సుధారక్ పరిచారక్
సుధాకర్ రామచంద్ర పరిచారక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పండర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సుధాకర్ రామచంద్ర పరిచారక్ | |||
పదవీ కాలం 1985 – 2009 | |||
ముందు | పాండురంగ్ భానుదాస్ డింగారే | ||
---|---|---|---|
తరువాత | భరత్ భాల్కే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 మహారాష్ట్ర, భారతదేశం | ||
మరణం | 2020 ఆగస్టు 18 పూణే, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసుధాకర్ పరిచారక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 1990,[2] 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[3] ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 1999 నుండి 2008 వరకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.
మరణం
మార్చుసుధాకర్ పరిచారక్ 2020 ఆగస్టు 5న కోవిడ్ సోకడంతో పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 18న మరణించాడు.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Five-time Pandharpur MLA Sudhakar Paricharak dies of Covid in Pune" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "25 वर्ष आमदारकी, पंढरपूरमधील दिग्गज नेते सुधाकरपंत परिचारक यांचे निधन". TV9 Marathi. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "कोरोनामुळे सहकारातील ज्येष्ठ नेते सुधाकर परिचारक यांचे निधन". News18 लोकमत. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.