సిరిచల్మ శ్రీమల్లికార్జున స్వామి దేవాలయం

సిరిచల్మ శ్రీమల్లికార్జున స్వామిదేవాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలంలో సిరిచల్మ గ్రామంలో కొలువై ఉంది.ఇక్కడ లభించిన శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని 11వ.శతాబ్ధంలో తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడి కాలంలో నిర్మించారు[1] [2].

సిరిచల్మ శ్రీమల్లికార్జున స్వామి దేవాలయం
శ్రీ మల్లికార్జునస్వామి
సిరిచల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఇచ్చోడ ఆదిలాబాద్
సిరిచల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఇచ్చోడ ఆదిలాబాద్
సిరిచల్మ శ్రీమల్లికార్జున స్వామి దేవాలయం is located in Telangana
సిరిచల్మ శ్రీమల్లికార్జున స్వామి దేవాలయం
సిరిచల్మ ఇచ్చోడ ఆదిలాబాద్ తెలంగాణలో ఆలయ ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు16°05′00″N 78°52′00″E / 16.0833°N 78.8667°E / 16.0833; 78.8667
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఆదిలాబాద్ ఇచ్చోడ మండలం
స్థలంసిరిచల్మ
సంస్కృతి
దైవంమల్లికార్జునుడు (శివుడు)
భ్రమరాంబ (పార్వతి)
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి,నవరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుదక్షిణ భారత శైలి
దేవాలయాల సంఖ్య07

చరిత్ర

మార్చు

అతి పురాతన దేవాలయమైన శ్రీ మల్లికార్జున స్వామి[3] దేవాలయాన్ని పదకొండవ శతాబ్ద కాలంలో డెభ్భై మూడు ఎకరాల సువిశాలమైన చెరువు మధ్యలో ఆధ్యాత్మిక దివ్యధామం చారిత్రాత్మక పుణ్య ప్రదేశం గర్భగుడిలో స్వయంభూగా వెలిసిన శివలింగానికి రెండు నందులు స్వామివారి సేవలో ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడి కాలంలో నిర్మించారని ఆ సమయంలో విజయనగరం సామ్రాజ్య స్థాపకుడు శ్రీ కృష్ణదేవరాయులు సతీ సమేతంగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారని ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది.

ఆలయ కథ

మార్చు

ఇచ్చోడ లోని సిరిచల్మ గ్రామంలో ఒక దంపతులు ఉండేవారట వాళ్ళకు చాలా సంవత్సరాల వరకు సంతానం పుట్టలేదట ఆ గ్రామంలో పశువుల కాపరిగా వచ్చిన మల్లన్న అనే బాలుణ్ణి వారు పెంచుకున్నారట. కొన్నాళ్లకు ఆ గ్రామంలో తీవ్రమైన కరువు పరి‌స్థితులు రావడంతో ఊర్లో చెరువు తవ్యించాలని నిర్ణయించారు‌[4].అంత స్థోమత ఎవరికి లేదని తెలుసుకున్న మల్లన్న తానే స్వయంగా చెరువు తవ్వుతానని చెప్పి తెల్లావారే సరికి చెరువు తవ్వేశాడట. తర్వాత ఆ బాలుడు మల్లన్న కనిపించకపోవడంతో పరమ శివుడే బాలుడి రూపంలో వచ్చి చెరువు తవ్వాడని ఆ ప్రదేశంలో ఒక శివలింగం దొరకగా అదే ఆ బాలుడైన మల్లన్న స్వరూపమని భావించి ప్రతిష్టాపన చేసి కొలుస్తున్నారు.

ఆలయ విశిష్టత

మార్చు

ఈ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఆలయ బయట ఉన్న నంది పై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆలయ గర్భగుడీలోని స్వామివారిని తాకుతాయి.

ప్రత్యేకత

మార్చు

ఆలయంలో హనుమంతుని కాళ్ల కింద శనిదేవుడు అచేతనుడై ఉండడం, శివాలయానికి గుర్తుగా లింగం ఉపరితలంలో మాడబిల్ల కాస్తలోతుగా ఉండడం,దాని అటు ప్రక్కనే శిలాతట్టు ఉండడం ఆలయ ప్రత్యేకత.

ఈ మల్లన్న స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ఏడు రోజులు పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. జాతర చివరి రోజున ఇచట అగ్నిగుండాలు పేరుస్తారు.ఈ అగ్ని గుండం పై నుంచి నడుచుకుంటూ వెళ్ళుతుంటే చేసిన పాపాలు అన్ని పోతాయని భక్తుల నమ్మకం. ఈ అగ్ని గుండాలనేవి ఇక్కడ ఒక కుటుంబం కొన్ని సంవత్సరాల నుండి బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తుంది. ఫాల్గుణ శుక్ల పంచమి నుండి ఏకాదశి వరకు బ్రహ్మోత్సవాలు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామి వారికి పల్లకీ సేవ,ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది.

ప్రయాణం

మార్చు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సిరిచల్మ గ్రామం ఉంది. ఆదిలాబాద్ నుండి ప్రత్యేక బస్సులతోపాటు ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

మూలాలు

మార్చు
  1. Today, Telangana (2024-03-08). "Maha Shivaratri: Temples of Lord Shiva brimmed with devotees in Adilabad". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-03.
  2. link, Get; Facebook; Twitter; Pinterest; Email; Apps, Other (2016-07-19). "Sri Mallikharjuna Temple at Sirichalma Adilabad". Retrieved 2024-07-03. {{cite web}}: |last2= has generic name (help)
  3. telugu, NT News (2023-08-02). "తెప్పలో వెళ్లి మల్లన్న దర్శనం". www.ntnews.com. Retrieved 2024-07-03.
  4. Bharat, E. T. V. (2024-06-10). "చెరువు మధ్యలో మట్టితట్టలు మోసిన శివయ్య- ఎదురుగా రెండు నందులు- మహిమాన్విత ఆలయం ఎక్కడుందంటే? - Famous Siva Temple". ETV Bharat News. Retrieved 2024-07-03.