భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "వ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

వంకరటింకర పోతుంది పాము కాదుసవరించు

వంకరో టింకరో వయసే చక్కనసవరించు

వంకాయలు కోస్తున్నారా ఇంత సేపుసవరించు

ఇంత సేపు ఏం చేస్తున్నారని ఈసడింపుగా అనడం.

వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందటసవరించు

వంగలేక మంగళవారం అన్నాడంటసవరించు

వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువసవరించు

వంటింటి కుందేలుసవరించు

సిద్దంగా వున్న వస్తువు.

వంటిల్లు కుందేలు చొచ్చినట్లుసవరించు

వంటి మీద ఈగను కూడ వాలనీయనుసవరించు

అతి జాగ్రత్తగా కాపాడతానని అర్థం:

వండని అన్నం - వడకని బట్టసవరించు

వండలేనమ్మకు వగపులు మెండు - తేలేనమ్మకు తిండి మెండుసవరించు

వండాలేదు, వార్చాలేదు - ముక్కున మసెక్కడిది అన్నట్లుసవరించు

వండుకున్నమ్మకు ఒకటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలుసవరించు

వంతుకు గంతేస్తే దిగింది బుడ్డసవరించు

వంద మాటలు చెప్పొచ్చు - ఒక్కనికి పెట్టేదే కష్టంసవరించు

వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లుసవరించు

వంపున్న చోటకే వాగులుసవరించు

వంపుసొంపులే ఫలపుష్పాలు - లేత పెదిమలే తమలపాకులు అన్నట్లుసవరించు

వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లుసవరించు

వంశమెరిగి వనితను - వన్నెనెరిగి పశువును తెచ్చుకోవాలిసవరించు

వగలమారి వంకాయ సెగలేక ఉడికిందటసవరించు

వగలెందుకంటే పొగాకు కోసం అన్నట్లుసవరించు

వచ్చింది కొంత - పఠించింది కొంతసవరించు

వచ్చింది పాత చుట్టమే - పాత చేట గొడుగు పట్టండి అన్నట్లుసవరించు

వచ్చిననాడు వరాచుట్టం - మరునాడు మాడ చుట్టం - మూడవనాడు మురికి చుట్టంసవరించు

వచ్చిన పేరు చచ్చినా పోదుసవరించు

వచ్చేకాలం కన్నా వచ్చిన కాలం మిన్నసవరించు

వచ్చే కీడు వాక్కే చెపుతుందిసవరించు

వచ్చేగండం చచ్చినా తప్పదుసవరించు

వచ్చేటప్పుడు వెంట తీసుకురారు - పోయేటప్పుడు వెంట తీసుకుపోరుసవరించు

వచ్చినవారికి వరాలు - రానివారికి శాపాలుసవరించు

వచ్చిపోతూ వుంటే బాంధవ్యం - ఇచ్చి పుచ్చుకుంటూంటే వ్యాపారంసవరించు

వచ్చీరాని మాట వరహాల మూటసవరించు

వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచిసవరించు

వజ్రానికి సాన - బుద్ధికి చదువుసవరించు

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలిసవరించు

వట్టి గొడ్డుకు అరుపు లెక్కువసవరించు

వట్టి చేతులతో మూర వేసినట్లుసవరించు

వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయిసవరించు

వట్టి మాటలు కూటికి చేటుసవరించు

వడ్లగాదిలో పందికొక్కులాగాసవరించు

వడ్లగింజలో బియ్యపు గింజసవరించు

వడ్లల్లో, రెడ్లల్లో ఎన్నో రకాలన్నట్లుసవరించు

వడ్డించినదంతా మేం తింటాం ఆకులు మీరు నాకండి అన్నట్లుసవరించు

వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదుసవరించు

వడ్లూ గొడ్లూ ఉన్నవానిదే వ్యవసాయంసవరించు

వనితగానీ, కవితగానీ వలచిరావాలిసవరించు

వనితకూ వయసుకూ తోడు కావాలిసవరించు

వయసుకు వర్జ్యం లేదన్నట్లుసవరించు

వయసుకోట వాయనం, సొగసుతోట పాయసం అన్నట్లుసవరించు

వయసు తప్పినా వయ్యారం పోలేదుసవరించు

వయసుపడే ఆరాటం సోయగాల సమర్పణకే అన్నట్లుసవరించు

వయసు ముసలెద్దు - మనసు కోడెదూడసవరించు

వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయిసవరించు

వరహాకన్నా వడ్డీ ముద్దు - కొడుకుకన్నా మనమడు ముద్దుసవరించు

వరాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుసవరించు

వరిమొలకా, మగమొలకా ఒకటిసవరించు

వలచివస్తే మేనమామ కూతురు వరుస కాదన్నట్లుసవరించు

వలపులు మనసుల్ని తడితే కోరికలు తనువుల్ని తడతాయటసవరించు

వస్త్రహీనం - విస్తరి హీనం పనికిరావుసవరించు

వాచినమ్మకు పాచినన్నం పెడితే పరమాన్నం పెట్టారని ఇరుగుపొరుగులకు చెప్పుకొన్నదటసవరించు

వసుదేవుడంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడుసవరించు

ఎంతటి వానికైనా ఒక్కోసారి కాల కలసి రాకపోతె చాల కష్టాలు పడవలసి వస్తుంది. ఈ సామెతలో అదే అర్థం వున్నది

వస్తూ ఏమి తెస్తావు? పోతూ ఏమిస్తావు?సవరించు

వస్తే కొండ పోతే వెంట్రుకసవరించు

ఒక వెంట్రుకతో కొండను లాగడానికి ప్రయత్నించినప్పుడు వస్తే కొండ వస్తుంది, పోతే ఒక వెంట్రుక పోతుంది. చిన్న పెట్టుబడితో దాదాపుగా అసాధ్యమైనంత పెద్ద లాభం సంపాయించడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదుసవరించు

భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.

వ్యవసాయం గుడ్డాడి చేతిరాయిసవరించు

వ్యసనం ఏడూళ్ళ ప్రయాణంసవరించు

వ్రతం చెడ్డా ఫలం దక్కాలిసవరించు

వాగాడంబరం - అధిక ప్రసంగంసవరించు

వాడికి సిగ్గు నరమే లేదుసవరించు

వాడికి సిగ్గు నరమే లేదు- అంటే వాడికి సిగ్గు అనేదే లేదు, సిగ్గు వాడి నైజం కాదు ఎందుకంటే వాడికి సిగ్గు పుట్టించే నరం లేదు. ఇది ఇండోనేసియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెతకు స్వేచ్ఛానువాదం. (original in Indonesia - 'Dia Tidak ada urat malu')

వాడు నామెదడుతింటున్నాడు.సవరించు

అనవసరపు మాటలతో విసిగిస్తున్నాడని అర్థం: ఉదా:గంట నుండి వాడు నా మెదడు తింటున్నాడు.

వాడో పెద్ద ముదురుసవరించు

మోసగాడని అర్థం:

వాతలు మానుతాయి - వాదులు పోవుసవరించు

వానకంటే ముందు వరద వచ్చినట్లుసవరించు

వానరాకడ, ప్రాణం పోకడ తెలియదుసవరించు

వానలకు మఖాకార్తె - కుక్కలకు చిత్తకార్తెసవరించు

వానవుంటే కరువులేదు - మగడు వుంటే దరిద్రం లేదుసవరించు

వాన వెలసినా చూరునీళ్ళు పడుతున్నట్లుసవరించు

వాపును చూసి బలుపనుకుంటే పొరబాటుసవరించు

వాపు బలుపు కాదు - వాత అందం కాదుసవరించు

వాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అన్నట్లుసవరించు

వ్యాధికి రట్టు, సంసారానికి గుట్టు కావాలిసవరించు

వ్యాధికి మందుకానీ విధికి మందా?సవరించు

వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడటసవరించు

వాలుచూపులతో గాలమేసిసవరించు

ఉదా: వాలు చూపులతొ గాలమెసి వలపులోకి దింపు వారు మీరుగాదా..... (ఆడ వారి గురించి ఒక పాటలో)

విగ్రహపుష్టి నైవేద్యనష్టిసవరించు

గంభీరంగా విగ్రహం వలే ఉండి పని తనం లేకుండా ఉండేవారికి ఉపయోగించే సామెత. విగ్రహం ఉంది కాని ఆ విగ్రహాన్ని రోజు నైవేద్యం పెట్టి సేవించడం వల్ల ఉపయోగం లేదు. నైవేద్యం మాత్రం నష్టం.

వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలిసవరించు

వియ్యం అనగా పెళ్ళి. కయ్యం అనగా యుధ్ధం, పోరాటం. పెళ్ళి సంబంధం వెతికేటప్పుడు తమ ఆస్తీ అంతస్తులకు సరితూగే కుటుంబాన్ని వెతకాలి. లేదా నూతన వధూవరుల కాపురంలో ఆ అసమానతల కారణంగా కలతలు రావచ్చు. అలాగే ప్రత్యర్థి మనకు భుజబలంలోనూ, బుధ్ధిబలంలోనూ సరిసమానుడైతేనే పోరు రక్తి కడుతుంది. బలహీనుని ప్రత్యర్థిగా ఎంచుకొనడం వీరుల లక్షణం కాదు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దదిసవరించు

విషవలయంలో చిక్కుకున్నాడుసవరించు

వ్రాత కరణమా? మేత కరణమా? అన్నట్లుసవరించు

వ్రాయగా వ్రాయగా కరణం - దగ్గగా దగ్గగా మరణంసవరించు

వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోక్తమా?సవరించు

వాసి తరిగితే వన్నె తరుగుతుందిసవరించు

విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదుసవరించు

వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుందిసవరించు

విన్నవన్నీ నమ్మొద్దు నమ్మినవన్నీ చెప్పొద్దుసవరించు

ఒకవేళ నమ్మితే ఆ మాటలను మనసులోనే ఉంచుకోవాలి కానీ దాన్ని మరొకరి దగ్గర చెబితే కొన్ని సందర్భాల్లో దోషరహితులను దోషులుగా ప్రచారం చేసినట్లు అవుతుంది.

విందు అయినా మూన్నాళ్ళు - మందు అయినా మూన్నాళ్ళుసవరించు

విందు మర్నాడు మందుసవరించు

విగ్రహపుష్టి - నైవేద్య నష్టిసవరించు

విడవమంటే పాముకు కోపం - పట్టమంటే కప్పకు కోపంసవరించు

విడిచిన ముండకు వీరేశలింగంసవరించు

విడిచినమ్మలు వియ్యమందబోతే అంతకంటే అడ్డాలమ్మ వచ్చి హారతిపట్టిందటసవరించు

విడిచేసిన వాడు వీధికి పెద్దసవరించు

విత్తం కొద్దీ వైభవముసవరించు

విత్తటానికి శుక్రవారం - కోయటానికి గురువారంసవరించు

విత్తు ఒకటయితే చెట్టు ఒకటౌతుందా?సవరించు

విత్తుకొద్దీ పంటసవరించు

విత్తు ముందా? చెట్టు ముందా?సవరించు

విద్య కొద్దీ వినయముసవరించు

విధం చెడ్డా ఫలం దక్కాలిసవరించు

విధి వస్తే పొదలడ్డమా?సవరించు

విదియనాడు రాని చంద్రుడు తదియనాడు తనకు తానై కనబడతాడుసవరించు

విన్న మాట కంటే చెప్పుడు మాట చేటుసవరించు

విన్నమ్మ వీపు కాలింది - కన్నమ్మ కడుపు కాలిందిసవరించు

వినాయకుడి మీద భక్తా? ఉండ్రాళ్ళ మీద భక్తా?సవరించు

విని రమ్మంటే తిని వచ్చినట్లుసవరించు

వినేవాటికీ - కనేవాటికీ బెత్తెడే దూరంసవరించు

వియ్యానికి కయ్యం తోబుట్టువుసవరించు

వియ్యానికయినా కయ్యానికయినా సమవుజ్జీ వుండాలిసవరించు

వియ్యాలందితే కయ్యాలందుతాయిసవరించు

విరిగిన వేలు మీద ఉచ్చ పోయనన్నట్లుసవరించు

విరుచుకుని విరుచుకుని వియ్యాలవారింటికి పోతే పలుగురాళ్ళతో నలుగు పెట్టారటసవరించు

విల్లంబులు కలవారికి చల్లకుండలవారు తోడా?సవరించు

విశాఖ కురిస్తే విషము పెట్టినట్లేసవరించు

విశాఖ చూచి విడువర కొంపసవరించు

విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లేసవరించు

విశాఖలో వరదలు - సంక్రాంతికి మబ్బులుసవరించు

విశాఖలో వర్షం - వ్యాధులకు హర్షంసవరించు

విషానికి విషమే విరుగుడుసవరించు

విస్తరి కొదవా, సంసారపు కొదవా తీర్చేవారు లేరుసవరించు

విస్తరి చిన్నది - చెయ్యి పెద్దదిసవరించు

విస్సన్న చెప్పింది వేదంసవరించు

విసిగి వేసారి పోయారుసవరించు

అన్ని ప్రయత్నాలు చేసి విసిగి పోయారని అర్థం: ఉదా: ఇక ఆ ప్రయత్నం చేయ లేను నేను విసిగి వేశారి పోయాను.

వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లుసవరించు

వీపున కొట్టచ్చుగానీ, కడుపుమీద కొట్టరాదుసవరించు

వీపు విమానం మోత మోగుతుందిసవరించు

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పెద్దవారు కొట్టడానికి ముందు భయపెడుతూ వీపు విమానం మోత మోగిపోతుంది అని అంటారు. దీని అర్థం విమానం బయలు దేరేటప్పుడు చాలా శబ్దం చేస్తుంది. ఇప్పుడు అల్లరి ఆపక పోతే నే వీపు మీద వేసే దెబ్బలు, అంత గట్టి శబ్దం చేస్తూ, బాధ కలిగిస్తాయి అనే అర్థం ఆధారంగా వచ్చిన సామెత వీపు విమానం మోత మోగుతుంది.

వీరభద్రపు పళ్ళెములాగాసవరించు

వీలెరిగి మాట - కీలెరిగి వాతసవరించు

వీసం యిచ్చి గంపెడు అడిగినట్లుసవరించు

వీసంలో మానెడు తీసినట్లుసవరించు

వృద్ధనారీ పతివ్రతసవరించు

వృద్ధ వైద్యం - బాల జోస్యంసవరించు

వృష్టికి ప్రమాణాలు - ఉత్తర, హస్త కార్తెలుసవరించు

వెంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందిసవరించు

వెంటపోయినా వెనుక పోరాదుసవరించు

వెంట పోయైనా చూడాలి - వెంట వుండయినా చూడాలిసవరించు

వెక్కిరించబోయి వెల్లికిలా పడ్డట్లుసవరించు

వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుసవరించు

వెదకబోయిన తీర్థం ఎదురయినట్లుసవరించు

వెధవముండ కాళ్ళకు మ్రొక్కితే నాలాగే వర్ధిల్లమని దీవించిందటసవరించు

వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరుసవరించు

వెనక నొక్కుళ్ళేనా ముందు పనులున్నాయా అందిటసవరించు

వెన్న అరచేతిలో పెట్టుకుంటే అడక్కుండానే కరుగుతుందిసవరించు

వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లత్రాగిన వాడ్ని కొట్టినట్లుసవరించు

==వీనతో పెట్టిన విద్య చిన్నతనం నుంది అలవాడిన గుణం ==

వెన్నెల వేళే విరహాలన్నట్లుసవరించు

వెయ్యి అబద్ధాలు చెప్పయినా ఒక పెళ్ళి చేయాలిసవరించు

వెయ్యి గుళ్ళ పూజారిసవరించు

వెర్రి కుదిరింది - తలకు రోకలి చుట్టమన్నాడటసవరించు

వెర్రివాడా వెర్రివాడా అంటే వెక్కెక్కి ఏడ్చాడటసవరించు

వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ లోకువసవరించు

వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ మరదలుసవరించు

వెర్రివాడి పెళ్ళాం వాడకల్లా వదినేసవరించు

వెర్రివాడికి పెళ్ళిచేస్తే వేలెట్టి కెలికాడటసవరించు

వెర్రివాని చేతి రాయిలాగాసవరించు

వెర్రి వేయి విధాలన్నట్లుసవరించు

వెల తక్కువ - ఫల మెక్కువసవరించు

వెండ్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయగలదుసవరించు

మనకున్న వనరులను బట్టి పని చేయాలి. అంతే గాని ఆశగా మనకున్న వనరుల కన్న ఎక్కువున్న పనిని చేయ కూడదు: అలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత. వెండ్రుకలున్న అమ్మ ఏ కొప్పైనా వేయ గలదు. సరిపడ వెండ్రుకలు లేనిదే కొప్పేం వేయ గలదు?

