సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు


సూక్ష్మ జీవులెట్లు వ్యాధిని కలుగ జేయునుసవరించు

చాల అంటు వ్యాధులకు సూక్ష్మ జీవులే కారణమని అందరికి తెలిసిన విషయమే..... ఆసలు సూక్ష్మ జీవులు వ్యాధులను ఎట్లు కలుగ జేయునో తెలుసికోవడము, సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన తోడనే మన శరీరములోని రక్షణ వ్యవస్థతో జరుగు సంగర్షణ మొదలకు విషయాలను తెలుపుటయే ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశము:

సూక్ష్మ జీవులెట్లు వ్యాధిని కలుగ జేయును:సవరించు

సూక్ష్మ జీవులు గాయము గుండా గాని, నోరు ముక్కు మొదలగు మార్గముల గుండ గాని ఏదో యొక విధమున మన శరీరమున ప్రవేశిచునని మరొక వ్యాసములో చెప్పపడినది. ఇవి ప్రవేశించిన తోడనే మన రక్తమునదుండు తెల్ల కణములకును వీనికి యుద్ధము ప్రారంభమగును. మనకొక చిన్న కురుపు లేచినప్పుడు మన శరీరములో పోరాటము జరుగును. తెల్ల కణములను ఎల్లప్పుడు సిద్ధముగ నుండి వెనుదీయక తాము చచ్చు వరకును పోరాడు మన భటులని చెప్ప వచ్చును. ఇందు కొన్ని సూక్ష్మ జీవులను మ్రింగి నశింపజేయును. కొన్ని సూక్ష్మ జీవులను నశింప జేయు విష పదార్థములను పుట్టించును. మరి కొన్ని ఈ సూక్ష్మ జీవులను యుద్ధ రంగము నుండి మోసికొని పోయి ఖైదీలుగ బట్టి యుంచును. కొన్ని సూక్ష్మజీవుల విషములకు విరుగుడు పదార్థములను పుట్టించును. ఇంకను కొన్ని ఆ యాస్థలముల నుండెడి యితర భటులకు ఆహారమును దెచ్చి యిచ్చును. యుద్ధము ప్రార్తంభమయిన తోడనే సూక్ష్మ జీవుల వుద్రేకమును బట్టి తెల్ల కణముల క్రొత్త పటాలములు నిముష నిముషము నకును యుద్ధ స్థలమునకు వచ్చు చుండును. వీనితో పాటు వీని కాహార పదార్థమగు రసియు, రక్తము మొదలగు నితర పదార్థములను హెచ్చుగ యుద్ధ రంగమునకు వచ్చు చుండును. ఈ పదార్థముల యొక్కయు సూక్ష్మ జీవుల యొక్కయు కూడికనే మనము వాపు అని చెప్పు చున్నాము. సూక్ష్మ జీవుల యొక్కయు తెల్ల కణముల యొక్కయు మృత కళేబరములును యిద్ధము యొక్క ఉద్రేకము చేత నశింపయిన కండ రక్తము మొదలగు ఇతర శరీర భాగములను, రసియు, సూక్ష్మ జీవులచే విసర్జింప బడిన విషయమును, బ్రతియున్న కొన్ని తెల్ల కణములను చేరి యేర్పడు దానినే మనము చీము అని చెప్పుదుము. సూక్ష్మ జీవులు కోటాన కోట్లుగా పెరుగు చుండుట చేత రోగి యొక్క శరీర బలము సూక్ష్మజీవుల బలము కంటే తక్కువగ నున్న యెడల సూక్ష్మ జీవులే జయము నొంది శరీరములోనికి చొచ్చుకొని పోవును. శరీర బలము హెచ్చుగ నుండి సూక్ష్మ జీవుల బలము తక్కువగ నున్న యెడల సూక్ష్మ జీవులు నశించి పోవును. లేదా, వెలుపలకు గెంటి వేయబడును. ఇట్లు గెంటి వేయ బడుత చేతనే కురుపు చితికి చీము భయడ బడు చున్నది. సూక్ష్మ జీవుల బలము తక్కువగ నున్న యెడల కురుపు లోలోపలకు పోవును. అట్టి సమయములో శస్త్రము చేసి చీము బయటకు వచ్చుటకు మార్గ మేర్పరచిన గాని కురుపు మానదు. చీము బయటకు పోవుటకు దారి యేర్పడగానే మన దేహము లోని తెల్ల కణములకు సూక్ష్మ జీవుల విషమంతగా నంటదు. అందుచే నవి కొంచెము తెప్పరిలి క్రొత్త బలమును పొందినవై సూక్ష్మ జీవులను బయటకు తరిమి వేయును. అందు వలన పుండు శీఘ్రముగా మానును.

