సాహితీ యశస్వి అభ్యుదయ కవి, రచయిత, విమర్శకుడు అయిన ఎస్వీ సత్యనారాయణ గారి షష్టిపూర్తి సందర్భంగా వారి సాహితీ యశస్సును వివరిస్తూ పలువురు వ్రాసిన వ్యాసమాలిక గల పుస్తకం. డా.సి.నారాయణరెడ్డి మొదలుకొని, డా.సాగి కమలాకరశర్మ వరకు 45మంది వ్రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అరసంలో క్రియాశీలక ఉద్యమ సూర్యుడుగా ఎస్వీ తెలుగు సాహిత్యోద్యమంలో ఓయు తెలుగు శాఖాధిపతిగా, అరసం నేతగా, కవిగా, రచయితగా, విప్లవ కార్యకర్తగా, విమర్శకునిగా సాహితీ సాంస్కృతిక రంగ కార్యకర్తగా బహుముఖ కృషీ వలుడు ఎస్వీ వారి అపూర్వ కృషికి అద్దంగా నిలుస్తుంది.

సాహితీ యశస్వి
కృతికర్త: పలువురు రచయితలు వ్రాసిన వ్యాసమాలిక
సంపాదకులు: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, డా.కరిమిళ్ల లావణ్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఎస్వీ సత్యనారాయణ గారి షష్టిపూర్తి సందర్భంగా వారి సాహితీ యశస్సును గూర్చి
ప్రచురణ: సాహితీ మిత్రులు, హైదరాబాదు
విడుదల: 2014
పేజీలు: 204
ప్రతులకు: సాహితీ మిత్రులు, 1-701046/23, అజామాబాద్, హైదరాబాద్ 20

పుస్తకంలోని విషయం మార్చు

'పరిశోధనలో, కవితా రచనలో, ఉపన్యాస ఒరవడిలో అలజడిని సృష్టించే సృజన సంపన్నుడు- భజన శక్తులను లక్ష్య పెట్టని అభ్యుదయాంశను నిలువెల్లా నింపుకున్న సాహిత్య వ్యక్తిత్వం ఎస్వీధి' అంటూ జ్ఞానపీఠ అవార్డ్‌ గ్రహీత డా||సి.నారాయణ రెడ్డి ఎస్వీ. సత్యనారాయణను అభినందిస్తారు. 60 సంవత్సరాలు నిండిన సందర్భంలో అరసం జాతీయ నేతకు సాహితీ పెద్దలు అందించిన అక్షరాభి నందనలు- ఆశీస్సులు, ఈ గ్రంథంలో (దాదాపు 45 మంది రాసినవి) ఉన్నాయి.[1]

గ్రంథంలో వ్యాసాలు వ్రాసిన ప్రముఖులు మార్చు

  • సి.నారాయణ రెడ్డి
  • ఎన్. గోపి
  • రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
  • కాత్యాయనీ విద్మహే
  • ఏటూకూరి ప్రసాద్‌
  • కత్తి పద్మారావు,
  • సుంకిరెడ్డి నారాయణ రెడ్డి,
  • అవంత్స సోమ సుందర్‌,
  • నాళేశ్వరం శంకర్‌,
  • మానేపల్లి
  • ఆచార్య మసన చెన్నప్ప
  • సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి
  • అద్దేపల్లి రామమోహన్‌ రావు
  • పరకాల పట్టాభిరామారావు
  • పెనుగొండ లక్ష్మీ నారాయణ
  • వెలుదండ నిత్యానందరావు
  • రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు
  • జి బాలశ్రీనివాసమూర్తి
  • ఆనందరామం
  • గూడ శ్రీరాములు
  • వేల్పుల నారాయణ
  • వై. రెడ్డి శ్యామల
  • కరిమెళ్ల లావణ్య
  • సాగి కమలాకర శర్మ
  • జ్యోత్స్న ప్రభ
  • వి.ఆర్‌.రాసాని
  • జింబో
  • వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు

ప్రముఖ కవులు, రచయితలు వారి అభిప్రాయాలు ఈ పుస్తకంలో ఎస్వీ సాహితీ సాంస్కృతిక కృషిని అవిష్కరించాయి.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు