సుజుకి
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Suzuki Motor Corporation (スズキ株式会社 Suzuki Kabushiki-Kaisha ) అనేది జపాన్ లోని హమాట్సులో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక జపనీస్ బహుళ జాతీయ సంస్థ, అది కాంపాక్ట్ ఆటోమొబైల్స్ మరియు 4x4 వాహనాలు, సంపూర్ణ శ్రేణిలో మోటార్ సైకిళ్ళు, ఆల్-టెరైన్ వెహికల్స్ (ATVs), ఔట్‌బోర్డ్ మెరైన్ ఇంజన్లు, వీల్చైర్లు మరియు వివిధ రకాలైన ఇతర చిన్నపాటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు తయారు చేయడంలో ప్రత్యేక ప్రావీణ్యం కలిగిన సంస్థ. ఉత్పాదక పరిమాణం విషయంలో సుజుకి ప్రపంచంలో 9వ అతిపెద్ద ఆటోమొబైల్ ఉత్పాదక సంస్థ,[6] ఈ సంస్థ 45,000 మంది ఉద్యోగుల సేవలను వినియోగిస్తుంది, దానికి 23 దేశాలలో 35 ముఖ్య ఉత్పాదక సౌలభ్యాలు మరియు 192 దేశాలలో 133 పంపిణీదారులు ఉన్నారు.[ఉల్లేఖన అవసరం] జపాన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (JAMA) గణాంకాల ప్రకారం, చిన్న కార్లు మరియు ట్రక్కుల తయారీలో సుజుకి జపాన్ యొక్క రెండవ అతిపెద్ద ఉత్పాదక సంస్థ.
![]() | |
రకం | Public (TYO: 7269) |
---|---|
స్థాపితం | 1909 (as Suzuki Loom Works) |
వ్యవస్థాపకు(లు) | Michio Suzuki |
ప్రధానకార్యాలయం | Hamamatsu, Shizuoka, Japan |
కీలక వ్యక్తులు | Osamu Suzuki, Chairman of the Board, President, CEO, COO and Representative Director[1] |
పరిశ్రమ | Automobile |
ఉత్పత్తులు | |
ఆదాయం | ![]() |
నిర్వహణ రాబడి | ![]() |
మొత్తం ఆదాయము | ![]() |
ఉద్యోగులు | 14,266 (2009)[5] |
అనుబంధ సంస్థలు | |
వెబ్సైటు | GlobalSuzuki.com |
"సుజుకి"ని జపనీస్ భాషలో [suzuki]అని ఉఛ్చరిస్తారు, అందులో [ki] మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆంగ్లభాషలో దానిని /səˈzuːki/sə-ZOO-kee అని ఉఛ్చరిస్తారు, దానిలో జు మీద ఒత్తిడి అధికంగా పెడతారు. ఆంగ్ల భాష మాట్లాడేవారిని ఆకర్షించడానికి ఉద్దేశించిన మార్కెటింగ్ ప్రచారాలలో సుజుకి సంస్థ ఈ ఉఛ్చారణని ఉపయోగించింది.
విషయ సూచిక
- 1 చరిత్ర
- 2 మారుతి సుజుకి
- 3 అమెరికన్ సుజుకి మోటార్ కార్పొరేషన్ చరిత్ర
- 4 పాకిస్తాని సుజుకి మోటార్ కంపెని లిమిటెడ్
- 5 సుజుకి కెనడా ఇన్కార్పొరేటెడ్ చరిత్ర
- 6 OEM ఒప్పందాలు
- 7 ఆటోమొబైల్స్
- 8 మోటార్‌సైకిళ్ళు
- 9 ఆల్-టెరైన్ వెహికల్స్ (ATVs)
- 10 సంఘటనల స్ఫోన్సర్షిప్
- 11 వీటిని కూడా చూడండి
- 12 సూచనలు
- 13 బాహ్య లింకులు
చరిత్రసవరించు
This section includes a list of references, but its sources remain unclear because it has insufficient inline citations. (July 2009) |
1909లో, మిచియో సుజుకి (1887-1982), జపాన్‌లోని హమామట్సు అనబడే ఒక చిన్న సముద్రపు కోస్తా గ్రామంలో సుజుకి లూమ్ వర్క్స్ స్థాపించాడు. సుజుకి జపాన్ యొక్క బ్రహ్మాండమైన సిల్కు పరిశ్రమ కోసం నేత మగ్గాలు నిర్మించడంతో వ్యాపారం దిన దిన ప్రవర్ధమానమయ్యింది.[7] 1929లో, మిచియో సుజుకి ఒక కొత్త రకపు నేత మగ్గం కనిపెట్టాడు, దానిని విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. సుజుకి 120 దాకా పేటెంట్స్ మరియు యుటిలిటి మోడల్ రైట్స్‌ను దాఖలు చేసాడు.[ఉల్లేఖన అవసరం] సంస్థ మొదటి 30 సంవత్సరాలు ఈ అసాధారణమయిన సంక్లిష్టమయిన యంత్రాల యొక్క అభివృధ్ధి మరియు ఉత్పత్తి పైన దృష్టి కేంద్రీకరించింది.[ఉల్లేఖన అవసరం]
మగ్గాలు విజయవంతమయినప్పటికీ, సుజుకి తన సంస్థ ఇతర రంగాలలోకి మళ్ళాలని గుర్తించి ఇతర వస్తువులపై దృష్టి పెట్టడం మొదలు పెట్టాడు. వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అతను ఒక చిన్న కారుని నిర్మించడం అత్యంత ఆచరణయోగ్యమయిన కొత్త వ్యాపారమని నిర్ణయించాడు. పధకం 1937లో మొదలయ్యింది, రెండేళ్ళలో సుజుకి అనేక కాంపాక్ట్ ప్రొటోటైప్ కార్లను నిర్మించింది. ఈ మొదటి సుజుకి మోటారు వాహనాలు ఒక వినూత్నమయిన, ద్రవంచేత చల్లబరిచే, ఫోర్‌స్ట్రోక్, నాలుగు సిలిండర్ల ఇంజన్ చేత శక్తినివ్వబడినది. అది ఒక కాస్ట్ అల్యూమినియం క్రాంక్కేస్ మరియు గేర్‌బాక్స్ కలిగి ఉండి, 800cc కంటే తక్కువ స్థానభ్రంశం నుండి అది 13 horsepower (9.7 kW)ఉత్పత్తి చేసింది.
రెండవ ప్రపంచ యుధ్ధం ఆగమనంతో, ప్రభుత్వం పౌరప్రయాణీకుల కార్లను "అత్యవసర వస్తువు కాదు" అని ప్రకటించడంతో సుజుకి యొక్క క్రొత్త వాహనాల ఉత్పత్తి ప్రణాళికలు ఆగాయి. యుధ్ధం పూర్తి అయ్యాక, సుజుకి తిరిగి మగ్గాలను ఉత్పత్తి చేయసాగింది. జపాన్‌కు ప్రత్తి ఎగుమతికి U.S. ప్రభుత్వం అనుమతినివ్వడంతో, మగ్గాల ఉత్పత్తి ఊపందుకుంది. స్థానిక వస్త్రపరిశ్రమ ఉత్పత్తిదారుల నుండి ఆర్డర్లు పెరగడం మొదలవ్వడంతో సుజుకి యొక్క భాగ్య రేఖలు కాంతివంతం కాసాగాయి. కానీ 1951లో ప్రత్తికి గిరాకీ పడిపోవడంతో ఆ సంతోషం అనతికాలం మాత్రమే కొనసాగింది.
