సామెతలు - శ, ష

(సామెతలు - శ నుండి దారిమార్పు చెందింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "శ, ష" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

శంఖులో పోస్తేగాని తీర్థం కాదనిసవరించు

దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలుసవరించు

శతకోటి దరిద్రాలుంటే వాటిని తీర్చటానికి అనంతకోటి ఉపాయాలు కూడా ఉంటాయి అని అర్ఢం. ఎన్ని సమస్యలున్నా వాటికి తగిన పరిష్కారాలుంటాయని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

శతకోటి లింగాలలో బోడిలింగంసవరించు

అందరిలో నువ్వూ ఒకడివి అన్న భావం వ్యక్తపరచడానికి ఈ సామెతను వాడతారు.

శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లుసవరించు

శతమర్కటం పితలాటకం అన్నట్లుసవరించు

శతాపరాధములకు సహస్ర దండనలుసవరించు

శనగలుతిని చేయి కడుగుకొన్నట్లుసవరించు

అతి సులబంగా చేసిన పని అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయేగిస్తారు.

శనిపడితే ఏడేళ్ళు - నేను పడితే పధ్నాలుగేళ్ళుసవరించు

శనిపీనుగు ఒంటరిగా పోదుసవరించు

శని విరగడయితే చాలు అన్నట్లుసవరించు

శనేశ్వరానికి నిద్రెక్కువ - దరిద్రానికి ఆకలెక్కువసవరించు

శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడుసవరించు

శ్మశాన వైరాగ్యం - ప్రసూతి వైరాగ్యంసవరించు

శల్యపరీక్ష చేసినట్లుసవరించు

శల్య సారథ్యం లాగాసవరించు

అతిగా నిరుత్సాహ పరిచే వారి గురించి దీనిని వాడుతారు. భారత యుద్ధంలో కర్ణుడికి సారది అయిన శల్యుడు కర్ణుడిని అన్ని విధాల నిరుత్సాహ పరుస్తాడు.

శవానికి చేసిన అలంకారం వలెసవరించు

అంతా వృధా అయిందని అర్థం అనే అర్ధంలో ఈ సామెతను వాడతారు.

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడటసవరించు

ఎల్లప్పుడూ అశుభం పలికే వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడటసవరించు

శృంగారానికి సమయ సందర్భాలు అక్కరలేదన్నట్లుసవరించు

శృంగారానికి సమయం - సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లుసవరించు

శృంగారానికి సిగ్గూ - ముద్దుకు బుద్ధీ లేవన్నట్లుసవరించు

శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంటసవరించు

== శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా ఈ ప్రకృతిలో జరిగే పనులన్ని దైవాజ్ణ ప్రకారమే manku untayani తున్నాయని అర్థం.

శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది ? అన్నాడట.సవరించు

శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుందిసవరించు

మరణం తర్వాత ఏమి వుండదని అర్థం.

శ్రాద్ధాని కంటులేదు - యజ్ఞానికి ఎంగిలిలేదుసవరించు

శ్రావణంలో శనగల జోరు - భాద్రపదంలో బాధల పోరుసవరించు

శివరాత్రికి చింతాకంత చెమటసవరించు

శివరాత్రితో చలి శివ శివా అంటుందిసవరించు

శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదుసవరించు

శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానంసవరించు

శ్రీరంగనీతులు చెపుతాం ఆచరించండి అన్నట్లుసవరించు

శ్రీరామరక్ష నూరేళ్ళాయుష్షుసవరించు

శ్రుతిమించి రాగాన పడినట్లుసవరించు

శుభస్య శీఘ్రంసవరించు

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండెక్కడన్నాడటసవరించు

శుష్క ప్రియాలు - శూన్య హస్తాలుసవరించు

శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లుసవరించు

శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లుసవరించు

శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పుసవరించు

శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లుసవరించు

శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లుసవరించు

శోభనాల వేళ - సురాలోక మార్గం అన్నట్లుసవరించు

శొంఠి లేని కషాయం లేదుసవరించు

షండునికి రంభ దొరికినట్లుసవరించు

తనకు ఉపయోగంలేని వస్తువు చేతికి దొరికి నట్లు.

షష్టినాడు చాకలివాడైనా ప్రయాణం చేయడుసవరించు

మూలాలుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం