ప్రధాన మెనూను తెరువు

కోయంబత్తూరు కృష్ణారావు ప్రహ్లాద్ (1941 ఆగస్టు 8 – 2010 ఏప్రిల్ 16) [1] ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తి, ఈయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వ్యవస్థల ఎగువ శ్రేణి యాజమన్యమును సంప్రదించారు. అతను మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని స్టీఫెన్ ఎమ్. రోస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వాణిజ్యసముదాయ విధానాలకు పాల్ మరియు రూత్ మెక్ క్రాకెన్ విలక్షణ విశ్వవిద్యాలయ ఆచార్యుడు.

C. K. Prahalad
CK Prahalad WEForum 2009.jpg
C. K. Prahalad on Nov 8, 2009 at World Economic Forum's India Economic Summit 2009.
జననంAugust 8, 1941[1]
మరణం2010 ఏప్రిల్ 16 (2010-04-16)(వయసు 68)[2]
జాతీయతIndian
విద్యాసంస్థలుLoyola College, Chennai
Harvard Business School
వృత్తిProfessor
మతంHindu
జీవిత భాగస్వామిGayatri
పిల్లలుMurali Krishna, Deepa[3]
వెబ్ సైటుwww.ckprahalad.com/

ఈయన పరిశోధనలు వాణిజ్యసముదాయ విధానములకు మరియు భారీ, విభిన్న, బహుళదేశ వాణిజ్య సముదాయాలలో ఎగుర శ్రేణి యాజమాన్యం యొక్క పాత్ర వంటి వాటికి ప్రత్యేకం. C.K. ప్రహ్లాద్ మూల యోగ్యత మరియు ది ఫార్చ్యూన్ ఎట్ ది బాటం అఫ్ ది పిరమిడ్ సిద్ధాంతాలకు పితామహుడిగా పేరు గడించారు.

ప్రారంభ జీవితంసవరించు

ప్రహ్లాద్ పదకొండు మంది పిల్లలలో తొమ్మిదవ వాడిగా 1941లో తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. ఈయన తండ్రి మంచి పేరున్న సంస్కృత పండితుడు మరియు చెన్నైలో న్యాయమూర్తి[ఉల్లేఖన అవసరం]. 19 సంవత్సరాల వయస్సులో మద్రాసు విశ్వవిద్యాలయంలో భాగమైన చెన్నై లయోలా కళాశాలలో భౌతిక శాస్త్రంలో B.Sc పట్టా పుచ్చుకున్న తరువాత ఆయన స్థానిక యూనియన్ కార్బైడ్ బ్యాటరీ కర్మాగారం నిర్వాహకుని ద్వారా యూనియన్ కార్బైడ్ లో చేరారు. అక్కడ ఆయన నాలుగు సంవత్సరాలు పనిచేసారు. ప్రహ్లాద్ యూనియన్ కార్బైడ్ లో పనిచేసిన అనుభవం తన జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కీలక స్థానం అని చెప్తారు. నాలుగు సంవత్సరాల తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య అభ్యసించారు.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో, ప్రహ్లాద్ 1975లో బహుళ జాతీయ నిర్వహణ మీద ఒక డాక్టరేట్ కు సంబంధించిన సిద్ధాంతాన్ని కేవలం రెండున్నర సంవత్సరములలో వ్రాసి D.B.A. పట్టా పొందారు.[4]

ఆచార్య పదవి మరియు బోధనసవరించు

హార్వర్డ్ లో పట్టా పొందిన తరువాత, ప్రహ్లాద్ తను చేస్తున్న మాస్టర్ డిగ్రీ కొనసాగించేందుకు తిరిగి తన పూర్వ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ కు వచ్చారు. కాని వచ్చిన తరువాత కొద్ది కాలానికే ఈయన తిరిగి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లారు, 1977లో మిచిగాన్ విశ్వవిద్యాలయంలో స్టీఫెన్ M. రోస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వారు ఇతనిని ఉద్యోగంలో నియమించుకున్నారు, అక్కడ ఇతను పూర్తి స్థాయి ఆచార్యుడిగా ఉన్నత ఒడంబడిక నియమాలతో ముందుకు సాగారు. 2005లో ప్రహ్లాద్ విశిష్టమైన ఆచార్యుడిగా విశ్వవిద్యాలయం యొక్క అత్యున్నత ఘనతను సంపాదించారు.

2010 ఏప్రిల్ 16న, ప్రహ్లాద్ ముందుగా రోగనిర్ణయం చేయని ఊపిరితిత్తుల అనారోగ్యంతో సాన్ డియోగో, కాలిఫోర్నియాలో మరణించారు.[2]

సాధనలుసవరించు

రచనలు, ఆసక్తులు, మరియు వ్యాపార అనుభవంసవరించు

ప్రహ్లాద్ యొక్క ఖ్యాతి మేనేజ్మెంట్ గురుగా అప్పుడప్పుడే వెలుగొందుతున్న రోజులలో, 90 దశాబ్ద ఆరంభంలో ఫిలిప్స్ జాన్ టిమ్మర్ కి దివాలాకు తయారుగా ఉన్న ఆ విద్యుత్ పరికరాల వాణిజ్య సముదాయాన్ని పునర్నిర్మితం చేయుటలో సలహా ఇచ్చారు. 2-3 సంవత్సరాల పాటు నడిచిన ఆపరేషన్ సెంచూరియన్ విజయవంతమైన ఫలితంగా, ఇతను కూడా తరచూ ఫిలిప్స్ నిర్వాహక సమూహాలతో ఉండేవారు.

