సురేంద్రనగర్

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సురేంద్రనగర్ జిల్లా ఒకటి. జిల్లా జనసంఖ్య 1.7 మిలియన్లు. సురేద్రనగర్‌ను పూర్వం ఝలావద్ అని పిలిచే వారు. ఝలా రాజపుత్రులు సురేంద్రనగర్ జిల్లా ప్రాంతంలోని పలు రాజాస్థానాలను పాలించారు. వల్వాద్‌తో కూడిన సురేంద్రనగర్ 400,000 మంది నివసిస్తున్నారు. హైటెక్ బంగళాలకు ఈ నగరం కేంద్రంగా ఉంది.

సురేంద్రనగర్ జిల్లా
జిల్లా
జింజువాడలోని మడపోల్ గేట్
జింజువాడలోని మడపోల్ గేట్
సురేంద్రనగర్ జిల్లా is located in Gujarat
సురేంద్రనగర్ జిల్లా
సురేంద్రనగర్ జిల్లా
Location in Gujarat, India
నిర్దేశాంకాలు: 22°44′N 71°31′E / 22.73°N 71.51°E / 22.73; 71.51Coordinates: 22°44′N 71°31′E / 22.73°N 71.51°E / 22.73; 71.51
దేశం India
రాష్ట్రంగుజరాత్
విస్తీర్ణం
 • మొత్తం10,489 km2 (4,050 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
547 మీ (1,795 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,755,873
 • సాంద్రత144.45/km2 (374.1/sq mi)
భాషలు
 • అధికారGujarati, హిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
363031
టెలిఫోన్ కోడ్02752
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుGJ-13
Largest citySurendranagar
లింగ నిష్పత్తి0.924 /
అక్షరాస్యత61.61%

.

భౌగోళికంసవరించు

జిల్లా వైశాల్యం 10489 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,515,148. జనసంఖ్యలో 26% నగరాలలో నివసిస్తున్నారు. [1][2]

జిల్లాలోని ఇతర నగరాలు : ధ్రంగద్ర, హల్వద్, వధ్వన్, లింబ్ది, చుదా, లఖ్తర్, కతొసన్ రాజ్, ములి (గుజరాత్), సయ్ల, థంగద్, తర్నెతర్.

ఆరోగ్యకేంద్రంసవరించు

బ్రిటిష్ కాలంలో సురేంద్రనగర్ కాలనీ హిల్‌స్టేషన్‌గా ఉండేది. ఇక్కడి పొడి వాతావరణం భౌతిక, మానసిక బాధలకు నుండి విముక్తి కలిగిస్తుంది. సురేంద్రనగర్ పొడి వాతావరణం క్షయ వ్యాధి నివారణకు సహకారం అందిస్తుంది.

విద్యసవరించు

గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలలో సురేంద్రనగర్ జిల్లా రెండవస్థానంలో ఉంది. జిల్లాలో అధికస్థాయిలో విద్యాకేంద్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్టపత్రికలలో అనేకం సురేంద్రనగర్‌లో ప్రచురితమౌతున్నాయి.

ఆర్ధికంసవరించు

జిల్లాలో కాంఫెక్షనరీ, పాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ ఫ్లాస్టిక్స్, ఉప్పు ఉత్పత్తి చిన్నతరహా, మధ్యతరాహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో వధవన్ ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. వధ్వన్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రొసెసింగ్ కేంద్రం, పత్తి, ఉప్పు, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఫ్లాస్టిక్స్, టెక్స్టైల్ బియరింగ్స్, సెరామిక్స్, శానిటరీ వేర్ మొదలైన వ్యాపారాలకు కేంద్రంగా ఉంది.

సహజ వనరులుసవరించు

దేశానికి అవసరమైన ఉప్పులో 25% సురేంద్రనగర్‌లో ఉత్పత్తి చేయబడుతుంది.జిల్లాలో మైళ్ళ పొడవున ఉప్పునీటి సరసులు ఉన్నాయి. ప్రత్యేకంగా కరగోడా ప్రాంతంలో ఇవి అధికంగా ఉన్నాయి. జింజువాడా ఎడారి ప్రాంతంలో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి చేయబడుతుంది.

వస్త్రాల తయారీసవరించు

దేశంలో పత్తి, కాటన్ జిన్నింగ్ పతిశ్రమలకు సురేంద్రనగర్ కేంద్రంగా ఉంది. జిల్లాలో జిన్నింగ్, ప్రెసింగ్ యూనిట్లు అధికసంఖ్యలో ఉన్నాయి. అధికస్థాయిలో పత్తి ఉత్పత్తి చేయబడుతున్న ప్రాంతాలలో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. శంకర్ కాటన్ వరల్డ్. సురేంద్రనగర్ కాటన్ ఆయిల్, ఆయిల్ సీడ్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 1964లో ఇక్కడ కాటన్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎక్స్‌చేంజ్ స్థాపించబడింది. సురేంద్రనగర్ నగరం వస్త్రాల తయారీకి, వస్త్రాల విక్రయానికీ (ప్రధానంగా చీరలకు ) ప్రధాన కేంద్రంగా ఉంది.