 
నెత్తురు చుక్కలో సూక్ష్మ జీవులతో జారుగు యుద్ధము చూపు పటము

సూక్ష్మ జీవులలో కొన్ని అంటిన స్థలముననే పెరుగుచు తమ విషమును మాత్రము శరీరము నందంతటను ప్రసరింప జేసి వ్యాధి కలుగ జేయుననియు మరికొన్ని సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన తోడనే శరీరమునందన్ని భాగములకు వ్యాపించు ననియు పైన వ్రాసి యున్నాము. పైన వర్ణించిన కురుపులో సూక్ష్మ జీవులు సామాన్యముగా ప్రవేశించిన చోటనే వృద్ధి పొందును. ధనుర్వాయువు (Tetanus) లో నిట్లే సూక్ష్మ జీవులు ఎక్కడ ప్రవేశించునో అక్కడ కొంత వాపు పోటు మొదలగు గుణములు కలిగించుచు ఆ ప్రదేశమునందే యని నివసించి యుండును. ఈ సూక్ష్మ జీవులు తా మక్కడనుండి కదలక తాము తయారు చేయు విషమును మాత్రము శరీరమంతటను వ్వాపింప జేసి మరణము కలిగించును. చలి జ్వరము మొదలగు కొన్ని వ్వాధులలో వాధి కలిగించు సూక్ష్మ జీవులు ప్రవేశించిన చోటనే యుండక రక్తము గుండ శరీర మంతను వ్యాపించును. రోగి యొక్క నెత్తురు చుక్క నొక్క దాని నెక్కడ నుండి యైనను తీసి పరీక్షించిన యెడల సూక్ష్మ జీవులు కానవచ్చును. దొమ్మును కలిగించు సూక్ష్మ జీవులు నెత్తురు ద్వారాను, ధనుర్వాయువు కలిగించు సూక్ష్మ జీవుల విషములు నరముల ద్వారాను వ్యాపించును.

ఒకానొక వ్యాధి ప్రారంభమైన తరువాత సూక్ష్మ జీవుల లెల్ల తమ సైన్యములను, విషములను నలు దిక్కులకు ఎట్లు ప్రసరింప జేయు చుండునో అట్లే మన శరీరమందలి వివిధాంగములును సూక్ష్మ జీవుల కపాయకరములగు వివిధ పదార్థములను పుట్టించుచు తమ యుద్ధ భటులను వృద్ధి చేసికొను చుండును. మన శరీర బలము సూక్ష్మ జీవుల బలము కంటే మించిన యడల వ్యాధి కుదురును. లేదా వ్యాధి ప్రకోపించును. అతి మూత్రము మొదలగు కారణములచే శరీర బలము తగ్గి యున్న వార లిందు చేతనే రాచపుండు మొదలగు వానికి సులభముగ లోంగుదురు.

సూక్ష్మ జీవుల ఆయుర్దాయము:సవరించు

తల్లి సూక్ష్మ జీవియే రెండు ముక్కలయి, ప్రతి ముక్కయు తిరిగి యౌవనము గల సూక్ష్మజీవి యగుట చేత తల్లి కెన్నటికిని మరణమున్నదని చెప్పుటకు వీలు లేదు. కావున సాధారణముగా సూక్ష్మ జీవులన్నియు చిరంజీవులని చెప్పనగును. కాని యొక చెరువు ఎండి పోయినప్పుడా చెరువులోని చేపలన్నియు నెట్లు చచ్చి పోవునో అట్లే యొక రోగి మృతినొంది నప్పుడు ఆ రోగి నాశ్రయించి యున్న సూక్ష్మ జీవు లనేకములు వానికి తగిన యాధారములేక నశించి పోవును. ఇట్లు గాక రోగికి రోగము కుదిరి సూక్ష్మ జీవులు ఓడి పోయి నప్పుడు కూడా సూక్ష్మ జీవులు అనేక చోట్ల మరణము సంభవించు చున్నది.

అట్లే కొన్ని జాతుల సూక్ష్మ జీవులకు యౌవన, జరావస్థలును ఆయుఃపరిమితి నున్నట్లు తోచు చున్నది.టైపాయిడ్ సూక్ష్మ జీవులు ఒకటి రెందు వారాలలో విజృంభించి నాలుగు వారాలలో చాలా భాగము నశించి పోవును. మశూచకపు సూక్ష్మ జీవులు పది లేక పదిహేను దినాలలో తమ క్రియశిలతను పోగొట్టు కొనును. కొన్ని సూక్ష్మ జీవులు కొంత కాలము విజృంభించిన తరువాత తమ స్వభావమును మార్చు కొని గ్రుడ్లుగా అగును. ఈ గ్రుడ్లకు సాధారముగా జీవితకాల ఇంతింతని లేదు. ఒకానొకప్పుడు మితి లేకుండ చాల కాలము పడి యుండి ఎప్పుడు తగిన తరుణము వచ్చునో అప్పుడు మొలకరించును. క్షయ, దొమ్మ మొదలగు కొన్ని వ్యాధుల సూక్ష్మ జీవుల గ్రుడ్లిట్లు పడి యుండి యోకానొకప్పుడు అకాస్మత్తుగ ప్రబలి హాని కలుగ జేయును. సూక్ష్మ జీవులన్నియు గుంపులు గుంపులుగా పెరిగి సామాన్యముగా గుంపులు గానే చచ్చును. వీని పెంపు పూవుల పెంపు వంటిది. ప్రతి దినము సాయంకాలమునకు మల్లెపూవు లెట్లు పూచి విజృంభించి మరునాటికి వాడి పోవునో అట్లే సూక్ష్మ జీవులను ఒకానొక కాలమందు వృద్ధి నొంది తమ ఆయుర్థాయపు మితి మీరిన తోడనే పెంపు తగ్గి యుండును. కావున ఆటలమ్మ, పొంగు, మశూచకము, కలరా మొదలగు అంటు వ్వాధులు ఏమియు రోగము లేని వాని యందు అకస్మాత్తుగ కనుపడి దిగిపోవు నప్పుడు కూడా నొక్క పెట్టున దిగిపోవును. అనగా అట్లు దిగిపోవు నాటికి సూక్ష్మ జీవుల పొగరు అణగి పోవునని గాని, లేక సూక్ష్మ జీవుల వలన తయారు చేయబడు విషముల శక్తి విరిగి పోయినదని గాని తెలియుచున్నది. ఒక్కొక్క జాతి సూక్ష్మ జీవి ఎట్లు పెరుగుచు, చచ్చు చుండునో అట్లే వాని వలన కలుగు వ్యాధుల యొక్క స్వరూపములుని నిరూపింప బడు చుండును.

సూక్ష్మ జీవులు ఎవ్వరికి సంక్రమించునుసవరించు

ప్రతి సూక్ష్మ జీవియు ఒక్కొక్క జాతి జంతువున కొక్క విధముగను, ప్రలలో కూడా యొక్కొక్క దేశపు ప్రజల కొక్కక విధముగా అంటును. అన్ని జంతువులకును అన్ని జాతుల ప్రజలకును ఒకటే రీతిగ నీ వ్యాధులు వ్యాపించవు మానవుల కంటినట్లు సూక్ష్మజీవు లితర జంతువులలో వ్యాపించవు.. ఏవో కొన్ని జంతులే కాని తక్కిన జంతువులు సూక్ష్మ జీవులకు లెక్క చేయవు. పశువులకు, కోళ్ళకు, పందులకు వచ్చు అనేక వ్వాధులు మనుష్యుల వ్యాప్తి అగుట లేదు. మంష్యుల వచ్చు పచ్చ సెగ, ఆటలమ్మ మొదలగు వ్యాధులు పశువులకు సంక్రమించినట్లు కన్పించదు. ఒకటే కుంటుంబములో చేరిన రెండు తెగల జంతువులకు కూడా సూక్ష్మ జీవులొక్క రీతిగా వ్యాపించడంలేదు.. పొలము చుంచులులు అధికముగ క్షయవ్యాధితో మరణించును. కాని యింటి చుంచులకు క్షయవ్యాధి రాదు. కొన్ని దేశములలో గొర్రెలకు దొమ్మ వ్యాధి మిక్కుటము వచ్చును మరికొన్ని దేశములలో నీ గొర్రెల దొమ్మ వ్యాధి రాదు. మానవులలో కూడా ఈ భేదము స్పష్టముగ కానవచ్చు చున్నది. అప్రికా దేశము లోని నీగ్రోలను నల్ల వారలకు చలి జ్వరమంతగా రాదు. అక్కడున్న తెల్లవారల నిది మిక్కిలి యధికముగా బాధించును. కాని యీ నీగ్రోలు క్షయవ్యాధి చేతను, మశూచకము చేతను, తెల్ల వారల కంటే మిక్కిలి సులభముగ మృతి చెందుదురు.

కడు మన్య ప్రదేశములలో రేయింబగళ్ళు నివసించు చున్నను కోయ వాండ్రకు సాధారాముగ చలి జ్వరము అంటదు. బయటి ప్రదేశముల నుండి పోవువారచ్చట నొక్క దినము నివసించినను వారికీ చలి జ్వరము వెంటనే సంక్రమించును.

ఒక్కటే జాతిలో కూడా సూక్ష్మ జీవు లందరకు నొక్కరీతిగా నంటవు. టీకాలు వేసి నప్పుడు కొందరికి బాగుగ పొక్కుటయు కొందరికి బొత్తిగ పొక్కక పోవుటయు అందరకు తెలిసిన విషయమే. ఒక్కొక్క పైరునకొక్కొగ తరహా నేల స్వతస్సిద్ధముగ నెట్లు తగి యుండునో అట్లే యొక్కొక్క ఆథితి సూక్ష్మ జీవులకును కొందర ప్రజల శరీరములు మిక్కిలి ప్రీతగ నుండును.

వంశపారంపర్యముగ వచ్చుచుండు అలవాటు చేత కూడా అంటువ్యాధుల వ్యాప్తి మారుచుండును. తండ్రి తాతలందరు ఒకే వ్యాధి చే పీడితులయిన యెడల వారి సంతానమునకు ఆ వ్యాధి కలుగక పోవచ్చును. దీనికి ప్రతిగ క్షయ మొదలగు కొన్ని వ్యాధులు తరతరములకు హెచ్చుగ కూడా వచ్చుచుండును. కొన్ని వ్యాధులు కలిగినను మిక్కిలి తేలికగ పోవచ్చును. ఇందుకు ఉదాహరణము. మన దేశములో మనము పొంగు, తట్టమ్మ, అని చెప్పెడు వ్యాధి కెవ్వరును భయపడరు తనంతట అది వచ్చును పోవును. దీనిని ఎన్నడు నెరుగని ప్రదేశములలో నీయమ్మవారే ప్రవేశించి నపుడు భయంకరముగ జన నాశము చేయు చుండును. 1875 సంవత్సరంలో ఫిజీ దీవులలో (Fizi Islands) నీవ్వాధి ప్రవేశించి నాలుగు నెలలలో నలుబది వేల మంది ప్రజలను మ్రింగి వేసెను. ఈ వ్యాధి ఆదేశము వారెవ్వరింతకు ముందెరిగి యుండక పోవుట చేత దాని యుద్రేకమునకు మితి లేక యుండెను. రమారమి ముగ్గురు ప్రజలకు ఒకడు చొప్పున మృత్యువు పాల బడిరి. ఇత్లే తట్టమ్మ పేరు వినినప్పుడు ఐరోపియనులకు (Europeans) దేహము కంపము జెందును. ఇదే ప్రకారము కొన్ని జంతువులను లెక్క లేకుండ నశింప జేయు కొన్ని అంటు వ్వాధులు ఇతర జంతువులకు అంటనే అంటవు. మహామారి (Plague) వ్యాధి వలన ఎలుకలు కుప్పలు కుప్పలుగ చచ్చును. అదే ప్రదేశములయందుండి వీరితో సాంగత్యము కలిగి యున్నను పంది కొక్కులకు ఎంత మాత్రము భయము లేదు. వృక్షజాతి యందు కూడా ఆముదపు చెట్టునకంటు చీడ యదే ప్రదేశములో నుందు ఇతర జాతి వృక్షముల కంటునా?

ఇట్టి జాతి భేదములు దేశ భేదములే గాక వయస్సును బట్టియు భోజనాది సౌకర్యములను బట్టియు ఇంక నితర కారణాలను బట్టియు అంటు వ్యాధుల వ్యాప్తి మారు చుండును. పసి వాండ్రకు అంటు వ్వాధులు సులభముగ నంటును. మిక్కిలి వయస్సు వచ్చిన పావురముల కంటెను చిన్న పావురములకు దొమ్మ వ్వాధి సులభముగా అంటునని పరిశోధకులు పరీక్షించి యున్నారు. ఇది గాక ఆకలిచే గాని బడలికచే గాని బాధ నొందు జంతువులకీ యంటు వ్వాధులు మిక్కిలి శీఘ్రముగ నంటుననియు; అధికముగ నీటిలో నాని నప్పుడును అతి దాహముగ నుండు అప్పుడును ఈ వ్యాధులు సులభముగ అంటుననియు కుక్కలు కోళ్ళు మొదలగు జంవుల మీద పరీక్షించి అనేక మంది విద్వాంసులు నిర్ధారణ చేసి యున్నారు.

మానవులలో కూడా యొకానొకప్పుడు సూక్ష్మ జీవుల కసాధ్యముగా నుండు వారి శరీరము సయితము అధికాయాసముచే గాని తిండి లేమిచే గాని శరీర పటుత్వము తగ్గి యున్నప్పుడును చలి గాలి యందును ఎండ వానల యందును తిరుగు చున్నప్పుడును సూక్ష్మ జీవులకు సులభముగ లొంగిపోవును. బలముగ నున్నప్పుడు మన శరీరములో ప్రవేశించినను మనకపకారము చేయ లేని సూక్ష్మ జీవులే మనము బలహీన స్థిలో నున్నప్పుడు మనలను శీఘ్రముగ లోబరుచు కొనును. క్షామాదుల యందు వేన వేలు ప్రజ లంటు వ్యాధుల పాలగుటకు ఇదియే కారణము.

మనోవిచారము, భయము మొదలగు కారణములు కూడా క్షయ మొదలగు వ్యాధుల వ్యాపకములో సహకారులగునని తెలియుచున్నది. ఇది గాక మన శరీరమునందీ సూక్ష్మ జీవులు ప్రవేశించు స్థలమును బట్టి కూడా వాని యుపద్రవము మారుచుండును. ఇందునకే ఇతర స్థలములందలి పుండు కంటే పెదవుల మీద నుండు పుండు మిక్కిలి శీఘ్రముగ వ్వాపించును.

ఇది ఇట్లుండాగా నొకా నికనికి అంటు వ్యాధి తగులుటకు తగిన అవకాశముల న్నియు నున్నను అది వాని నంటదు. మశూచికము ఊరంతయు వ్యాపించి యున్నను ఇంటిలో చాల మందికి వచ్చినను, మశూచకపు రోగులకు దినదినము ఉపచారము చేయుచున్నను అందరికిని ఈ వ్యాధి యంటు నని భయము లేదు. కొందరికి తేలు కుట్టినపుడు అమితముగ బాధ పెట్టుటయు, మరి కొందరికి బొత్తిగ విషము ఎక్కక పోవుటయు ఇట్టిదియే.

మూలాలుసవరించు

అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది