భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "మ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

మంగలిని చూసి గాడిద కుంటినట్లుసవరించు

పూర్వ కాలం మంగలి వాళ్లు పల్లె వాసులకు గోళ్లు తీసేవారు: అలాగే కాలిలో ముల్లు గుచ్చుకుని విరిగితే దాన్ని కూడా తీసేవారు. ఆ విధంగా గాడిద మంగలిని చూసి తన కేదో ముల్లు గుచ్చు కున్నట్టు నటించిందట కుంటుతూ:

మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లుసవరించు

పూర్వ కాలం మంగలి వాళ్లు పల్లె వాసులకు గోళ్లు తీసేవారు: అలాగే కాలిలో ముల్లు గుచ్చుకుని విరిగితే దాన్ని కూడా తీసేవారు. ఆ విధంగా ఒక ఎద్దు మంగలిని చూసి తన కేదో ముల్లు గుచ్చు కున్నట్టు నటించిందట కుంటుతూ:

మంగలి పనిలాగాసవరించు

మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదేసవరించు

మంగలంలోని పేలాల్లాగాసవరించు

మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చేసవరించు

మంచం మీద వున్నంతసేపే మగడు - కిందికి దిగితే యముడుసవరించు

మంచం వేసేంతవరకే ఇద్దరం - మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందటసవరించు

మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందటసవరించు

మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లుసవరించు

మంచమెక్కిన మీదట మర్యాదలేల?సవరించు

మంచమెక్కి వావి వరుస లడిగినట్లుసవరించు

మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లుసవరించు

మంచి ఆలి కొక మాట - మంచి ఎద్దు కొక వాతసవరించు

మంచికి పోతే చెడు ఎదురైనట్లుసవరించు

మంచి కొంచమైనా చాలుసవరించు

మంచి గొడ్డుకొక దెబ్బ - మంచి మనిషికొక మాటసవరించు

మంచి చెడ్డలు పడుగు పేకలుసవరించు

మంచి మరణంలో తెలుస్తుందిసవరించు

మంచి మాటకు మంది అంతా మనవాళ్ళుసవరించు

మంచివాడు మంచివాడు అంటే యిల్లంతా నాశనం చేశాడటసవరించు

మంచివాడికి మాటే దెబ్బసవరించు

మంత్రం లేని తీర్థం మరి బక్కెడుసవరించు

మంత్రం లేని సంధ్యకు మరి చెంబుడు నీళ్ళుసవరించు

మంత్రంలో పస లేకపోయినా తుంపర్లకు కొదవలేదుసవరించు

మంత్రసాని పనికి ఒప్పుకొన్నాక ఏది వచ్చినా పట్టాలిసవరించు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?సవరించు

మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడుసవరించు

మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంటసవరించు

మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడుసవరించు

మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలిసవరించు

మందికి నీతి చెప్పాను కానీ - నీకూ నాకూ కాదు అన్నాడటసవరించు

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయని చెప్పే సామెత ఇది

మందిని మ్రింగే యిల్లుండాలి గానీ - ఇంటిని మ్రింగే మంది ఉండరాదుసవరించు

మందిని ముంచి గుడి కట్టినట్లుసవరించు

మందుకు పథ్యం - మాటకు సత్యంసవరించు

మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లుసవరించు

మందూ, మాకూ లేదన్నట్లుసవరించు

మక్కాకు పోయినా టక్కరితనం మానలేదుసవరించు

మనకి లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోయిందంటా ఎదుటి వాడికి ఉందీ అని ఏడిస్తే రెండో కన్ను పోయిందంటాసవరించు

మంచి వాణ్ణి డబ్బిచ్చైనా కొనుక్కోవాలి, చెడ్డవాణ్ణి డబ్బిచ్చి వదిలించు కోవాలిసవరించు

మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలిసవరించు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?సవరించు

మంత్రాలు పనిచేస్తాయనేది ఒట్టి మూడ నమ్మకమని దీని అర్థం: మంత్రాలకు చింత కాయలు రాలవు. ఇంత చిన్న పని కూడా చేయలేని మంత్రాలు ఇంకేం పని చేయగలవు.

మంది ఎక్కువైతే, మజ్జిగ పల్చనవుతుందిసవరించు

భోజనాల సమయంలో వచ్చిన అతిథులకు సరిపడా వంట కాలుంటాయి. అను కోకుండా అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఉన్న మజ్జిగలో ఇంకో రెండు చెంబుల నీళ్లు పోస్తారు అందరికి సరిపోవడానికి. ఆ విధంగా మందెక్కువయితే మజ్జిగ పలచనవుతుంది. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత.

మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంటసవరించు

అసలుకే లేదురా మొగుడా అంటే.... పెసర పప్పు వండ మన్నాడట. అలాంటిదే ఈ సామెత కూడ

మగడు విడిచిన ముండ - మబ్బు విడిచిన ఎండసవరించు

మగని చుట్టాలు చెప్పులు ముంగిట్లో విడిస్తే - ఆలి చుట్టాలు వంటింట్లో విడుస్తారుసవరించు

మగనికి మాడు చెక్కలు - మిండడికి పంచభోజ్యాలుసవరించు

మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలిసవరించు

ఏపనిలో తప్పు జరిగితే ఆ పనిలో నేర్పు ఉన్నవారు మాత్రమే సరి చేయగలరు. వేరెవ్వరు చేయలేరు... ఆ సందర్భంగా ఈ సామెతను వాడతారు.

