సీతారాముల కళ్యాణం చూతము రారండీ

(సీతారాముల కళ్యాణం చూతము రారండి నుండి దారిమార్పు చెందింది)

సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని సీతారామ కళ్యాణం (1961) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికి శ్రీరామనవమి నాడు, హిందువుల పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన హరనాథ్, సీతగా నటించిన గీతాంజలి పై చిత్రీకరించారు.

"సీతాకల్యాణ వైభోగము" అని త్యాగయ్య రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు.[1]

నేపథ్యం

మార్చు

శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గుర్వాజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. శివ ధనుర్భంగం చేసిన పిదప సీతారాముల కల్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్ళిమండపంలో వివిధ కల్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు.

సీతా రాముల కల్యాణము చూతము రారండీ పాట

మార్చు

సీతా రాముల కళ్యాణము చూతము రారండీ

సీతా రాముల కల్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూసిక్ ]
చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట
[చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట] — [ కోరస్ ]
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట..ఆ.ఆ.ఆ.ఆ.....
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట

కల్యాణము చూతము రారండి...

[ మ్యూజిక్ ]
దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా
[దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా] — [ కోరస్ ]
ధరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ధరణీ జాతిని స్థావన చేయగా... నరుడై పుట్టిన పురుషోత్తముని
కల్యాణము చూతము రారండి..
[ మ్యూజిక్ ]
దశరథ రాజు సుతుడై వెలసి... కౌశికు యాగము రక్షణ చేసి..
[దశరథ రాజు సుతుడై వెలసి...కౌశికు యాగము రక్షణ చేసి] — [ కోరస్ ]
జనకుని సభలో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ.....
జనకుని సభలో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]
సీతారాముల కల్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూసిక్ ]
సిరి కల్యాణపు బొట్టును పెట్టి...
బొట్టును పెట్టి — [ కోరస్ ]
మణి బాసికమును నుదుటన గట్టి
నుదుటన గట్టి — [ కోరస్ ]
పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ.....
పారాణిని పాదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీతా..
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి — [ కోరస్ ]
ఒంపుగ కాపురి నామము గీసి
నామము గీసి — [ కోరస్ ]
చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ.....
చంపగ వాసి చుక్కను పెట్టీ...పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..

కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి

[ మ్యూజిక్ ]
జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై — [ కోరస్ ]
రాముని దోసిట నీలపు రాసై
నీలపు రాసై — [ కోరస్ ]
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరమున వెలసిన సీతారాముల..
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]

1998 సినిమా

మార్చు

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి అనే పేరుతో 1998లో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా ఒక సినిమా నిర్మించబడింది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. సీతారామ కళ్యాణము (1961), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:45-69.