సీమా బిస్వాస్
సీమా బిస్వాస్ (జననం 14 జనవరి 1965), హిందీ నాటకరంగ, సినిమా నటి. 1994లో శేఖర్ కపూర్ తీసిన బ్యాండిట్ క్వీన్ సినిమాలో ఫూలన్ దేవి పాత్రలో నటించి, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[1] 2005లో దీపా మెహతా తీసిన వాటర్ సినిమాలోని శకుంతల పాత్రకు సంగీత నాటక అకాడమీ అవార్డు, 2006 ఉత్తమ నటి జెనీ అవార్డును అందుకుంది. ఖామోషి: ది మ్యూజికల్ (1996) సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును కూడా అందుకుంది. భూత్ (2003), వివాహ్ (2006), హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ (2017) వంటి సినిమాలతోపాటు, అనేక టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.
సీమా బిస్వాస్ | |
---|---|
జననం | |
వృత్తి | నాటకరంగ, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1988–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | బాండిట్ క్వీన్ |
జననం, విద్య
మార్చుసీమా 1965, జనవరి 14న జగదీష్ - మీరా దంపతులకు అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణంలో జన్మించింది.[2] నల్బరి పట్టణంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సీమా, అస్సాంలోని నల్బారి కళాశాల నుండి ఆనర్స్‌తో పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైంది. తరువాత, న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాటకరంగంలో శిక్షణ పొందింది.[1]
సినిమారంగం
మార్చుకృష్ణన్ కర్తా తీసిన అమ్షిని (హిందీ) సినిమాలో సీమా హీరోయిన్‌గా నటించింది. 1988 జరిగిన ఫిల్మోత్సవ్ లో ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రవేశించింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీలో సీమా నటనను చూసిన శేఖర్ కపూర్ బ్యాండిట్ క్వీన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతకుముందే సీమా అస్సామీ సినిమాలో నటించింది. 1996లో సంజయ్ లీలా బన్సాలీ తీసిన ఖామోషి: ది మ్యూజికల్ సినిమాలో నానా పటేకర్ సరసన ఫ్లావీ అనే చెవిటి, మూగ మహిళ పాత్రలో నటించింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును గెలుచుకుంది. హిందీ, మరాఠీ, మలయాళం, తమిళ సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించింది.[3] 2014లో, గోవాలో నవంబరు 20 నుండి 30 వరకు జరిగిన 45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సీమా బిశ్వాస్ జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది.[4]
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర |
---|---|---|
2014–15 | మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహానీ | మై ముయి |
2019 | లీలా | |
2020 | దాడీ అమ్మా దాడి అమ్మ మాన్ జావో! | దాది అమ్మ |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2020 | కోడ్ ఎం | ఆసిఫ్ తల్లి | ఏఎల్టి బాలాజీ/జీ5 |
2021 | ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 | పీఎం బసు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
2022 | హ్యూమన్ | రోమా మా | డిస్నీ+హాట్‌స్టార్ |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డులు | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
1995 | జాతీయ చలనచిత్ర అవార్డులు | బాండిట్ క్వీన్ | ఉత్తమ నటి | గెలుపు[5] |
1997 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ నూతన నటి | గెలుపు | |
ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
ఖామోషి: ది మ్యూజికల్ | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది | ||
స్టార్ స్క్రీన్ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | గెలుపు | ||
2001 | సంగీత నాటక అకాడమీ అవార్డు | మొత్తం సహకారం | గెలుపు | |
2003 | స్టార్ స్క్రీన్ అవార్డులు | కంపెనీ | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది |
2004 | భూత్ | ప్రతిపాదించబడింది | ||
2006 | 26వ జీనీ అవార్డులు | నీటి | ఉత్తమ నటి | గెలుపు |
2013 | కెనడియన్ స్క్రీన్ అవార్డులు | మిడ్‌నైట్ చిల్డ్రన్ | ఉత్తమ సహాయ నటి | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Bandit queen used to cry all night, used to act nude in front of director and cameraman". News Track. 14 January 2020. Retrieved 2022-02-11.
- ↑ Vasisht, Divya (24 June 2003). "Seema Biswas: Beyond the limelight". The Times of India. Retrieved 2022-02-11.
- ↑ Kumar, Anuj (3 March 2007). "Beyond the image". The Hindu (Metro Plus Mangalore ed.). Archived from the original on 7 November 2012. Retrieved 2022-02-11.
- ↑ Pranjal Borah (21 November 2014). "Seema Biswas as Jury in 45th International Film Festival of India". KothaSobi. Archived from the original on 2021-01-13. Retrieved 2022-02-11.
- ↑ "43rd National Film Awards – 1996". Directorate of Film Festivals. pp. 26–27. Archived from the original on 15 December 2013. Retrieved 2022-02-11.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సీమా బిస్వాస్ పేజీ