ఈ బ్రహ్మాండమైన సవాలుతో, సుజుకి యొక్క ఆలోచనలు తిరిగి మోటారు వాహనాల మీదకు మళ్ళాయి. యుధ్ధం తర్వాత, జపనీయులకు కొనడానికి ధరల విషయంలో అందుబాటులో ఉండి, నమ్మదగిన వ్యక్తిగత రవాణా కొరకు ఉపయోగపడే వాహనాలకు సంబంధించిన గొప్ప అవసరం ఉంది. అనేక సంస్థలు విలక్షణమయిన సైకిల్‌కు జోడించగలిగిన "క్లిప్-ఆన్" గాస్ చేత శక్తినివ్వబడిన ఇంజన్లను అందివ్వడం మొదలు పెట్టాయి. సుజుకి యొక్క మొదటి రెండు చక్రాల నైపుణ్యం, "పవర్ ఫ్రీ" అనబడే ఒక యంత్రీకరణ చేయబడిన సైకిల్ యొక్క రూపంలో వెలికి వచ్చింది. చవకగా ఉండేందుకు ఇంకా నిర్మించడానికీ మరియు నిర్వహణకు అనువుగా ఉండేలా రూపకల్పన చేయబడిన 1952 పవర్ ఫ్రీలో 36cc, ఒక హార్స్పవర్, టూస్ట్రోక్ ఇంజన్ ఉంటాయి.[8] ఇంతకు మునుపెన్నడూ లేని లక్షణం డబుల్-స్ప్రాకెట్ గేర్ సిస్టమ్, అది వాహన చోదకుడిని ఇంజన్ సాయం అందిస్తుండగా సైకిల్ తొక్కడం, ఇంజన్ సాయం లేకుండా తొక్కడం, లేదా తొక్కే పనిని పూర్తిగా ఆపివేసి కేవలం ఇంజన్ శక్తితో మాత్రమే నడిపించే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ ఎంత నైపుణ్యత కలిగినదంటే కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క పేటెంట్ కార్యాలయం సుజుకి సంస్థకు మోటార్‌సైకిల్ ఇంజనీరింగ్‌లో పరిశోధనకు ఆర్థిక సబ్సిడీ మంజూరు చేసింది, ఆ విధంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ జనియించింది.
1953లో, సుజుకి, మౌంటి ఫ్యూజి హిల్ క్లైంబ్లో అతిచిన్న 60 cc "డైమండ్ ఫ్రీ" తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నపుడు సుజుకి తన అనేకమయిన పందెపు విజయాలలో మొదటి విజయాన్ని సాధించింది.[8]
1954కి, సుజుకి నెలకు 6,000 మోటారు సైకిళ్ళను ఉత్పత్తి చేయసాగింది ఇంకా అది తన పేరును అధికారికంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మార్చింది. తన మొదటి మోటారు సైళ్ళు విజయవంతమవ్వడంతో సుజుకి తన మరింత విజయవంతమయిన ఆటోమొబైల్: ది 1955 సుజుకి సుజులైట్ను సృష్టించింది. మొదటి నుండి సుజుకి తన పెంచాంట్ను వినూత్న కల్పన కోసం షోకేస్‌లో ఉంచింది. అర్థ శతాబ్దం తర్వాత కార్లలో అతి సాధారణమైన ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ మరియు రాక్-అండ్-పినియన్ స్టీరింగ్ ఫీచర్స్‌ను సుజులైట్ కలిగి ఉంది.
చారిత్రక కాలగమనంసవరించు
- 1909 - Mr. మిచియో సుజుకి ద్వారా సుజుకి లూమ్ వర్క్స్, షిజౌకా ప్రిఫెక్చర్ (ముఖ్యకార్యనిర్వహణాధికారి చేత నడుపబడుతోన్న జిల్లా), హమామట్సులో స్థాపించబడింది.
- 1920 - పునర్వ్యవస్థీకరించబడి, ఇంకార్పొరేట్ చేయబడి, 500,000 యెన్లచే పెట్టుబడి పెట్టబడి మిచియో సుజుకి ప్రెసిడెంట్‌గా సుజుకి లూమ్ మానుఫాక్చరింగ్ కంపెనీగా అవతరించింది.
- 1952 - 'పవర్ ఫ్రీ' మోటారుచే నడుపబడే సైకిల్‌ను అమ్మకానికి పెట్టారు.[8]
- 1954 - కంపెనె పేరు సుజుకి మోటార్ కంపెని., లిమిటెడ్‌గా మార్చబడింది.
- 1955 - బరువు తక్కువ ఉన్న కారు సుజుకి సుజులైట్ (360 cc, 2 - స్ట్రోక్) ఫ్రంట్ వీల్ డ్రైవ్, అమ్మకానికి పెట్టారు, అది జపాన్ యొక్క తక్కువ బరువున్న కార్ల శకానికి నాంది పలికింది.
- 1961 - లూమ్ మెషీన్ విభాగాన్ని మోటార్ వర్క్స్ మరియు లైట్‌వెయిట్ ట్రక్ 'సుజులైట్ కారీ'ల నుండి వేరు చేయబడి స్థాపించబడిన సుజుకి లూమ్ మానుఫాక్చరింగ్ కంపెని యొక్క క్రయవిక్రయ ప్రక్రియ మొదలయ్యింది.
- 1962 - ఐల్ ఆఫ్ మాన్ TTలో సుజుకి 50 cc క్లాస్ ఛాంపియన్షిప్ గెలిచింది.
- 1963 - లాస్ ఏంజిల్స్‌లో U.S. సుజుకి మోటార్ కార్పొరేషన్., ఒక ప్రత్యక్ష అమ్మకాల అనుబంధ సంస్థ ప్రారంభించబడింది.
- 1965 - 'D55' (5.5 hp, 2-స్ట్రోక్) ఔట్‌బోర్డ్ మోటార్ క్రయవిక్రయప్రక్రియ మొదలయ్యింది అది మార్కెట్లో వేగంగా తన ఉనికి చాటుకుంది ఇంకా ఫ్రొంటె 800 కూడా అమ్మకానికి వచ్చింది.
- 1967 - థాయి సుజుకి మోటార్ కంపెని లిమిటెడ్ ఒక స్థానిక అస్సెంబ్లి ప్లాంట్‌ను స్థాపించింది.
- 1968 - కారి ఫుల్-కాబ్ వాన్ క్రయవిక్రయాలు మొదలు పెట్టడం జరిగింది.
- 1970 - LJ-సీరీస్ (జిమ్ని) 4x4 క్రయవిక్రయాలు మొదలు పెట్టడం జరిగింది.
- 1971 - Ts185 ఎండ్యూరో క్రయవిక్రయాలు మొదలు పెట్టడం జరిగింది.
- 1971 - GT750 మోటార్ సైకిల్ క్రయవిక్రయాలు మొదలు పెట్టడం జరిగింది.
- 1973 - సుజుకి కనడా లిమిటెడ్., కెనడాలోని ఆంటారియాలో ప్రారంభించబడింది.
- 1974 - జకార్తాలో సుజుకి ఇండొనీషియా మానుఫాక్చరింగ్ స్థాపించబడింది, యంత్రీకరించబడిన వీల్‌చెయిర్‌ను సుజుకి మోటార్ చెయిర్ పేరుతో క్రయవిక్రయాలు మొదలు పెట్టి వైద్య పరికరాల రంగంలో ప్రవేశించింది; తర్వాత ప్రిఫాబ్ 'మినిహౌశ్ యొక్క రెండు నమూనాలు మరియు మూడు రకాల స్టోరేజ్ షెడ్లను సుజుకి హోమ్ మార్కెటింగ్ ద్వారా అమ్మకానికి పెట్టి గృహనిర్మాణ రంగంలోకి విస్తరించింది.
- 1975 - ఫిలిపీన్స్లోని మనిలాలో ఆంటోనియో సుజుకి కార్పొరేషన్., తేలిగ్గా జోడించి ఉత్పత్తి చేయడం కోసం మరియు అమ్మకాల కొరకు జాయింట్ వెంచర్ స్థాపించబడింది.
- 1976 - GS-సీరీస్ మోటార్ సైకిళ్ళు క్రయవిక్రయాలు మొదలు పెట్టబడ్డాయి.
- 1977 - LJ80 4x4 వాహనం క్రయవిక్రయాలు మొదలయ్యాయి ఇంకా GS1000H మోటార్‌సైకిల్ యొక్క ఎగుమతులు మొదలయ్యాయి.
- 1979 - ఆల్టో క్రయవిక్రయం చేయబడింది.
- 1979 - SC100 UKలో అమ్మబడింది.
- 1980 - ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సుజుకి ఆస్ట్రేలియా Pty. Ltd. స్థాపించబదింది, మూడు విద్యుత్‌శక్తి జనరేటర్ నమూనాలను అమ్మడం ద్వారా సాధారణ లక్ష్యాల ఇంజన్ల రంగంలోకి ప్రవేశించింది.
- 1981 - జనరల్ మోటార్స్ మరియు ఇసుజు మోటార్స్ లిమిటెడ్., (జపాన్)తో వ్యాపార సంబంధాల విషయమై సంతకాలు చేయడం జరిగింది.
- 1982 - పాకిస్తాన్‌లోని కరాచిలో PAK సుజుకి మోటార్ కంపెని., లిమిటెడ్ 4x4 యొక్క ఉత్పత్తి మొదలు పెట్టి వర్ల్డ్ రోడ్ రేస్ గ్రాండ్ ప్రి 500లో వరుసగా ఏడవ సారి మేకర్ ఛాంపియన్షిప్ గెలిచింది.
- 1982 - ఆల్టోకు మద్దతుగా SC100 కొనసాగింపును ఆపివేయడం జరిగింది.
- 1983 - భారతదేశంలో కార్ల ఉత్పత్తి కోసం మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంలోకి ప్రవేశించింది.
- 1983 - కల్టస్/స్విఫ్ట్ 1.0 లీటర్ పాసింజర్ కార్ అమ్మకాలు మొదలయ్యాయి ఇంకా భారతదేశంలో హర్యానాలోని గుడ్‌గావ్‌లోని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌లో 4x4 ఉత్పత్తి మొదలయ్యింది.
- 1984 - న్యూజీలాండ్‌లోని వాంగానుయ్లో సుజుకి న్యూజీలాండ్ లిమిటెడ్ స్థాపించబడి యునైటెడ్ స్టేట్స్కు షెవ్రొలె స్ప్రింట్ ఎగుమతి చేయడం మొదలు పెట్టింది. చైనా నేషనల్ ఏరోటెక్నాలజీ ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ బీజింగ్ కార్పొరేషన్‌తో కార్ ఉత్పత్తి సాంకేతిక సాయపు ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. జర్మనీలోని హెప్పెన్హెయిమ్లో సుజుకి మోటార్ GmbH డాయిష్‌లాండ్ యొక్క కార్యకలాపం మొదలయ్యింది.
- 1985 - సమురాయ్ యొక్క ప్రవేశంతో సుజుకి ఆఫ్ అమెరికా ఆటోమోటివ్ కార్పొరేషన్ స్థాపించబడింది, నూనెచేత చల్లబరిచిన ఇంజన్‌తో కూడిన GSX-R750 మోటార్‌సైకిల్‌ను అమ్మడం జరిగింది అంతేకాక స్పెయిన్ లోని అవెల్లో S.A.లో స్కూటర్ ఉత్పత్తి మొదలయ్యింది. స్పెయిన్‌లోని ఆండలూసియాలోని లినారెస్ కర్మాగారంలో సుజుకి కార్ల ఉత్పత్తి కోసం సాంటానా మోటార్స్‌తో ఒప్పందం కుదిరింది.
- 1986 - U.S. సుజుకి మోటార్ కార్పొరేషన్ మరియు సుజుకి ఆఫ్ అమెరికా ఆటోమోటివ్ కార్పొరేషన్లను కలిపి ఒకటి చేసి అమెరికన్ సుజుకి మోటార్ కార్పొరేషన్ స్థాపించబడింది.
- 1987 - కొలంబియాలో కల్టస్/స్విఫ్ట్ ఉత్పత్తి మొదలయ్యింది ఇంకా కారు ఎగుమతుల మొత్తం 2 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
- 1988 - ఎస్క్యూడో/విటారా 4x4 క్రయవిక్రయ ప్రక్రియ మొదలయ్యింది ఇంకా కార్ ఉత్పత్తి యొక్క మొత్తం 10 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
- 1989 - కెనడాలోని ఆంటారియాలో CAMI ఆటోమోటివ్ Inc. స్థాపించబడి కార్యకలాపాలు మొదలుపెట్టింది. యునైటెడ్ స్టేట్స్లో స్విఫ్ట్ GT/GLX మరియు సైడ్‌కిక్ యొక్క అమ్మకాలు మొదలయ్యాయి.
- 1990 - సంస్థ పేరును సుజుకి మోటార్ కార్పొరేషన్‌గా మార్చడం జరిగింది.
- 1991 - దేవూ షిప్‌బిల్డింగ్ & హెవి మెషినరి లిమిటెడ్‌తో సాంకేతిక సంబంధాలతో కొరియాలో కార్ ఉత్పత్తి మొదలయ్యింది ఇంకా కాప్పుచినో 2-సీటర్ క్రయవిక్రయాలు మొదలయ్యాయి.
- 1993 - సుజుకి ఈజిప్ట్ S.A.E.,లో పారింజర్ కార్ ఉత్పత్తి/అమ్మకాలు మొదలయ్యాయి, హంగరిలోని ఎజ్టర్గోమ్లో మగ్యార్ సుజుకి కార్పొరేషన్లో కొత్త కార్ ఉత్పత్తి యంత్ర సముదాయం యొక్క ప్రారంభోత్సవం జరిగింది ఇంకా వాగన్ R పాసింజర్ కార్ క్రయవిక్రయాలు మొదలయ్యాయి.
- 1994 - మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. ఆఫ్ ఇండియా యొక్క మొత్తం కారు ఉత్పత్తి 1 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
- 1995 - మోటార్ సైకిల్ ఎగుమతుల మొత్తం 20 మిలియన్ యూనిట్లకు చేరుకుంది
- 1996 - వియెత్నాంలో ఉత్పత్తి మొదలు (మోటార్‌సైకిళ్ళు మరియు ఆటోమొబైల్స్)
- 1997 - విదేశీ మార్కెట్ల కోసం ఆటోమొబైల్ అమ్మకాలు 10 మిలియన్ క్యుములేటివ్ యూనిట్లకు చేరుకున్నాయి ఇంకా చికాగోలో, 4-స్ట్రోక్ ఔట్బోర్డ్మోటర్స్, ఇన్నొవేషన్ అవార్డ్ ఎట్ ది ఇంటర్నేషనల్ మరైన్ ట్రేడ్ ఎఘిబిట్ అండ్ కాన్ఫెరెన్స్ (IMTEC) గెలుచుకుంది.
- 1998 - సుజుకి మరియు జనరల్ మోటార్స్ వ్యూహాత్మకమైన సంబంధం ఏర్పరచుకున్నాయి ఇంకా పాసింజర్ కార్ల ఉత్పత్తి కోసం చోంగ్‌కింగ్ చాంగ్'అన్ సుజుకి ఆటోమొబైల్ కంపెని లిమిటెడ్ చైనీస్ ప్రభుత్వం నుండి అధికారిక ఆమోదం అందుకుంది.
- 1999 - మొత్తం మోటార్‌సైకిల్ ఉత్పత్తి 40 మిలియన్ యూనిట్లకు చేరుకుంది ఇంకా జియాంగ్జి చాంఘె సుజుకి ఆటోమొబైల్ కంపెని లిమిటెడ్ కమర్షియల్ వాహనాల ఉత్పత్తి కొరకు చైనీస్ ప్రభుత్వం నుండి అధికారిక ఆమోదం అందుకుంది.
- 2000 - కంపెని 80వ వార్షికోత్సవం జరుపుకుంది, కొసాయ్ ప్లాంట్‌లో మొత్తం కారు ఉత్పత్తి 10 మిలియన్ యూనిట్లకు చేరుకుంది, ఇంకా జనరల్ మోటార్స్ డి అర్జెంటీనా S.A.లో సుజుకి ఉత్పత్తి మొదలయ్యింది.
- 2001 - సుజుకి లియానా/ఏరియో యొక్క మొత్తం ఆరంభం. జిమ్ని/SJ యొక్క అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి, ఆల్టో యొక్క ఉత్పత్తి 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంది ఇంకా సుజుకి లాండ్‌ఫిల్ వేస్ట్ విషయంలో "జీరో-లెవెల్" లక్ష్యాన్ని చేరుకుంది.
- 2002 - ప్రపంచవ్యాప్త మార్కెట్లో 30 మిలియన్ క్యుములేటివ్ ఆటోమొబైల్ అమ్మకాలు సాధించింది ఇంకా అమెరికా యొక్క #1 వారంటి: 100,000/7-సంవత్సరాల పవర్‌ట్రెయిన్ లిమిటెడ్ వారంటి కూడా.
- 2003 - సుజుకి కెయి కార్ అమ్మకాలలో వరుసగా 30వ సంవత్సరం నంబర్ వన్‌గా నిలిచింది, ఇంకా జపాన్‌లో మొదటి హైబ్రిడ్ కెయి కార్ ట్విన్ యొక్క క్రయవిక్రయ ప్రక్రియ మొదలయ్యింది.
- 2004 - స్థానిక ఆటోమొబైల్ అమ్మకాలు మొత్తం 15 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.
- 2005 - స్విఫ్ట్ 2006 RJC కార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెలుచుకుంది.
2006 - కొత్త XL7 యొక్క క్రయవిక్రయ ప్రక్రియ మొదలయ్యింది ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్ కోసం; GM పెట్టుబడులను ఉపసంహరించుకుంది, అది 92.36 మిలియన్ షేర్లను అమ్మివేసి తన వాటాను 3 శాతానికి తగ్గించుకుంది.
