సినిమా గోల 1978లో విడుదలైన తెలుగు చలన చిత్రం. సుందర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సంగయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.కృష్ణ రంగా సంగీతాన్ని సమకూర్చగా ఎ. శ్రీరామ్ రెడ్డి సమర్పించాడు.[1] ఈ చిత్రాన్ని దర్శకుడు సి.గంగాధర్ ఎనిమిది రోజుల్లోనే పూర్తి సినిమా తీసి రికార్డు సృష్టించాడు. సినిమా పేరుతో మోసంచేస్తూ, నిర్మాతను కీలుబొమ్మగా వాడుకుంటూ, దోచుకుంటున్న ఒక ఘరానా వ్యక్తి నాటకాన్ని ప్రభుత్వం పనిగట్టి శిక్షించడం ఈ చిత్రం యొక్క కథాంశం. ఏ.శ్రీరాం రెడ్డి, దినేశ్, వసంత, విజయశ్రీ మొదలైన నూతన నటీనటులు ఉన్న ఈ చిత్రాన్ని గట్టు సంగయ్య నిర్మించాడు. [2]

సినిమా గోల
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.గంగాధర్
నిర్మాణం గట్టు సంగయ్య
తారాగణం ఏ.శ్రీరాం రెడ్డి, దినేశ్, వసంత, విజయశ్రీ
సంగీతం ఎం.కృష్ణ రంగా
నిర్మాణ సంస్థ సుందర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Cinema Gola (1978)". Indiancine.ma. Retrieved 2020-08-25.
  2. "8 రోజుల్లో 'సినిమా గోల'" (PDF). జమీన్‌రైతు. 3 నవంబరు 1978. Retrieved 5 October 2024.