సి ఎస్ బి బ్యాంక్ లిమిటెడ్

సిఎస్ బి బ్యాంక్ లిమిటెడ్( కాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్) (CSB Bank Limited - Catholic Syrian Bank Limited) 1920 సంవత్సరంలో త్రిస్సూర్ ప్రధాన కార్యాలయంగా, కేరళ రాష్ట్రములో స్వాతంత్ర్య పూర్వ ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంకుకు భారతదేశ వ్యాప్తంగా శాఖలతో,ఎటిఎమ్ ల నెట్ వర్క్ తో విస్తరించిన బ్యాంక్ గా ఉన్నది.

సి ఎస్ బి బ్యాంక్ లిమిటెడ్
Formerly కాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్
Typeపబ్లిక్
పరిశ్రమబ్యాంకింగ్
ఆర్ధిక సేవలు
స్థాపనమూస:ప్రారంభించిన తేదీ
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంత్రిస్సూర్, కేరళ, భారతదేశం
Number of locations
426 శాఖలు [1] (2016–17)
Areas served
ప్రాంతాల సేవలు
Key people
ప్రళయ్ మోండల్l
(మేనేజింగ్ డైరెక్టర్ & ముఖ్య నిర్వహణ అధికారి - తాత్కాలికం)
Productsవినియోగదారుల బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, తనఖా రుణాలు, ప్రైవేట్ బ్యాంకింగ్ , సంపద నిర్వహణ(వెల్త్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్
RevenueIncrease1,617.49 crore (US$200 million) (2017)[1]
Increase 118.57 crore (US$15 million) (2021)[1]
Increase 1.55 crore (US$1,90,000) (2017)[1]
Total assetsIncrease16,223.24 crore (US$2.0 billion) (2017)[1]
OwnerFairfax Financial
Number of employees
4700 (2022)[1]
Capital ratio22%[1]

చరిత్ర మార్చు

సిఎస్ బి బ్యాంక్ త్రిస్సూర్ జిల్లాలో ప్రధాన కార్యాలయాలయంగా జనవరి 1921 న రూ. 5 లక్షల అధీకృత మూలధనంగా,రూ. 45270/- పెయిడ్ అప్ క్యాపిటల్ తో ప్రారంభించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో తన శాఖలతో గుర్తింపుత, మైక్రో ఎటిఎమ్ లు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్ సర్వీసెస్ ,యుపిఐ వంటి వివిధ సేవలతో వినియోగదారులకు సేవలను అందిస్తున్నది.[2]

అభివృద్ధి మార్చు

సిఎస్ బి బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం రెండవ షెడ్యూలులో చేర్చబడినందున, 1969 లో బ్యాంకు ఒక షెడ్యూల్డ్ బ్యాంకుగా మారింది. 1972 సంవత్సరంలో మహారాష్ట్ర రాజధాని ముంబై చెంబూరులో తన మొదటి శాఖను ప్రార౦భి౦చి౦ది. 1975వ సంవత్సరంలో బ్యాంకింగ్ ద్వారా "ఎ క్లాస్" షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాను పొంది, ఆ సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించింది. కాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్ పేరు ఉన్న ప్రాంతాలు, కమ్యూనిటీ సంబంధిత అవగాహన సమస్యలను పరిష్కరించడానికి, 2019 సంవత్సరంలో "సిఎస్ బి బ్యాంక్ లిమిటెడ్" పేరుగా మారింది.[3]

సేవలు మార్చు

సిఎస్ బి బ్యాంక్ లిమిటెడ్ వినియోగదారుల సేవలలో ట్రెజరీ, కార్పొరేట్/హోల్ సేల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, ఇతర బ్యాంకింగ్ బిజినెస్ వంటి నాలుగు విభాగాలలో వివిధ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. రిటైల్ బ్యాంకింగ్ బంగారుపై రుణాలు, ఆస్తులపై రుణాలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ రుణాలు, కరెంట్ ఖాతాలు , పొదుపు ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు,సంచిత డిపాజిట్ ఖాతాలు వినియోగదారులకు ఉన్నాయి, వీటి నుంచి వంటి ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది[4].

మార్చి 31, 2021 నాటికి, సిఎస్ బి బ్యాంక్ లిమిటెడ్ 518 శాఖలతో, (వీటిలో 3 సేవా శాఖలు, 3- అసెట్ రికవరీ శాఖలు) 318 ఎటిఎంలు ఉన్నాయి.[5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Balance Sheet 31.03.2017" Archived 2022-10-24 at the Wayback Machine (16 March 2018).
  2. www.ambitionbox.com. "CSB Bank Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
  3. "CSB Bank(),Profile, Latest News, Press Release, MOU, CSR". www.psuconnect.in. Retrieved 2022-08-17.
  4. "CSB Bank Company Profile: Stock Performance & Earnings | PitchBook". pitchbook.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
  5. "CSB Bank Limited (CSBBANK.NS) Company Profile & Facts - Yahoo Finance". finance.yahoo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.