 • నగరంలోని జవహర్ రోడ్డు, విఠల్ ప్రెస్ రోడ్డులలో పెద్ద షోరూములు ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,755,873,[3]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 274 వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 167 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.89%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 929:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.19%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలో అధికంగా జైనులు ఉన్నారు. నగరకేంద్రంలో ప్రధాన జైనఆలయం ఉంది. తరువాత స్థానంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, పఠేల్ ప్రజలు ఉన్నారు. గుర్తించతగినంతగా భర్వద్, రాబరీ ప్రజలు ఉన్నారు.

సంస్కృతిసవరించు

 • జాతీయరహదారి -8 - లింబాడీ వద్ద రాజ్- రాజేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవాలకు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ) 3 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి ఆలయం ఇది మాత్రమే అన్న గుర్తింపును కలిగి ఉంది. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.
 • దెదారా గ్రామంలో ప్రఖ్యాత " గంగావో " గుండం ఉంది. 11 వ శతాబ్దంలో ఇది అభివృద్ధి చేయబడింది.

సస్కృతిక సంస్థలుసవరించు

జిల్లాలో అనేక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి

 • షబ్దలొక్ సాహిత్య వర్తుల్ (స్థాపకుడు: డక్టర్.నాగ్జిభై దేశాయ్)
 • ననలల్ సాహిత్య సభ (రమేష్ ఆచార్య)
 • కలమందిర్ గ్రూప్ (స్థాపకుడు: అతుల్కుమర్ వ్యాస్)
 • క్లబ్ ఆఫ్ డిసర్ట్ లైంస్

భొగావో మర్మం గురించిన కథనాలుసవరించు

పురాతన కాలంలో జునాగఢ్ రాజు చౌడసమా వధ్వన్ రాకుమారి రణక్‌దేవి అందానికి ముగ్ధుడయ్యాడు. వధ్వన్ రాకుమారి రణక్‌దేవి కొరకు వధ్వన్ మీద యుద్ధం చేసాడు. రాకుమారి నగరం విడిచి భొగావో నదికి వెళ్ళి నదిలో మునిగి ప్రాణాలు వదిలింది. ఆమె ప్రాణం వదలడానికి ముందు నదిని శపించుంది. శాపకారణంగా నదిలో నీరు ఇంకిపోయిందని ఈ నది సంవత్సరానికి ఒకరిని బలి తీసుకుంటుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. వధ్వలోని భిగ్వద నదీతీరంలో రాకుమారి రణక్‌దేవికి ఆలయం నిర్మించబడింది.

ప్రముఖులుసవరించు

 • జావేర్చంద్ మేఘాని (1896-1947) కవి, సాహిత్యకారుడు, సాంఘిక సంస్కర్త, స్వాతంత్ర్యోద్యమ పోరాటవీరుడు. (జన్మస్థలం కొలకత్తా)
 • సుకలాల్ సంఘవి (1880-1978) జైన్ పండితుడు, తత్వవేత్త. లింబ్దిలో జన్మించారు.
 • గుజరాత్ హాస్యనటుడు షహబుద్ధిన్ రాథోడ్, జగదీష్ త్రివేది ఈ జిల్లాకు చెందినవాడు.
 • నవల రచయిత శ్రీ ఉమాశంకర్ జోషి (గ్రామం: గుజర్వాడి) ఈ జిల్లా నుండే ఉంది.
 • ప్రముఖ హిందీ సినిమా రైటర్ విపుల్ కె రావల్ సురేంద్రనగర్ లో జన్మించాడు. కె రావల్ వద్వాన్ రాజాస్థాన దివాన్ ముని మనుమడు
 • నవలా రచయిత, సినిమా / టి.వి సీరియల్ స్క్రీన్ప్లే & డ్రామా రచయిత శ్రీ అతుల్‌కుమార్ వ్యాస్ సురేంద్రనగర్ జిల్లాలోని లఖ్తర్‌లో జన్మించాడు. తన స్వస్థలమైన ధ్రంగ్ధ్ర (సురేంద్రనగర్). అతను 15 నవలలు, 4 కథల పుస్తకాలు, 4 పద్యాల సేకరణలు 9 గుజరాత్ పాప్ ఆల్బములు తయారు చేసాడు. మిస్టర్ వ్యాస్ తన బంద్ పాపన్ మా పాలస్ (2010) కథ పుస్తకం కోసం ధూమకేతు అవార్డు గెలుచుకన్నాడు.
 • సురేంద్రనగర్‌లో మిస్టర్ గిరీష్ భట్, రమేష్ ఆచార్య, పంకజ్ త్రివేది, తలకాషి పార్మర్ వంటి ప్రసిద్ధ నవలా రచయితలు ఉన్నారు.
 • ప్రముఖ రచయిత సుమంత్ రావల్ ఇప్పుడు జునాగడ్ వదిలి సురేంద్రనగర్‌లో నివసిస్తున్నాడు.
 • డాక్టర్. చివరి నాగ్జిభాల్ దేశాయ్, డాక్టర్ మోతీభాయి పటేల్, వినోదినిబెన్ షా.సి.ఎస్ మెహతా, ధీమంత్ భాయ్ షా (మోటభాయి) అనేక ఇతర మేధావులు విద్య, సామాజిక సేవల రంగంలో పనిచేస్తున్నారు.
 • సంజయ్ గద్వి చిత్ర దర్శకుడు
 • స్థానికంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలతో అనుబంధం ఉన్న శ్రీ నౌషాద్ సోలంకి సురేంద్రనగర్ జిల్లాలోని ధ్రంగద్రలో జన్మించాడు.. నేషనల్ గ్రౌండ్ వాటర్ సలహా మండలిలో ప్రధానంగా సభ్యుడు - జలవనరుల డి.ఆర్.యు.సి.సి సభ్యుడు మంత్రిత్వ శాఖ (రాజ్కోట్ డిసిషన్Dicision), సురేంద్రనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, విజిలెన్స్ సభ్యుడు వక్తగా, బుద్ధ ఆఫ్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు పర్యవేక్షణ కమిటీ - సౌరాష్ట్ర సెంట్రల్ గుజరత్ చాప్టర్ అధ్యక్షుడు సురేంద్రనగర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, అనేక మరింత సంస్థల అధ్యక్షుడు. యు.ఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రెజిల్‌లో పాల్గొన్నాడు.

విద్యసవరించు

గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్సవరించు

 • సి.యు. షా విశ్వవిద్యాలయం, వధ్వన్ సిటీ.
 • కంప్యూటర్ అప్లికేషన్, వధ్వన్ సిటీ యొక్క మాస్టర్ యొక్క సి.యు షా కళాశాలలో. విద్య, శిక్షణ
 • జిల్లా సంస్థ ఇంజనీరింగ్, టెక్నాలజీ
 • సి.యు షా కళాశాలలో
 • సి.యు షా మెడికల్ కాలేజ్
 • సి.యు . షా ఫార్మసీ కళాశాల
 • కామర్స్ సి.యు షా కళాశాలలో, కంప్యూటర్, నిర్వహణ
 • ప్రభుత్వ పాలిటెక్నిక్
 • ఎన్.ఎం. షా ఆర్ట్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్
 • సి.యు. షా ఫైన్ ఆర్ట్ కాలేజ్
 • సి.యు షా మహిళా - ఆర్ట్స్, కామర్స్ & హోంసైన్స్ కాలేజ్
 • ఎం.పి షా కామర్స్ కళాశాల
 • ఎం.పి. వోరా కాలేజ్
 • ఎం.పి. షా ఆర్ట్స్ & విజ్ఞాన శాస్త్రం కాలేజ్ ఐటి
 • శ్రీ స్వామి వివేకానంద కాలేజ్
 • ఎం.ఎం . విద్య యొక్క షా కళాశాల
 • మైత్రీ విద్యాపీట్
 • ఎస్,జె.వి అర్మొర బి.బి.ఎ. బి.సి.ఎ మహిళా కళాశాల
 • ఎం.జిటి. &ఐ.టి సంస్కృతి కాలేజ్
 • జి.బి పర్మార్ కాలేజ్ మేనేన్మెంట్, కంప్యూటర్

ఉన్నత,సవరించు

ఖు.ఎం.ఆర్.దర్ది విద్యాలయ, అనింద్ర.

 • ఆర్.ఎ.పతెల్ బాయ్స్ పాఠశాల
 • శ్రీ గ్యందీప్ హైపాఠశాల గుజరవది.
 • శ్రీమతి. సవితబెన్ హిమ్మత్లల్ గొలని హై పాఠశాల, ళెఊ పతిదర్ సంకుల్, వధ్వన్ నగరం
 • మత్రుష్రీ షంతబెన్ దెవ్జిభై షియనియ హయ్యర్ సెకండరీ పాఠశాల, ళెఊ పతిదర్ సంకుల్, వధ్వన్ నగరం
 • శ్రీ జి సి షా స్వమినయ్రయన్ హై పాఠశాల
 • శ్రీ దజిరజ్ హై పాఠశాల (వధ్వన్ నగరంలో పురాతన పాఠశాల)
 • శ్రీ ఎం.టి.దొషి హై పాఠశాల (వధ్వన్ నగరం)
 • అల్ట్రా విజన్ అకాడమీ {విజ్ఞాన శాస్త్రం, కామర్స్}
 • శ్రీ సర్దార్ పటేల్ విద్యాలయ
 • శ్రీ సర్దార్ పటేల్ కన్యా విద్యాలయ
 • శ్రీ పంచ్షిల్ హయ్యర్ సెకండరీ పాఠశాల
 • జె.ఎన్.వి (జవహర్లాల్ ఎనహెరు వివిధ్లక్షి) హై పాఠశాల
 • శ్రీ షేథ్ ఎన్.టి.ఎం . హై పాఠశాల
 • శ్రీ సి పి ఒజ శారద మందిర్ హై పాఠశాల
 • శ్రీ డి.ఎన్.టి. హై పాఠశాల
 • శ్రీ శవితబెన్ వదిలల్ ముని. ప్రథ్మిక్ శాల, జొరవర్నగర్
 • సర్దార్ పటేల్ విద్యాలయ
 • ఆర్.పి.పి బాలికల కోసం (రంభబెన్ పుర్షొత్తందస్ పతదీ) పాఠశాల
 • తిరుపతి విద్యాలయ
 • శ్రీ సావా సాల, జొరవర్నగర్ ( ప్రపంచ లిమ్కా రికార్డుల బుక్ లో రికార్డు ఉంది)
 • శ్రీ పి.జి.ఎన్.ఎం.ఎస్. గర్ల్స్ హై పాఠశాల
 • శ్రీ శారదా గీతా విద్యాలయ, 80 ఫీట్ రోడ్, నవరంగ్ సొసైటీ, సురేంద్రనగర్ ఆలోచనలు
 • సంస్కృతి పాఠశాల
 • ఆంగ్ల పాఠశాలల
 • బటర్ పిల్లలు పాఠశాల
 • బచ్పన్ హై పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) (అంతర్జాతీయ పాఠశాల అవార్డు విజేత)
 • సి.యు షా పాఠశాల (ఇంగ్లీష్ మీడియం)
 • దయమయి మాతా అధిక పాఠశాల (ఇంగ్లీష్ / గుజరాతి మీడియం)
 • సన్నీ స్కై ఇంగ్లీష్ ప్రాథమిక పాఠశాల / సన్నీ స్కై హయ్యర్ సెకండరీ పాఠశాల (ప్రిన్సిపాల్ - రాషిడా అందుకే) (ఇంగ్లీష్ మీడియం) వధవన్ నగరంలో
 • ఆదెర్ష్ ణివషి పాఠశాల

ముందు ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలుసవరించు

 • బార్బీ హౌస్, నర్సరీ ప్లే
 • బచ్పన్ ప్రీ ప్రాథమిక & ప్రాథమిక పాఠశాల (ఇంగ్లీష్)
 • ఎన్.డి రావల్ ప్రాథమిక హై పాఠశాల (గుజరాతి భాష)
 • త్రిమూర్తి బల్మందిర్
 • త్రిమూర్తి పాఠశాల
 • యూరో కిడ్స్ అంతర్జాతీయ
 • బటర్ ప్రాథమిక పాఠశాల ' (గుజరాతీ / ఇంగ్లీష్ మీడియం)
 • శ్రీ శారదా పాఠశాల - జొరవర్నగర్

ముందు ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలుసవరించు

 • బార్బీ హౌస్, నర్సరీ ప్లే
 • బచ్పన్ ప్రీ ప్రాథమిక & ప్రాథమిక పాఠశాల (ఇంగ్లీష్)
 • ఎన్.డి రావల్ ప్రాథమిక హై పాఠశాల (గుజరాతి భాష )
 • త్రిమూర్తి బల్మందిర్
 • త్రిమూర్తి పాఠశాల
 • యూరో కిడ్స్ అంతర్జాతీయ
 • బటర్ ప్రాథమిక పాఠశాల ' (గుజరాతీ / ఇంగ్లీష్ మీడియం)

శ్రీ శారదా పాఠశాల - జొరవర్నగర్

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Basic Data Sheet: District Surendranagar (08), Gujarat (24)" (PDF). Census of India. 2001.
 2. "Census GIS India". Archived from the original on 25 ఏప్రిల్ 2015. Retrieved 29 August 2010.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Gambia, The 1,797,860 July 2011 est.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Nebraska 1,826,341

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు