సారంగపాణి (1680-1750) వాగ్గేయకారుడు. అన్నమాచార్యునితో ఆరంభమైన శృంగార ఆధ్యాత్మ పదాలుగా రూపుదిద్దుకొని పెద, చిన తిరుమలాచార్యులతో కొనసాగి క్షేత్రయ్యతో సుస్థిరపడిన సంకీర్తన కవితను విస్తృత పరిచినవాడు సారంగపాణి.[1]

జీవిత విశేషాలు

మార్చు

సారంగపాణి చిత్తూరు మండలంలోని కార్వేటినగరం సంస్థానంలో ప్రసిద్ధి చెందిన పదకర్త. ఇతను చెన్నపురి సమీపంలోని పొన్నేరులో జన్మించాడు. తరువాత కార్వేటి నగరం చేరి ఆస్థానంలో స్థిరపడ్డాడు. వేణుగోపాల ముద్రతో అనేక పదాలు రచించాడు. నూకరాజు వేంకట పెరుమాళ్ళరాజు (1917-1732), అతని సోదర పుత్రుడు నూకరాజు కార్వేటి రాజు (1733-1752) అనే కార్వేటి నగర రాజుల కాలంలో వారి ఆస్థాన విధ్వాంసుడుగా ప్రసిద్ధికెక్కాడు. అతను రాసిన పదాల ఆధారంగా అతను సంస్కృతాంధ్ర భాషాకోవిదుడనీ, సంగీతాభినయాల్లో పరిపూర్ణ జ్ఞానం కలవాడనీ తెలుస్తుంది. ఇప్పటికి లబించిన అతని రచనలు 201. అందులో 6 క్షేత్రయ్య పదాలు. మిగిలిన 195 సారంగపాణి పదాలు. దీనిలో నాలుగు రకాల పదాలున్నాయి. ప్రథమ భాగం శృంగార పదాలు, ద్వితీయ భాగం దేశీయ పదాలు. వీటిలో వేశ్యావిలాస, చూషణలు వివరించబడ్డాయి. తృతీయ భాగం జాతీయ పదాలు. వీటిలో జానపద భాషాధోరణి స్పష్టమవుతుంది. నాల్గవ భాగం కీర్తనలు. ఇవి నీతి, వైరాగ్య, తత్వ ప్రబోధాలు. వీటిలో మూడు పదాలు నూకరాజు కార్వేటి రాజుకు అంకితమై ఉన్నాయి. మిగిలినవి కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామికి అంకితమైనవి. అతను వైణీకుడు. అతని పదాల్లో సంగీత సాహిత్యాలకు సమ ప్రాధాన్యతనిచ్చాడు. 1731లో నూకరాజు వేంకట పెరుమాళ రాజు అతనికి దుర్గ రాజపురం అనే అగ్రహారం దానమిచ్చాడు. చివఫ్రి కాలంలో రాజాశ్రయం కోల్పోయి నిరుపేదతనంతో అష్టకష్టాలు అనుభవించింజట్లు తెలుస్తుంది. అతను రాసిన పదాలు ముద్రణకు నోచుకోలేదు. ప్రతి సంవత్సరం కార్వేటి నగరంలో సారంగపాణి ఉత్సవాలు వేణుగోపాలస్వామి ఆలయంలో జరుపుతారు.

మూలాలు

మార్చు
  1. Gangappa, S. (1992). Annamacharya Pramukha Vaggeyakarulu : Tulanatmaka Parisilanamu (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)