సామెతలు - స, హ

(సామెతలు - హ నుండి దారిమార్పు చెందింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "స, హ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడటసవరించు

పిసినారి వాడిని ప్రతిఫలం అడిగితే ఇలాగే జరుగుతుందని అర్ధం.

సంక్రాంతికి చంకలెత్తలేనంత చలిసవరించు

సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోనివారూ బయటకు వస్తారుసవరించు

సంక్రాంతి సాలు కొకసారేసవరించు

సంఘ భయం - పాప భయంసవరించు

సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టుసవరించు

వినటానికి ఇంపుగాలేని గొంతు, అంధవిహీనత

సంచిలాభం చిల్లు కూడదీసిందిసవరించు

సంజయ రాయబారంలాగాసవరించు

సంతకు చీటి లచ్చికి గాజులుసవరించు

వివరణ: ఒక ఆడ కూలి తాను పని చేసె రెడ్డి వద్దకు వెళ్లి దొరా నాకు గాజులు వేయించు అని అడిగిందట. దాంతో ఆ రెడ్డి గారు సంతకు ఒక చీటి వ్రాసి ఇచ్చి దీన్ని సంతలో ఇస్తే నీకు గాజులు వేస్తారని అన్నాడట. దాంతో ఆ అమాయక రాలు ఆనందంతో సంతకు వెళ్లి ఆ చీటీని ఎవరికివ్వాలో తెలియక ఏడిచిందట..... మాయకులు అమాయకులను ఎలా వేదిస్తారో తెలిపే సామెత ఇది.

సంతకు వెళ్ళొచ్చిన ముఖంలాగాసవరించు

సంత మెరుగు సాని ఎరుగునుసవరించు

సంతలో కొడితే సాక్షులెవరు?సవరించు

సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం చేస్తే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడిపోయిందటసవరించు

సంతులేని ఇల్లు చావడి కొట్టంసవరించు

మొన్నటిదాకా ఎవరైనా పెద్దలు నూతన వధువరూలను ఆశీర్వదించేటప్పుడు గంపెడు బిడ్డలను కనమని ఆశీర్వదించేవారు. ఇప్పుడు పెరుగుతున్న జనాభా దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టుఅంటున్నారు.ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండడం సబబని, అంతకన్నా ఎక్కువైతే సంసారం నడపటం యజమానికి కష్టమవుతుందని నిన్నటివరకు ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుతం ఇద్దరు కూడా అనవసరమని, ఒకరుంటే సరిపోతుంది అంటున్నారు.

సంతోషమే సగం బలంసవరించు

ఎల్ల వేళలా ఆనందంగా.... సంతోషంగా వుండమని దీని సందేశం.

సంతోషానికి సాకు - ఆలోచనకు ఆకృతి లేదుసవరించు

సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందటసవరించు

సందడిలో సడేమియా అన్నట్లుసవరించు

సందడిలో సందడి - పనిలో పనిసవరించు

సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లుసవరించు

సంపదలో మరపులు ఆపదలో అరుపులుసవరించు

సగం పెట్టి మేనత్త అన్నట్లుసవరించు

సగం సాలె నేత, సగం మాలనేతసవరించు

సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతూంటే, అసత్యం ప్రపంచమంతా చుట్టి వస్తుందిసవరించు

సత్యం నావద్ద దండిగా వుంది, చెప్పులు తేరా మగడా! నిప్పులో దూకుతా అందటసవరించు

సత్రం కూటికి అయ్యగారి ఆజ్ఞా!సవరించు

సత్రం భోజనం - మఠం నిద్రసవరించు

సన్నమో ముతకో సంతలో తేలిపోతుందిసవరించు

సన్నసన్నగా కాపుతనం వచ్చింది - సన్న బియ్యం వండవే పెళ్ళామా అన్నాట్టసవరించు

సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు తప్పలేదుసవరించు

సన్యాసికి దొంగల భయమేమి?సవరించు

సన్యాసి పెళ్ళాం విధవా కాదు పునిస్త్రీ కాదుసవరించు

సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుందిసవరించు

సన్యాసుల మధ్య కల్లుముంతలు మాయమైనట్లుసవరించు

సన్నెకల్లు దాస్తే పెళ్ళాగుతుందా?సవరించు

సరదాకి సమర్థాడితె చాకల్ది చీర పట్టు కెళ్లిందటసవరించు

ఆడపిల్లలు సమర్తాడినప్పుడు వారి ఒంటి పై నుండే బట్టలు చాకలి చెందు తాయి. ఇది ఆచారము. అలా ఒక అమ్మాయి సరదాకి సమర్తాడిందట. సాంప్రదాయం ప్రకార చాలల్ది వచ్చి చీర పట్టు కెళ్లిందట. ఇందులో సరదాకి కూడా అబద్ధం చెప్ప కూడదు అనే భావం దాగుంది.