మగ్గంలోని కెండెలాగా కొట్టుకోవడంసవరించు

మగువే మగవాడికి మధుర భావనసవరించు

మఘ ఉరిమితే మదురు మీద కర్ర అయినా పండుతుందిసవరించు

మఘ, పుబ్బలు వరుసయితే క్షామంసవరించు

మఘలో మానెడు - పుబ్బలో పుట్టెడుసవరించు

మట్టిపనికైనా స్వంతవాడే కావాలిసవరించు

మట్టిలో మాణిక్యంలాగాసవరించు

మట్టెల చప్పుడే కానీ చేసే పనేమీ లేదుసవరించు

మడికి గట్టు, యింటికి గుట్టు, మాటకు మంచి కావాలిసవరించు

మడి బీదకాదు - రైతే బీదసవరించు

మతము తలకు ఎక్కితె బుద్ది పదాలకు దిగులు.సవరించు

మతి ఎంతో గతి అంతసవరించు

గతిలేనమ్మకి మతిలేని మొగుడుసవరించు

మతిలేని మాటకు శృతిలేని పాటసవరించు

మదిలో ఒకటి - మాటలో ఒకటిసవరించు

మద్దెల పోయి రోలుతో మొర పెట్టుకున్నట్లుసవరించు

మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?సవరించు

తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

మన బంగారం మంచిదయితే కంసాలిని వన్నె అడగడం దేనికి?సవరించు

==మన్మథ రాజ్యంలో ముద్దుల మద్దెల మోతలే వుంటాయన్నట్లు

మనసుంటే మార్గముంటుందిసవరించు

ఏపనికైనా మనసు లగ్నము చేసి పని చేయాలని అర్థం.

మనసుకు మనసే సాక్షిసవరించు

మనసుకు ముఖమే సాక్షిసవరించు

మనసు మంచిదే - గుణమే గుడిసేటిదిసవరించు

మనసున నాటిన మాటలు చెరుపలేరుసవరించు

మనసు మనువు కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందటసవరించు

మనసు విరిగితే అతుక్కోదుసవరించు

మనసు మహామేరువు దాటుతుంది - కాలు కందకం దాటదుసవరించు

మనసు లేని మనువులాగాసవరించు

మనసులో ఏముంటే సోదిలో అదే వస్తుందిసవరించు

మనసులో చింతకు మందులేదుసవరించు

మనసు కుదిరితే మల్లి - కుదరకుంటే ఎల్లిసవరించు

మనసైన అమ్మాయి నవ్వు మన్మథుని శరమైన పువ్వన్నట్లుసవరించు

మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపుసవరించు

మనిషి కాటుకు మందు లేదుసవరించు

మనిషికి ఉన్నది పుష్టి - గొడ్డుకు తిన్నది పుష్టిసవరించు

మనిషికి కాక మానులకు వస్తాయా కష్టాలు?సవరించు

మనిషికి మాటే అలంకారంసవరించు

మనిషికొక తెగులు మహిలో వేమాసవరించు

మనిషి చస్తే మాట మిగులుతుందిసవరించు

మనిషి పేదయితే మాటకు పేదా?సవరించు

మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవుసవరించు

మనిషి బయటకు ఎలా కనబడుతున్నా... లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు.

మనిషి సంగతి మాట చెపుతుందిసవరించు

మనిషికో మాట గొడ్డుకో దెబ్బసవరించు

మనిషి తెలివున్న వాడు వానికి మాటలు అర్థం అవుతాయి. పశువుకు మాటలు రావు. తెలివి లేదు. దానికి ఒక దెబ్బ వేస్తే అది చెప్పిన మాట వింటుంది. ఆ విధంగా ఈ సామెతను వాడు తారు.

మనుషులు పోయినా మాటలు వుంటాయిసవరించు

మనుగుడుపుల అల్లుడూ - చెరకు తోటలో ఏనుగూ ఒక్కటేసవరించు

మనువాడిన తర్వాతే అందాల విందులు అందిటసవరించు

మనువొక చోట - మనసొక చోటసవరించు

మనోవ్యాధికి మందు లేదుసవరించు

మన్ను తిన్న పామువలెసవరించు

మన్ను పడితే బంగారం - బంగారం పడితే మన్నుసవరించు

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక బోసుకున్నట్లుసవరించు

అత్యాశకు పోతే మిగిలేదేమి ఉండదని చెప్పే సామెత ఇది.

