సీతాదేవి (సినిమా)

సీతాదేవి 1982 లో విడిదలైన తెలుగు చిత్రం, చిరంజీవి, సుజాత (నటి), సత్యేంద్ర కుమార్, రాళ్ళపల్లి, హరి బాబు, డబ్బింగ్ జానకి, పిఎల్ నారాయణ, వంకాయల సత్యనారాయణ నటించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకుడు.

సీతాదేవి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈరంకి శర్మ
నిర్మాణం టి రామన్
తారాగణం సుజాత,
చిరంజీవి,
జానకి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ కథ తమ్ముడు (చిరంజీవి) అక్క (సుజాత) ల చుట్టూ తిరుగుతుంది. సుజాత తన బాల్యంలో ఒక ఉయ్యాల మీద నుండి పడిపోతుంది. ఆమె కుడి చేయి చచ్చుపడిపోతుంది. భార్య చనిపోయిన ఒక పోలీసు అధికారి (సత్యేంద్ర కుమార్) సుజాతను పెళ్ళి చేసుకుంటాడు. సుజాత పెళ్ళి కోసం చిరంజీవి రాళ్ళపల్లి ప్రభావంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటాడు. పెళ్ళి జరిగిన రోజున చిరంజీవిని పోలీసులు అరెస్టు చేస్తారు. తమ్ముడు దొంగ అయినందున సుజాత భర్త ఆమెను వదిలేస్తాడు. తన భర్తతో ఏకం కావడానికి సుజాత ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందనేది మిగతా సినిమా.

తారాగణం

మార్చు
  • చిరంజీవి
  • సుజాత
  • హరిబాబు
  • రాళ్ళపల్లి
  • రజని
  • జానకి
  • జయశ్రీ
  • సత్యేంద్ర కుమార్
  • పి.ఎల్.నారాయణ
  • వంకాయల సత్యనారాయణ

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: ఈరంకి శర్మ
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

పాటల జాబితా

మార్చు
  1. ఇన్నేళ్ల నా తపస్సు ఈడెరెను ఆవేళ నీ ఇంటి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: ఆత్రేయ
  2. తెలుగు వంటి తేనె వంటి దీపం వంటి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: ఆత్రేయ
  3. దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆత్రేయ.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.