సమయం తప్పితే కాళ్ళు - సమయం వస్తే రాళ్ళుసవరించు

సమయానికి రానిది చంక నాకనా?సవరించు

సముద్రం మధ్యన వున్నా మంచినీళ్ళు కరువేసవరించు

సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరుసవరించు

సముద్రంలో కాకి రెట్టలాగాసవరించు

సముద్రంలో వానపడినట్లుసవరించు

సముద్రానికి ఏతాము వేసినట్లుసవరించు

సరదాకి సమర్తాడితే చాకలిది చీర, రవిక లాక్కున్నదటసవరించు

సరసము విరసము కొరకేసవరించు

సర్కారుకు చాటుగానూ, షావుకారికి ఎదురుగానూ వుండాలిసవరించు

సర్వేజనా స్సుఖినో భవన్తుసవరించు

సవతులున్న ఇల్లు నరక సమానంసవరించు

సందేహాలన్నీ దేహాలతో తీర్చుకున్నట్లుసవరించు

సంపదలో మరుపులు - ఆపదలో అరుపులుసవరించు

సంపదలో మరుపులు - ఆపదలో మ్రొక్కులుసవరించు

సంపద, సాని రెండూ నిలకడగా వుండవుసవరించు

సంపాదన ఒకరిది - అనుభవం ఇంకొకరిదిసవరించు

సంపెంగల సంతలో ఒయ్యారాల విందులన్నట్లుసవరించు

సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడటసవరించు

సంసారం జానెడు - ఖర్చు బారెడుసవరించు

సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడిందిసవరించు

సంసారి తిరిగి, సన్యాసి తిరగక చెడతారుసవరించు

సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టుసవరించు

సంసారం గుట్టు - జబ్బు రట్టుసవరించు

సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే బూడిద, బుర్రకాయ గాడిద బరువైనాయటసవరించు

సత్రం లో భోజనం మఠం లో నిద్ర అన్నట్లుసవరించు

కార్యాభారం ఎక్కువై ఇళ్ళు కూడా పట్టకుండా నిర్వర్తించాల్సిన పనిమీదనే ఎక్కడెక్కడో తిరుగుతుండటం. ఇంట్లోనివారి ప్రేమలు, అనురాగాలు, బయట దొరకవు.

సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...సవరించు

ఆరంభశూరత్వం.ఒక పని ప్రారంభించినట్లు చెప్పుకోవటానికి కొన్ని ఉదాహరణలను మాత్రం చూపుతూ తర్వాత ఎంతకాలానికి ఆ పనులను ముగించక కాలాయపన చేయటం .సంగీత కచ్చేరి జరిగేటప్పుడు సన్నాయి ఆలపించే వ్యక్తి ముందుగా సన్నాయిని పీకపెట్టి శృతి చేసుకుంటూ ఉంటాడు. పూర్తిగా సంగీత జ్ఞానం లేనివాడైనా, లేక తానెందుకు కచ్చేరికి సహకరించాలి అనే అనుకునేవాడైనా సన్నాయి నొక్కులు (శృతి చేస్తూ) నొక్కుతూ కూర్చుంటాడే తప్ప అసలు పూర్తి పాటను పాడే స్థాయికి రాడు.