మరదలి సరసం మొగలి పువ్వుల వాసన వంటిదిసవరించు

మర్యాదకు పోతే మానం దక్కదుసవరించు

మర్రి చెట్టుక్రింద మొక్కలు కావుసవరించు

మర్రి చెట్టు కింద మొక్క మొలవదుసవరించు

మరుని విందుకు పరదా లెందుకు?సవరించు

మరులున్నవాడే మగడుసవరించు

మర్దనం గుణవర్ధనంసవరించు

మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయిసవరించు

మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుందిసవరించు

మృగశిరలో ముల్లోకాలు చల్లబడతాయిసవరించు

మృగశిరలో వేసిన పైరు, మీసాలు రావడంతో పుట్టిన కొడుకు మేలుసవరించు

మృగశిర కురిస్తే మఖ గర్జిస్తుందిసవరించు

మరో లోకానికి వెళ్ళినా మారుటి తల్లి వద్దుసవరించు

మలప బుద్ధులు - పిదప చేష్టలుసవరించు

మలప సన్యాసి వేషాలు వేసినట్లుసవరించు

మలుగులు క్రుంగితే మాపటికి ఈనుతుందిసవరించు

మల్లెల జ్వరానికి అందాల గంధమే మందు అన్నట్లుసవరించు

మల్లెల మంచం మీదే మన్మథ లంచం అన్నదటసవరించు

మల్లెల వేళలో వయసు సొగసుల విందు లన్నట్లుసవరించు

మసి పాత్రలో మాణిక్యంలాగాసవరించు

మసి పూసి మారేడు కాయ చేసినట్లుసవరించు

మోసము చేసే వారి గురించి ఈ సామెతను చెప్తారు

మసి మొగంగాడూ, చమురు కాళ్ళవాడూ జతకలిసినట్లుసవరించు

మహాజనానికి మరదలు పిల్లన్నట్లుసవరించు

మహారాజని మనవి చేసుకుంటే, మరి రెండు తగిలించమన్నాడటసవరించు

మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలిసవరించు

మహా వ్యసనాలుంటే గానీ మహాత్ములు కాలేదన్నట్లుసవరించు

మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా?సవరించు

మాంసం తినేవాడు పోతే ఎముకలు కొరికే వాడు వస్తాడుసవరించు

మా ఆయనే ఉంటే మంగలి వాణ్ణయినా పిలుచుకొని వచ్చేవాడు అన్నదటసవరించు

అమాయకపు స్త్రీల గురించి ఈ సామెత చెప్తారు. వివరణ. పూర్వం మగడు చనిపోయిన స్త్రీలు గుండు గీయించుకునే వారు. ఆ విధంగా ఒక విధవ స్త్రీ గుండు గీయించు కోడానికి మంగలిని పిలవాలని చూసి .... చూసి ఎవరు దొరకలేదట..... అప్పుడు తన మగడు ఉండుంటే మంగలిని పిలుచుక వచ్చే వాడు గదా...... అని వాపోయిందట. మగడు వుంటే గుండు గీయించుకో నవసరము లేదనే జ్ఞానం ఆమెకు లేది.

మా ఇంటి కొస్తే ఏం తెస్తావు? మీ ఇంటి కొస్తే ఏం పెడ్తావు?సవరించు

అంతా ఎదుటి వారినుండి రాబట్టడమే గాని తననుంచి ఏమి ఇవ్వని వారి గురించి ఈ సామెత పుట్టింది

మా గేదె చస్తే చచ్చిందిగానీ ఎదురింటి గేదె పాలివ్వకపోతే చాలుసవరించు

ఇతరులకు కష్టాలు రావాలనే వారి నుద్దేశించి ఈ సామెత పుట్టింది

మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరదుసవరించు

మాఘమాసపు వాన మగడు లేని జాణసవరించు

మాఘమాసపు చలికి చెట్లుకూడా వణుకుతాయిసవరించు

మాఘ మాసంలో చలి అత్యధికంగా వుంటుందని ఈ సామెతకు అర్థము.

మాచకమ్మ సౌందర్యంలాగాసవరించు

మాచకమ్మ అనగా మీసాలున్న స్త్రీ అని అర్థము. అన సౌందర్యవతి కాదని అర్థము.

మాటకారి - నీటుగాడుసవరించు

మాటకు ప్రాణంగానీ మూటకు ప్రాణమా?సవరించు

మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులుసవరించు

మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికిసవరించు

మాటకు ముందు ఏడ్చేవాడిని - నవ్వే ఆడదానిని నమ్మరాదుసవరించు

మాటకు హరిశ్చంద్రుడి లాగాసవరించు

హరిశ్చంద్రుడిలాగా అబద్దం చెప్పని వాడని అర్థము.

మాకు జయం - మీకు ఋణంసవరించు

మాట గొప్ప చెప్ప మాటలు చాలవుసవరించు

మాట చుట్టమా? పెట్టు చుట్టమా?సవరించు

మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటేసవరించు

నిజాయితీగా వుండే వారు మాటకు ప్రాణంకన్న విలువిస్తారని ఈ సామెతకు అర్థము.

మాట మీకు - మూట మాకుసవరించు

మాటల పసేగానీ చేతల పస లేదుసవరించు

మాటలు ఎక్కువ పని తక్కువ చేసే వారి గురించి ఈ సామెతను వాడుతారు

మాటలతో మూటలూ, మాన్యాలు సంపాదించవచ్చుసవరించు

మాటలు కోటలు దాటుతాయ్‌ కాళ్ళు గడప దాటవుసవరించు

మాటలు చెప్పే మొనగాళ్లేగానీ బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరుసవరించు

మాటలు నేర్చిన కుక్కల్ని వేటకు తీసుకెళితే యిస్కో అంటే యిస్కో అన్నాయటసవరించు

మాటలు నేర్చినమ్మ ఏడ్చినా అందమేసవరించు

మాటలు, పాటలు మాయింట్లో, మాపటి భోజనం మీ యింట్లోసవరించు

మాట మంచి - చేత చెడ్డసవరించు

మాట లేకుంటే చోటే లేదుసవరించు

మాటలే మంత్రాలు - మాకులే మందులుసవరించు

మాటల్లోపడి మగణ్ణి మరచినట్లుసవరించు

మాటల్లో మరులు - చేతల్లో స్వర్గాలుసవరించు

మాట్లాడితే మల్లెలు - కాట్లాడితే కందిరీగలుసవరించు

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లుసవరించు

కొంతమంది వారి తాతలు, ముత్తాతలు, తండ్రుల గూర్చి లేనిపొని గొప్పలు చెబుతారు, కాని ప్రస్తుతం వారేమి చేస్తున్నారో చెప్పారు. వాళ్ళ తాతలు చేసిన గొప్ప పనులకు వీళ్ళని పొగడాలని వీరి కోరిక. అటువంటివారిని ఎవరూ మెచ్చరు. అలాంటివారిని ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత.

మానం చూపి ప్రాణం తీసినట్లుసవరించు

మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు?సవరించు

మానవ సేవే మాధవ సేవసవరించు

మానిందే మందు - బ్రతికిందే బ్రతుకుసవరించు

మానిన పుండును రేపినట్లుసవరించు

మాపటికి మనసు - రేపటికి సొగసు అన్నట్లుసవరించు

మాపటేళ ఆకలి, పెదవుల దాహం తీరవన్నట్లుసవరించు

మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడుసవరించు

తన వారి గురించి లేని పోని గొప్పలు చెప్పుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

.

మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లుసవరించు

లేని పోని గొప్పలు చెప్పుకునే వారిని బట్టి ఈ సామెత పుట్టింది.

మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు గడప దాటవుసవరించు

ప్రగల్భాలు పలికే వారిని గురించి ఈ సామెతను వాడతారు.

మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదటసవరించు

మాతాకబళం తల్లా అంటే ... మా ఆయనెక్కడైనా కనిపించాడా ? అన్నదట ఆ ఇల్లాలు.సవరించు

అత్యంత చమత్కార వంతమైన ఈ సామెతకు కొంత వివరణ కావాలి. అదేమంటే::: ఒక బిచ్చగాడు ఒకరి ఇంటి ముందు నిలబడి మాదాకవళం తల్లా అన్నాడట. దానికి ఆ ఇల్లాలు అతనితో.. మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని బదులిచ్చింది. దానికి ఆ బిచ్చగాడు కనిపిస్తే పంపిస్తాలే తల్లీ అని అక్కడి నుండి వెళ్లి పోతాడు. ఆ ఇల్లాలి మాటలోని మర్మం బిచ్చగానికి బాగా అర్థం అయింది. ఆ ఇల్లాలు తన గుట్టును విప్పిచెప్పకుండా చెప్పిన సమాధానం ఎంతో చమత్కార వంతమైనది. అసలు విషయం ఏమంటే.... ఆ ఇల్లాలు భర్త కూడా బిచ్చగాడే. అతను బిచ్చం తెస్తేగాని ఇంట్లో తినడానికి ఏమి లేదు. ఆమె అన్న ఆమాటతో పరిస్థితి అర్థమైన ఆ బిచ్చగాడు సరైన సమాధానం చెప్పి వెళ్లి పోతాడు.

మామ బంతిన కూర్చుని అత్త బంతిన లేచినట్లుసవరించు

మామా ఒకింటి అల్లుడేసవరించు

అత్తా ఒకింటి కోడలే అన్న సామెత లాంటిదే ఇదీను

మామిళ్ళకు మంచు చెరుపు - కొబ్బరికి కుడితి చెరుపుసవరించు

మారులేని తిండి మాలతిండిసవరించు

మార్గశిరలో మాట్లాడటానికి ప్రొద్దుండదుసవరించు

మార్గసిరలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడని అర్థము ( పగటి సమయం తక్కువ)

మాలకూటికి పోయినా పప్పు నీళ్ళేసవరించు

మాల పల్లెలో మంగళాష్టకాలుసవరించు

మాల బడాయి పాటి మీద - మొగుడి బడాయి ఆలి మీదసవరించు

మావి మాకిస్తే రాజ్యమిచ్చినట్లేసవరించు

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనెసవరించు

తినటానికి తిండి లేనపుడు మీసాలకి సంపెంగ నూనె కావాలనడం వినేవారికి హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఉన్నదానితో సంతృప్తి పడక అతిగా ఆశ పడే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

మింగ మెతుకులేదు, లంజకు లత్తుకటసవరించు

మింగ లేక మంగళవారం అన్నాడటసవరించు

పని చేతకాక పోతే తనకు చేతకాదని ఒప్పుకోడానికి అహం అడ్డు వస్తుంది. అందుకని ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. అంతే గాని వారి అసమర్థతను బయట పెట్టరు. అలాంటి వారికి ఈ సామెత. ఇదే అర్థంతో మరొక సామెత ఉంది. అది. "ఆడ లేక మద్దెల ఓడు అన్నాడట"

మింటికీ, మంటికీ ముడి వేసినట్లుసవరించు

మిండలను మరిగినమ్మా, మీగడ తిన్నమ్మా ఊరుకోరుసవరించు

మిడతంభొట్ల జోస్యంలాగాసవరించు

మితం తప్పితే హితం తప్పుతుందిసవరించు

మిధునంలో పుట్టిన మొక్కా, మీసకట్టుతో పుట్టినకొడుకూ అక్కర కొస్తారుసవరించు

మిన్ను విరిగి మీదపడ్డట్లుసవరించు

మీ ఇంట్లో తిని మా యింట్లో చేయి కడుగమన్నట్లుసవరించు

మీఊరు మాఊరికెంత దూరమో మాఊరు మీవూరికంతేదూరంసవరించు

అంతా ఒకటే ఆనే అర్థంలో చెప్పే సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత కూడా ఉంది. అది: ఈ గుడ్డ ముక్క కూడ ఆ తాను లోనిదే ఈ పేడు కూడ ఆ మొద్దులోనిదే