C. K. ప్రహ్లాద్ వాణిజ్య సముదాయ విధానాలలో అసంఖ్యాక ప్రముఖ పరిశోధనలకు సహ-రచయిత, వీటిలో ది కోర్ కాంపిటెన్స్ ఆఫ్ ది కార్పోరేషన్ (గ్యారీ హమేల్ తో, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ, మే–జూన్, 1990) కూడా ఉంది. ఇవి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రచురించి మరియు బాగా ఎక్కువగా పునర్ముద్రణ చేసిన వ్యాసాలు.[5] ఈయన ఇంకా అనేక అంతర్జాతీయ ఉత్తమ అమ్మకాలను రచించారు, వీటిలో: కంపీటింగ్ ఫర్ ది ఫ్యూచర్ (గ్యారీ హమేల్ తో), 1994; ది ఫ్యూచర్ ఆఫ్ కాంపిటేషన్ (వెంకట్ రామస్వామితో), 2004; మరియు ది ఫార్చ్యూన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్: ఎరాడికేటింగ్ పావర్టీ త్రూ ప్రాఫిట్స్ వార్టన్ స్కూల్ పబ్లిషింగ్, 2004. ఇతని ఆఖరి పుస్తకం, M. S. కృష్ణన్ సహ-రచనతో ఏప్రిల్ 2008లో ప్రచురించిన ది న్యూ ఏజ్ ఆఫ్ ఇన్నోవేషన్ .

ప్రహ్లాద్ ప్రజా ఇంక్. సహ వ్యవస్థాపకుడు ఆ తరువాత అదే వ్యవస్థకు CEO అయ్యారు. ("ప్రజా" సంస్కృత పదం "ప్రజా" నుండి వచ్చింది దీని అర్ధం "పౌరుడు" లేదా "సామాన్య ప్రజలు"). ఈ వ్యవస్థ లక్ష్య పరిధి ఏవిధంగా ఉంటుందంటే సామాన్య ప్రజానీకం కూడా ఎటువంటి నిషేధం లేకుండా సమాచారమును పొందవచ్చు (ఈ ఇతివృత్తం "బాటమ్ ఆఫ్ పిరమిడ్" లేదా BOP సిద్ధాంతానికి సంబంధించింది.) వివిధ నిర్వహణ ఆలోచనలను ఒక వేదిక మీద పంచుకోవచ్చు. ఈ వ్యవస్థ యొక్క పనిసామర్ధ్యం అంచెలంచెలుగా దాని మూడోవంతుకు పడిపోయింది మరియు TIBCO కు అమ్మివేయబడింది. తను చనిపోయే నాటికి, ఇతను ఇంకా ఇండస్ వ్యాపారవేత్తల TiE మండలిలో ఉన్నారు.

పది సంవత్సరాలుగా చేపడుతున్న ముఖ్యమైన సర్వేలలో అత్యుత్తమ నిర్వహణ దార్శనికులలో ప్రహ్లాద్ మొదటి పది స్థానాలలో ఒక స్థానంలో ఉంటూనే ఉంటారు. బిజినెస్ వీక్ ఆయన గురించి ఏమని వ్యాఖ్యానించింది అంటే : "మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఒక తెలివైన భోధకుడు, ఈయన ఈ నాటి వ్యాపార విధానాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప దార్శనికుడు అయి ఉండవచ్చు". ఈయన ప్రైవేటు రంగ మరియు పురోగమనం మీద సంయుక్త రాజ్యాల యొక్క బ్లూ రిబ్బన్ కమిషన్ సభ్యుడు. ఈయన నిర్వహణ మరియు ప్రజా పరిపాలనకి సహాయాల కొరకు 2000 సంవత్సరంలో భారత రాష్ట్రపతిచే లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

గౌరవాలు మరియు అవార్డులుసవరించు

 • 2009లో ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుని ఆయన అందుకున్నారు.[6]
 • 2009లో ఆయనకు, భారత ప్రభుత్వం చేత ఇవ్వబడుతున్న 'పౌర సన్మాన అవార్డుల సోపానములో మూడవ స్థానంలో ఉన్న పద్మ భూషణ్ లభించింది.
 • 2009లో టైమ్స్ ప్రచురించిన ప్రపంచం యొక్క అత్యంత ప్రభావిత వ్యాపార దార్శనికుడుగా నిలిచారు [Thinkers50.com].[7]
 • 2009లో, ది రాజ్క్ లాస్జ్లో కాలేజ్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ (కార్వినస్ యూనివర్సిటీ అఫ్ బుడాపెస్ట్) నుండి హెర్బర్ట్ సైమన్ అవార్డుని ఆయన అందుకున్నారు.

వీటిని కూడా చూడండిసవరించు

 • బాటమ్ ఆఫ్ పిరమిడ్
 • మూల యోగ్యత
 • సహ-సృష్టి

సూచనలుసవరించు

 1. 1.0 1.1 Notable Alumni: Dr. C K Prahalad. IIMA USA Chapter.
 2. 2.0 2.1 Stern, Stefan (April 19, 2010). "Manifesto writer for business survival". Financial Times. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "ft" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. http://www.deccanherald.com/content/64381/management-guru-c-k-prahalad.html
 4. ఆచార్య C.K. ప్రహ్లాద్
 5. Schumpeter (April 24, 2010). "The guru of the bottom of the pyramid". The Economist.
 6. http://specials.rediff.com/news/2009/jan/09slide1-ప్రవాసి-భారతీయ-దివస్-అవార్డులు-వేడుక.htm
 7. http://news.therecord.com/బిజినెస్/వ్యాసం/613813

బాహ్య లింకులుసవరించు