సద్ది తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదన్నట్లుసవరించు

సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలిందంటసవరించు

జోగి జోగి రాసుకొంటే బూడిద రాలింది అన్నట్లు.జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోవటం.అందరూ వట్టి చవటాయలేనని

సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టంసవరించు

అన్నిటికన్న సంసారం కష్టమైనది అర్థం.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానంసవరించు

అన్ని ఇంద్రియాలలోకీ (అవయువాలు) కన్ను అతి ముఖ్యమైనదని దీని అర్థం. నయనం అంతె కన్ను మాత్రమే కాదు నయనం అంతె ఆత్మ . అందుకె నయనం చిందంసి సస్త్ర్రాని . ఇంద్రియాల్లింతికి ఆత్మ ప్రదానం

సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నాడటసవరించు

అందరూ సుఖంగా ఉండాలని దాని అర్ధం అయితే సర్వే డిపార్టుమెంటు వాళ్ళేనా మిగతా వాళ్లెవరూ సుఖంగా ఉండక్కర్లేదా? అని ఓవ్యక్తి ఆ పదానికి అర్ధం తెలియక ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే సామెతగా అవతరించింది. చెపుతున్న విషయాన్ని సరిగావినక, అర్ధంచేసుకోక తొందరపాటుగా మాట్లాడే వారు అని

సమయానికి లేని భాకా చంక నాకనా?సవరించు

నిష్ప్రయోజనమైనది అని త్యజింపఁబడినవస్తువే మఱొకపుడవసర మవుచుండును. వేళకు లేనందువలన దత్ఫలము భ్రష్టమైనట్లు =భ్రష్టావసరన్యాయము

స్వకార్య ధురంధరుడు - స్వామికార్య వంచకుడుసవరించు

స్వకుచ మర్దనంసవరించు

స్వగృహే పూర్ణమాచారంసవరించు

స్వయంరాజా - స్వయం మంత్రీసవరించు

స్వర్గానికి పోయినా సవతి పోరు తప్పలేదన్నట్లుసవరించు

స్వర్గారోహణపర్వం చదువుతున్నట్లుసవరించు

సాయిబు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లుసవరించు

సాయబూ! గోకులాష్టమి ఎప్పుడని అడిగినట్లుసవరించు

సాధారణంగా పండుగలైనా, ఏదైనా క్రొత్త పని ప్రారంభించడానికి మంచిరోజు తెసుసుకోవడానికి పురోహితుణ్ణి గాని, పూజారిని గాని అడుగుతాం. కాని వీటిగురించి బొత్తిగా తెలియని వారిని అడిగినప్పుడు, 'సాయబూ! గోకులాష్టమి ఎప్పుడన్నట్లు' ఆయనను అడిగితే ఏం ప్రయోజనం అన్న సందర్భంలో ఈ సామెత వాడతాం. అంటే వేరే మతస్తునికి ఇంకొక మతపు పండుగలు ఎలా తెలుస్తాయన్న సందర్భంలో.\

సాయిబు గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్ట అంటించుకోను నిప్పు అడిగినట్లుసవరించు