మీకు మాట నాకు మూటసవరించు

మీద మెరుగులు - లోన పురుగులుసవరించు

మీన మేషాలు లెక్క పెట్టినట్లుసవరించు

ముంజేతి కంకణానికి అద్దమేల ?సవరించు

ముంజేతి కంకణం అద్దం లేకుండానే మామూలుగా చూసు కోవచ్చు. అనవసరమైన పని చేయకూడదని అర్థం.

ముండకు దొరికేది మోటు మొగుడేసవరించు

ముండకు దొరికేవి మొండి శిశినాలేసవరించు

ముండ మొయ్యవచ్చు గానీ నింద మొయ్యరాదుసవరించు

ముండా కాదు, ముత్తయిదువా కాదుసవరించు

ముడ్డి తనది కాక పోతే గోదావరి దాక డేక మన్నాడటసవరించు

ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

ముడ్డి తనది కాకపోతే తాడికి ఎదురు దేకమన్నాడటసవరించు

ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

ముంతపాలు కుర్రాడికి - బంతులాట మంచానికిసవరించు

ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లుసవరించు

ముందరున్నది ముసళ్ళ పండుగసవరించు

ముందు ఆకు తెచ్చుకుంటే ఎప్పుడైనా తినవచ్చుసవరించు

ముందుకు పోతే మురికి ముండ - వెనుకకు పోతే వెర్రి ముండసవరించు

ముందు నుయ్యి వెనుక గొయ్యిసవరించు

ఎటు పోవడానికి దారి లేదని అర్థం. అన్ని దారులు మూసుకపోయాయని దీని అర్థం.

ముందుంది ముసళ్ళ పండుగసవరించు

ఇది ఎంత మాత్రము మొసళ్ళ పండగ కాదు. not crocodile.. ముసలం అంటే రోకలి అని అర్థం. రోకళ్ళ పండగ ముందు ఉంది అని అర్థం.

ముందూ నడిచే ముతరాచువాణ్ణీ - వెనుకనడిచే ఏనాది వాడినీ నమ్మరాదుసవరించు

ముందు పెళ్ళాం బిడ్డలు మెతుకులేక ఏడుస్తుంటే ఉంచుకున్నదానికి పిల్లలులేరని పూజలు చేసాట్టసవరించు

ముందు ముచ్చట్లు -వెనుక చప్పట్లుసవరించు

ముందు మురవబోకురా ముతరాచు వాడా అన్నట్లుసవరించు

ముందు మురిసినమ్మకు పండుగ గుర్తుండదుసవరించు

ముందు మూడుముళ్ళ ముచ్చట - తర్వాత సోయగాల జాతర అందటసవరించు

ముందు వాళ్ళకు మూకుళ్ళు - వెనుక వాళ్ళకు నాకుళ్ళుసవరించు

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడిసవరించు

దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి.

ముక్కు ఉండేంత వరకే పడిశ ముంటుందిసవరించు

ముక్కు ఏదంటే తల చుట్టూ త్రిప్పి చూపినట్లుసవరించు

ముక్కు కోసినా మొదటి మొగడే మేలుసవరించు

ముక్కు మూరెడు సిగ బారెడుసవరించు

ముక్కు మూసుకుంటే మూడు ఘడియలుసవరించు

ముక్కులో ఏ వేలు పెట్టినా సరిపోతుందిసవరించు

ముక్కులో చీమిడుందంటే, నీ చేత్తోనే తీయమన్నట్లుసవరించు

ముక్కూ మొహం తెలీనట్లుసవరించు

ముఖం అందం మానానికి చేటుసవరించు

ముఖం చూచి బొట్టు పెట్టినట్లుసవరించు

ముఖంలో సుఖంలేదు - మోకాళ్ళలో బిగువు లేదుసవరించు

ముఖారవిందం - భజగోవిందంసవరించు

ముగ్గురికి తెలిస్తే మూడు లోకాలకు ప్రాకుతుందిసవరించు

ఏదైనా రహస్యం ఇద్దరి మద్యలోనే వుండాలని అర్థం. మూడో వానికి తెలిస్తే అందరికి తెలిసిపోతుందని ఈ సామెతకు అర్థము

ముట్టుకుంటే ముత్యం - పట్టుకుంటే బంగారంసవరించు

ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదేసవరించు

పిల్లల ఏడుపు ఆపడానికి జోల పాడ తారు. ముడ్డి గిల్లితే పిల్లలు ఏడుస్తారు. అలా ఏడిపించి ఓదార్చడం అంటే చేస్తున్న పనిలో నటన ఉన్నదని అర్థం.

