు

బతికి చెడినవాడి బాధలు చూడు - చెడి బతికిన వాడి చేష్టలు చూడుసవరించు

బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలిసవరించు

పుట్టిన ఊళ్ళోనే చచ్చిందాకా కూర్చోక దేశంలోని ప్రధానమైన పట్టణాలను చూడాలని, సన్మార్గ వర్తనంతో జీవించి స్వర్గాన్ని చేరాలని బోధిస్తుంది ఈ సామెత.

బతికితే డయేరియా చస్తే కలరాసవరించు

బతుకంత భయం లేదు - చావంత కష్టం లేదుసవరించు

బతుకులెన్నాళ్ళు - భాగ్యాలెన్నాళ్ళు?సవరించు

బద్ధకస్తుడికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువసవరించు

బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టుసవరించు

గుట్టుగా చేయవలసిన పనిని బహిరంగంగా నలుగురికీ తెలిసేట్టు అమోదయోగ్యం కాని రీతిలో చేయటం

బర్రె పాతిక బందం ముప్పాతికసవరించు

చారనా కోడికి బారనా మసాలా లాంటిదే ఈ సామెత.

బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చుసవరించు

బతికుంటే ఏపనైనా చేసి బతకొచ్చు. చచ్చి సాధించేదేమి లేదనే అర్థంతో ఈ సామెత వాడాతారు.

బ్రతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చుసవరించు

బతికుంటే ఎపని చేసైనా బతకొచ్చు: చచ్చినాక చేసేదేమి వుండదని అర్థం.

బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులుసవరించు

బయటొక మాట - లోపల యింకో మాటసవరించు

బయట తన్ని, యింట్లో కాళ్ళు పట్టుకున్నట్లుసవరించు

బయట పులి - ఇంట్లో పిల్లిసవరించు

బ్రతకని బిడ్డ బారెడుసవరించు

చచ్చిన వాడి కండ్లు చారెడు అనే సామెత లాంటిదే ఇదీను.

బ్రతికితే వైద్యుడు బ్రతుకుతాడు - చస్తే బ్రాహ్మణుడు బ్రతుకుతాడుసవరించు

బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుందిసవరించు

బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడటసవరించు

బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చుసవరించు

బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులుసవరించు

బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావుసవరించు

బ్రహ్మచారీ శతమర్కటఃసవరించు

బ్రహ్మజ్ఞానుల వారు వచ్చారు, పట్టుబట్టలు జాగ్రత్త అన్నట్లుసవరించు

బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొదవా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదవా?సవరించు

బ్రాహ్మణుడి ఆచారం నీటి కొద్దీసవరించు

బ్రాహ్మణుడి నోరు, ఏనుగు తొండం వూరుకోవుసవరించు

బ్రాహ్మణుడికి పప్పాశ - అల్లుడికి అత్తాశసవరించు

బరితెగించిన వాడు బజారుకు పెద్దసవరించు

బర్రె చస్తే పాడి బయటపడుతుందిసవరించు

బర్రె, దూడ వుండగా గుంజకేలరా గురక రోగం?సవరించు

బలం ఉడిగినా పంతం ఉడగదుసవరించు

బలపం పట్టి భామవొళ్ళో ఓనమాలు దిద్దినట్లుసవరించు

బలవంతపు బ్రాహ్మణార్థంసవరించు

బల్ల క్రింద చేతులుసవరించు

బల్లి పడిందని బావ ప్రక్కలో దూరినట్లుసవరించు

బసవదేవునికి బడితె పూజసవరించు

బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లుసవరించు

చేసే ప్రయత్నాలు విఫలం అవ్వటమే కాక అప్పటిదాకా అనుభవిస్తున్న కష్టాలకన్నా మరిన్ని కష్టాలు కూడా వచ్చిపడటం.ఒక ఉద్యోగంలో అధికంగా శ్రమిస్తూ అక్కడ తనకు వచ్చే ఆదాయం సరిపోవటంలేదని వేరొకచోట ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి వెళ్ళినప్పుడు ఆ భావన అంతా ఉత్త భ్రమగా మిగిలి అంతకుముందు ఉద్యోగంలో ఉన్న సుఖము, సంపాదన కూడా కొత్త ఉద్యోగంలో కరవవటం.

బాదరాయణ సంబంధంసవరించు

బాధకొక కాలం - భాగ్యానికొక కాలంసవరించు

బాపన సేద్యం బత్తెం నష్టంసవరించు

బాపన సేద్యం బత్తెం చేటు - కాపుల చదువులు కాసుల చేటుసవరించు

బాపని సేద్యం బతకటానికీ రాదు - చావటానికీ రాదుసవరించు

బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయంసవరించు

పరభాషా పదాలతో సామెత. బార్ ఆంగ్లపదం, దివాలా ఉర్దూ పదం.బ్రాందీ సారా దొరికే బార్‌ ఎప్పుడూ బంగాళాఖాతం లాగా నిండుగానే ఉంటుందనీ ఆ బార్‌లో పడి తాగుతూ ఉంటే ఆ దురలవాటు వల్ల ఆస్తి అంతా నాశనమై దివాలా తియ్యటం జరిగితీరుతుందని హెచ్చరిస్తుంది ఈ సామెత.

బాల జ్యోతిష్యం - వృద్ధ వైద్యంసవరించు

బాల వాక్కు బ్రంహ వాక్కుసవరించు

బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలుసవరించు

బావకు మరదలు పిల్లపై ఆశసవరించు

బావా! అంటే, ప్రక్కలోకి రావా! అన్నాడటసవరించు

బావా! అని చూడబోతే, రావా? అని కొంగు లాగాడుటసవరించు

బావి లోతు తెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదుసవరించు

బాహువుల పందిరిలో అధరాల ఆరాటం అందాల విందుకోసం అన్నట్లుసవరించు

బిగికౌగిలి పొదరింట పరువాల విందులన్నట్లుసవరించు

బిచ్చగాణ్ణి పొమ్మన్నా, ఉండమన్నా అత్తే చెప్పాలిసవరించు

బిచ్చానికి పోయినా బిగువు తగ్గలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదుసవరించు

బిడ్డ చచ్చినా ఉయ్యాల మీద తీపి పోలేదుసవరించు

బిడ్డ చచ్చినా పీతికంపు పోలేదుసవరించు

బిడ్డను దించి లోతు చూచినట్లుసవరించు

బిడ్డలను కన్నమ్మా - భిక్షం వేసినమ్మా చెడరుసవరించు

బిడ్డ వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళసవరించు

బీద కూటికి గానీ గుణానికి గారుసవరించు

బీదైన మాత్రాన బింకం పోతుందా?సవరించు

బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దుసవరించు

బుగ్గ గిల్లి జోల పాడటంసవరించు

ఏడ్చే పిల్లలను వూరుకోబెట్టడానికి జోల పాడతారు. బుగ్గ గిల్లితే ఏడుస్తారు. అలా ఏడిపించి జోల పాడడం వ్వర్థం. ఉపయోగం లేని పని చేయడం

బుట్టలో కాపురం బూడిద పాలైనట్లుసవరించు

బుట్టలో పేలాలు వేయించినట్లుసవరించు

బుడ్డను నమ్ముకొని ఏట్లో దిగినట్లుసవరించు

బుధవారం పుట్టిన ఎద్దు భూమిని దున్నినా, త్రొక్కినా భూమి పొర్లి పొర్లి పండుతుందిసవరించు

బుధవారంనాడు పులికూడా వేటకు రాదుసవరించు

బుద్ధి భూమినేలుతూంటే రాత గాడిదలు కాస్తోందిసవరించు

బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావుసవరించు

బురద గుంటలో పందిలాగాసవరించు

బులుపు తీరితే గానీ బుద్ధిరాదుసవరించు

బూడిదను నాకే కుక్కను పిండికి కాపుంచకూడదుసవరించు

బూడిదలో పోసిన పన్నీరుసవరించు

బూతు లేనిదే నీతి లేదుసవరించు

బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనంసవరించు

బెల్లం ఉన్నంతసేపే ఈగలు - సిరి వున్నంతసేపే బలగంసవరించు

బెల్లమున్నచోటే ఈగలుసవరించు

బెల్లం కొట్టిన గుండ్రాయిలాగాసవరించు

బెల్లం వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డసవరించు

బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావుసవరించు

ముదిరిన బెండకాయను కూరకు పనికిరాదని ఎవరూ కొనరు. అలాగే వయసు ముదిరిన బ్రహ్మచారికి ఎవ్వరూ పిల్లను ఇవ్వరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

బెల్లం చుట్టూ ఈగల్లాసవరించు

సంపదలు కలిగినప్పుడే బంధువులు వస్తారని దీని అర్థం.

బేరం చేస్తూ బ్లౌజు కొలతలడిగినట్లుసవరించు

బొక్కలు పూడ్చి తూపులు తెరిచినట్లుసవరించు

బొగ్గుల్లో మాణిక్యంలాగాసవరించు

బొమ్మకు మ్రొక్కినా నమ్మకముండాలిసవరించు

బొల్లెద్దుకు ముఖమే సాక్షిసవరించు

బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడటసవరించు

బొంకు అంటే అబద్ధం. అబద్ధం చెప్పినా, అతికినట్లుగా, గోడ కట్టినట్లుగా ఉండాలి అని అంటారు. వినేవారిని ఇట్టే నమ్మించేటట్లు ఉండాలి. కానీ ఇలా మిరియాలు తాటికాయలంత ఉంటాయి అని అంటే ఎవరూ నమ్మరు. తప్పు పని చెయ్యడం చేతకానివాడి చేత ఆ పని చేయించబోయినపుడు, వాడా పని సరిగా చెయ్యలేడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు.

బొంకు నేర్చి రంకు నేర్వాలిసవరించు

బోగందాని చళ్ళకూ, సంతలో సొరకాయలుకూ గోటిగాట్లు ఎక్కువసవరించు

బోడి గుండుకి మోకలికి ముడి వేసె రకంసవరించు

బోడినెత్తిన కొబ్బరికాయ కొట్టినట్లుసవరించు

బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లుసవరించు

చేయ లేని పనిని చేసి నట్టుచెప్పినప్పుడు ఈ సామెతను వాడుతారు.

బోడి పెత్తనంసవరించు

బోనులో పడ్డ సింహంలాగాసవరించు

బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లుసవరించు

బోడి గుండంత సుఖం లేదు - ఊరుకున్నంత ఉత్తమం లేదుసవరించు

భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంటసవరించు

బోగందానికి ఒక మగడా?సవరించు

బోసి నోటికి పేలపిండి ప్రీతిసవరించు

భక్తిలేని పూజ పత్రి చేటుసవరించు

మూలాలుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_బ&oldid=3047945" నుండి వెలికితీశారు