సాయిబు సంపాదన బూబు కుట్టుకూలికే సరిసవరించు

సామెతలేని మాట - ఆమెత లేని ఇల్లుసవరించు

సాలెవాడి భార్య సరి మీద పడిందిసవరించు

స్వాతి కురిస్తే చట్రాయికూడా పండుతుందిసవరించు

స్వాతి కురిస్తే భీతిసవరించు

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయిసవరించు

స్వాతివాన ముత్యపువానసవరించు

స్వాతివానకు సముద్రాలు నిండుతాయిసవరించు

స్వాతీ నేను జరుపుకు వస్తాను, విశాఖా నీవు విసురుకురా!సవరించు

స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లుసవరించు

సాక్షికాళ్ళు పట్టుకోవడంకన్నా వాదికాళ్ళు పట్టుకోవడం మేలుసవరించు

సిగ్గే స్త్రీకి అలంకారంసవరించు

సిరికొద్దీ చిన్నెలు - మగనికొద్దీ వన్నెలుసవరించు

సిరిపోయినా చిన్నెలు పోలేదుసవరించు

సిరిరా మోకాలొడ్డు వారుంటారా?సవరించు

సింగడు అద్దంకి వెళ్లినట్టుసవరించు

సింగడు అద్దంకి వెళ్లినట్టు (సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు) - యజమానుల దగ్గర సిద్దడు పనివాడు, ఏంచెప్పినా సరిగా చేయడని అనుకొంటుంటారు. ఒక రోజు రాత్రి యజమానులు తనను ప్రొద్దున్నే అద్దంకి పంపించాలనుకోవటం విని, ఎలాగైనా మెప్పు పొందవచ్చని, అక్కడ పనేంటో తెలుసుకోకుండానే వాళ్ళు లేచే సరికి అద్దంకి వెళ్ళి వచ్చాడు. వివరం /ఉపయోగం లేకుండా ఎవరైనా వ్యక్తి పనిని చేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. అసలు సామెత " సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు " అని. దీని వివరం ఒక భార్యా భర్త పొద్దు పోయిన తరువాత రేపు సింగడిని (తమ పాలేరు) అద్దంకి పంపాలి అని అనుకోవడం విని. అద్దంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటో తెలుసుకోకుండా, తెల్లవారకముందే సింగడు అద్దంకి వెళ్ళి వస్తాడు. తొందరపాటుతో అసలు విషయం తెలుసుకోకుండా నిష్ప్రయోజకరమైన పనులుచేసే వారికి ఈ సామెత వాడతారు. రవి కుమార్ పెనమకూరి. హైదరాబాదు. (దీనినే 'పుల్లయ్య వేమవరం వెళ్ళినట్లు' అని కోస్తాప్రాంతంలో వాడతారు)

సింగినాదం జీలకర్రసవరించు

ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములో జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ, ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర ఒకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది.ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవిసవరించు

సీత చరిత్రలో నిలిచిపోయిన ఒక మహా సాధ్వి. పీత ఒక సామాన్య జీవి. కాని ఎవరి కష్టాలు వారివి. ఎవరికైనా సరే ఇతరుల సమస్యలు మన సమస్యలతో పొలిస్తే తక్కువగానే కనపడతాయి.

సీత పుట్టుక లంకకు చేటుసవరించు

సీతాపతీ! నీకు చాపేగతిసవరించు

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందిసవరించు

సొమ్మొకడిది సోకొకడిదిసవరించు

ఒకరి కష్టాన్ని ఇంకొకడు తింటుంటే ఈ మాట అంటారు.

సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందటసవరించు

స్థాన బలిమి కాని తన బలిమి కాదుసవరించు

స్నానానికి ముందుండకూడదు, సంభావనకు వెనకుండకూడదుసవరించు

సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలుసవరించు

సుఖం మరిగినమ్మకు మొగుడి కష్టమేం తెలుస్తుంది?సవరించు

సుఖం మరిగిన దాసరి పదం మరిచాడటసవరించు

సుతులు లేనివారికి గతులు లేవుసవరించు

సున్నకి సున్న - హళ్ళికి హళ్ళిసవరించు

సూది గొంతు - బాన కడుపుసవరించు

సూదిని తీసుకెళ్ళి దూలానికి గ్రుచ్చినట్లుసవరించు

సూది పోయిందని సోదెకు వెడితే పాతరంకులు బయట పడ్డాయటసవరించు

సూదిలా వచ్చి పలుగులా తయారైనట్లుసవరించు

సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖానే పడుతుందిసవరించు

సూర్యుని ముందు దివిటీలాగాసవరించు

>==సూక్ష్మంలో మోక్షం అన్నట్లు ==

సెట్టి తక్కెడ సేరుకు ముప్పావు తరుగుసవరించు

సైంధవుడిలాగా అడ్డుపడినట్లుసవరించు

సొమ్మొకడిది - సోకొకడిదిసవరించు

సొమ్ము సొమ్ముగా వుండాలి - బిడ్డలు గుండ్రాళ్ళలాగా వుండాలిసవరించు

సోమరి సమాజానికి బరువుసవరించు

హనుమంతుడి ముందా కుప్పిగంతులుసవరించు

హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి చేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి చేష్టలు చేస్తే విచిత్రంగా ఉంటుంది కదా. ఏదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.

హనుమంతుడు... అందగాడు...సవరించు

హనుమంతుడు ఏమాత్రం అందంగా ఉంటాడో అందరికీ తెలుసు. హనుమంతుడు బ్రహ్మచారి. ఒక్క బ్రహ్మచారి వందకోతులతో సమానమంటారు. హనుమంతుడు ఏదో కొద్దిగా కోతిచేష్టలు చేస్తాడు కానీ మంచిఅందగాడే అని అర్ధం.

హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడుసవరించు

హరిశ్చంద్రుని కన్నా సత్య ప్రవర్థనుడని అర్థం.

హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లుసవరించు

మూలాలుసవరించు

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం