సులాఫ్ ఫవాకేర్జీ

సిరియా దేశ నటి

సులాఫ్ ఫవాకేర్జీ సిరియన్ చలనచిత్ర, టెలివిజన్ నటి.

సులాఫ్ ఫవాకేర్జీ
జననం (1977-07-27) 1977 జూలై 27 (వయసు 46)
లటకియా, సిరియా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామివేల్ రందాన్ (వివాహం.1999)
పిల్లలు2

జననం మార్చు

సులాఫ్ ఫవాకేర్జీ 1977, జూలై 27న సిరియా లోని లటకియాలో జన్మించింది.

కళారంగ ప్రస్థానం మార్చు

సులాఫ్ ఫవాకేర్జీ సిరియన్ రంగస్థల నాటకాల్లో పలు పాత్రలను పోషించింది. అదమ్ ఇస్మాయిల్ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో కళలు, శిల్పకళలలో అధ్యయనం చేసింది. ఆ తరువాత అల్-సావత్ (ది వాయిస్), హెక్యాట్ అల్-షీతా (వింటర్ టేల్స్) వంటి ప్రసిద్ధ నాటకాలలో నటించింది.[1] 2008 వేసవి ఒలింపిక్స్ క్రీడల టార్చ్ వెలిగించినవారిలో సులాఫ్ ఫవాకేర్జీ ఒకరు.[2] 2011, మే నెలలో సిరియన్ టెలివిజన్ లో కనిపించింది.[3]

నటించిన చిత్రాల జాబితా మార్చు

  1. అల్ టిర్హాల్
  2. నాసిమ్ ఆల్-రో (1998)
  3. హలిమ్ (2006)
  4. హస్సిబా (2008)
  5. ది బేబీడాల్ నైట్ (2008)
  6. అస్మాహన్ - టెలివిజన్ సిరీస్ (2008)
  7. క్లియోపాత్రా (2010)

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-12. Retrieved 2017-06-22.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-05. Retrieved 2017-06-22.
  3. https://www.youtube.com/watch?v=E4vjl3ycLn4&feature=related