- 2008 - GM సుజుకిలో తన మిగిలిన 3 శాతం వాటాకు సంబంధించిన పెట్టుబడి కూడా ఉపసంహరించుకుంది.
- 2009 - సుజుకి ఈక్వేటర్ అన్న పేరుగల తన మొట్టమొదటి ప్రొడక్షన్ పికప్ ట్రక్, ప్రవేశపెట్టింది. వోల్క్స్వాగన్ AG మరియు సుజుకి ఒక చనువైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాపించడానికి ఒక సాధారణ అవగాహనకు వచ్చారు.[9]
- 2010 - వోక్స్వాగన్ AG సుజుకి యొక్క 19.9% ఔట్‌స్టాండింగ్ షేర్లను కొనే ప్రక్రియను పూర్తి చేసింది.[10]
మారుతి సుజుకిసవరించు
భారతదేశంలోని గుడ్గావ్లో ఆధారితమైన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, ఆర్థిక సంవత్సరం 2009-2010లో 1,018,365 యూనిట్ల వార్షిక ఉత్పత్తితో సుజుకి యొక్క అతిపెద్ద మరియు అత్యంత విలువైన అనుబంధ సంస్థ.[12] భారతీయ ఆటో జెయింట్ సంస్థలో సుజుకికి 54.2% వాటా ఉన్నది, మిగిలిన వాటాకి అనేక భారతీయ పౌర మరియు ఆర్థిక సంస్థలు యాజమాన్యం వహిస్తున్నాయి. సంస్థ 1981లో ఇంకార్పొరేట్ చేయబడి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లలో నమోదు కాబడి ఉంది.[13] 2005-2006 సంవత్సరంలో, భారతదేశంలోని పాసింజర్ కార్ మార్కెట్లో సంస్థకు 54% మార్కెట్ షేర్ ఉంది.[14] దాదాపు 75,000 మంది ఉద్యోగులను మారుతి, దాని భాగస్వాములు ప్రత్యక్షంగా నియుక్తులను చేసాయి.
సుజుకి అల్ప భాగస్వామిగా, భారతదేశపు మధ్యతరగతికి తక్కువ ధర కారును ఉత్పత్తి చేయడం కోసం, మారుతి సుజుకి ఒక భారత ప్రభుత్వ సంస్థగా పుట్టింది. కొన్ని సంవత్సరాలుగా, దాని వస్తువుల శ్రేణి విస్తృతి చెందింది, యాజమాన్యం చేతులు మారింది, వినియోగదారుడు పరిణితి చెందాడు.
మారుతి సుజుకి 14 నమూనాలను ఆఫర్ చేస్తుంది, వాటిలో INR 200,000 (US$ 5000)కన్నా తక్కువ ధరకు లభించే భారతదేశపు అత్యుత్తమ అమ్మకాల కారు మారుతి 800 నుండి ప్రీమియం సెడాన్ మారుతి సుజుకి SX4 మరియు లగ్జరి SUV, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఉన్నాయి. సంస్థ ప్రవేశపెట్టిన మొదటి నమూనా 1983లో వచ్చిన మారుతి 800 కాగా 1984లో మారుతి ఓమ్ని అనబడే మిని-వాన్ ప్రవేశపెట్టబడింది. రెండు మోడల్స్, హై-ఎండ్ టెక్నాలజీ మరియు మంచి ఇంధన సామర్ధ్యాల ఉపయోగం వల్ల తమ తమ వర్గాలలో బ్రహ్మాండమైన విజయాలు సాధించాయి. 1985లో ప్రవేశపెట్టబడిన మారుతి జిప్సి, భారత సైన్యం మరియు భారత పోలీస్ సర్వీస్ ప్రాథమిక వినియోగదారులు అవ్వడంతో విస్తృతమైన ఉపయోగానికి దారి తీసింది. మీడియమ్-సెడాన్ విభాగంలో పెరుగుతోన్న పోటీని ఎదుర్కోడానికి 1994లో మారుతి ఎస్టీమ్ చేత భర్తీ చేసేంత వరకు కొంత కాలమే నడిచిన మారుతి 1000 కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.
1993లో ప్రవేశపెట్టిన మారుతి జెన్, సంస్థ యొక్క రెండవ కాంపాక్ట్ కార్ మోడల్ అది తన ఉన్నతమైన పనితనం వల్ల మిక్కిలి జనాదరణ కూడా పొందింది. సంస్థ మరొకె కాంపాక్ట్ కార్ మారుతి వాగర్-R ప్రవేశపెట్టింది, దానిని 1999లో మారుతి బాలెనో అనుసరించింది. కానీ, టాటా, హ్యుండాయ్, హోండా మరియు దేవూ మోటార్స్ నుండి పోటీ పెరుగుతుండడంతో, మారుతి బాలెనోతో ఇదివరకు మోడల్స్ సాధించిన రీతిలో అదే స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. కనుక అది మారుతి సుజుకి బాలెనోను సుజుకి SX4తో ప్రతిక్షేపణ చేసింది. ప్రస్తుతం సుజుకి SX4 హోండా సిటీ నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది.
2000వ సంవత్సరంలో మారుతి ఆల్టో ప్రవేశపెట్టబడింది. టాటా ఇండీకా మరియు హ్యుండాయ్ సాంట్రో ప్రవేశం మారుతి యొక్క అమ్మకాలను ప్రభావితం చేసింది కానీ ఆల్టో, సంస్థ తన ఆటో లీడర్ స్థానాన్ని భారతదేశంలో నిలుపుకునేందుకు సాయపడింది. భారతదేశంలో అది ప్రస్తుతం అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే కార్. మారుతి మోడల్స్‌లో 2003లో ప్రవేశపెట్టిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 2004లో ప్రవేశపెట్టిన మారుతి వర్సా, 2005లో ప్రవేశపెట్టిన మారుతి సుజుకి స్విఫ్ట్, 2007లో ప్రవేశపెట్టిన మారుతి జెన్ ఎస్టిలో మరియు మారుతి సుజుకి SX4 ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఆల్టో, స్విఫ్ట్ మరియు SX4 తమ తమ విభాగాలలో నాయకులు.
ఫిబ్రవరి 14వ తేదీన మారుతి సుజుకి ఇండియా, భారతదేశంలో సుజుకి అనుబంధ సంస్థ, తమ సంస్థ ఆల్టో యొక్క సంకరించిన ఉత్పత్తిలో ఒక మిలియన్ మొత్తాన్ని సాధించిందని ప్రకటించింది. సెప్టెంబరు 2000వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఏడు సంవత్సరాల అయిదు నెలలలో ఆల్టో ఒక మిలియన్ యూనిట్ల స్థాయిని చేరుకుంది. ఆ మిలియన్లో చివరి సగం కేవలం 25 నెలలలో వచ్చింది అది రికార్డ్. గత 37 నెలలుగా వరుసగా, ప్రతి నెలా, ఆల్టో భారతదేశపు అతిపెద్ద పరిమాణంలో అమ్ముడవుతున్న కారుగా ఉంది. దానిని ప్రవేశపెట్టిన దగ్గర నుండి దాని జనాదరణ పెరుగుతూ వచ్చింది, వినియోగదారులు దాని తక్కువ ధర మరియు ఇంధన సామర్ధ్యం పట్ల ఆకర్షితులయ్యారు. దీనితో ఆల్టో మారుతి సుజుకి అంబులపొదిలో మిలియన్ యూనిట్ల స్థాయిని దాటిన మూడవ కారు అయ్యింది. ఇది వరకు, మారుతి 800 మరియు ఓమ్ని ఒక మిలియన్ యూనిట్ల స్థాయిని దాటాయి. భారతదేశంలో విజయంతో పాటు మారుతి సుజుకిలో తయారు అయిన 152,000 కి పైగా ఆల్టోస్ అంతర్జాతీయంగా అమ్ముడుపోయాయి, అవి అల్జీరియా మరియు చిలి దేశాలలో మంచి ఫలితాలను రుచి చూసాయి.
మారుతి ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ దాని ప్రధానమైన దృష్టి ఎగుమతుల మీద ఉంటుంది, అది స్థానిక భారతీయ మార్కెట్లో పని చేయదు. 480 కార్ల మొదటి వాణిజ్య రవాణాసరుకు హంగరికి పంపబడింది. అదే దేశానికి 571 కార్ల రవాణా సరుకుని పంపించి మారుతి 3,000,000 కార్ల ప్రమాణాన్ని దాటింది. దాని ఆరంభం నుండి ప్రభుత్వం ప్రోత్సహించదలచుకున్న అంశాలలో ఎగుమతులు ఒకటి. ప్రతి రాజకీయ పార్టీ మారుతి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలని కోరుకుంది. కానీ ఎగుమతుల విషయంలో మారుతి సుజుకి హ్యుండాయ్‌తో పోల్చుకుంటే అధమమైనది.
భారతదేశంలో జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క ఇతర అనుబంధ సంస్థలు:
- సుజుకి పవర్‌ట్రెయిన్ ఇండియా లిమిటెడ్: కార్ ఇంజన్ల ఉత్పత్తిదారులు
- సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: 'సుజుకీ అనే బ్రాండ్ పేరుతో టూవీలర్లను ఉత్పత్తి చేసే సంస్థ. భారతదేశంలో ప్రవేశపెట్టిన దాని టూవీలర్ నమూనాలు 'GS 150R, ఇంట్రూడర్, హయబూసా 1300 cc, 125 cc ఆక్సెస్, 125 cc మోటార్‌సైకిల్ జ్యూస్.
అమెరికన్ సుజుకి మోటార్ కార్పొరేషన్ చరిత్రసవరించు
అమెరికన్ సుజుకి ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని బ్రెయాలో ఉంది. జనరల్ మోటార్స్‌తో ఒక ఒప్పందంతో, సుజుకి, యునైటెడ్ స్టేట్స్లో తన సుజుకి కల్టస్ యొక్క ఒక రూపాంతరాన్ని 1985లో షెవ్రోలె స్ప్రింట్గా అమ్మడం మొదలు పెట్టింది. ఈ నమూనా మొదట 3-డోర్ల హాచ్బాక్గా అమ్మడం జరిగింది అది షెవ్రోలె యొక్క అతి చిన్న నమూనా.
1986 మోడల్ సంవత్సరం కోసం సమురాయ్‌ని 1985లో పరిచయం చేయడం జరిగింది, అది కొత్తగా ఏర్పరచిన అమెరికన్ సుజుకి కార్పొరేషన్ పరిచయం చేసిన మొదటి కార్. తన మొదటి సంవత్సరంలో సుజుకి అమ్మినన్ని కార్లు ఏ ఇతర జపనీస్ సంస్థ అమ్మలేదు. సమురాయ్ ఒక కన్వర్టిబుల్‌గా లేదా హార్డ్టాప్గా అందుబాటులో ఉంది, సంస్థ యొక్క నినాదం నెవర్ ఎ డల్ మొమెంట్ . వినియోగదారుల నివేదికలు 1988 టెస్ట్‌లో సమురాయ్‌కు బోల్తా పడే సమస్య ఉందన్న ఆరోపణలు చేసే వరకు సమురాయ్ విజయవంతంగా అమ్ముడయ్యింది. ఇది చాలా ప్రాచుర్యం పొందిన 1996వ సంవత్సరపు వ్యాజ్యానికి దారితీసి, 2004 వరకు పూర్తి కాలేదు.
1989లో, అమెరికన్ సుజుకి స్విఫ్ట్‌ను పరిచయం చేసింది, అది రెండవ జనరేషన్ సుజుకి కల్టస్. స్విఫ్ట్ GTi మరియు GLX హాచ్బాక్గా అందుబాటులో ఉంది తర్వాత నాలుగు డోర్లు కలిగిన పాసింజర్ కారుగా 1990లో అందుబాటులోకి వచ్చింది. 1989లో సైడ్‌కిక్ అనబడే ఒక చిన్న SUV కూడా ప్రవేశపెట్టబడింది. 1991లో 4-డోర్ల సుజుకి సైడ్‌కిక్ ప్రవేశపెట్టబడింది, అది ఉత్తర అమెరికాలో మొదటి 4-డోర్ల మిని-SUV. స్విఫ్ట్ మరియు సైడ్‌కిక్, GM యొక్క జియో మెట్రో మరియు జియో ట్రాకర్‌కు దాయాదులు అవి చాలా వరకు సుజుకి మరియు GM యొక్క జాయింట్ వెంచర్ అయిన CAMI చేత కెనడాలోని ఆంటారియోలోని ఇంగర్సోల్లో ఉత్పత్తి చేయబడ్డాయి. స్విఫ్ట్ GT/GTi మరియు 4-డోర్ల మోడల్స్ జపాన్ నుండి దిగుమతి చేసుకోబడ్డాయి. సుజుకి సమురాయ్ యొక్క వినియోగదారుల నివేదికల నుండి ప్రతికూల మూల్యాంకనాలు తర్వాత సంవత్సరాలలో వార్షిక అమ్మకాలు 20,000 యూనిట్ల కన్నా తక్కువకి పడిపోవడం అమెరికన్ సుజుకిలో కొన్ని తాత్కాలిక ఆటుపోట్లకు దారి తీసాయి.
1995లో అమెరికన్ సుజుకి ఎస్టీమ్‌ను పరిచయం చేసి స్విఫ్ట్‌ను తిరిగి రూపకల్పన చేసింది. స్విఫ్ట్ GTను వదిలివేసి స్విఫ్ట్ యొక్క ఈ రూపాంతరాన్ని ఉత్తర అమెరికాకు మాత్రం పరిమితం చేయడం జరిగింది, అది CAMIలో నిర్మించేవారు. ఈ మోడల్స్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్తో నార్త్ అమెరికాలో అమ్మబోయే మొదటి వాహనాలు. 1996లో ఎస్టీమ్ యొక్క స్టేషను వాగన్ రూపాంతరం ప్రవేశపెట్టబడింది. ప్రపంచవ్యాప్త సుజుకి ఉత్పత్తి ఈ సంవత్సరంలో 975,000 కార్ల కన్నా ఎక్కువ స్థాయికి చేరుకుంది.
1996లో అమెరికన్ సుజుకి 2-డోర్ల SUV X-90 మరియు డ్యూయల్ ఎయిర్బాగ్స్,120 hp (89 kW) 1.8 లీటర్ ఇంజన్, 16 అంగుళాల చక్రాలు మరియు టూ-టోన్ పెయింట్ కలిగి, పునఃపరిశీలన గావించిన సైడ్‌కిక్ స్పోర్ట్ మోడల్ కూడా విడుదల చేసింది. సైడ్కిక్ను విటారా ప్రతిక్షేపణ చేసింది, 1999 సంవత్సరానికి గ్రాండ్ విటారా ప్రతిక్షేపణ చేసింది. గ్రాండ్ విటారా, V6-సిలిండర్ ఇంజన్ కలిగిన సుజుకి యొక్క మొదటి మోడల్ అవుతుంది. అది 4-వీల్ ABS బ్రేక్‌లతో అందుబాటులో ఉంటుంది.
గ్రాండ్ విటారా యొక్క కొనసాగించబడిన రూపాంతరంగా గ్రాండ్ విటారా XL-7 2001లో ప్రవేశపెట్టబడింది. గ్రాండ్ విటారా XL-7కు పెద్దదయిన 2.7 లీటర్ V6-సిలిండర్ ఇంజన్ మరియు 3-వరుసల సీటింగ్ ఉంది. ఈనాటి వరకు వచ్చిన వాహనాలలో ఇది సుజుకి యొక్క అతి పెద్ద వాహనం.
2001లో నమూనాల లైనప్ నుండి స్విఫ్ట్‌ను జారవిడవడం జరిగింది, 2002లో ఎస్టీంను కొత్త ఎయిరియోతో ప్రతిక్షేపణ చేయడం జరిగింది, దానిని 4-డోర్ల పాసింజర్ కారుగా మరియు 5-డోర్ల క్రాస్ఓవర్గా ఆఫర్ చేసి 4-వీల్ డ్రైవ్‌ను ఒక వైకల్పంగా ఇవ్వడం జరిగింది.
2004లో, దివాలా తీసిన దేవూ మోటార్స్‌ను జనరల్ మోటార్స్ మరియు సుజుకి సంయుక్తంగా కొని ఆ వెంచర్‌కు GMDAT అని కొత్త పేరు పెట్టడం జరిగింది. అమెరికన్ సుజుకి కాపాక్ట్ దేవూ నుబీరా/దేవూ లాసెట్టిని ఫోరెంజాగా మరియు మధ్యమ పరిమాణము గల దేవూ మాగ్నస్‌ను వెరోనాగా పునరుధ్ధరించింది. 2005లో ఫోరెంజా స్టేషను వాగన్ మరియు హాచ్బాక్ బాడి స్టైల్‌ను పొందింది, హాచ్బాక్ రెనో అన్న పేరుతో అమ్మడం జరిగింది.
యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ సుజుకి 100,000కు పైగా వాహనాలు అమ్మిన మొదటి సంవత్సరం 2006. సుజుకి గ్రాండ్ విటారాను 2006 తిరిగి రూపకల్పన చేసింది, అంతే కాక అంతా కొత్తదయిన సుజుకి SX4 మరియు సుజుకి XL7ను 2007లో ప్రవేశపెట్టింది. సుజుకి SX4ను ఫియట్‌తో జాయింట్ వెంచర్గానూ, XL7ను (గ్రాండ్ విటారా XL-7 అన్న పేరు కుదించబడడం చూడండి) ఇంగర్సోల్లో CAMI ఆటోమోటివ్ ఇంకార్పొరేటెడ్తో జాయింట్ వెంచర్గానూ ఉత్పత్తి చేయడం జరిగింది. 2009 మధ్యలో గిరాకీ తక్కువ ఉండడం మూలాన సుజుకి XL7 ఉత్పత్తిని నిరవధికంగా వాయిదా వేసి, తదనంతరంగా CAMIలోని తన వాటాను సంవత్సరం తర్వాతి భాగంలో GMకు అమ్మివేసింది.
కష్టమయిన స్థానిక US ఆటోమార్కెట్ ప్రభావం ఉన్నప్పటికీ, 2007 అమ్మకాల సంఖ్యలలో సుజుకి తన వేగాన్ని కొనసాగించింది అందులో మే 2008 అత్యుత్తమమైన మే నెలగా నమోదు అయ్యింది.[15]
పాకిస్తాని సుజుకి మోటార్ కంపెని లిమిటెడ్సవరించు
సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆఫ్ జపాన్ (SMC) మరియు పాకిస్తాన్ ఆటోమొబైల్ కార్పొరేషన్ (PACO)ల మధ్య కుదిరిన జాయింట్ వెంచర్ ఒప్పందానికి సంబంధించిన నిబంధనల ప్రకారం, పాక్ సుజుకి మోటార్ కంపెని లిమిటెడ్ (PSMCL) ఆగస్టు 1983లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయబడింది.[16]
కొత్త కంపెని అవామి ఆటోస్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్థులను, ఉత్పత్తి సౌకర్యాలను స్వాధీనంలోకి తెచ్చుకుంది. పాసింజర్ కార్స్, పిక్ అప్స్, వాన్స్ మరియు 4X4 వాహనాలు ప్రాథమిక లక్ష్యంగా PSMCL జనవరి 1984లో వాణిజ్య కార్యకలాపాలను మొదలు పెట్టింది.
బిన్ కాసిమ్ వద్ద కంపెని యొక్క గ్రీన్ ఫీల్డ్ ఆటోమొబైల్ ప్లాంట్‌కు సంబంధించిన ప్రారంభోత్సవం 1989లో అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి చేసారు.
1990వ సంవత్సరపు మొదట్లో మొదటి దశ పూర్తి కాగానే, సుజుకి ఇంజన్లను అంతర్గతంగా సంస్థలోనే జోడించడం మొదలయ్యింది. కొత్త ప్లాంట్ 1992లో పూర్తి అయ్యింది, దాంతో సుజుకి ఉత్పత్తి కొత్త ప్లాంట్‌కు బదిలీ అయ్యింది - ఇంకా త్రీ-బాక్స్ 1,300 cc మార్గల్లా కార్ కూడా ఉత్పత్తి శ్రేణిలో చేర్చడం జరిగింది.
1992లో సంస్థను ప్రైవేటీకరణ చేయడం జరిగి అది ప్రత్యక్షంగా జపనీస్ మానేజ్మెంట్ నియంత్రణలోకి వచ్చింది. ప్రైవేటీకరణ సమయంలో SMC తన వాటాను 25% నుండి 40%నికి పెంచింది, తదనంతరముగా SMC 2001 డిసెంబరు 31 నాటికి తన వాటాను అంచెలంచెలుగా 73.09%నికి పెంచింది.
బిన్ కాసిమ్ ప్లాంట్ తదుపరి జూలై 1994లో తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని సంవత్సరానికి 50,000 వాహనాలకు విస్తరించింది ఇంకా డిసెంబరు 2003కు ఈ ప్లాంట్‌లో 300,000 వాహనాలను ఉత్పత్తి చేయడం జరిగింది.
పాక్సుజుకి ప్రస్తుతం తన కార్లను బంగ్లాదేశ్, ఘనా, నైజీరియా మరియు మాల్దీవ్స్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది.
సుజుకి కెనడా ఇన్కార్పొరేటెడ్ చరిత్రసవరించు
- 1973 - జూన్ 1, ఆంటారియోలోని డౌన్స్వ్యూలో సుజుకి కెనడా లిమిటెడ్ కంపెనీగా ఏర్పడింది. తయారు చేసే వస్తువులలో మోటార్‌సైకిళ్ళు, కెనడా అంతటా సుజుకి డీలర్ల కోసం విడిభాగాలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.
- 1974 - వెస్టర్న్ కెనడాలోని డీలర్లకు సేవలందించడానికి వాంకోవర్ శాఖ కార్యాలయం మరియు గిడ్డంగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
- 1980 - శరదృతువు - సుజుకి కెనడా ఈస్టర్న్ కెనడాలో నాలుగు చక్రాల LJ80 యొక్క క్రయవిక్రయ ప్రక్రియ మరియు అమ్మకాలతో తన ఆటోమోటివ్ అమ్మకాలను మొదలు పెట్టింది. నవంబరు 1, కంపెని పేరు సుజుకి కెనడా లిమిటెడ్ నుండి సుజుకి కెనడా ఇంకార్పొరేటెడ్కు మార్చబడింది.
- 1982 - కెనడాలో సుజుకి ఆల్-టెరైన్ వెహికల్స్ (ATVs) అనబడే కొత్త శ్రేణి వాహనాల ప్రవేశం.
- 1983 - వెస్టర్న్ కెనడాలో సుజుకి ఔట్‌బోర్డ్ మోటార్స్ యొక్క శ్రేణిని ప్రవేశపెట్టడం. 1983 ఫిబ్రవరి 1 - వెస్టర్న్ బ్రాంచ్ బ్రిటిష్ కొలంబియాలోని రిచ్మండ్లోని విస్తరించబడిన సౌలభ్యాలకు తరలింది.
- 1984 - 'సుజుకి ఫోర్సా' (సుజుకి కల్టస్) ఆటోమొబైల్ యొక్క అమ్మకాలు మొదలు పెట్టింది.
- 1986 - వాహనాల ఉత్పత్తి కోసం ఒక 600 మిలియన్ డాలర్ల సుజుకి-GM జాయింట్ వెంచర్ CAMI ఆటోమోటివ్ ఇన్కార్పొరేటెడ్ ప్రకటించబడింది. ఆంటారియోలోని ఇంగర్సోల్లో, 1989 నుండి ఉత్పత్తి మొదలవ్వాలని ప్రణాళిక వేయడం జరిగింది.
- 1987 - జనవరి 25 - సుజుకి కెనడా ఇన్కార్పొరేటెడ్, ఆంటారియోలోని రిచ్మండ్ హిల్‌లో ఒక కొత్త110,000 చ .అ (10,000 మీ2) ప్రధాన కార్యాలయం మరియు వేర్‌హౌస్ ఫెసిలిటికి తరలించబడింది.
- 1988 - శరదృతువు - సుజుకి, CAMI-నిర్మించిన 2-డోర్ సుజుకి సైడ్కిక్ను అమ్మడం మొదలు పెట్టింది.
- 2009 - శరదృతువు - సుజుకి CAMIలో తన వాటాను GMకు అమ్మింది.
OEM ఒప్పందాలుసవరించు
1985 నుండి, ప్రపంచవ్యాప్తంగా సుజుకి ఆటోమొబైల్స్‌ను ఇతర ఉత్పాదకుల కోసం ఉత్పత్తి చేయడం లేదా పంచుకోవడం చేసింది.
జనరల్ మోటర్స్
- షెవ్రొలె స్ప్రింట్ - యునైటెడ్ స్టేట్స్/కెనడా (సుజుకి కల్టస్)
- పోంటియాక్ ఫైర్‌ఫ్లై - కెనడా (సుజుకి కల్టస్)
- జియో మెట్రో - యునైటెడ్ స్టేట్స్ (సుజుకి కల్టస్)
- హోల్డెన్ బారినా - ఆస్ట్రేలియా & న్యూజీలాండ్ (సుజుకి కల్టస్)
- షెవ్రొలె స్విఫ్ట్ - సౌత్ అమెరికా (సుజుకి కల్టస్)
- షెవ్రోలె క్రూజ్ - జపాన్ (సుజుకి ఇగ్నిస్)
- హోల్డెన్ క్రూజ్ - ఆస్ట్రేలియా (సుజుకి ఇగ్నిస్)
- షెవ్రోలె MW - జపాన్ (సుజుకి వాగన్ R)
- బెడ్ఫోర్డ్ రాస్కల్ - యూరోప్ (సుజుకి కారి)
- బెడ్ఫోర్డ్ రాస్కల్ - యునైటెడ్ కింగ్డం (సుజుకి కారి)
- హోల్డెన్ స్కర్రి - ఆస్ట్రేలియా (సుజుకి కారి)
- షెవ్రోలె సూపర్కారి - సౌత్ అమెరికా (సుజుకి కారి)
- జియో ట్రాకర్ - యునైటెడ్ స్టేట్స్ (సైడ్‌కిక్/విటారా)
- షెవ్రోలె ట్రాకర్ - యునైటెడ్ స్టేట్స్/కెనడా (సైడ్‌కిక్/విటారా)
- GMC ట్రాకర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- అసునా సన్రన్నర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- పోంటియాక్ సన్రన్నర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- షెవ్రోలె విటారా - సౌత్ అమెరికా (సైడ్‌కిక్/విటారా)
- షెవ్రోలె గ్రాండ్ నోమాడ్ - సౌత్ అమెరికా (సుజుకి XL7)
- హోల్డెన్ డ్రోవర్ - ఆస్ట్రేలియా & న్యూజీలాండ్ (సుజుకి సియెర్రా/జిమ్ని)
- ఓపెల్ అజీల - యూరోప్ (సుజుకి వాగర్ R మరియు సుజుకి స్ప్లాష్)
- షెవ్రోలె MW - జపాన్ (సుజుకి వాగర్ R)
- వాక్స్హాల్ అజీల - యునైటెడ్ కింగ్డమ్ (సుజుకి వాగర్ R మరియు సుజుకి స్ప్లాష్)
- షెవ్రోలె MW - జపాన్ (సుజుకి వాగర్ R)
- ఓపెల్ అజీల - యూరోప్ (సుజుకి వాగర్ R మరియు సుజుకి స్ప్లాష్)
- హోల్డెన్ డ్రోవర్ - ఆస్ట్రేలియా & న్యూజీలాండ్ (సుజుకి సియెర్రా/జిమ్ని)
- షెవ్రోలె గ్రాండ్ నోమాడ్ - సౌత్ అమెరికా (సుజుకి XL7)
- షెవ్రోలె విటారా - సౌత్ అమెరికా (సైడ్‌కిక్/విటారా)
- పోంటియాక్ సన్రన్నర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- అసునా సన్రన్నర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- GMC ట్రాకర్ - కెనడా (సైడ్‌కిక్/విటారా)
- షెవ్రోలె ట్రాకర్ - యునైటెడ్ స్టేట్స్/కెనడా (సైడ్‌కిక్/విటారా)
- జియో ట్రాకర్ - యునైటెడ్ స్టేట్స్ (సైడ్‌కిక్/విటారా)
- షెవ్రోలె సూపర్కారి - సౌత్ అమెరికా (సుజుకి కారి)
- హోల్డెన్ స్కర్రి - ఆస్ట్రేలియా (సుజుకి కారి)
- బెడ్ఫోర్డ్ రాస్కల్ - యునైటెడ్ కింగ్డం (సుజుకి కారి)
- బెడ్ఫోర్డ్ రాస్కల్ - యూరోప్ (సుజుకి కారి)
- షెవ్రోలె MW - జపాన్ (సుజుకి వాగన్ R)
- హోల్డెన్ క్రూజ్ - ఆస్ట్రేలియా (సుజుకి ఇగ్నిస్)
- షెవ్రోలె క్రూజ్ - జపాన్ (సుజుకి ఇగ్నిస్)
- షెవ్రొలె స్విఫ్ట్ - సౌత్ అమెరికా (సుజుకి కల్టస్)
- హోల్డెన్ బారినా - ఆస్ట్రేలియా & న్యూజీలాండ్ (సుజుకి కల్టస్)
- జియో మెట్రో - యునైటెడ్ స్టేట్స్ (సుజుకి కల్టస్)
- పోంటియాక్ ఫైర్‌ఫ్లై - కెనడా (సుజుకి కల్టస్)
ఫియట్
- ఫియట్ సెడిసి - యూరోప్ (సుజుకి SX4)
సుబారు
- సుబారు జస్టి - యూరోప్ (సుజుకి స్విఫ్ట్)
మాజ్డా
- మాజ్డా ప్రొసీడ్ లెవాంట్ - జపాన్ (సుజుకి విటారా)
- మాజ్డా కారోల్ - జపాన్ (సుజుకి ఆల్టో)
- ఆటోజామ్ AZ-1 - జపాన్ (సుజుకి కారా)
- ఆటోజామ్ స్క్రమ్ - జపాన్ (సుజుకి ఎవెరి)
- ఆటోజామ్ AZ-వాగన్ - జపాన్ (సుజుకి MR వాగన్)
- మాజ్డా AZ-ఆఫ్‌రోడ్ - జపాన్ (సుజుకి జిమ్ని)
- మాజ్డా స్పియానో - జపాన్ (సుజుకి లపిన్)
- మాజ్డా లపూటా - జపాన్ (సుజుకి కెయి)
- మాజ్డా స్పియానో - జపాన్ (సుజుకి లపిన్)
- మాజ్డా AZ-ఆఫ్‌రోడ్ - జపాన్ (సుజుకి జిమ్ని)
- ఆటోజామ్ AZ-వాగన్ - జపాన్ (సుజుకి MR వాగన్)
- ఆటోజామ్ స్క్రమ్ - జపాన్ (సుజుకి ఎవెరి)
- ఆటోజామ్ AZ-1 - జపాన్ (సుజుకి కారా)
- మాజ్డా కారోల్ - జపాన్ (సుజుకి ఆల్టో)
నిస్సాన్
- నిస్సాన్ మోకో - జపాన్ (సుజుకి MR వాగన్)
- నిస్సాన్ పీనో - జపాన్ (సుజుకి ఆల్టో)
- నిసాన్ రూక్స్ - జపాన్ (సుజుకి పాలెట్)
- నిస్సాన్ పీనో - జపాన్ (సుజుకి ఆల్టో)
- మారుతి 800 - ఇండియా (సుజుకి ఆల్టో)
- మారుతి ఓమ్ని - ఇండియా (సుజుకి కారి)
- మారుతి జిప్సి - ఇండియా (సుజుకి జిమ్ని)
- మారుతి 1000 - ఇండియా (సుజుకి కల్టస్)
- మారుతి జెన్ - ఇండియా (సుజుకి ఆల్టో)
- మారుతి 1000 - ఇండియా (సుజుకి కల్టస్)
- మారుతి జిప్సి - ఇండియా (సుజుకి జిమ్ని)
- మారుతి ఓమ్ని - ఇండియా (సుజుకి కారి)
- జెన్ నుండి అన్ని మారుతి నమూనాలను మారుతి సుజుకి అన్నారు.
- వోక్స్వాగన్ రాక్టన్ (సుజుకి SX4) - ప్రస్తుతం వృధ్ధి చేయబడుతోంది.
ఆటోమొబైల్స్సవరించు
- సుజుకి నమూనాలు
- ఎయిరో/లియానా
- ఆల్టో
- ఆల్టో లపిన్
- APV
- కాపుచినో
- కారి
- సర్వో
- సుజుకి కల్టస్ (అకా సుజుకి ఫోర్సా, సుజుకి స్విఫ్ట్, జియో మెట్రో, పోంటియాక్ ఫైర్‌ఫ్లై, et al.)
- ఎస్క్యూడో
- సుజుకి ఈక్వేటర్
- ఎస్టీమ్/కల్టస్ క్రెసెంట్
- ఫ్రోంట్
- గ్రాండ్ విటారా
- ఇగ్నిస్
- జిమ్ని
- కెయి
- కిజాషి
- LJ-సీరీస్
- మెహ్రాన్
- మైటిబాయ్
- MR వాగన్
- పాలెట్
- సైడ్‌కిక్
- స్ప్లాష్
- SX4
- SX4 క్రాస్కవర్
- SX4 స్పోర్ట్
- సుజుకి ట్విన్
- వాగన్ R
- X-90
- XL7
- దేవూ ఆధారితమయిన ఉత్తర అమెరికా నమూనాలు
- స్విఫ్ట్+
- ఫోరెంజా/రెనో
- వెరోనా
- షెవ్రోలె ఆధారితమయిన దక్షిణ అమెరికా నమూనాలు
- ఫన్
మోటార్సైకిళ్ళుసవరించు
సుజుకి 1952లో మోటార్‌సైకిళ్ళను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది, వాటిలో తొలి నమూనాలు యంత్రీకరించబడిన సైకిళ్ళు. 1950, 1960 మరియు 1970వ దశాబ్దంలో ఎక్కువ భాగం, సంస్థ టూ-స్ట్రోక్ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిళ్ళను మాత్రమే ఉత్పత్తి చేసేది, వాటిలో అతిపెద్ద టూ-స్ట్రోక్ నమూనా నీటిచే చల్లబరిచే గుణం కలిగిన మూడు సిలిండర్ల GT750.
టూ-స్ట్రోక్ పోటీలో సుజుకి యొక్క విజయం వెనుక ఒక పెద్ద కారణం, ఈస్ట్ జర్మన్ గ్రాండ్ ప్రి రేసర్ ఎర్న్స్ట్ డెగ్నర్, అతను 1961లో పశ్చిమానికి ఫిరాయించాడు, [17] అతను తనతో తూర్పు జర్మన్ తయారీదారు అయిన MZ నుండి టూ-స్ట్రోక్ ఇంజన్ల ప్రావీణ్యం తీసుకుని వచ్చాడు. సుజుకి డెగ్నర్ను నియమించింది, అతను 1962 సీజన్లో 50 cc క్లాస్ F.I.M. రోడ్ రేసింగ్ వర్ల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. జోయల్ రాబర్ట్ 1970 250 cc టిటిల్ గెలిచినపుడు, సుజుకి మోటోక్రాస్ వర్ల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి జపనీస్ తయారీదారు అయ్యింది. 1970వ దశాబ్దంలో, బారి షీన్ మరియు రోజర్ డి కోస్టర్, రోడ్ రేసింగ్ మరియు మోటోక్రాస్లలో ప్రీమియర్ 500 cc డివిజన్లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినపుడు సుజుకి మోటార్‌సైకిల్ రేసింగ్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. సుజుకి మోటోGPలో పోటీ చేయడం కొనసాగిస్తోంది, అది చివరిసారి 2000 సీజన్లో టైటిల్ గెలుచుకుంది. 2006 నుండి, బృందాన్ని స్ఫోన్సర్ చేస్తోంది రిజ్లా, దానిని రిజ్లా సుజుకి మోటోGP టీమ్ అని గుర్తిస్తారు.
1976 వరకు కూడా సుజుకి తన మొదటి ఫోర్-స్ట్రోక్ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిల్, GS400 మరియు GS750 ప్రవేశపెట్టలేదు.
1994లో, సుజుకి నాంజింగ్ జిన్చెంగ్ మషినరితో భాగస్వామ్యం కుదుర్చుకుని జిన్చెంగ్ సుజుకి అనబడే ఒక చైనీస్ మోటార్‌సైకిల్ తయారీ మరియు ఎగుమతి సంస్థను సృష్టించింది.
నమూనాలుసవరించు
గుర్తించదగ్గ సుజుకి మోటార్‌సైకిల్స్‌లో ఈ క్రింది వాటిల్లో కొన్ని ఉన్నాయి:
- హయాబూసా (GSX-1300R) - 1999లో మూస:190చేయగలిగిన ఒక స్పోర్ట్ మోటార్‌సైకిల్, అది 2000 నుండి 186 mph కు పరిమితమయ్యింది.
- GSX-R1000 - GSX-R సీరీస్‌లో అతిపెద్దది, దీనిని 2000వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.
- GSX-R750 - GSX-R1000కు తాత, ఈ హోదా 25 ఏళ్ళ కన్న ఎక్కువ పాతది, అంతేకాక ఈ నమూనా ప్రతి రెండు నుండి నాలుగు సంవత్సరాలకు నవీకరణ/తిరిగి రూపకల్పన చేయబడుతోంది.
- GSX-R600 - GSX-R750 యొక్క చిన్న రూపాంతరం.
- GSX-650F - 2008లో ప్రవేశపెట్టబడిన ఈ కొత్త స్పోర్ట్ టూరింగ్ మోడల్ రిటైర్ అయిన కటానా సృష్టించిన ఖాళీని పూరిస్తుంది. 2009 మోడల్ ABSను ఒక ప్రామాణికమైన లక్షణంగా కలిగి ఉంది.
- SV650 - కొత్తగా పుట్టుకొస్తోన్న నేకెడ్ బైక్ మార్కెట్లో బడ్జెట్ ఎంట్రిగా 1999లో ప్రవేశపెట్టబడింది, 2008 నాటికి, నేకెడ్ మరియు ఫుల్లి ఫెయిర్డ్గా అందించబడింది. 2009 నుండి దానిని గ్లేడియస్ వేరియంట్లో కూడా ఆఫర్ చేయబడింది.
- బర్గ్మాన్ - జపాన్, ఇటలి మరియు స్పెయిన్ దేశాలలో ఉత్పత్తి చేయబడిన 125 cc నుండి 638 cc ఇంజన్ కపాసిటీ కలిగిన పట్టణ స్కూటర్ల యొక్క సీరీస్.
- RGV250 - కెవిన్ స్క్వాంట్జ్ యొక్క RGV500 GP రేస్ బైక్ యొక్క రోడ్-రేసింగ్ రెప్లీకా.
ఆల్-టెరైన్ వెహికల్స్ (ATVs)సవరించు
- సుజుకి ఈగర్ 400
- సుజుకి LT 230
- సుజుకి LT-R450 (రేస్ రెడి)
- సుజుకి LT250R
సంఘటనల స్ఫోన్సర్షిప్సవరించు
ల్యూజ్, భయాథ్లాన్, మరియు క్రాస్ కంట్రి స్కీయింగ్ స్పోర్టింగ్ ఈవెంట్స్‌కు సుజుకి ఒక పెద్ద స్ఫోన్సర్. వాళ్ళు ASEAN ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు కూడా ప్రస్తుత టైటిల్ స్ఫోన్సర్.
వీటిని కూడా చూడండిసవరించు
- సుజుకి ఇంజన్ల పట్టిక
- సుజుకి వరల్డ్ రాలి బృందం
- సుజుకి T సిరీస్
- సుజుకి T20
- సుజుకి GT సిరీస్
సూచనలుసవరించు
- ↑ Google Finance, "Suzuki Motor Corporation", found at [1]
- ↑ http://www.globalsuzuki.com/corp_info/financialinfo/pdf/2008/financial_summary.pdf
- ↑ 3.0 3.1 [2]
- ↑ [3]
- ↑ "Outline". Global Suzuki. Retrieved 2009-10-19. Cite web requires
|website=
(help) - ↑ "World Motor Vehicle Production by manufacturer" (PDF). International Organization of Motor Vehicle Manufacturers. 2008. Cite journal requires
|journal=
(help) - ↑ "Cars are a sideline for Suzuki; sport-utes carry the load". Automotive News (5656). April 29, 1996. pp. S72(2).
- ↑ 8.0 8.1 8.2 ట్విస్ట్ ది త్రాటిల్: సుజుకి
- ↑ "Volkswagen and Suzuki agreed to establish a comprehensive partnership". Volkswagenag.com. 2009-12-09. Retrieved 2010-10-05. Cite web requires
|website=
(help) - ↑ "Volkswagen completes Suzuki tieup". Japan Times. 2010-01-15. మూలం నుండి 2012-05-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-16. Cite web requires
|website=
(help) - ↑ [24]
- ↑ "Maruti Suzuki sales in 2009-10". Marutisuzuki.com. Retrieved 2010-07-04. Cite web requires
|website=
(help) - ↑ [4][dead link]
- ↑ [5][dead link]
- ↑ "Even Suzuki Registers A May Sales Increase". Retrieved 2008-07-18. Cite web requires
|website=
(help) - ↑ "Pak Suzuki Motor Company Limited :". Paksuzuki.com.pk. Retrieved 2009-05-20. Cite web requires
|website=
(help) - ↑ Alpha State. "TEAM SUZUKI by Ray Battersby (2008) Parker House Publishing ISBN 0979689155 / 0-9796891-5-5". Teamsuzuki.co.uk. Retrieved 2010-10-05. Cite web requires
|website=
(help)