సితార-ఎ-ఇంతియాజ్
సితార-ఎ-ఇంతియాజ్ (ఉర్దూః ستارہ-يمتيج) పాకిస్తాన్ దేశం ప్రదానం చేసే మూడవ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని "పాకిస్తాన్ యొక్క భద్రత లేదా జాతీయ ప్రయోజనాలకు, ప్రపంచ శాంతి, సాంస్కృతిక లేదా ఇతర ముఖ్యమైన ప్రజా ప్రయత్నాలకు ప్రత్యేకించి విలువైన సహకారం అందించిన పాకిస్తాన్ పౌరులకు, విదేశీ పౌరులకు" ప్రదానం చేస్తారు. సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం లేదా విజ్ఞాన శాస్త్రం వంటి గౌరవనీయమైన రంగాలలో అత్యుత్తమ సహకారం అందించిన పౌరులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. పాకిస్తాన్ రక్షణ దళాల సైనిక అధికారులు కూడా ఈ పురస్కారానికి అర్హులు. ఈ పురస్కారం 1957 నుండి ప్రదానం చేయబడుతోంది.
పురస్కార గ్రహీతలు
మార్చుఈ పురస్కారం పొందిన కొందరి జాబితా:
- ఇంజమామ్-ఉల్-హక్ క్రికెట్ క్రీడాకారుడు. (2005)
- అజహర్ మహమూద్ క్రికెట్ క్రీడాకారుడు. (2008)
- గులాం అలి గాయకుడు. (2013)
- సర్ఫరాజ్ అహ్మద్ క్రికెట్ క్రీడాకారుడు. (2018)
- మిస్బా-ఉల్-హక్ క్రికెట్ క్రీడాకారుడు. (2018)
- షేక్ అయాజ్ సింధీ కవి.
- అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ క్రీడాకారుడు. (2020 మరణానంతరం)