సిర్మౌర్

హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా

[1]

సిర్మౌర్ జిల్లా

सिरमौर سپریمو
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంనాహన్
విస్తీర్ణం
 • మొత్తం2,825 కి.మీ2 (1,091 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం4,58,593
 • సాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత79.98%
 • లింగ నిష్పత్తి915
జాలస్థలిఅధికారిక జాలస్థలి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 12 జిల్లాలలో సిర్మౌర్ జిల్లా ఒకటి. ఇది అధికంగా పర్వతమయమై ఉంటుంది. అంతే కాక ఈ జిల్లాలో గ్రామప్రాంతం అధికంగా ఉంటుంది. జిల్లాలో 90% ప్రజలు గ్రామాలలో నివసిస్తునారు. జిల్లాలో నాహన్ (జిల్లాకేంద్రం) అలాగే సుకేటి వద్ద ఉన్న షివాలిక్ ఫాసిల్ పార్క్ వద్ద 8.5 కోట్ల సంవత్సరాలనాటి శిలాజాలను కనుగొనబడ్డాయి. జిల్లాలో 6 తెహసిల్స్ (నాహన్, రేణుక, షిల్లై, రాజ్ఘర్, పచ్చద్, పయోంట సాహెబ్) ఉన్నాయి. ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకగా ఉంది. సిర్మౌర్ వ్యవసాయదారులు ఉర్లగడ్డలు, అల్లం పండిస్తున్నారు. సిర్మౌర్ జిల్లాలో పీచెస్ పండ్లు అధికంగా పండించబడుతున్నాయి. ఈ నాణ్యమైన పీచ్ పండ్లను అందిస్తున్న రాజ్ఘర్‌ను పీచ్ బౌల్ అని మారు పేరుతో పిలుస్తుంటారు. సిర్మౌర్ జిల్లాలో టన్నులకొద్దీ పండ్లు పండించబడుతున్నాయి. పయోంటా వద్ద ఉన్న దౌలా కుయాన్ వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న " ఫ్రూట్జ్ రీసెర్చ్ సెంటర్ " ఉంది. సిర్మౌర్ జిల్లాలోని వ్యవసాయ భూమి మామిడి, ఆఫిల్ పండ్లు పండించడానికి అనుకూలమైంది. ప్రస్తుతం జిల్లాలోని రైతులు టమాటా పంటను కూడా పండిస్తున్నారు. జిల్లాలోని లానా- చాటా ఉన్న పంట భూములలో రైతులు పండ్లకు బదులు ధాన్యాన్ని ఎంచుకున్నారు. గిరీ నదిని ఈ జిల్లాను రెండు సమానభాగాలుగా (గిరిపార్- గిరివార్) విభజిస్తుంది.

సంస్కృతిసవరించు

సోలన్ జిల్లాలో దేవతారాధన, వివిధ అలవాట్లు, ఆచారాలు ఉన్నాయి. జిల్లాలో హిందీ, సిర్మౌరీ భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లలోని పలు ప్రదేశాలలో నిర్వహించబడుతున్న సంతలలో బిషు ఒకటి. బిషు సంతలో తోడానృత్యాలు భాగమై ఉంటాయి. సిర్మౌర్ నృత్యరీతులలో నతి, గీ, రస, బుధేచు ప్రబలమైనవిగా భావించబడుతున్నాయి. వివాహవేడుకలు, దిపావళి పండుగ వంటివి ప్రజలు కోలాహలంగా జరుపుకుంటారు.

చరిత్రసవరించు

సిర్మౌర్ ఒకప్పుడు ఇండియా ఉపఖండంలో స్వతంత్ర రాజ్యంగా ఉండేది. జైసల్మార్ రాజా రసాలూ చేత 1090లో స్థాపించబడింది. ఈ ప్రాంతంలో స్థానికులను సిర్మౌర్ అని పిలిచేవారు. తరువాత ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో సామంత రాజ్యంగా మారింది. ప్రస్తుతమిది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాగా మారింది. ఈ ప్రాంతం ఒకప్పుడు నాహన్ అని పిలువబడేది. దీనిని ఒకప్పుడు రాజపుత్ర వంశానికి చెందిన రాజులు పాలించేవారు.

ఆర్ధికంసవరించు

సిర్మౌర్ జిల్లా ఆర్థికం వ్యవసాయరంగం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో సహజసిద్ధమైన ఖనిజలవణాలు ఉన్నాయి. కంరౌ గ్రామం " లైం స్టోన్ కోటీశ్వరుల భూమిగా "గా పిలువబడుతుంది.

పర్యాటకంసవరించు

హబ్బెన్ లోయసవరించు

సిర్మౌర్ జిల్లాలో హబ్బెన్ లోయ ప్రబల పర్యాటక ఆకర్షణలలో ఒకటి. షిర్గుల్ దేవత ఆలయం, పలు దేవతాలయం, టోకో టిబ్బ కలి & హబ్బెన్ పట్టణం ప్రాంతాలన్నీ నగరజీవితానికి దూరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని అనుభవించవచ్చు. రాజూత్ కోటలోని ప్రఖ్యాత టొక్రూ టిబ్బా కాలి మా, పలు దేవాలయం ఉన్నాయి. భారతదేశంలోని ప్రముఖ షిర్గుల్ ఆలయాలలో ఒకటైన షిర్గుల్ దైవాన్ని సిర్మౌర్, సోలన్, సిమ్లా, ఉత్తరాంచల్, ఢిల్లీ, ఒతరప్రాంతాలలో ఆరాధిస్తుంటారు. దట్టమైన దేవదారు వృక్షాలతో నిండిన అరణ్యాలు భారతదేశం అంతటి నుండి ప్స్ర్యాటకులను ఆకర్షిస్తుంది.

చుర్దార్సవరించు

సిర్మౌర్ జిల్లాలో ఉన్న చుర్ శిఖరం సముద్రమట్టానికి 3,647 మీ ఎత్తున ఉంది. సిర్మౌరీలందరికి మనోహరమైన ఈ పర్వత శిఖరం ప్రముఖ మతసంబంధిత ప్రదేశంగా ఉంది. 11,965 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు శివాలిక్ పర్వతశ్రేణులలో ఒకటి. చుర్దార్‌ను చురచందిని (మంచు గాజు) అని కూడా అంటారు. హిమాలయాలలో ఉన్న అత్యంత సుందర ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ పర్వత శిఖరం నుండి విస్తారంగా ఉన్న హిమమయ శిఖరాలు దర్శనమిస్తున్నాయి. ఘర్వాల్ ప్రాంతంలో బద్రీనాథ్, కేదార్నాథ్ శిఖరాలు కూడా ఈ మనోహర ప్రదేశాలలో ఒకటి. హనుమనుతుడు సంజీవినీ మూలికలను తీసుకువచ్చిన పర్వతం ఇది అని విశ్వసిస్తున్నారు. పురాతన పట్టణ శిథిలాలు " డుండి దీవి " సమీప ంలో కనుగొనబడ్డాయి. ఈ హిమాలయ లోయలలో ఆయుర్వేద మూలికల సంపద, పైన్ వృక్షాలు అధికంగా ఉన్నాయి. వన్యమృగసంరక్షణాలయంలో నడిచివెళ్ళే సమయంలో అనదమైన మోనల్ పక్షుకను (హిమాచల్ ప్రదేశ్ జాతీయ పక్షి), నెమళ్ళను దర్శించవచ్చు. పర్వతారోహకులు చుర్దార్ వద్ద ఉన్న అత్యధిక హిమాపాతం కలిగిన గ్లాసియర్లను (33 అడుల హిమం) అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తరచుగా ష్రిగుల్ ఆలయం కూడా హిమంలో కూరుకు పోతుంది. సూర్యుడు ప్రకాశిస్తున్న రోజులలో బద్రీనాథ్, కేదార్నాథ్ శిఖరాలు, గంగా మైదానాలు, సట్లెజ్ నది, సిమ్లా, చక్రతా పర్వతాలు స్పష్ఠంగా కనిపిస్తుంటాయి. చుర్దార్ శిఖరంలో శివలింగాలు, కాళీ మాతను దర్శించవచ్చు. ఇక్కడ భక్తులు కాళీమాతకు మేకలు, గొర్రెలను బలీవ్వడం, జండాలను కట్టడం, మొక్కుబడులను చెల్లించడం వంటివి చేస్తుంటారు. ఇక్కడకు చేరుకునే మార్గం :- ఈ శిఖరం రేణుక తెహ్సిల్ కేంద్రం దడహు వద్ద నుండి ఆరంభం ఔతుంది. మరొక మార్గంలో రాజ్ఘర్ నుండి మెనస్ రోడ్డు ద్వారా ప్రయాణించి కూడా చేరుకోవచ్చు.

రేణుకా జీసవరించు

సిర్మౌర్ జిల్లాలో మతపరమైన అలాగే పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంత్సలలో రేణుకాజీ ఒకటి. ఇది నాహన్ నుండి 40 కి.మీ దూరంలో వాహనాల ద్వారా పయనించడానికి అనువైన మెటల్ రోడ్డు మార్గంలో ఉంది. ఇక్కడ రేణుకా సరసు ఉంది. పర్యాటకులకు రేణుకా సరసులో బోటుద్వారా పయనించడం చక్కని అనుభవం. బాదం ఆకారంలో ఉన్న ఈ సరసు వైశాల్యం 2.4చ.కి.మి. ప్రతిసంవత్సరం కార్తిక ఏకాదశి సందర్భంలో ఈ సరసును దర్శింక్షడానికి వేలాది భక్తులు వస్తుంటారు. సుదూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ మైదానంలో శిబిరలు ఏర్పరచుకుని రాత్రంతా గడుపుతుంటారు. రాత్రంతా సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఉత్సవసమయంలో ఈ ప్రదేశం అంతా పలు కార్యక్రమాలతో అందంగా మారుతుంది. ఈ ఉత్సవంలో పరశురాముడు స్వస్థలమైన జము నుండి పరశురాముని ఇత్తడి విగ్రహాన్ని మేళతాళాలతో పల్లకీలో తీసుకురాబడుతుంది. ఈ దైవాన్ని 3 రోజులపాటు (ఏకాదశి, ద్వాదశి ) ఆలయంలో ఉంచుతారు. పూజారి పూనకంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు. ద్వాదశి నాడు భక్తులు పవిత్ర రేణుకా సరసులో స్నానం ఆచరించి దైవానికి కానుకలు సమర్పించుకుంటారు.

హరిపూర్ ధార్సవరించు

హరిపూర్ ధార్ సముద్రమట్టానికి 2687 మీ. ఎత్తులో ఉంది. సిర్మౌర్‌లో ఉన్న " మా భంగయాని ఆలయం హరిదార్ పూర్ " చాలా ప్రబలమైంది. హరిపూర్ దార్ అనేది ఒక కొండ. ఈ కొండ చివరన సిర్మౌర్ రాజ్యానికి చెందిన ఒక కోట ఉంది. ఈ కోటను సిర్మౌర్ రాజ్యసరిహద్దులను కాపాడడానికి నిర్మించబడింది. పొరుగున ఉన్న జుబ్బల్ రాజ్యంతో సిర్మౌర్ రాజ్యానికి తరచుగా వివాదాలు తెలెత్తుతూ ఉండేవి. ఒకరి సరిహద్దులను ఒకరు తరచుగా ఆక్రమించుకుంటూ ఉండేవారు. సరిహద్దు రక్షణార్ధం నిర్మించబడిన ఈ కోటను నివాసానికి ఉపయోగించలేదు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ ఆటవీ శాఖకు నివాసయోగ్యంగా ఉంది. పర్వతప్రాంత రాజ్యాలను ఆక్రమించుకున్న కాలంలో జరిగిన చారిత్రక సంఘటనలకు ఇది సాక్ష్యంగా మాత్రమే నిలిచింది. నాహన్‌కు 106 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం రహదారి మార్గంలో బసులద్వారా 40 కి.మీ దూరంలో ఉన్న దడహు వరకు చేరుకోవచ్చు. అక్కడికి ఎగువన ఉన్న అంధేరీ వరకు 44 కి.మీ దూరం జీబులలో చేరుకోవచ్చు. తరువాత 22 కి.మీ వరకు పోనీలలో కాని కాలిబాట ద్వారా కాని ప్రయాణిచాలి. సోలన్, రాజ్ఘర్ వరకు ఉన్న మార్గంలో ఈ ప్రదేశానికి చేరుకోవడం సులువు. ఖరోటియన్‌కు 2కి.మీ దూరంలో ఈ కోట ఉంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 530,164, [1]
ఇది దాదాపు కేప్ వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 542వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత 188 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 15.61%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 915:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 79.98%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

________________________________________________________________________________

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cape Verde 516,100 July 2011 est. line feed character in |quote= at position 11 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సిర్మౌర్&oldid=2864813" నుండి వెలికితీశారు