వెంపలి చెట్టుకు నిచ్చెన వేసినట్లుసవరించు

వేటుకు వేటు - మాటకు మాటసవరించు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్లుసవరించు

వేపకాయంత వెర్రి ఎవరికైనా వుంటుందిసవరించు

వేలు వంక పెడితేగానీ వెన్న రాదుసవరించు

వేలు మీద గోరు మొలిచింది ఏం చేతు మొగుడా అన్నట్టుసవరించు

ఏదో ఒక వంక చెప్పి చెయ్యాల్సిన పనిని తప్పించుకోటం

వేగం కన్నా ప్ర్రాణం మిన్నసవరించు

వాహనాలు నడిపే వారికి ఈ పలుకుబడి వర్తిస్తుంది. ప్రయాణము వేగవంతమైతే ప్రమాదాలు జరుగుతాయి గనుక, వేగం కన్నా.... ప్రాణం మిన్న అని అంటారు. అనగా మితిమీరిన వేగం ప్రాణ హాని అని అర్థము.

వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడుసవరించు

ఒకరికొకరు తోడుగా వుండి ఐకమత్యంగా పని చేసుకోవాలని దీని అర్థం>

వేడినీళ్ళకు ముందు, పంక్తి భోజనానికి వెనుక పోగూడదుసవరించు

వేడుకకు వెల లేదుసవరించు

వేలం వెర్రి - గొర్రెవాటుసవరించు

వేలుకు వేలు ఎడమా?సవరించు

వేలు చూసి అవలక్షణ మనిపించుకొన్నట్లుసవరించు

వేలు చూపితే హస్తం మింగుతాడన్నట్లుసవరించు

వేలు పెట్టేందుకు చోటిస్తే తల దూర్చినట్లుసవరించు

వేలు మీద గోరు మొలిచింది వేరుపోదాం రారా మగడా! అన్నదటసవరించు

వేలు వాచి రోలంతయితే, రోలు వాస్తే మరెంత కావాలి?సవరించు

వేశ్య - వైశ్యుడు అబద్ధాల కోరులేసవరించు

వేషాల కోసం దేశాల పాలయినట్లుసవరించు

వేషాలమారికి వేవిళ్ళొస్తే, ఉన్నచోటు విడవను అన్నదటసవరించు

వేషాలెన్ని వేసినా కూటి కోసమేసవరించు

వేసిన వత్తికి - పోసిన చమురుకు సరిసవరించు

వేసినట్టే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడుసవరించు

వేసిందే ఒక గంతు - దిగిందే ఒక బుడ్డసవరించు

వేసిందే ఒక గంతు - విరిగిందే ఒక కాలుసవరించు

వేసేటప్పుడు వేపకొమ్మ, తీసేటప్పుడు పోలేరమ్మసవరించు

మామూలుగా మనం ఎక్కి తొక్కే వేపకొమ్మనే పదిమందీ కూడి ఒకచోట ప్రతిష్ఠించి అమ్మవారుగా భావించి పూజలు పునస్కారాలు జరపడం ప్రారంభించిన తర్వాత ఆ కొమ్మ దేవతామూర్తి అవుతుంది. దానిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించదలిస్తే ఆ దేవతను కొలిచే అక్కడి జనంలో ఆగ్రహం రగిలి శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుంది

వేసేది విషముష్ఠి విత్తనాలు - ఆశించేవి మధుర ఫలాలుసవరించు

వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టుసవరించు

ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండటం. పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పటం.

వేసినదే ఒకఅడుగు; విఱిగినదే కాలుసవరించు

వైద్యం నేర్వనివాడూ - వానకి తడవనివాడూ వుండడుసవరించు

వైదీకి వైద్యంలో చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటేసవరించు

వైద్యుడి పెళ్ళాంగూడా ముండ మోసేదేసవరించు

వైద్యుని పేరు చెపితే రోగాలు పారిపోతాయా?సవరించు

వైద్యుని భార్యకే భగంధర రోగముసవరించు

వైద్యుడు రోగాలు కోరు - వైశ్యుడు కరువు కోరుసవరించు

వైరాగ్యం ముదిరితే వారవనిత కూడా తల్లితో సమానంసవరించు

కష్టాలలో చిక్కుకున్నాడు అని అర్థం: ఉదా: అతడు విషవలయంలో చిక్కుకున్నాడు.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సామెతలు_-_వ&oldid=3049687" నుండి వెలికితీశారు