సిట్రస్ (లాటిన్ Citrus) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబంలోని ప్రజాతి. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు [1] సిట్రస్ పువ్వులు ఏప్రిల్ , మే నెల మధ్యలో కాస్తాయి , నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పండ్లు వస్తాయి. పండు లేత పసుపు, నారింజ, ఎరుపు, రంగులో ఉంటాయి . పండ్లు కొన్ని తియ్యగా చేదుగా, పులుపుగా గా వస్తాయి . ఒక పండుకు సుమారు విత్తనాలు 10-15 వరకు వస్తాయి. ఈ పండ్లను అస్సాం లో కోమ్లా తెంగా, కమలా-తెంగా, సుమ్తియా-తెంగా, హమ్థియా-తెంగా, బెంగాలీ భాషలో కమల,ఇంగ్లీష్ లో ఆరెంజ్ ,లూస్ -స్కిన్డ్ ఆరెంజ్, మాండరిన్ ఆరెంజ్, హిందీ లో సంత్ర,కన్నడ లో కుడగోరేంజ్ , తమిళం లో వాలాజ కమరా , తెలుగులో కమలా పండు అని అంటారు. భారత దేశం లో: అస్సాం, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర( పశ్చిమ కనుమలు ప్రాంతాలలో ) వస్తాయి [2] ఇతర దేశాలలో ఈ పండ్లు జపాన్, దక్షిణ చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో సాగు చేస్తారు . అమెరికా దేశంలో సిట్రస్ (మాండరిన్ నారింజ) ను వాణిజ్య సాగుగా అలబామా, ఫ్లోరిడా ,మిసిసిపీ, టెక్సాస్, జార్జియా,కాలిఫోర్నియా రాష్టములలో వేస్తారు.[3]

సిట్రస్
OrangeBloss wb.jpg
Mandarin Orange (Citrus reticulata cultivar)
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
సిట్రస్

జాతులు and hybrids

Important species:
Citrus aurantifoliaKey lime
Citrus maximaPomelo
Citrus medicaమాదీఫలం (Citron)
Citrus reticulataకమలాపండు (Mandarin orange)


Important hybrids:
Citrus × aurantiumBitter orange
Citrus × latifoliaPersian lime
Citrus × limonనిమ్మ (Lemon)
Citrus × limoniaRangpur
Citrus × paradisiGrapefruit
Citrus × sinensisబత్తాయి (Sweet orange)
Citrus × tangerinaTangerine
See also below for other species and hybrids.

Synonyms

Eremocitrus
Microcitrus
and see text

ఉపయోగములు : సిట్రస్ పండ్లలలో పోషక , విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఆమ్లాలు ఉన్నాయి. వీటి పండ్లు , ఆకులు సౌందర్య సాధనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్ల,, రక్తస్రావ నివారిణి, అజీర్తి, గ్యాస్ట్రో పేగుల కఫంతో వున్నా దగ్గు, చికిత్సలో ఉపయోగిస్తారు [4]

  1. "Citrus reticulata 'Clementine' - Plant Finder". www.missouribotanicalgarden.org. Retrieved 2020-10-13.
  2. "Citrus reticulata Blanco". India Biodiversity Portal. Retrieved 2020-10-13.
  3. "Mandarin Orange". www.hort.purdue.edu. Retrieved 2020-10-13.
  4. "medicinal herbs: MANDARIN - Citrus reticulata". www.naturalmedicinalherbs.net. Retrieved 2020-10-13.
"https://te.wikipedia.org/w/index.php?title=సిట్రస్&oldid=3048092" నుండి వెలికితీశారు