ముడ్డిక్రిందకు నీళ్ళు వస్తే కానీ లేవరుసవరించు

ముడ్డి మీద తన్నితే మూతి పళ్లు రాలాయటసవరించు

ముత్యపుచిప్పలన్నీ ఒక చోట - నత్తగుల్లలన్నీ ఒకచోటసవరించు

ముత్యమంత పదునుంటే మూల కార్తెలో చల్లినా ఉలవచేను పండుతుందిసవరించు

ముత్యాలు, పగడాలు, ముట్టుకుంటే జగడాలుసవరించు

ముదిమిన ముచ్చట్లు లావుసవరించు

ముద్దంటే ఒకింత మత్తు - ఒద్దంటే మరింత కోపంసవరించు

ముద్ద ముద్దకీ బిస్మిల్లానా!సవరించు

ముద్దుగుమ్మ కౌగిలింత నిద్రరాని ఆవులింత అన్నట్లుసవరించు

ముద్దు చేసిన కుక్క మూతి నాకితే - రంకు నేర్చిన రమణి రచ్చ కీడ్చిందటసవరించు

ముద్దున పేరు, మురిపాన నడక చెడతాయిసవరించు

ముద్దూ, మురిపెం మావంతు - ముడ్డీ, దొడ్డీ మీవంతుసవరించు

ముద్దూ మురిపాలు కౌగిళ్ళలోనే అన్నట్లుసవరించు

ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలిసవరించు

అవకాశం ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలని ఈ సామెత అర్థం.

మునగానాం తేలానాం మూసివాయనం అన్నట్లుసవరించు

మునిగితే గుండు - తేలితే బెండుసవరించు

మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లుసవరించు

ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

మునిగే వాడికి తెలుసు నీటి లోతుసవరించు

ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదుసవరించు

మురిపాలు, ముచ్చట్లు అంటే ముసుగు పెడతాడన్నట్లుసవరించు

మురిపెం తిరిపెం చేటు - ముసలి మొగుడు మంచానికి చేటుసవరించు

ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టంసవరించు

ఎటు తిరిగి తనకే నష్టం కలిగే పనుల / మాటల గురించి ఈ సామెత పుట్టింది

ముల్లును ముల్లుతోనే తీయాలిసవరించు

ముళ్ళు వేయటం చేతగాదుగానీ కోక ముడి విప్పనా అంటాడట పాపం!సవరించు

ముష్టికి నష్టి ఏమిటి?సవరించు

ముష్టికి నష్టి వీరముష్టిసవరించు

ముసలి కాలానికి ముప్పుతిప్పలుసవరించు

ముసలి తనానికి దసరావేషం లాగసవరించు

ఏవయసులో చేయాల్చిన పనులు ఆ వయసులోనే చేయాలని లేకుంటే నవ్వుల పాలవుతారని చెప్పే సామెత ఇది.

ముసలివానికి ముండ ముద్దుసవరించు

ముసలివానికేల దసరావేషాలుసవరించు

ముసలి ముగ్గురిని మార్చినట్లుసవరించు

ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాటసవరించు

పెద్దల మాట సద్దికూటి మూట అనే సామెత లాంటిదే ఈ సామెత.

ముసుగులో గుద్దులాటసవరించు

ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడటసవరించు

ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లుసవరించు

చింతామణి పాత్రను వెయ్యడానికి నవనవలాడుతూ నాజూకుగా ఉండి యవ్వన ప్రారంభ దశలో ఉన్న స్త్రీలే అర్హులౌతారు. అలాకాక వయసు ఉడిగి, ముసలితనం ముఖంలో స్పష్టంగా కనిపించేవారు చింతామణి పాత్ర వేస్తే ప్రేక్షకులకు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ సమయానికి ఏ వయసుకు తగిన పనిని వారుచేయాలికానీ, వేరొకరు చేస్తే బాగుండదు. కొంతమంది ఏ పనికైనా తామేనంటూ ముందుకు వస్తారు. అలా వచ్చేవారు ఆ పనిని తాము చేసినందువల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం అవసరమని ఈ సామెత

మూగవాని ముందు ముక్కు గోక్కున్నట్లుసవరించు

ఎదుటివారికి కోపం తెప్పించే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు

మూట పోతే పోయింది మాట పోరాదుసవరించు

మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయిసవరించు

మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమౌతాయిసవరించు

మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతున్నట్లుసవరించు

మూడు రోజులుంటే మురికి చుట్టంసవరించు

మూడునాళ్ళ ముచ్చటసవరించు

మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లుసవరించు

మూడు మాటలు - ఆరు తప్పులుసవరించు

మూడుముళ్ళ ముచ్చటసవరించు

మూడొచ్చి ముందుకొస్తే మూడంకె వేసిందటసవరించు

మూతి ముద్దుల కేడిస్తే వీపు గుద్దుల కేడుస్తుందిసవరించు

మూచ్చూడను ముక్కాలు దుడ్డు లేదు ముండను చూస్తే దుఖం వస్తుందటసవరించు

మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డదిసవరించు

మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?సవరించు

మూరెడు పోనేల బారెడు కుంగనేల?సరైన అంచనాలు లేకుండా ముందుకు వెళ్తే బాధపడతారు

మూల కురిస్తే ముంగారు పారుసవరించు

మూల ముంచు - జ్యేష్ఠ చెరచుసవరించు

మూల వాన ముంచక మానదుసవరించు

మూలవిరాట్లు ముష్టెత్తుకుంటూంటే ఉత్సవవిగ్రహాలకు ఊరేగింపటసవరించు

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుసవరించు

అసలే జబ్బుపడి మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడితే దాని బాధ అధికమౌతుంది. ఇదే విధంగా బాధలతో సతమతమౌతున్న వ్యక్తి మీద మరిన్ని బాధలు పడ్డప్పుడు అతని పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు .

మూలుగులు మునుపటిలాగే - భోజనాలు ఎప్పటిలాగేసవరించు

మూసి పెడితే పాసి పోయి నట్లుసవరించు

అనుభవించక దాచి పెట్టి దొంగల పాలు చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు.

మూసివాయనం ముత్తయిదువులాగాసవరించు

మూసిన ముత్యం - పాసిన పగడంసవరించు

మెచ్చి మేకతోలు కప్పినట్లుసవరించు

మెడబట్టి నెడితే చూరుపట్టుకుని వ్రేలాడినట్లుసవరించు

మెడలో రుద్రాక్షలు - మదిలో మదిరాక్షులుసవరించు

మెడలో వేసుకున్న పాము ఎప్పటికైనా కరవక మానదుసవరించు

మెతుకవుతే బ్రతుకవుతుందిసవరించు

మెత్తగా వుంటే మొత్తబుద్ధి వేస్తుందిసవరించు

పరుగెత్తే వాడిని చూస్తే తరమాలనిపిస్తుంది అనే సామెత లాంటితే ఈ సామెత

మెత్తని చెప్పుతో కొట్టుముసవరించు

యాదృశం ముఖం తాదృశీ చపేటికా : సంస్కృతన్యాయములు ముఖమును బట్టియే చెంపకాయ. "... ... ... మెత్తని చెప్పుతో కొట్టుము" అని సామెత.

మెరిసేదంతా బంగారం కాదుసవరించు

పై మెరుగులు చూసి మోస పోవద్దని అర్థం>

మెరుపు దీపం కాదు - మబ్బు గొడుగు కాదుసవరించు

మేకకు తెలిసిందంతా మేత సంగతేసవరించు

మేకపోతు గాంభీర్యంలాగాసవరించు

మేక వన్నె పులిసవరించు

పైకి మంచిగా నటిస్తూ లోన మొసపూరిత బుద్ధి గల వారిని గురించి ఈ సామెత చెప్తారు.

మేతకన్నా మసలితేనే బలంసవరించు

మేత కరణంగానీ కూత కరణం కాదుసవరించు

మేతకేగాని చేతకు కొరగాడుసవరించు

తినడం తప్ప పని చేయడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది

మేనత్త పోలిక - మేనమామ చాలికసవరించు

మేయబోతే ఎద్దుల్లోకి దున్నపోతే దూడల్లోకిసవరించు

తిండికి ముందు పనికి వెనుక వుండే వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది.

మేలు మరువరాదు - కీడు పలుకరాదుసవరించు

మేసేగాడిదను కూసేగాడిద వచ్చి చెరచినట్లుసవరించు

మొండికీ, బండకూ నూరేళ్లాయుష్షుసవరించు

మొండికి సిగ్గులేదు - మొరడుకు గాలి లేదుసవరించు

మొండి గురువు - బండ శిష్యుడుసవరించు

మొండిచేత్తో మూర వేసినట్లుసవరించు

మొండిచేతి వానికి నువ్వులు తినటం నేర్పినట్లుసవరించు

మొండివాడు రాజు కన్నా బలవంతుడుసవరించు

యాచకుల్లో ఒక రకమైన వారున్నారు. వారు రక్త సిక్తమైన తమ పసి బిడ్డను చేటలో పెట్టుకొని ఒకరి ఇంటి ముందు పెట్టి,,, మగ వాడు పెద్ద కొరడాతో తనను తాను కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తూ ఉండగా ఒక స్త్రీ ఒక వాయిద్యాన్ని భయంకరంగా వాయిస్తూ వుంటుంది. ఆ ఇంటి వారు బిచ్చం పెట్టునంత వరకు .... వారు అలా భయంకరమైన నృత్యాన్ని చేస్తూనే ఉంటారు. వారి భయంకర కృత్యాలను భరించ లేక ఆ ఇంటి వారు తప్పక బిచ్చం వేస్తారు. అలా వారికి ప్రతి ఇంటి వారు బిచ్చం వేస్తారు. ఆలా వారు బిచ్చం వేయనిదే కదిలి వెళ్ళరు. దీని నుండి పుట్టినదే ఈ సామెత.

మొక్కబోయిన దేవర ఎదురైనట్లుసవరించు

వెతకబోయిన తీగ కాళ్ళకు అడ్డం పడ్డట్టి అనే సామెత లాంటిదే ఈ సామెత

మొక్కై వంగనిది, మ్రానై వంగునా?సవరించు

మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఏ మొక్కైనా మనకు కావలసిన రీతిలో వంగుతుంది. అదే మొక్క పెరిగి పెద్ద వృక్షమయ్యాక వంచాలని ప్రయత్నిస్తే అది వంగదు. ఆదే విధంగా పిల్లలను బాల్యంలోనే కావలసిన రీతిలో తీర్చిదిద్దుకోవాలి. వారు పెరిగి పెద్దవారైనాక వారి అలవాట్లు, పధ్ధతులు మార్చలేమని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

మొగమోటానికి పోతే ముండకు కడుపు వచ్చిందటసవరించు

ఏ విషయంలోనైనా మొగమోటము పనికి రాదని చెప్పే సామెత ఇది. వివరణ: కొండంత రెడ్డి కొంగు పట్టుకున్నాడట.. పాపం ఆమె మొగమోటానికి పోయి సరే నన్నది. దాంతో కడుపు వచ్చింది. మొగమోటానికి పోయినందుకు కలిగిన కష్టం.

మొగబుద్ధి మోటబుద్ధి - ఆడబుద్ధి అపర బుద్ధిసవరించు

మొగుడికి దిండు - వుంచుకున్న వాడికి దేహంసవరించు

మొగుడికి మొద్దులు - మిండడికి ముద్దులుసవరించు

మొగుడికే మగతనం ఉంటే పొరుగింటాయనతో పనేంటి? అందిటసవరించు

మొగుడి కౌగిలి మొగలి పరిమళంసవరించు

మొగుడితో పెళ్ళికీ, పిల్లలతో తీర్థానికీ వెళ్ళరాదుసవరించు

మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లుసవరించు

మొగుడిని కొట్టి మొరపెట్టుకున్నట్లుసవరించు

మొగుడిమీద కోపం ప్రొద్దుగూకేంత వరకేసవరించు

మొగుడివాసన వచ్చేంతవరకూ ముసలివాసన తప్పదుసవరించు

మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకుసవరించు

భార్య భర్తల మధ్యన ఎన్నో గొడవలుంటాయి. తిట్టు కుంటారు, కొట్టు కుంటారు. ఆ తర్వాత కొంతసేపటికే ఒక్కటవుతారు. ఇది సహజం. కాని ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇతరులు చూస్తుండగా జరగ రాదు. ఆ వ్యవహారం ఇంటిగుట్టు. ఇతరులు చూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. తన మొగుడు తనను కొట్టుతుండగా తోడికోడలు చూస్తే ఆ అవమానం భరించ రానిది. అందుకే మొగుడు తనను కొట్టినందుకు కాదు, దీన్ని తన తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ ఎక్కువ.

మొగుడు కొద్దీ వన్నెలు - సిరి కొద్దీ చిన్నెలుసవరించు

మొగుడు పోయి తానేడుస్తుంటే ఉంచుకున్నవాడు ఊటీవెడదాం అన్నాడటసవరించు

మొగుడు లేనిదానికి మంత్రసానెందుకు?సవరించు

మొగుడే ముండా అంటే ముష్టికి వచ్చినవాడూ ముండా అంటాడుసవరించు

మొదటి దానికి మొగుడులేడు - కడదానికి శోభనమటసవరించు

మొదటికే మోసమయితే, లాభాలకు గుద్దులాటా?సవరించు

మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలినట్లుసవరించు

మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లుసవరించు

మొదలు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లుసవరించు

మొదటే కోతి, పైగా కల్లు తాగింది, ఆపై నిప్పులు త్రొక్కిందిసవరించు

మొద్దు మొహానికి అలంకరణ గూడానా?సవరించు

మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి జేబులో పెట్టుకున్నాడుటసవరించు

ఏవస్తువును ఎలా వాడాలో తెలియని తెలివి తక్కువ వాడని అర్థం.

మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదుసవరించు

మొరిగే కుక్క లన్నియూ కరిచే ధైర్యము కలవి కావు. అదే విధముగా, పైకి భయంకరముగా మాట్లాడి భయపెట్టు వ్యక్తులందరికి మనలను దెబ్బతేసే సాహసము యుండనవసరము లేదు. అదే చందముగా, కొన్ని కరిచే కుక్కలు మొరగనటులనే మనలను చాటుగా దెబ్బదీయ దలచిన కొందరు ముందుగా హెచ్చరించి రారు. ఈ సామెత వ్యంగ్యముగా ఈ విషయమునే తెలియచేస్తోంది.

మొలది విప్పి తలకి చుట్టుకొన్నట్లుసవరించు

మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టుసవరించు

మోకాలికి బోడి గుండుకు ముడి వేయడం అసాద్యం. అలా చేశానన్నాడంటే అది అబద్దమని అర్థం.

మోటువాడికి మొగలిపువ్విస్తే మడిచి ముడ్డిలో పెట్టుకున్నాడటసవరించు

మోచేతి దెబ్బ - మొగుడి కాపురం ఒకటిసవరించు

మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువుసవరించు

ఎన్నో బరువు బాధ్యతలు మోసే వారిని చూసి ఎదుటివారు తేలికగా తీసుకునే సందర్భంలో ఈ సామెత వాడతాం. కావిడి మోసే వాడికే దాని బరువు తెలిసినట్లు బాధ్యతలని మోసేవాడికే వాటి బరువు తెలుస్తుంది. చూసేవాడికి అది అనుభవంలోకి రాదు.

మోహం లేకపోతే మోదం లేదుసవరించు

మౌనం అర్ధాంగీకారంసవరించు

సాధారణంగా మనం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మౌనంగా ఉంటాం. అంటే ఆ విషయాన్ని మనం పూర్తిగా తిరస్కరించినట్టూ కాదు, అంగీకరించినట్టూ కాదు. అందుకీ మౌనంగా ఉంటే దానిని ఎదుటివారు అర్ధాంగీకారంగా భావిస్తారు.

మౌనేన కలహం నాస్తిసవరించు

కలహాలకు కారణము వాగ్వివాదము. అసలు మాట్లాడకుంటే..... వివాదమే లేదు. దీనినే .... ఊరకుండు వాడు ఉత్తమోత్తముడయా అని అన్నారు.

వెలుపలి లింకులుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_మ&oldid=2948867" నుండి వెలికితీశారు